Breaking News

Crime

అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేయలేదు, ఇప్పటికైనా నన్ను నమ్మండి: సూసైడ్ నోట్‌లో విద్యార్థిని

అవమానం భరించలేని ఓ అమ్మాయి తన నిండు జీవితాన్ని బలితీసుకుంది. తనపై తప్పులేదని ఎంత వారించినా ఎవరూ నమ్మకపోవడం ఆమెను మరింత బాధించింది. ఈ అవమానాన్ని భరించడం కంటే చావడమే మేలనుకుని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనకాపల్లి మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని హిమశేఖర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కాలేజీలో సీనియర్ విద్యార్థి గణేష్‌తో నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. అదేంటంటే… గణేష్ ఫస్టియర్‌లో ...

Read More »

మతఘర్షణలే టార్గెట్!

రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు – వాటి ఆసరాగా రిక్రూట్‌మెంట్లు – హైదరాబాద్ ఐఎస్ మాడ్యూల్ వ్యూహం ఇదీ – ఈ శనివారమే రక్తపాతానికి ముహూర్తం – చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయం, మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో భారీ పేలుళ్లకు స్కెచ్ – ఒక పోలీస్‌స్టేషన్‌నూ పేల్చేసేందుకు కుట్ర – విచారణలో బయటికొస్తున్న సంచలన విషయాలు – అరెస్టు చేసిన ఐదుగురికి 14 రోజుల రిమాండ్ క్రైంబ్యూరో: హైదరాబాద్ నగరంలోని సున్నిత ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపి మత ఘర్షణలు సృష్టించడం.. దాన్ని ...

Read More »

బాలకృష్ణకు తప్పిన ప్రమాదం

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  వాహనం బోల్తా కొట్టింది. ఆయన ప్రయణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా దారి మధ్యలో లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొట్టింది. కర్ణాటకలోని బాగేపల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. యాక్సిడెంట్ నుంచి బాలకృష్ణ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత మరో వాహనంలో బెంగళూరు వెళ్లిపోయారు.

Read More »

ఉసురుతీసిన మ్యాన్‌హోల్

-సాయం చేయడానికి వెళ్లి ఓ యువకుడి మృత్యువాత -కాంట్రాక్టర్‌పై కేసు నమోదు హఫీజ్‌పేట్: తెరుచుకున్న మ్యాన్‌హోల్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. జార్ఖండ్‌కు చెందిన మోతీయాదవ్ (24) బతుకుదెరువు నిమిత్తం 5 నెలల క్రితం నగరానికి వలస వచ్చి అయ్యప్పసొసైటీలో నివాసముంటున్నాడు. మాదాపూర్‌లోని రాక్ ఎన్ గ్రిల్ హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా వర్షం ప్రారంభంకావడంతో మెగాహిల్స్ వద్ద ఉన్న ...

Read More »

మన కులం కానోడ్ని ప్రేమిస్తావా.. నిన్ను బతకనీయమే… కన్నబిడ్డ మెడకు చున్నీ బిగించి చంపేశారు..!

దేశంలో పరువు హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ పరువు హత్య జరిగింది. తమ కుమార్తె మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో కన్నతల్లిదండ్రులో తమ బిడ్డను హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చౌహాన్ లక్ష్మణ్ కుమార్తె అఖిల (17) అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు నేరడిగొండ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్‌తో పరిచయం ఉంది. ...

Read More »

యురేనియం బాబా!

క్రైంబ్యూరో:అత్యాశకు పోయే ప్రబుద్ధులను కోట్లలో ముంచే ఘనులు చాలామందే ఉన్నారు. మొన్నటికి మొన్న డబ్బును పూజలతో రెట్టింపు చేస్తానని శివానంద బాబా బురిడీ కొట్టించగా.. అలాంటి వ్యవహారమే మరోటి బయటపడింది. కాకపోతే ఇతగాడు పిడుగు పడినప్పుడు యురేనియం లభిస్తుందని, దాని ఖరీదు మూడు వం దల కోట్లపైనే ఉంటుందని, తనకు ఐదు కోట్లు ఇస్తేచాలని నమ్మించి వసూలు చేసిన సొమ్ముతో ఉడాయించాడు. ఏకంగా 17రాష్ట్రాల్లో 62 మంది ప్రముఖులను బురిడీ కొట్టించి, రూ.150 కోట్లు కొల్లగొట్టిన కోహ్లీ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు బెంగళూరులో ...

Read More »

మానవత్వం మంటగలిసింది!

ఒక కాకికి ఏదైనా అయితేనే, అనేక కాకులు చుట్టూ మూగి కావు కావుమని అరుస్తాయి. అయితే, నడిరోడ్డు మీద వందలమంది జనం మధ్య ఓ వ్యక్తిని కొందరు చుట్టూ చేరి చితకబాదుతుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక యువకుడికి కత్తిపోటుతో నెత్తురోడుతూ ఆ యువకుడు బాధతో నేలపైపడి విలవిల్లాడుతుంటే వేడుక జరుగుతున్నట్లుగా.. వారి వారి సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు పోటీ పడటం విచిత్రం. మానవత్వం మంటగలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా..? కర్ణాటకలోని హసన్ పట్టణంలో మంగళవారం ఓ యువకుడు బస్టాండ్‌లో నిలుచున్న ...

Read More »

చికిత్స పొందుతూ మహిళ మృతి

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యాతాలర భూలక్ష్మి అనే మహిళ ఈనెల 11న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా నిజామాబాద్‌ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందినట్టు తెలిపారు. బూలక్ష్మి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ప్రొబిషినరీ ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Read More »

కొత్త ఫార్ములా… ఇప్పుడు లవ్…. తర్వాత రేప్… ప్రేమ వెనుక కామం…

అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా బుట్టలో వేయడమే లక్ష్యం. నాలుగైదు నెలలు లవ్వాయణం. అదను చూసి అత్యాచారం. ఇదీ ఇప్పుడు యువతులను నమ్మించి గొంతు కోస్తున్న కొందరు యువకుల దారి. ఇలాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువయిపోయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముందు ఆమె ప్రేమ కోసం పరితపిస్తారు. పిచ్చివాడిలా తిరుగుతారు. ఆఖరికి అతడు తనకోసం ప్రాణాలర్పిస్తాడన్న స్థాయికి తీసుకెళ్లడంతో సదరు యువతి అతడికి మనసును అర్పించేస్తుంది. ఆ తర్వాత కథ మొదలవుతుంది. కొన్నాళ్లపాటు వేచి చూసే ధోరణి. పార్టీలు, పబ్బులు, సినిమాలకు తిరిగినా ఎప్పుడూ ఎక్కడా ...

Read More »

పెళ్లై బిడ్డపుట్టాక ప్రేమలో పడిన మహిళ: ప్రియుడితో జంప్.. మళ్లీ భర్త వద్దకు ఎందుకొచ్చింది?

భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబంధాలే కారణం అవుతుంటాయి. ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా ఓ భార్య… భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో లేచిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రియుడు టాటా బై బై చెప్పడంతో తిరిగి భర్త చెంతకు చేరుకుంది. తిరిగి రావడమే కాకుండా తనతో కాపురం ...

Read More »

మరీ ఇంత పాశవికమా..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే పశువులా ప్రవర్తిస్తున్నాడంటం! మరి పశువులపైనే అలా ప్రవర్తిస్తే.. వాళ్లనేమంటాం?! ఈ చిత్రాల్లో కనిపిస్తున్న వ్యక్తులను చూడండి.. ఆస్ట్రేలియాలోని ఓ పశువధశాలలో ఆవులను ఎంతదారుణంగా చంపుతున్నారో తెలుస్తుంది. ఆవులను వరుసలో కట్టేసి.. అవి చచ్చేదాకా వాటి తలపై పెద్దసుత్తితో బాదుతున్నారు.ఒకదాని తర్వాత మరోదానిని చంపేస్తున్నారు. ఈ దారుణాన్ని ఓ సామాజిక కార్యకర్త వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇలాంటి క్రూరచర్యపై సోషల్‌మీడియాలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వీళ్లు మనుషులా.. పశువులా..? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

Read More »

హార్రర్ సినిమా ప్రాణం తీసింది..

తిరువన్నామలై : ఓ వ్యక్తి హార్రర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. థియేటర్‌లో ప్రదర్శించబడుతున్న ది కన్జ్యూరింగ్ 2 హార్రర్ మూవీని చూస్తున్న సమయంలో 65ఏళ్ల వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గుండెపోటు వచ్చిన వెంటనే అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారన్నారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వాసిగా గుర్తించారు.

Read More »

దొంగబాబా దోచేశాడు

-ప్రసాదంలో మత్తుమందిచ్చి 1.3 కోట్లతో పరారీ హైదరాబాద్ వ్యాపారి ఇంట్లో బడాచోరీ -లైఫ్ ైస్టెల్ బిల్డింగ్ యజమాని ఇంట్లో ఘటన క్రైంబ్యూరో/బంజారాహిల్ప్: మానసిక ప్రశాంతత కరువైందని, అందుకు పూజలు చేసి ఉపశమనం కలిగించాలని కోరిన ఓ వ్యాపారి కుటుంబాన్ని పూజారిగా వచ్చిన దొంగబాబా దారుణంగా మోసగించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహల్స్‌లో బుధవారం జరిగింది. సినీ ఫక్కీలో ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఆ దొంగబాబా వ్యాపారి ఇంట్లోంచి రూ.1.3 కోట్ల నగదును దొంగిలించి పరారయ్యాడు. బంజారాహిల్స్‌లో రోడ్డునెం.12లో నివాసముండే లైఫ్‌ైస్టెల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి ...

Read More »

ఇద్దరు మట్కారాయుళ్ళ అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పంత్‌ రోడ్డులోని విఎన్‌ టేలర్స్‌లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి వారి వద్దనుంచి 4180 రూపాయలు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచగా నేరస్తులకు బుధవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి దత్తయ్య ఐదురోజుల జైలుశిక్ష విధించినట్టు సిఐ వివరించారు.

Read More »

స్నేహితుని అప్రమత్తతో కొద్దిలో తప్పించుకున్నాడు..

హైదరాబాద్: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ఓ వాహనాన్ని కొనుగోలు చేయబోయి కొద్దిలో మోసం నుంచి బయటపడ్డాడు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సరూన్. 2011 మోడల్‌కు చెందిన ఇన్నోవా కారు కేవలం 5 వేల కిలోమీటర్లే తిరిగిందని, రూ. 6లక్షల 80 వేలకే అమ్ముతామని ప్రకటన పెట్టారు. దీంతో కొనడానికి సిద్ధమైన సరూన్ అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా నేను అమెరికాలో ఉన్నా. కారును శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ వీఐపీ పార్కింగ్‌లో పెట్టా అని చెప్పాడు. నీకు బేగం అనే మేడమ్ నెంబర్ ఇస్తా.. ...

Read More »

అమ్మా..! చనిపోతున్నాను

  అతనొచ్చేస్తున్నాడు… మమ్మల్ని చంపడానికే వస్తున్నాడు… నేను చనిపోతున్నాను.. ఐ లవ్యూ అమ్మా… బై… ఓ కొడుకు చనిపోయే ముందు క్షణాల్లో తన తల్లికి పంపిన ఆఖరి మెసేజ్ ఇది. ఇక ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది.. ? తల్లడిల్లిపోయిన ఆ మాతృహృదయం ఇప్పడు గుండెలవిసేలా విలపిస్తోంది. అమెరికాలో ఓ ముఫ్ఫయ్యేళ్ళ తీవ్రవాది విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 50 మందిలో ఎడీ జస్టిస్ ఒకడు. నైట్ క్లబ్ లో ఆగంతకుడు ఫైరింగ్ స్టార్ట్ చేయగానే జస్టిస్ వెళ్ళి ఓ ...

Read More »

పుర్రె మనిషి ఆచూకీ చెప్పండి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి శివారులోని కొత్తకుంటలో ఐదు రోజుల క్రితం లభించిన పుర్రెకు సంబంధించిన సమాచారం కోసం ఫ్లెక్సీలు తయారు చేయించినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4న ఎల్లారెడ్డి సమీపంలోని కొత్తకుంటలో పుర్రెతో పాటు నల్లరంగు ప్యాంటు, ఆకు పచ్చని చెక్స్ షర్టు లభించిందన్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, ఆరు నెలల క్రితం చని పోయినట్లుగా తెలుస్తోందని అన్నారు. వివరాలు తెలిసిన వారు ఎల్లారెడ్డి ఎస్సై శ్రీధర్ రెడ్డి 9440795463 లేదా సీఐ అనిల్ కుమార్ ...

Read More »

మ్యాట్రిమోనీలో పరిచయం.. రూ. 5 లక్షలతో పరార్

హైదరాబాద్ : మ్యాట్రీమోనీ సైట్‌లో పరిచయం అయి, ఓ మహిళకు రూ. 5.3 లక్షలు టోకరా వేసిన సైబర్‌చీటర్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం బేగంపేట్‌కు చెందిన మహిళకు భారత్ మ్యాట్రిమోనీ.కామ్ సైట్‌లో 2013 సెప్టెంబర్ నెలలో తన్మయి గోస్వామి అలియాస్ హేమంత్ గుప్తా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేసే గుప్తా, తాను సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్స్ కమిషనర్‌గా బెంగళూర్‌లో పనిచేస్తున్నానంటూ నమ్మించాడు. వీరిద్దరు వాట్సాప్, వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ ...

Read More »

కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల జీనత్ రఫీక్‌ను ఆమె తల్లే సజీవ దహనం చేసింది. ఈ ఘటన లాహోర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కోరికకు విరుద్ధంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న కారణంగానే ఆమెను చంపేసినట్లు తెలుస్తున్నది. కొన్ని రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో జీనత్ ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. అయితే ఇంట్లోవాళ్లు తన పెళ్లిని అంగీకరిస్తారన్న భావనతో ఆమె మళ్లీ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటికి రాగానే తల్లి పర్‌వీన్ బీబీ తన కొడుకుతో కలిసి జీనత్‌ను ...

Read More »

పూజారి తల నరికిన ఐఎస్‌

బంగ్లాదేశ్‌లో ఐదు నెలల్లో ఇది రెండోసారి మైనారిటీలు, సెక్యులర్లపై పెరుగుతున్న దాడులు ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. జినైగా జిల్లా నోల్డంగా గ్రామంలో ఆనంద్‌ గోపాల్‌ గంగూలీ (70) అనే పూజారిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం మోటార్‌ సైకిల్‌పై గంగూలీ గుడికి వెళ్తుండగా… మోటార్‌ సైకిళ్లపైనే అతడిని అనుచరించిన ముగ్గురు ఐఎస్‌ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. అనంతరం, గంగూలీ చనిపోయాడని నిర్ధారించుకునేందుకు కత్తులతో తల నరికారు. పూజారి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ముస్లింలు ...

Read More »