Breaking News

Crime

పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఏసిపి

రెంజల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం బోధన్‌ ఏసిపి రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రూరల్‌ సిఐ షకీర్‌ ఆలీ, ఎస్సై శంకర్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఖలీల్‌వాడిలో ఓ సిటీ స్కానింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో మంగళవారం పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ జగదీశ్‌ తెలిపారు. వారి వద్దనుంచి లక్ష 2 వేల 226 నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. సమగ్ర విచారణ కొరకు కేసును ఒకటో టౌన్‌కు బదిలీ చేసినట్టు సిఐ పేర్కొన్నారు. దాడిలో ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.

Read More »

చిరుత దాడి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామశివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట ప్రాంతంలో సోమవారం ఉదయం ధూసమడుగు వద్ద చిరుతపులి గోవును వేటాడి చంపింది. గత ఆరు నెలల్లో 11 ఆవులను చిరుత వేటాడడంతో గ్రామస్తులు, పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుత దాడిలో నీలం సత్తయ్యకు చెందిన 8 ఆవులు, దూడలు, పిట్ల లింగన్న, నీలం గంగవ్వ కు చెందిన గోవులను చంపి తిన్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ అధికారి భాస్కర్‌ ...

Read More »

రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూరు గ్రామ సమీపంలో సోమవారం పెట్రోల్‌ పంప్‌ వద్ద లారీ కారును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న గచ్చిబౌలికి చెందిన లక్ష్మినారాయణ (32), బీహార్‌కు చెందిన రాజన్‌ (26), విజయ్‌కుమార్‌, కోమల్‌సింగ్‌లు కారులో షిర్డీ వెళ్ళి హైదరాబాద్‌ తిరిగి వస్తున్నారు. మద్నూర్‌ సమీపంలో వీరి కారును ఎదురుగా ...

Read More »

వివాహిత ఆత్మహత్య యత్నం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయిన భర్త బాధలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన 6వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అసద్‌నగర్‌లోని అపార్టుమెంటులో గురువారం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ కథనం ప్రకారం…. నగరంలోని అసద్‌నగర్‌లో నివాసముంటున్న జరీనాబేగం, తాజ్‌ దంపతులు కూలీ పనిచేసుకుంటు జీవనం గడిపేవారు. ఐదేళ్ళ క్రితం హిజ్రాగా మారిన జరీనాబేగంకు, తాజ్‌తో ఎనిమిది నెలల క్రితం ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతిసోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా సిపికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వీటిపై సిపి స్పందిస్తు బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఫిర్యాదుల్లో పేర్కొన్న విధంగా సంబందిత పోలీసు అదికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలు ఏమైనా సమస్యలుంటే డయల్‌ ...

Read More »

వాహనాల తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత సందర్భంగా ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఐ శంకర్‌ ఆద్వర్యంలో తనిఖీ చేశారు. లైసెన్సు, ఆర్‌సి, ఇన్సురెన్సు లేని 15 వాహనాలకు రూ. 1500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, వాహన పత్రాలు కలిగిఉండాలని ఆయన అన్నారు. లేకపోతే జరిమానాలు విదిస్తామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం సంజీవయ్య కాలనీలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను ఆధువులోకి తీసుకున్నట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం టాస్క్‌ ఫోర్స్‌, మూడవ టౌన్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఆనంద్‌, విక్రమ్‌, సంజీవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 2 లక్షల 5 వేల నగదు, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏస్‌ఐ కష్ణ తెలిపారు. వీరితో పాటు ...

Read More »

రోడ్డు భద్రతా వారోత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత వారోత్సవాలు 2019 గోడప్రతులను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సోమవారం తన చాంబరులో విడుదల చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వాహనాలకు అతికించే స్టిక్కర్లను ప్రజలకు పంపిణీ చేసే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలను 4వ తేదీ నుంచి 10 వరకు నిర్వహించాల్సి ఉండగా, వీటిని ఈనెల 14 వరకు పొడిగించడం జరిగిందని, ...

Read More »

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం సోమవారం యధావిధిగా కొనసాగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయన తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్‌ సూచించారు. ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు.

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌ సమీపంలో జనవరి 18న రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. స్థానికులు గమనించి అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ జనవరి 29న మృతి చెందినట్టు తెలిపారు. కేసు నమోదు చేశామని, మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే 9440795417, 08462-234750 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Read More »

న్యాయవాదిపై దాడికేసులో సిఐకి జైలుశిక్ష

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ఓ న్యాయవాదిపై దౌర్జన్యం చేసిన కేసులో అప్పటి సిఐ డి.కృష్ణకు ఆరునెలల జైలుశిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తు గురువారం కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి… 2013 మార్చి 30న కామారెడ్డి పట్టణ శివారులోని ఒక భూమి వివాదం విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కుటుంబ సభ్యుల్లో ఒకరైన కామారెడ్డి వాస్తవ్యుడు న్యాయవాది చింతల గోపిపై అప్పటి సిఐ కృష్ణ అకారణంగా దాడిచేశారు. గోపి జర్నలిస్టుగా ...

Read More »

వైద్యునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో బాన్సువాడ మండలం సంగెం గ్రామానికి చెందిన జ్యోతి మృతిచెందింది. ఈ అంశంపై మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టగా మీడియా ప్రతినిదులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన పలువురు వైద్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధిపై ...

Read More »

భద్రత ఏర్పాట్లు పరిశీలించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ తుదిదశ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు పరిశీలించి పోలీసు అదికారులకు పలు సూచనలు చేశారు. నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో పోలింగ్‌బూత్‌ను, బందోబస్తును సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో తుది దశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, ...

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 6 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్బంగా నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల పరిధిలోని ప్రజలు ఆయా రకాల సమస్యలపై 6 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. ఫిర్యాదుల పట్ల సిపి సానుకూలంగా స్పందిస్తు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Read More »

డయల్‌ యువర్‌ సిపిని సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్‌ కార్తికేయ జిల్లా ప్రజలకు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు వివరించాలని కమీషనర్‌ తెలిపారు. ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం రాకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలని కమీషనర్‌ సూచించారు. సమస్యల పరిష్కారానికై ఆయా పోలీసు స్టేషన్లకు ...

Read More »

బస్సు ఢీకొని వివాహిత మృతి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామ శివారులో బస్సు ఢీకొని గ్రామానికి చెందిన మారెమ్మ అనే వివాహిత మృతి చెందింది. నిజామాబాద్‌ నుంచి జన్నేపల్లి వెళుతున్న బస్సు ఏపి 28 జెడ్‌ 1930 డిపో 2, అతివేగంగా వచ్చి మోటారుసైకిల్‌పై వెళుతున్న దంపతులను ఢీకొనడంతో మారెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా బస్సు డ్రైవర్‌ వేణుగౌడ్‌పై కేసు నమోదుచేసినట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Read More »

విద్యార్థిని అదృశ్యం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని అదృశ్యమైనట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. విద్యార్థిని తండ్రి మంగలి నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నవీపేట మండలం ఫక్రాబాద్‌కు చెందిన నరేశ్‌ కుటుంబ పోషణకై నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగలి వృత్తి చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడని, అదేక్రమంలో తమ పిల్లల్ని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని, అయితే ...

Read More »

బోధన్‌ ఎన్నికలకు భారీ బందోబస్తు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఈనెల 25న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కమీషనర్‌ హెచ్చరించారు. గొడవలు సృష్టించే వ్యక్తులపై నిఘా ఉంచామని, ప్రజలు పోలీసుశాఖపట్ల ఎంతో స్నేహభావంతో, నమ్మకంతో ఉంటారని, ఎవరికైనా శాంతిభద్రతల సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు ...

Read More »

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మొండివాగు నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Read More »