Breaking News

Crime

తల్లి ఒడికి చేరిన కిడ్నాప్‌నకు గురైన బాలుడు

అల్వాల్, నవంబర్ 19: బాలుడిని తల్లి నుండి ఎత్తుకుపోయి విక్రయించిన కేసు మిస్టరీని పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బాలుడిని తల్లి ఒడికి చేర్చారు. నార్త్‌జోన్ అదనపు డిసిపి పివై గిరి గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇటీవలే భర్త చనిపోవడంతో ఖమ్మం జిల్లా నివాసి రమాదేవి సికింద్రాబాద్‌కు వచ్చి చెత్తకాగితాలు, ఖాళీ బాటిళ్లు సేకరించి విక్రయించుకొని ఫుట్‌పాత్‌పై, సికింద్రబాద్ రైల్వేస్టేషన్‌లో నిద్రిస్తూ కాలం గడుపుతోంది. టోలీచౌకిలో నివాసం ఉండే మహమ్మద్ అరీఫ్(27) ఆటోడ్రైవర్. అతని సోదరికి పెళ్లి జరిగి ...

Read More »

అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి డిప్యూటి డిఇవో కార్యాలయంలో శుక్రవారం ఏబివిపి నాయకులు వినతి పత్రం అందజేశారు. డిప్యూటి డిఇఓ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఏబివిపి నగర కార్యదర్శి బాల్‌రాజు మాట్లాడుతూ కామారెడ్డిలోని ప్రణతి కోచింగ్‌ సెంటర్‌లో అనుమతి లేకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కనీస మౌలిక వసతులు సైతం లేవని, 60 ...

Read More »

ఆరుగురు టీఆర్‌ఎస్ నేతల అపహరణ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం డివిజన్‌లో ఆరుగురు టీఆర్‌ఎస్ నాయకులు అపహరణకు గురయ్యారు. చర్ల మండలం పునుగుప్ప అటవీ ప్రాంతంలో వీరిని మావోయిస్టులు అపహరించుకు పోయారు. అపహరణకు గురైన వారిలో భద్రాచలం నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ మానే రామకృష్ణ, వాజేడు మండల నాయకులు జనార్ధన్, సత్యనారాయణ, చర్ల మండలం నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేష్ ఉన్నారు. కాగా, ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు నేత జగన్ పేరిట లేఖను చర్లలో వదిలి వెళ్లారు

Read More »

మట్కా ఏజెంట్‌ అరెస్టు

  ఆర్మూర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దబజార్‌లో మట్కా స్థావరంపై దాడిచేసి దోండి లక్ష్మినారాయణను అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ గురువారం తెలిపారు. లక్ష్మినారాయణ వద్దనుంచి 1010 రూపాయలు, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకన్నట్టు తెలిపారు. ఇంకా ఎక్కడైనా మట్కా, లేదా పేకాట ఆడుతున్న సమాచారం తెలిస్తే వివరాలు తెలియజేయాలని అన్నారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Read More »

హత్యాయత్నం కేసులో హీరో వినోద్ కుమార్ అరెస్టు

పుత్తూరు, నవంబర్ 17: ‘సీతారత్నం గారి అబ్బాయి’ సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు వినోద్ కుమార్ అలియాస్ వినోద్ ఆల్వాను హత్యాయత్నం ఆరోపణలపై పుత్తూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వినోద్ కుమార్ తన స్నేహితుడు ఉదయ్‌ణ చిక్కిటయ్యతో కలిసి తన మాజీ మేనేజర్ సచ్చిదానందను సినీ ఫక్కీలో భారీ వాహనంతో ఢీకొట్టి చంపడానికి పథకం పన్నాడని తెలుస్తోంది. సచ్చిదానంద మరో గ్రామస్థుడితో కలిసి మోటారు సైకిలుపై వెళ్తుండగా ఉదయ్ నడుపుతున్న జీపు హటాత్తుగా వారి వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికీ ...

Read More »

పేకాట స్థావరంపై దాడి – ఐదుగురి అరెస్టు

  రెంజల్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో దాడిచేసి ఐదుగురు పేకాట రాయుళ్లను, 230 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

కుటుంభ కలహాలతో హత్య

కుటుంభ కలహాలతో భావమరిది అతని భార్యను అతి కిరాతకంగా గడ్డపారతో కొట్టి చంపటంతోపాటు ఇతర కుటుంభ సభ్యులను తీవ్రంగా గాయపర్చిన సంఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామంలో పీట్ల నర్సింలు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావటం లేదని ఆమెను నరకటానికి ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకుంటున్న ఆమె కుటుంభ సభ్యులపై గడ్డపారతో దాడికి దిగాడు. దాడిలో నిందుతిని బావమరిది సాయిలు, చెల్లెలు రోజాలు అక్కడికి అక్కడే మరణించారు. నిందుతుని భార్య శివమ్మ, మరదలు ఒల్లెపు లళిత, అత్త ...

Read More »

యువతి అదృశ్యం

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన కచ్చకాయల రాజేందర్‌ కూతురు రమ్య (19) శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిందని ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోస్‌కుమార్‌ శనివారం తెలిపారు. తండ్రి రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి కథనం ప్రకారం శుక్రవారం ఉదయం తన మేనత్త వద్దకు వెళుతున్నానని చెప్పిందని, మేనత్త వద్ద విచారించగా రమ్య అక్కడికి వెళ్లలేదని తెలిసిందని, ఇతర బంధువులను విచారించినా ...

Read More »

దొంగతనానికి పాల్పడిన నిందితులకు జైలుశిక్ష

  ఆర్మూర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన బూస రాజు ఇంట్లో ఏప్రిల్‌లో దొంగతనం జరిగినట్టు బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించి అనుమానంపై అదే కాలనీ కెనాల్‌ కట్టకు చెందిన కపపర్తి రాజు, కనపర్తి సత్యంలను విచారించిన అనంతరం వారిని సోమవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో వారికి జూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఉదయ్‌కుమార్‌ వంద రూపాయల జరిమానాతో పాటు 7 నెలలజైలుశిక్ష ...

Read More »

పెద్దమ్మ ఆలయంలో చోరీ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామం పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం పశువుల కాపరి ఆలయ తలుపులు తెరిచి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు ముదిరాజ్‌ కులస్తులు ఆలయం వద్దకు చేరుకొని గత నాలుగేళ్ళుగా తెరవని హుండిని సుమారు 500 మీటర్లు తీసుకెళ్ళి ధ్వంసం చేసి అపహరించినట్టు గమనించారు. దాంతోపాటు తులంనర బంగారు నగలు, వెండి వస్తువులను దొంగిలించినట్టు గ్రామ విఆర్వో రాజారాం తెలిపారు. ...

Read More »

గుర్తు తెలియని వృద్దురాలి మృతి

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంగణంలో బుధవారం గుర్తు తెలియని వృద్దురాలు (60) మృతి చెందింది. పట్టణ ఎస్‌ఐ శోభన్‌ కథనం ప్రకారం… ఆర్టీసి ప్రాంగణంలో బుధవారం ఉదయం వేళ గుర్తు తెలియని వృద్దురాలు మృతి దేహం లభించిందన్నారు. మృతురాలు గోచిచీర కట్టుకొని మెరుణ్‌ రంగు చీర ఉందన్నారు. కుడిచేయిపై పొన్నచెట్టు పచ్చబొట్టు, ఎడమచేయిపై చందమామ పచ్చబొట్టు, నుదురు, గదవపై పచ్చబొట్లు ఉన్నాయన్నారు. మృతురాలు గుండు చేయించుకొని ఉందని తెలిపారు. కేసు ...

Read More »

ప్రభుత్వ అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ అనుమతిలేకుండా నడుస్తున్న కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం టిజివిపి నాయకులు కామారెడ్డి ఉపవిద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో కామారెడ్డి ప్రాంతంలో అనేక పేర్లతో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయన్నారు. వాటిల్లో కనీస సదుపాయాలు లేవని, ఫీజులు దండుకుంటున్నారని చెప్పారు. అధిక ఫీజులను అరికట్టి సదుపాయాలు కల్పించేలా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో టిజివిపి ...

Read More »

ఏసిబి వలలో అవినీతి చేప

  లంచం తీసుకుంటూ చిక్కిన డిప్యూటి తహసీల్దార్‌ కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారంరేషన్‌ డీలర్ల వద్ద నుంచి లంచం తీసుకుంటూ కామారెడ్డి డిప్యూటి తహసీల్దార్‌ బాలయ్య ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. డిప్యూటి తహసీల్దార్‌ బాలయ్య మండలంలోని లింగాయపల్లి గ్రామ రేషన్‌ డీలర్‌ సిద్దిరాములుకు సంబంధించి రేషన్‌ షాపులో గోధుమల పత్రాల అనుమతికి సంబంధించి రూ. 2 వేలు లంచం అడిగాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని రేషన్‌ డీలర్‌ సిద్దిరాములు ఏసిబిని ఆశ్రయించాడు. నిజామాబాద్‌ ...

Read More »

మధుప్రియ పెళ్లైపోయింది

బెజ్జూరు (ఆదిలాబాద్) : నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో తన అభీష్టం మేరకు ...

Read More »

ఆర్డీవో ఘెరావ్‌

  – ఖాళీ స్థలాన్ని తీసుకోవద్దని ఆందోళన కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఇందిరా నగర్‌ కాలనీలోగల 31 చేరాయి ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని అధికారులు ఆక్రమించుకోవాలని చూడడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో నగేశ్‌ను ఘెరావ్‌ చేశారు. స్థలం విషయంలో ఆర్డీవోతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీ స్థలంలో అనేకమంది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని అధికారుల దృస్టికి తీసుకొచ్చారు. స్థలం పేదలకు కేటాయించాలని, గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన విషయాన్ని, ...

Read More »

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు

  – అధిక ధరలకు విక్రయిస్తున్న మద్యం డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుదుకాణాలను ఏర్పాటు చేసి అధిక ధరలను మద్యాన్ని విక్రయిస్తున్నారు. తెరాస ప్రభుత్వం మద్యం టెండర్లు పిలిచి నెలరోజులు కాకముందే మండలంలోని గ్రామానికి రెండు బెల్టుషాపులను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని భవానిదాబా, కంచెట్టిదాబా, రైల్వేస్టేషన్‌ దాబాల వద్ద ఉన్న మద్యం దుకాణాల్లోంచి మద్యం సరఫరా చేస్తున్నారు. దర్మారం వద్ద ఏర్పాటు చేసిన వైన్‌ దుకాణం నుంచి బర్దిపూర్‌, ధర్మారం, ఆరేపల్లి, కేశాపూర్‌, ...

Read More »

యువకుడి దారుణ హత్య

  రెంజల్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ కాలనీకి చెందిన దాసరి గంగాధర్‌ అలియాస్‌ పాంటి (30) అనే యువకుడిని ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో తలకిందిభాగంలో దాడిచేసి హత్యచేసినట్లు నిజామాబాద్‌ రూరల్‌ సిఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం… గంగాధర్‌ వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉండేవాడని, రోజువారిలాగే మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి నిద్రించాడన్నాడు. అతని తండ్రి దాసరి నాయుడు బుధవారం ఉదయం ఇంటి తలుపులు ...

Read More »

చనిపోయిన వారిపేరుమీద ఉపాధి హామీ బిల్లులు స్వాహా

  బీర్కూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో మార్చ్‌ 2014 నుంచి 31 ఏప్రిల్‌ 2015 వరకు నిర్వహించిన ఉపాధి హామీ పనుల దృష్ట్యా మండల అభివృద్ది కార్యాలయం ముందు సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మండలంలోగల 17 గ్రామపంచాయతీల్లో 2 కోట్ల 44 లక్షల ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందంటూ ఏపిడి లాల్‌సింహ చౌహాన్‌ తెలిపారు. ఈ పనుల్లో మండలంలోని కొన్ని గ్రామాల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనికీ బృందం తేల్చింది. ఇందులోభాగంగా మస్టర్లలో ...

Read More »

డిచ్‌పల్లి ఖిల్లా రామాయలంలో చోరీకియత్నం

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో గురువారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడగా ఆలయ ప్రధాన ద్వారం ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ప్రధాన ద్వారం ముందున్న చానల్‌గేటు తాళాలను పగులగొట్టి గర్భగుడి ద్వారం తాళాలు తీయరాకపోగా దొంగలు పారిపోయినట్టు తెలుస్తుంది. సంఘటన స్థలానికి డిచ్‌పల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ముజీబుర్‌ రహమాన్‌ చేరుకొని పరిశీలించారు. చోరీకి విఫల యత్నం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సంఘటన స్థలంలో గ్రామస్తులు, ...

Read More »

అక్రమ కట్టడం కూల్చివేత

  కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం స్థలాల పక్కన బ్రహ్మంగారి ఆలయాన్ని నిర్మించడానికి గాను ప్రహరీగోడ నిర్మిస్తుండడంతో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ప్రొక్లెయినర్లతో వేకువజామున కట్టడాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ అనుమతి లేని స్థలంలో కులస్తులు 1200 గజాల స్థలంలో 8 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీగోడ అక్రమమని పేర్కొంటూ సిబ్బంది కూల్చివేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ రవిగౌడ్‌ ఆయా కులస్తులతో తహసీల్దార్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు.

Read More »