నందిపేట్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నందిపేట్ మండలకేంద్రంలోని మోడల్ కళాశాలలో ఆడపిల్లకు తమ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, అత్యవసర సమయంలో పోలీసులను ఎలా ఆశ్రయించాలో డయల్ 100 ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో స్థానిక ఎస్ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పిల్లలు ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేదానిపై అవగాహన కల్పించారు. వాళ్ళు ఆపద ఉందని గ్రహించినా లేదా గుర్తుతెలియని వ్యక్తులు వారికి ఇబ్బంది పెడుతున్నా వెంటనే డయల్ 100 కు ...
Read More »ఉరివేసుకొని యువకుని ఆత్మహత్య
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం ముదాంగల్లికి చెందిన సరీన్ కుమార్ (32) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎంపి వైద్యునిగా పనిచేస్తున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. మృతుని భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోవింద్ పేర్కొన్నారు.
Read More »యువతి అదృశ్యం
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్లోగల ధనలక్ష్మి కాటేజ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నామాల శిరీష (20) అదృశ్యమైనట్టు 6వ టౌన్ ఎస్ఐ తెలిపారు. శిరీష అన్నయ్య నామాల రాకేశ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. బోధన్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన శిరీష నగర శివారులోని ఇండస్ట్రీలో పనిచేస్తుందని, ఈనెల 13వ తేదీన ఇంటినుంచి పనికి వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు రాకేశ్ ఇండస్ట్రికి వెళ్లి ...
Read More »ఆలయంలో దొంగ…
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోగల కేశాపూర్ గ్రామంలో మహాలక్ష్మి ఆలయంలో హుండి చోరీచేస్తున్న వ్యక్తిని ఆలయ సమీపంలోగల అగ్రిగోల్డ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ గుర్తించి అదే సంస్థలో పనిచేస్తున్న గంగారెడ్డికి విషయం తెలియజేశాడు. ఇద్దరు కలిసి ఆలయంవైపు వెళ్లిచూడగా వీరిని గమనించిన దొంగ పారిపోయాడు. అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అతడు కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి తాండాకు చెందిన లంబాడి ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ...
Read More »సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి అని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ శనివారం తెలిపారు. సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్టు 2005, తెలంగాణ ప్రయివేటు సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులరేషన్ రూల్స్ 2008 ప్రకారం అనుమతులు లేకుండా సెక్యురిటి ఏజెన్సీలు నడపరాదని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈమధ్యకాలంలో సెక్యురిటి ఏజెన్సీలు, కంపెనీల మధ్య సరైన అవగాహన లేకపోవడం మూలాన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరైనా ...
Read More »కొనసాగుతున్న దేహదారుఢ్యపరీక్షలు
నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచన మేరకు నిజామాబాద్ నగర శివారులోని నాగారం స్టేడియంలో ఎస్ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు గురువారంతో పదవ రోజుకు చేరినట్టు పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. పదవరోజు వెయ్యి మంది అభ్యర్థులకు గాను 910 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమీషనర్ వెల్లడించారు. పరీక్షల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రీడర్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, ...
Read More »నిందితుల అరెస్టు
నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13వ తేదీన అర్ధరాత్రి బాల్కొండ, ముప్కాల్ మండల కేంద్రాల్లో వైన్స్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. వారి వద్దనుంచి రూ.13 వేల విలువగల నాణేలు స్వాధీన పరుచుకున్నట్టు వివరించారు. కేసులో ముప్కాల్ ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా నేర పరిశోధన చేసి నిందితులను 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారని సిపి పేర్కొన్నారు. నేరస్తులు మహ్మద్ ఖలీల్ (20), మహ్మద్ అహ్మద్ ...
Read More »తప్పతాగి ఎస్ఐ వీరంగం
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి తప్పతాగి తన స్నేహితులతో ఒక యువకునిపై దాడిచేసి అతన్ని ఆసుపత్రి పాలు చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈనెల 8వ తేదీన రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నరేశ్, అతని స్నేహితులతో కలిసి తాము నివాసముండే ప్రాంతానికి వచ్చి మద్యం సేవిస్తుండగా స్తానిక యువకుడు రంజిత్ వారి వద్దకెళ్లి ఇక్కడ కుటుంబాలు నివాసముంటున్నాయని, మద్యం తాగవద్దని కోరారు. దీంతో ఆగ్రహించిన ...
Read More »కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగర శివారులోని రాజారాం స్టేడియంలో జరుగుతున్న ఎస్ఐ, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు బుధవారంతో 9వ రోజుకు చేరినట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బుధవారం వెయ్యి మంది పురుష అబ్యర్థులను పిలువగా, అందులోంచి 845 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ...
Read More »8వ రోజు దేహదారుఢ్య పరీక్షలు
నిజామాబాద్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులో నాగారం స్టేడియంలో నిర్వహిస్తున్న ఎస్ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో 8వ రోజుకు చేరినట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. మంగళవారం వెయ్యి మంది అభ్యర్థులకుగాను 872 మంది హాజరైనట్టు ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సి ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కమీషనర్ తెలిపారు. ఉదయం ...
Read More »కొనసాగుతున్న ఎస్ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం రాజారాం స్టేడియంలో ఎస్ఐ, కానిస్టేబుళ్ళ అబ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు సోమవారంతో 7వ రోజుకు చేరాయి. నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7వ రోజు 937 మంది పురుష అభ్యర్థులను పిలువగా, అందులో 876 మంది హాజరైనట్టు కమీషనర్ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా పర్షీలు నిర్వహించినట్టు తెలిపారు. అక్రమాలకు ...
Read More »ఇసుక తరలిస్తే చట్టరీత్యా నేరం
ఆర్మూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వేల్పూర్ మోర్తాడ్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీస్ శాఖ సిబ్బంది ఆర్టీవో అధికారికి అప్పగించారు. అనంతరం అసిస్టెంట్ రవాణా శాఖ అధికారి జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపయోగించే ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే ఆర్టీవో చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రతి ట్రాక్టర్‌ను పరిశీలించి ట్రాక్టర్ డ్రైవర్ లైసెన్స్, సంబంధిత పత్రాలను పరిశీలించి వాహనానికి జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ...
Read More »ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ సమక్షంలో నిర్వహించారు. మూడవరోజు పరీక్షలకు వెయ్యి మంది పురుష అభ్యర్థులను పిలువగా 891 మంది హాజరైనట్టు కమీషనర్ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా ఆర్ఎఫ్ఐడి ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ...
Read More »ఆర్టీవో కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్టిఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పడుగుల సుదాకర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విదుల్లో ఉండగానే ఆత్మహత్యకు సుధాకర్ ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అధికారుల వేధింపులా, కుటుంబ కలహాలా ఆత్మహత్యకు కారణమనే కోణంలో కేసు విచారణ జరుపుతున్నారు.
Read More »పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఏసిపి
రెంజల్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని రెంజల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం బోధన్ ఏసిపి రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రూరల్ సిఐ షకీర్ ఆలీ, ఎస్సై శంకర్ సిబ్బంది ఉన్నారు.
Read More »పేకాటరాయుళ్ల అరెస్టు
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ఖలీల్వాడిలో ఓ సిటీ స్కానింగ్ సెంటర్ పై అంతస్తులో మంగళవారం పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్ఫోర్సు సిఐ జగదీశ్ తెలిపారు. వారి వద్దనుంచి లక్ష 2 వేల 226 నగదు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. సమగ్ర విచారణ కొరకు కేసును ఒకటో టౌన్‌కు బదిలీ చేసినట్టు సిఐ పేర్కొన్నారు. దాడిలో ఎస్ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.
Read More »చిరుత దాడి…
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామశివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట ప్రాంతంలో సోమవారం ఉదయం ధూసమడుగు వద్ద చిరుతపులి గోవును వేటాడి చంపింది. గత ఆరు నెలల్లో 11 ఆవులను చిరుత వేటాడడంతో గ్రామస్తులు, పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుత దాడిలో నీలం సత్తయ్యకు చెందిన 8 ఆవులు, దూడలు, పిట్ల లింగన్న, నీలం గంగవ్వ కు చెందిన గోవులను చంపి తిన్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి భాస్కర్ ...
Read More »రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఉద్యోగుల మృతి
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు గ్రామ సమీపంలో సోమవారం పెట్రోల్ పంప్ వద్ద లారీ కారును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న గచ్చిబౌలికి చెందిన లక్ష్మినారాయణ (32), బీహార్‌కు చెందిన రాజన్ (26), విజయ్‌కుమార్, కోమల్సింగ్లు కారులో షిర్డీ వెళ్ళి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. మద్నూర్ సమీపంలో వీరి కారును ఎదురుగా ...
Read More »వివాహిత ఆత్మహత్య యత్నం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయిన భర్త బాధలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన 6వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అసద్నగర్లోని అపార్టుమెంటులో గురువారం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కథనం ప్రకారం…. నగరంలోని అసద్నగర్లో నివాసముంటున్న జరీనాబేగం, తాజ్ దంపతులు కూలీ పనిచేసుకుంటు జీవనం గడిపేవారు. ఐదేళ్ళ క్రితం హిజ్రాగా మారిన జరీనాబేగంకు, తాజ్‌తో ఎనిమిది నెలల క్రితం ...
Read More »డయల్ యువర్ సిపికి 9 ఫిర్యాదులు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ప్రతిసోమవారం నిర్వహించే డయల్ యువర్ సిపి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోదన్ డివిజన్ల నుంచి ప్రజలు డయల్ యువర్ సిపి ద్వారా సిపికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వీటిపై సిపి స్పందిస్తు బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఫిర్యాదుల్లో పేర్కొన్న విధంగా సంబందిత పోలీసు అదికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ప్రజలు ఏమైనా సమస్యలుంటే డయల్ ...
Read More »