Breaking News

Crime

నక్సల్స్‌ బ్యానర్‌ రగడ…. పోలీసుల ఆరా…. జనశక్తి నక్సల్స్‌ ఉన్నట్టా… లేనట్టా

వివాదం అవుతున్న ఎర్గట్లలో నక్సల్స్‌ బ్యానర్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15. జిల్లాలో నక్సల్స్‌ ప్రభావంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎర్గట్లలో బ్యానర్ల వెలువడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈనెల 30న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం.ఎల్‌) జనశక్తి పార్టీ బ్యానర్లు మోర్తాడ్‌ మండలం ఎర్గట్లలో రెండు రోజుల క్రితం వెలిసాయి. దీంతో ఈ వ్యవహారం జిల్లా అంతంట చర్చనీయాశంగా మారింది. నెల రోజుల క్రితం దోమకొండ ప్రాంతంలోనూ పోస్టర్లు వెలిసాయి. కానీ వీటిని ఎవరు బయటకు తెచ్చారు అనేది ప్రశ్నార్థకంగా ...

Read More »

ఎసిబి వలకు చిక్కిన పంచాయితీ కార్యదర్శి

బాల్కొండ, నవంబర్‌ 12 : గ్రామ ఉపసర్పంచ్‌ వద్ద 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయితీ కార్యదర్శి ఉదంతం బుధవారం బాల్కొండ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. ఎసిబి డిఎస్పీ సంజీవరావు నేతృత్వంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ అలకొండ శ్రీనివాస్‌ నుంచి చిట్టాపూర్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి రమేశ్‌ 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ...

Read More »

ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -ఒకరి మృతి -మరొకరి పరిస్థితి విషమం

  కామారెడ్డి, నవంబర్‌ 11 : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఇద్దరు ఇంటర్మీడియట్‌ విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. మాచారెడ్డి మండలానికి చెందిన మానస (18) మంగళవారం ఉదయం పురుగుల మందు సేవించగా ఆసుపత్రికి తరలించారు. స్థానిక బతుకమ్మకుంట కాలనీలో సమీప బంధువుల వద్ద వుంటుంది. దీంతో మానసను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేయడానికి నిరాకరించడంతో ప్రభుత్వ ...

Read More »

కలకలం రెపిన నకిలీ కరెన్సి

నిజామాబాద్‌, నవరబర్‌ 11; నగరంలోని నాగారం కెనాల్‌లొ నకిలీ కరెన్సి కలకలం రేపింది. వివరాలలోకి వెలితె నగర శివారులోని నాగారం దగ్గర గల నిజాంసాగర్‌ కెనాల్‌లొ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలొ ఎవరొ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ కరెన్సి నోట్లని ఒక సంచిలొ తీసుకువచ్చి కెనాల్‌ నీటిలొ పారవెసి పారిపోయాడు. అది చూసిన స్తానికులు అవి నిజమైన నోట్లని భావించి వాటికొసం ఎగబడ్డారు. దీనితొ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఆయి బ్రిడ్జిపైన రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. వెంటనె 5 టౌన్‌ పొలీసులు ...

Read More »

కామారెడ్డిలో వృద్ధురాలు హత్య

కామారెడ్డి, నవంబర్‌ 10 : కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి వృద్ధురాలు హత్యకు గురైంది. కాలనీలోని ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ తువాలుతో మెడకు చుట్టి హతమార్చారు. సోమవారం ఉదయం కుటుంబీకులు వృద్ధురాలు మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Read More »

వారంతే……..అవినీతిటైపు

  బాన్సువాడ, నవంబర్‌07, (పండరీనాథ్‌): అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. బోధన్‌ ప్రాంతంలో నిషేదిత మత్తు పదార్థాల నియోగం, అనుమతిలేని మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసార తయారి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉన్న వీటిని అరికట్టడంతో చిత్తశుద్ది చూపడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా ప్రత్కేక బృందాలు దాడులు చేస్తున్నాపుడే అక్రమాల గుట్టురట్టవుతోంది. స్థానికి అధాకారులు తమకేమి పట్టనట్లు ఉండడం అనుమానాలకు తావిస్తొంది. క(ళ్ళు)ల్లు మూసుకుంటున్న అధికారులు బోధన్‌ డివిజన్‌లో కల్తీకల్లు వ్యాపారం ...

Read More »

అపరిచితులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దు -కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌

కామారెడ్డి, నవంబర్‌ 6 : అపరిచితులు, అనుమానిత వ్యక్తులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. నెట్‌కేఫ్‌, మొబైల్‌షాపు, సిడిపాయింట్‌ యజమానులు, నిర్వాహకులకు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు సిమ్‌కార్డులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక హత్య కేసులో నిందితుని వద్ద వృద్ధురాలి పేరిట గల సిమ్‌కార్డు దొరికిందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల మొబైల్‌షాపు నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. అదే విధంగా చిన్న పిల్లలను ...

Read More »

మహిళ హత్య కేసులో ఆర్టీసి డ్రైవర్‌ అరెస్ట్‌ -నాలుగున్నర తులాల ఆభరణాలు , రూ.18 వేల నగదు స్వాధీనం

కామారెడ్డి, నవంబర్‌ 6 : ఓ మహిళను నమ్మించి మద్యం తాగించి హత్య చేసిన సంఘటనలో ఆర్టీసి డ్రైవర్‌ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల యశోధ అలియాస్‌ లక్ష్మి (28) కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని కొలమద్ది గ్రామ శివారులో గల నర్మాల ప్రాజెక్టు (ఎగుర మానేరు డ్యాం) సమీపంలో గత అక్టోబర్‌ 14న దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటనపై కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో దేవునిపల్లి పోలీసులు కేసును ఛేదించారు. కేసు ...

Read More »

మాజీ ఎంపీ మధుయాస్కీపై కేసు

  నిజామాబాద్‌, నవంబరు 06, నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీపై చెల్లని చెక్కు కేసును నమోదు నాంపల్లి కోర్డు మంగళవారం ఆదేశించింది. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బురుగు రామస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం మధుయాస్కీ బురుగు రామస్వామిగౌడ్‌, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి రూ.30 లక్షల చోప్పున అప్పుగా తీసుకున్నారు. రూ.90 లక్షలు ఏప్రిల్‌ 2014లో తీసుకున్నట్లు వారు పేర్కోన్నారు. ఈ డబ్బుల నిమిత్తం మధుయాస్కీ జూన్‌ 11, 2014 తేదితో కూడిన హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ ...

Read More »

కామారెడ్డిలో చోర్‌ బజార్‌

అడ్డికి పావుసేర్‌ ధరకే సెల్‌ ఫోన్‌ కామారెడ్డి, నవంబర్‌  4: వేలల్లో ధర పలికే సెల్‌ఫోన్‌ వందల్లో దొరుకుతుందంటే నమ్ముతారా? ఇది ముమ్మాటికి నిజం. అయితే అలా తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ అమ్మకాలు కామారెడ్డిలోని చోర్‌ బజార్‌లో జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని సిరిసిల్లా రోడ్‌లో ఎస్‌బిహెచ్‌ బ్యాంకు ఎదురుగా వున్న వీధిలో సెల్‌ఫోన్‌ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆ వీధిలోకి వెళ్తే వందలాది మంది సెల్‌ఫోన్‌లను చేతిలో పట్టుకుని రోడ్డుపై నిల్చుండి లావాదేవీలు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. నోకియా మొదలుకొని శ్యాంసంగ్‌, ఎల్‌జి, మాక్రోమాక్స్‌, ...

Read More »

మద్నూర్‌లో వాహనాల తనిఖీలు

మద్నూర్‌, నవంబర్‌ 3 : మద్నూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌ఎన్‌ఏ రహదారిపై సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, కాలుష్య నివారణ పత్రాలు, బీమా పత్రాలను పరిశీలించారు. నెంబరు ప్లేట్‌తో పాటు అవసరమైన పత్రాలు వారు, పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణించిన వారికి జరిమానాలు విధించినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ...

Read More »

దొంగతనాల నివారణకు ముందుస్తు చర్యలు

మద్నూర్‌, నవంబర్‌ 1 : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని మద్నూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు మందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద సిఐ వెంకటేశ్వర్లు మద్నూర్‌ ఠాణాను తనిఖీ చేసి నేరాలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. అదే విధంగా దొంగతనాల నివారణపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్‌ఐ ...

Read More »

మల్లాపూర్‌ వృద్ధుని అదృశ్యం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : మద్నూర్‌ మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన సాయగొండ (65) గత పది రోజులుగా కనిపించడం లేదని అతని కుమారుడు మల్లుగొండ ఫిర్యాదు చేసినట్లు మద్నూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, సమీప బంధువులు, గ్రామాలు, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Read More »