Breaking News

Crime

దుబాయి నుంచి వచ్చిన భర్తను ప్రియుళ్లతో కలిసి చంపేసిందో భార్య

ఇద్దరు ప్రియుళ్లతో కలిసి.. భర్తను సజీవ దహనం చేసిన భార్య    మోపాల్‌(నిజామాబాద్ జిల్లా): మండలంలోని ఠాణాకుర్దు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భార్య లీలావతి, భర్త సాయిలు(33)ను పథకం ప్రకారం సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ వెంకటేశ్వర్లు, మోపాల్‌ సీఐ సతీష్‌లు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఠాణాకుర్దు గ్రామానికి చెందిన వేల్పూర్‌ సాయిలు బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి గత పదిరోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ...

Read More »

అమ్మ పుట్టినరోజునే ఆమెను హత్యచేశాడు. కారణం..

ఫ్లోరిడా: ప్రాణం పోసిన అమ్మ పుట్టిన రోజు వచ్చిందంటే ఆమె కడుపున జన్మించిన వారికి చెప్పలేని సంతోషం ఉంటుంది. అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని అత్రుతగా ఎదురుచూస్తారు. కానీ.. అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ యువకుడు విరుద్ధంగా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లిని ఆమె పుట్టిన రోజు నాడే కడతేర్చాడు. జోషూ లియోన్ కర్మోనా అనే 18 ఏళ్ల యువకుడు అమ్మను చంపేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూశాడు. ఆమె పుట్టిన రోజు నాడే ఆమెను చంపాలని ముహూర్తంగా ఎంచుకున్నాడు. అనుకున్న రోజు రానే ...

Read More »

ప్రజావాణిలో 78 ఫిర్యాదులు

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 78 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జేసి సత్తయ్య, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు పంపినట్టు చెప్పారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More »

చీర దొంగకు ఏడాది జైలా?: సుప్రీం

న్యూఢిల్లీ: కోట్లాది రూపాయలు లూటీ చేసి విలాసవంత జీవితాన్ని అనుభవిస్తుంటే.. చీరలు దొంగతనం చేశాడని ఏడాది పాటు జైలు నిర్భందంలో ఉంచడమా..? అని తెలంగాణ సర్కార్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం చురక అంటించింది. చీరల దొంగతనం ఆరోపణలతో తన భర్త ఎల్లయ్యను ఏడాదికాలంగా జైల్లో ఉంచారంటూ హైదరాబాద్‌ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More »

బీర్కూర్‌ విఆర్వో దారుణ హత్య

  బీర్కూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో బుధవారం ఉదయం బీర్కూర్‌ విఆర్వో-2 అద్దె రాములు (45) దారుణంగా హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ డిఎస్పీ నర్సింహరావు కథనం ప్రకారం… బాల్కొండ మండలం సుబ్బిర్యాల్‌ గ్రామానికి చెందిన అద్దె రాములు గత ఏడాదిన్నర కాలంగా బీర్కూర్‌ మండల విఆర్వో-2గా పనిచేస్తున్నారన్నారు. అదే క్రమంలో బుధవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు విఆర్వో రాములు ఒంటిపైన బట్టలు లేకుండా, తలపై, ఒంటిపై పదునైన ఆయుధంతో చేసిన గాట్లతో ...

Read More »

చేయని తప్పుకు.. దుబాయ్ లో జైలు

గల్ఫ్ ఎజెంట్స్ , డ్రగ్స్ మాఫియా ఆగడాలకు ఓ అమాయకుడి జీవితం దుబాయ్ లో జైలుపాలైంది. చేయని తప్పుకు ఏడేళ్లు జైలు శిక్షపడింది.  నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్ ఉపాధికోసం దుబాయ్ వెళ్లాడు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన శ్రీనివాస్ 2016లో తిరిగి ఇంటికి వచ్చాడు. నితిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగు నెలల తర్వాత  దుబాయ్ వెళ్లాడు. రిటర్న్ లో వెళ్లేప్పుడే చిక్కుల్లో పడ్డాడు. శ్రీనివాస్ దుబాయ్ కు వెళ్లేప్పుడు ట్రావెల్ ఏజెంట్ మహష్ చిన్న ...

Read More »

73 మంది బాలకార్మికులకు విముక్తి

  కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి 73 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్టు జిల్లా సంక్షేమ అధికారి ఎం.రాధమ్మ తెలిపారు. ఆపరేషన్‌ స్మైల్‌-3లో భాగంగా పోలీసుశాఖ, మహిళ, శిశు సంరక్షణ శాఖ, వివిధ శాఖల సమన్వయంతో ప్రతియేటా జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న తనిఖీలో భాగంగా ఈయేడాది సైతం తనికీలు చేపట్టినట్టు తెలిపారు. వివిధ ప్రాంతాలను పరిశీలించి ...

Read More »

ఫేస్‌బుక్ లైవ్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్

స్టాక్‌హోం : ముగ్గురు నరరూప రాక్షసులు మనిషన్నవాడు భీతిల్లేలా దారుణానికి తెగబడ్డారు. మృగాల్లా మారి ఓ ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మానవత్వాన్ని మంటగలిపిన ఆ వికృత చేష్టలను వికటాట్టహాలను ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ పెట్టారు. పోలీసులు వచ్చి ఆ నీచులను పట్టుకునే వరకు మూడు గంటల పాటు దారుణకాండ కొనసాగింది. బాధితురాలు స్పృహ కోల్పోయి జీవచ్ఛవంలా పడి ఉన్న దృశ్యాన్నీ కొందరు చూశారు. సుమారు ఆరు వేల మంది ఉన్న ఫేస్‌బుక్ క్లోజ్డ్ గ్రూప్‌లో ఈ అకృత్యాన్ని ఆ ముగ్గరు లైవ్ స్ట్రీమ్ ...

Read More »

సినీ నిర్మాతనంటూ బురిడీ

55 గ్రాముల నెక్లెస్‌తో ఉడాయించిన వ్యక్తి అరెస్టు  సినీ నిర్మాతనంటూ నమ్మించి బంగారు నగల దుకాణంలో 55 గ్రాముల నెక్లెస్‌ తీసుకొని ఉడాయించిన యువకుడిని సైదాబాద్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 1.67 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చంపాపేట రెడ్డి కాలనీలో మాధవీలత శ్రీ స్వర్ణ జువెలరీ పేరుతో బంగారు, వెండి ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. బీటెక్‌ పూర్తిచేసిన మహబూబాబాద్‌ జిల్లా తంగెళ్లపల్లికి చెందిన టి. నాగేంద్రకుమార్‌ వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా మాధవీలతకు సినీ నిర్మాతగా ...

Read More »

భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపి తానూ ఆత్మహత్య

కడప: ఆవేశం మనిషిని ఎంతటి దారుణానికైనా పురిగొల్పుతుంది. దీని ఫలితం ఎంత ఘోరంగా అయినా ఉండొచ్చు. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంలో అనుమానం పెనుభూతమైంది. దీంతో కుటుంబ యజమాని తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. భార్యను అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితంగా వారి ఒక్కగానొక్క చిన్నారి అనాథ అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కడప జిల్లా వేముల మండలం నల్లచెరవుపల్లిలో రామాంజనేయులు అతని భార్య కవిత దంపతులు కూలి పని చేస్తూ ...

Read More »

మేడిపల్లి వద్ద ఆటోబైక్‌ ఢీ – ఒకరి మృతి

  గాంధారి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం మేడిపల్లి గ్రామ శివారువద్ద సోమవారం సాయంత్రం ఆటో, బైక్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీ బస్వన్న తాండాకు చెందిన మోతిలాల్‌ (30) అనే వ్యక్తికామారెడ్డి నుంచి తన పని ముగించుకొని సొంత గ్రామానికి వెళుతుండగా మేడిపల్లి గ్రామ శివారువద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న మోతిలాల్‌కు చేయి విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో ...

Read More »

వాహనాన్ని తప్పించబోయి బస్సుకింద పడిన యువకుడు

బీర్కూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామ ప్రధాన రహదారిపై బాన్సువాడ గ్రామానికి చెందిన మహ్మద్‌ అప్రోజ్‌ (25) వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసి బస్సుకింద పడి గాయాలపాలైనట్టు నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం … బాన్సువాడ నుంచి తిమ్మాపూర్‌ వస్తున్న మహ్మద్‌ అప్రోజ్‌ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వస్తున్న ఆర్టీసి బస్సుకింద పడి గాయాలపాలయ్యాడు. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్తలానికి చేరుకొని అప్రోజ్‌ను ...

Read More »

ఉరిశిక్షపై హైకోర్టులో సవాల్ చేసిన దిల్‌సుఖ్‌నగర్ నిందితులు

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మూడున్నరేళ్లపాటు సాగిన విచారణకు తెరదించుతూ ఎన్ఐఏ కోర్టు నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జివుర్ రెహ్మన్, మహ్మద్ తహసీన్ అక్తర్, అజాద్ షేక్‌లను దోషులుగా తేలుస్తూ వారికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు కాపీని హైకోర్టుకి పంపింది. ఈ తీర్పును హైకోర్టు నిర్థారించాకే శిక్ష అమలు చేయనుంది. ఈ తీర్పును పరిశీలించిన హైకోర్టు రెఫర్ ట్రయల్ ...

Read More »

నగదు మారుస్తామంటూ కుచ్చుటోపీ

ఏడుగురు సూడో పోలీసుల అరెస్టు   27లక్షల కొత్త నోట్లు, కారు, రెండు బైక్‌లు స్వాధీనం   పోలీసులమని నమ్మించారు. గుట్టలుగా పాత కరెన్సీ ఉందని, కొత్త కరెన్సీ ఇప్పిస్తే కమీషన్‌ ఇస్తామంటూ ఆశ చూపారు. నమ్మి కొత్త నోట్లతో వస్తే.. కాజేసి ఉడాయుంచారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి 27లక్షల కొత్త కరెన్సీ, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్‌కు చెందిన ...

Read More »

అర్ధరాత్రి వాహనాల తనిఖీ…

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు గత రెండ్రోజులుగా మోర్తాడ్‌ ఎక్సైజ్‌ అధికారులు అర్ధరాత్రి జాతీయరహదారిపై వచ్చిపోయే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడు, ఎక్సైజ్‌ సిబ్బంది గత రెండ్రోజులుగా రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో మోర్తాడ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ పటేల్‌ బానోజి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గైపీర్లవద్ద అనుమతి లేకుండా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని మైనార్టీలు తహసీల్దార్‌ కృష్ణానాయక్‌కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. బీర్కూర్‌ గ్రామంలో గైపీర్ల పూజ నిమిత్తం మొల్ల కులానికి చెందిన మైనార్టీలు సంవత్సరానికి ఒక కుటుంబం చొప్పున దేవునికి పూజలు నిర్వహిస్తారని, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మొల్ల కుటుంబ సభ్యులందరికి అడిగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం గైపీర్ల దేవునికి పూజలందిస్తున్న ఓ కుటుంబం కులానికి సంబందం లేకుండా ...

Read More »

ఫ్లైట్‌లో టీవీ నటిపై లైంగిక వేధింపులు

ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోలేదన్న టీనా దత్తా హిందీ టీవీ చానల్‌ నటి, కలర్స్‌ చానల్‌ ‘ఉత్తరన్‌’ షో స్టార్‌ టీనా దత్తాను విమానంలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. దీనిపై ఫ్లైట్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం వైరల్‌ కావాలంటూ… తన ఫేస్‌బుక్‌ పేజీలో జరిగిన విషయాన్నంతటినీ పోస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం ఆమె జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో ముంబై నుంచి రాజ్‌కోట్‌కు ప్రయాణమయ్యారు. ఫ్లైట్‌లో ఎక్కి కూర్చున్న ఆమెను టేకాఫ్‌కు ...

Read More »

ఆ మహిళా బ్యాంక్‌ మేనేజర్‌పై మనసుపారేసుకున్న ఖాతాదారుడు ఏం చేశాడంటే

హైదరాబాద్: అతడో ఆర్‌ఎంపీ డాక్టర్‌. రోజుకు పదుల సంఖ్యలో రోగులకు వైద్యం చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో అతడికి మంచి పేరుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తన వద్ద ఉన్న నగదును స్థానిక బ్యాంకులో డిపాజిట్‌ చేయడం, నగదును విత్‌డ్రా చేసేవాడు. వారానికి మూడుసార్లు బ్యాంక్‌మేనేజర్‌ను కలిసి డబ్బు ఎక్కువగా ఇవ్వాలని వేడుకునేవాడు. ఆ సమయంలో అతగాడి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆ బ్యాంక్‌ మేనేజర్‌పై మనసుపారేసుకున్నాడు. అటెండర్‌ వద్ద నుంచి ఆమె ఫోన్‌ నెంబర్‌ సంపాదించాడు. ఆ తర్వాత వేధింపుల పర్వానికి తెరలేపాడు. ...

Read More »

పోలీసుల వాహనాల తనిఖీ

  బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కల్లోలమోరి చౌరస్తాలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల దృవపత్రాలు పరిశీలించారు. వాహన దారుల దృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణీకులను కూర్చోబెట్టవద్దని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు పోచయ్య, పోశెట్టి, పెద్దన్న, ఉన్నారు.

Read More »

కారులో రూ.65 లక్షలు

మద్దిపాడు: పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం నల్లధనం కట్టలు తెంచుకుని బయటకు వస్తోంది. పలు మార్గాల ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు నల్లబాబులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద కారులో రూ. 65లక్షల నగదు లభ్యమైంది. పోలీసుల వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పెద్దమొత్తంలో నగదును గుర్తించారు. అయితే ఈ భారీ మొత్తానికి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదును ...

Read More »