Breaking News

Cultural

ప్రముఖ కవి ఎండల‌ నర్సింలు మృతి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితుడు ఎండెల‌ నరసింహులు ఆదివారం మరణించారు. నరసింహులు ఇటీవల‌ శ్రీ ల‌క్ష్మీ నరసింహస్వామి శతకం, కుంతీపుత్ర శతకము రచించారు. జిల్లాలో, రాష్ట్రంలో జరిగిన పలు కవిసమ్మేళనాల‌లో పాల్గొని తమ కవితా గానం చేశారు. పద్య రచనలో చేయి తిరిగిన ఆయన ఎన్నో ఖండికలు రచించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని భాషాభిమానాన్ని చాటారు. ఆయన మరణం పట్ల హరిదా రచయితల‌ సంఘం అధ్యక్ష ...

Read More »

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన మార్గదర్శకాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల‌కనుగుణంగా జిల్లాలోని ముస్లింలంతా బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. గురువారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 1వ తేదీన బక్రీద్‌ పండుగ సందర్భంగా కోవిడ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని, ప్రజలు రెండు మీటర్లు లేదా 6 ...

Read More »

భక్తుల‌కు గమనిక…

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ భీంగల్‌ నృసింహ స్వామి ఆల‌యానికి ఈనెల‌ 23 నుంచి ఆగష్టు 20 వ తేదీ వరకు భ‌క్తుల‌ను అనుమతించడం లేదని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు. భీమ్‌గల్‌ గ్రామం, మండల‌ చుట్టుపక్కల‌ గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నందున దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసువారి సూచన మేరకు కొండ మీదికి భక్తుల‌ను అనుమతించబోమని పేర్కొన్నారు. స్వామివారి భక్తులు తమ తమ ఇళ్లలోనే స్వామివారిని ఆరాధించాల‌ని చెప్పారు. తిరిగి ఆల‌యం ఆగష్టు ...

Read More »

రేపటి నుండి దక్షిణాయనం ప్రారంభం

దక్షిణాయనం అంటే ఏంటీ ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం, సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయుల‌ కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెల‌లు ఉత్తరాయణం, 6 నెల‌లు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ...

Read More »

సరస్వతి మహాక్షేత్ర వార్షికోత్సవ వేడుకలు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూరు మండలం ఇల్చిపూర్‌లోని శ్రీ సరస్వతి మహాక్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ అభివృద్ది కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు సామూహిక కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ఒడి బియ్యం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 15న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Read More »

కళ్యాపూర్‌లో దత్త జయంతి వేడుకలు

రెంజల్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దత్త జయంతిని పురస్కరించుకుని మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో బుధవారం దత్త జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సర్పంచ్‌ కాశం నిరంజని, ఉపసర్పంచ్‌ జలయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, ...

Read More »

నిజామాబాద్‌కు లయన్స్‌ క్లబ్‌ స్వాగతం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలో బుదవారం లయన్స్‌ క్లబ్‌ స్వాగత బోర్డు ఏర్పాటు చేసింది. నగరంలోని పూలాంగ్‌ వద్ద హైదరాబాద్‌ వైపు నుండి నిజామాబాదు వైపు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ బోర్డు ఏర్పాటు చేశారు. లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, జోన్‌ చైర్మెన్‌ ద్వారకా దాస్‌ అగర్వాల్‌ స్వాగత బోర్డును ప్రారంబించారు. ఈ సందర్భంగా రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ మాట్లాడుతూ నగరంలోకి ప్రవేశించే వారికి స్వాగతం పలుకడంతో ...

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సమరసతా వేదిక ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ గౌరవ సన్మానం నిర్వహించారు. అంతకు ముందు పారిశుధ్య కార్మికుల సర్వే నిర్వహించి, వారి వివరాలు నమోదు చేశారు. స్థానిక సద్గురుధామంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించుకోవడం తమ భాగ్యంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక ...

Read More »

గోదావరికి పర్యాటక శోభ

నందిపేట్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్ట్‌ అయినటువంటి ఎస్‌ఆర్‌ఎస్‌పి అనేక ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో త్వరలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్ట్‌, దిగువ భాగాన ఉన్న గోదావరి నదికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. గోదావరిపై నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచినప్పటికీ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే కనీస వసతులు లేకపోవడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చిన్నబోయింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు అన్ని ...

Read More »

దేవాలయాలకు భూమిపూజ చేసిన హంపి పీఠాధిపతి

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హంపి పీఠాధిపతి స్వరూపానంద స్వామి శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని శనీశ్వరుని, ముత్యాలమ్మ దేవాలయాల నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయాల నిర్మాణానికి గ్రామస్తులందరూ విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రజని, సర్పంచ్‌ రమేష్‌, గ్రామస్తులు కిషోర్‌, నీరడి రమేష్‌, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేదాలు స్త్రీ గురించి ఏమన్నాయి…

నిజామాబాద్‌ కల్చరల్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం. స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03, స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20, స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది), స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74, స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2, స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – ...

Read More »

శుక్రవారం హనుమాన్‌ విజయోత్సవం

చైత్ర పూర్ణిమను హనుమాన్‌ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్‌ విజయోత్సవంగా నిర్ణయించారట. అదేగాక ఇంకో కధనం కూడా ఉంది. చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారి అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్‌ విజయోత్సవంగా జరుపుతారట. ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ ...

Read More »

బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌నగర్‌ శ్రీరామాలయ శ్రీసీతారామచంద్రస్వామివారి 34వ వార్షిక బ్రహ్మూెత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, ఆరగింపు, తీర్థగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్‌రెడ్డి ఆలయ అధ్యక్షుడు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ వార్షిక బ్రహ్మూెత్సవాలు ఏప్రిల్‌ 11వ తేదీ ...

Read More »

”వికారినామ ఉగాది”

ఉగాది పండుగ వచ్చింది ఉత్సాహాన్నే తెచ్చింది మామిడిపిందెల వేపపువ్వుల చెరుకుముక్కల చింతపులుపుతో కొత్తబెల్లమూ కోరిన రుచులు షడ్రుచుల మేళవింపుతో వికారి నామ వుగాది వచ్చింది కుహూ కుహూ కోయిల రాగాలతో రామచిలకల కోలాహలముతో కొత్తఅల్లుళ్ళ సందళ్ళతో కోరికలు తీర్చే కొత్త ఉగాది రానేవచ్చింది! నవవసంతంలా మనజీవితం మమతానురాగాలతో నిండాలని కోరినకోరికలు తీరాలని కష్టసుఖాలను సమంగా స్వీకరిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం గత చేదుజ్ఞాపకాల్ని విడిచిపెట్టి కొత్తజీవితం ఆరంభిద్దాం రాబోవు ఎన్నికల్లో నిజాయితీపరుల్ని గెలిపిద్దాం మనరాతల్ని మార్చుకొని రాబోవు తరాలకు రాచబాటవేద్దాం అనల 8008694322

Read More »

లక్ష్మీ నరసయ్యకు హరిదా రంగస్థల పురస్కార ప్రదానం

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంస్క తిక ప్రక్రియలలో నాటక రంగం అన్ని కళల సమాహారంగా ప్రేక్షకులను రంజింప చేస్తుందని నిజామాబాద్‌ పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు ముర్తుజా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాటక రంగ అభివద్ధికి కషి జరుగుతున్నదని, అందులో భాగంగానే తెలంగాణ సంగీత నాటక అకాడమీ బాద్మి శివ కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నాటక రంగం ప్రపంచ నాటక చరిత్రలో గొప్ప స్థానాన్ని అలంకరించడానికి రచయితలు, నటులు, దర్శకులు ...

Read More »

24న సంగీత, నృత్యపాఠశాల వార్షికోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీజ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, నిజామాబాద్‌ వారి 47వ వార్షికోత్సవం ఈనెల 24న ఆదివారం నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డి.ప్రశాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 5.30 గంటలకు వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, గౌరవ అతిథిగా సెషన్స్‌ జడ్జి కె.సుజన, ఆత్మీయ అతిథులుగా 7వ పటాలము కమాండెంట్‌ ఎస్‌.వి.సాంబయ్య, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమీషనర్‌ ...

Read More »

బతుకు భారం కాదు…

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుఖం విలువ తెలుస్తుంది శోకం పైబడితేనే అంటారు సినారె… బతుకు విలువ తెలుస్తుంది భారం పైబడితేనే అనిపిస్తుంది పైచిత్రాన్ని చూస్తుంటే… చిన్న వాహనం, దానిపై 40 వరకు కుర్చీలు, సాపలు, వాటిపై తన భార్య యజమానికి భారం అనిపించట్లేదు కదూ… అదే జీవితమంటే… (సామాజిక ప్రసార మాధ్యమంలో కనిపించిన చిత్రం) బతుకు భారాన్ని ఆనందంగా మోస్తున్న వీరికి నిజామాబాద్‌ న్యూస్‌ హ్యాట్సాఫ్‌.

Read More »

21న వసంత కవితోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల సంఘం కామారెడ్డి ఆద్వర్యంలో 21వ తేదీ అంతర్జాతీయ కవితా దినోత్సవం రోజున వసంత కవితోత్సవం (కవి సమ్మేళనం) నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. 21న సాయంత్రం 5 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాశివనంలో కవి సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శంకర్‌, ఆత్మీయ అతుథులుగా తెరసం రాష్టకార్యదర్శి సి.హెచ్‌. ప్రకాశ్‌, తెరసం రాష్ట్రకార్యవర్గసభ్యులు మోతుకూరి ...

Read More »

దేశభక్తిని చాటిచెప్పిన పవిత్ర యుద్దం

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర యుద్దం లఘుచిత్రం దేశభక్తిని చాటిచెప్పిందని ప్రముఖ నిర్మాత భాస్కర్‌ ఐతే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాణిక్‌ భవన్‌ పాఠశాలలో పవిత్రయుద్దం సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ పవిత్రయుద్దం చిత్రాన్ని దర్శకులు రవిశ్రీ అద్భుతంగా తెరకెక్కించారని, అంతేకాకుండా స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తు వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మాణిక్‌ భవన్‌ పాఠశాల ప్రాంగణంలో మొదటి లఘుచిత్రం సక్సెస్‌ మీట్‌ జరగడం ...

Read More »

గ్రంథాలయం ఫేస్‌బుక్‌ పేజీ ప్రారంభం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయ ఫేస్‌బుక్‌ పేజీని గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి శనివారం ఆవిష్కరించారు. డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ వారు గ్రంథాలయ అభివృద్దికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గ్రంథాలయం గురించి అన్ని వర్గాల ప్రజలకు తెలపడానికి సోషల్‌ మీడియా అనుసంధానం చాలా మంచి విషయమన్నారు. పాఠకులందరు గ్రంథాలయానికి సంబంధించిన విశేషాలను ఫేస్‌బుక్‌లో తెలుసుకోవచ్చన్నారు. రీజినల్‌ మేనేజర్‌ మణికంఠ మాట్లాడుతూ ఇలాంటి నూతన ఆలోచనల ద్వారా గ్రంథాలయ అభివృద్ది జరుగుతుందన్నారు. ...

Read More »