నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నామని, ప్రతి కుటుంబం బంధుమిత్రులతో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని కోరుతున్నామని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశిస్తున్నామని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »సంస్కతిని కాపాడేలా పండుగలు జరుపుకోవాలి
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సతీమణి పార్వతీ శరత్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి ఆద్వర్యంలో స్థానిక గాంధీ గంజ్ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలు అన్నారు. ఇక్కడ వేసిన అన్ని ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయన్నారు. పోటా పోటీగా ఒకరిని మించి ఒకరు ముగ్గులు ...
Read More »జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిధి సేకరణ
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతోమంది కరసేవకుల త్యాగము, కషి ఫలితంగా శతాబ్దాల అనంతరం హిందువుల ఆరాధ్య దైవం అయిన భగవాన్ శ్రీ రాముని భవ్య మందిర నిర్మాణం రాజ్యాంగబద్ధంగా ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. శ్రీరామ భవ్యమందిర నిర్మాణ నేపథ్యంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కామారెడ్డి నగరం ఆధ్వర్యంలో నగర విస్తతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని సత్య గార్డెన్లో ఏర్పాటు ...
Read More »జాగృతిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడి కళాశాలలో జాగతి జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా నలు మూలలనుండి తెలంగాణ జాగతి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగతి అధ్యక్షులు మాట్లాడుతూ జాగతిచే నిర్వహించే విద్య, వైద్య, సాంస్కతిక, సాహిత్య, మహిళా సాధికారిక లాంటి కార్యక్రమాలను మండల, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి సభ్యులు కషిచేయాలని సూచించారు. ...
Read More »16న ‘కట్టడి’ ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచించిన కరోనా కవితా సంపుటి ‘కట్టడి’ పుస్తకాన్ని 16న ఆవిష్కరించనున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కవులు, రచయితలు హాజరు కావాలని కోరారు.
Read More »హిందూ పరిరక్షణ చట్టం కోసం మహిళ సైకిల్‌యాత్ర
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందు పరిరక్షణ చట్టం తేవాలని, దేవాదాయ శాఖ రద్దు చేసి దేవాలయాల హుండీ డబ్బును హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలని డిమాండ్ చేస్తూ వేములవాడకు చెందిన సాధారణ మహిళ మధులత గత మూడు రోజుల క్రితం సైకిల్ యాత్ర చేపట్టారు. వేములవాడ నుండి డిల్లి వరకు దాదాపు 1500 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి ప్రధాని నరేంద్ర మోడికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళుతూ బుధవారం రాత్రి కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ...
Read More »కుంకుమార్చనలో దిల్‌రాజు దంపతులు
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుంకుమార్చన పూజా కార్యక్రమంలో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఉదయం 10 గంటలకు మహాలక్ష్మి అమ్మవారికి నవ కలశ అభిషేకం చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి వ్రతం సాయంకాలం 6:30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తామర కొలను వద్ద తామర పుష్పంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, దీపారాధన గావించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ మెంబర్లు ...
Read More »ఆలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ
ఆర్మూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, ముప్కల్ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 34 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా, ఆలయ నిర్మాణం కోసం శుక్రవారం మంత్రి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ పద్మ, జెడ్పిటిసి బద్దం నర్సవ్వ, సర్పంచ్ కొమ్ముల ...
Read More »ఊరికొకటే వినాయక విగ్రహం
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడ కుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామస్తులు పండుగ నేపథ్యంలో తీర్మానం చేశారు. ఈయేడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యూత్క్లబ్ు, యువజన సంఘాలు, గణేశ్ మండలీలు ఎవరు కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేయొద్దని తీర్మానించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మల్లన్న గుడి వద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతిరోజు పురోహితుడు ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారని ...
Read More »ప్రముఖ కవి ఎండల నర్సింలు మృతి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితుడు ఎండెల నరసింహులు ఆదివారం మరణించారు. నరసింహులు ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకం, కుంతీపుత్ర శతకము రచించారు. జిల్లాలో, రాష్ట్రంలో జరిగిన పలు కవిసమ్మేళనాలలో పాల్గొని తమ కవితా గానం చేశారు. పద్య రచనలో చేయి తిరిగిన ఆయన ఎన్నో ఖండికలు రచించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని భాషాభిమానాన్ని చాటారు. ఆయన మరణం పట్ల హరిదా రచయితల సంఘం అధ్యక్ష ...
Read More »వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలకనుగుణంగా జిల్లాలోని ముస్లింలంతా బక్రీద్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 1వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలు రెండు మీటర్లు లేదా 6 ...
Read More »భక్తులకు గమనిక…
ఆర్మూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ భీంగల్ నృసింహ స్వామి ఆలయానికి ఈనెల 23 నుంచి ఆగష్టు 20 వ తేదీ వరకు భక్తులను అనుమతించడం లేదని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. భీమ్‌గల్ గ్రామం, మండల చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నందున దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసువారి సూచన మేరకు కొండ మీదికి భక్తులను అనుమతించబోమని పేర్కొన్నారు. స్వామివారి భక్తులు తమ తమ ఇళ్లలోనే స్వామివారిని ఆరాధించాలని చెప్పారు. తిరిగి ఆలయం ఆగష్టు ...
Read More »రేపటి నుండి దక్షిణాయనం ప్రారంభం
దక్షిణాయనం అంటే ఏంటీ ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం, సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయుల కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ...
Read More »సరస్వతి మహాక్షేత్ర వార్షికోత్సవ వేడుకలు
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అడ్లూరు మండలం ఇల్చిపూర్‌లోని శ్రీ సరస్వతి మహాక్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ అభివృద్ది కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు సామూహిక కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ఒడి బియ్యం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 15న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
Read More »కళ్యాపూర్‌లో దత్త జయంతి వేడుకలు
రెంజల్, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దత్త జయంతిని పురస్కరించుకుని మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో బుధవారం దత్త జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సర్పంచ్ కాశం నిరంజని, ఉపసర్పంచ్ జలయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, ...
Read More »నిజామాబాద్‌కు లయన్స్ క్లబ్ స్వాగతం
నిజామాబాద్, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా కేంద్రంలో బుదవారం లయన్స్ క్లబ్ స్వాగత బోర్డు ఏర్పాటు చేసింది. నగరంలోని పూలాంగ్ వద్ద హైదరాబాద్ వైపు నుండి నిజామాబాదు వైపు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ బోర్డు ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మెన్ గోపాల్ దాస్ అగర్వాల్, జోన్ చైర్మెన్ ద్వారకా దాస్ అగర్వాల్ స్వాగత బోర్డును ప్రారంబించారు. ఈ సందర్భంగా రీజియన్ చైర్మెన్ గోపాల్ దాస్ మాట్లాడుతూ నగరంలోకి ప్రవేశించే వారికి స్వాగతం పలుకడంతో ...
Read More »పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సన్మానం
నిజామాబాద్, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమరసతా వేదిక ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ గౌరవ సన్మానం నిర్వహించారు. అంతకు ముందు పారిశుధ్య కార్మికుల సర్వే నిర్వహించి, వారి వివరాలు నమోదు చేశారు. స్థానిక సద్గురుధామంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించుకోవడం తమ భాగ్యంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక ...
Read More »గోదావరికి పర్యాటక శోభ
నందిపేట్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్ట్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పి అనేక ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో త్వరలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, దిగువ భాగాన ఉన్న గోదావరి నదికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. గోదావరిపై నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచినప్పటికీ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే కనీస వసతులు లేకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ చిన్నబోయింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు అన్ని ...
Read More »దేవాలయాలకు భూమిపూజ చేసిన హంపి పీఠాధిపతి
రెంజల్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హంపి పీఠాధిపతి స్వరూపానంద స్వామి శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని శనీశ్వరుని, ముత్యాలమ్మ దేవాలయాల నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయాల నిర్మాణానికి గ్రామస్తులందరూ విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రజని, సర్పంచ్ రమేష్, గ్రామస్తులు కిషోర్, నీరడి రమేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »వేదాలు స్త్రీ గురించి ఏమన్నాయి…
నిజామాబాద్ కల్చరల్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం. స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03, స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20, స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది), స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74, స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2, స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – ...
Read More »