Breaking News

Dichpally

వృక్ష శాస్త్రంలో డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగంలో మంగళవారం పిహెచ్‌డి డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేశారు. వక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్‌ అరుణ పర్యవేక్షణలో ఎన్‌.నాగ సమీర అనే పరిశోధక విద్యార్థిని ”బయోడైవర్సిటీ ఆఫ్‌ ఆల్గె ఇన్‌ అశోక్‌ సాగర్‌ అండ్‌ ఆలీ సాగర్‌ లేక్స్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌, తెలంగాణ స్టేట్‌” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెయూ సెమినార్‌ హాల్‌లో జరిగిన పిహెచ్‌డి వైవా వోస్‌ కు డాక్టర్‌ బి.ఆర్‌ ...

Read More »

తెలుగులో ఇద్దరికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో ఇద్దరు పరిశోధక విద్యార్థులకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. ఆర్ట్స్‌ విభాగం పీఠాధీపతులు ఆచార్య పి.కనకయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సయ్యద్‌ ఆఫ్రిన్‌ బేగం ”తెలంగాణ నవలా రచయిత్రులు – ఒక పరిశీలన” అనే అంశంపై, మరొక పరిశోధక విద్యార్థి షేక్‌ అక్బర్‌ పాషా ”వరంగల్‌ జిల్లా తెలుగు సాహిత్య వికాసం” అనే అంశంపై పిహెచ్‌.డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాలు రూపొందించి సమర్పించారు. ఆర్ట్స్‌ ...

Read More »

కామర్స్‌లో గోపి కృష్ణకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్‌ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి కె.గోపి కష్ణకు ఈ నెల 18 వ తేదీన పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిందని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కామర్స్‌ విభాగాధిపతి, బిఓఎస్‌ చైర్మన్‌ డా. రాంబాబు గోపిశెట్టి పర్యవేక్షణలో ”ఇంపాక్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ కాపిటల్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రాక్టీసెస్‌ ఆన్‌ ఫైనాన్సియల్‌, పర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఐటి కంపెనీస్‌ ఎ సెలెక్ట్‌ స్టడీ” అనే అంశంపై ...

Read More »

టీం వర్క్‌ తోనే విద్యా ప్రమాణాల మెరుగుదల

అధ్యాపకుల సమావేశంలో వైస్‌ ఛాన్స్‌లర్‌ నీతూ ప్రసాద్‌ డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొట్టమొదటి సారిగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి శనివారం ఉదయం విచ్చేసిన ఉపకులపతి, సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారిణి నీతూ కుమారి ప్రసాద్‌కు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఘన స్వాగతం పలికారు. పచ్చని మొక్కను, మేలైన శాలువా, చిరు జ్ఞాపిక, రంగు రంగుల పుష్పగుచ్చం వీసీకి అందజేశారు. మొదటగా వీసీ తన చాంబర్‌కు వెళ్లి కొద్ది సేపు కూర్చొని, అనంతరం డైరెక్టర్‌ ఆచార్య కనకయ్య ఆధ్వర్యంలో అకడమిక్‌ ఆడిట్‌ ...

Read More »

23 న అంతర్జాల సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ వారి సౌజన్యంతో ప్లాంట్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అనే అంశంపై ఈ నెల 23 న ఒక రోజు అంతర్జాల కార్యశాల నిర్వహించనున్నట్లు విభాగాధిపతి మరియు సదస్సు కో-ఆర్డినేటర్‌ డా.అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ తెలిపారు. అంతర్జాల కార్యశాలకు డా.జి.బి.జోరే, ఎస్‌ఆర్‌టిఎంయూ, నాందేడ్‌ డా.నాదఫ్‌, జియోగ్రఫీ విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోవాబీ మాలిక్‌ ఫాసిల్‌, అటవీశాఖ విభాగం, సర్‌ సయ్యద్‌ కళాశాల, ...

Read More »

పిజి, యుజి పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని కళాశాలలోని కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మరియు డిగ్రీ కోర్సులకు చెందిన బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ (ఎల్‌). ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన ...

Read More »

పరీక్ష తేదీల్లో మార్పు

డిచ్‌పల్లి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న పీజీ ఎం.ఎ. హిందీ నాల్గవ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ మరియు మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల్లో మార్పులు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 13 వ తేదీ జరిగే పరీక్ష 17 వ తేదీ నాడు, 17 వ తేదీన జరిగే పరీక్ష 23 తేదీన జరుగుతాయని ఆయన తెలిపారు. యూజీసీ నెట్‌ హిందీ సబ్జెక్ట్‌ ...

Read More »

11న బ్యాక్‌లాగ్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు 2012-13, 2013-14 బ్యాచ్‌ లకు చెందిన ఆర్ట్స్‌ ఫాకల్టీ కోర్సులు ఇంగ్లీష్‌, హింది, తెలుగు, ఉర్దూబీ సోషల్‌ సైన్స్‌ ఫాకల్టీ కోర్సులు అప్లైడ్‌ ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌బీ సోషల్‌ వర్క్‌, లా, కామర్స్‌, బిజినెస్‌ ...

Read More »

టియులో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ఆధ్వర్యంలో వెస్ట్‌ జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ -2021 ఎంపికకు పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని గెస్ట్‌ హౌస్‌ పరిసర ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డా. ప్రవీణా బాయి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఎన్‌ఎస్‌ఎస్‌ జెండా ఆవిష్కరించి, స్పోర్ట్స్‌ జెండా ఊపి పరేడ్‌ పోటీలను ప్రారంభించారు. వాలంటీర్లందరు ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ గీతం ...

Read More »

ముగిసిన డిగ్రీ పరీక్షలు, 9 నుంచి ఇయర్‌ వైస్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధింపబడి విద్యా సంవత్సరానికి, పరీక్షలకు, మూల్యాంకనానికి కొంత కాలం సందిగ్ధత ఏర్పడి, తదనంతరం భయాందోళనల నుంచి తేరుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. గత నెల 21 కి ప్రారంభమైన డిగ్రీ కోర్సులకు చెందిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ. (ఎల్‌) పరీక్షలు, ఎడ్యూకేషన్‌ కోర్సులకు చెందిన బి.ఎడ్‌., ఎం.ఎడ్‌. పరీక్షలు, లా కోర్సులకు చెందిన ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. పరీక్షలు ...

Read More »

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు 2012-13, 2013-14 బ్యాచ్‌లకు చెందిన ఆర్ట్స్‌ ఫాకల్టీ కోర్సులు ఇంగ్లీష్‌, హింది, తెలుగు, ఉర్దూబీ సోషల్‌ సైన్స్‌ ఫాకల్టీ కోర్సులు అప్లైడ్‌ ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌బీ సోషల్‌ వర్క్‌, లా, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ ...

Read More »

7 న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ – 2021 వాలంటీర్స్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ఆధ్వర్యంలో వెస్ట్‌ జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ -2021 ఎంపికకు పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని క్యాంటీన్‌ పరిసర ప్రాంగణంలో జరుగనున్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డా. ప్రవీణా బాయి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్స్‌కు చెందిన వాలంటీర్స్‌ అర్హులని ఆమె తెలిపారు. కావున ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ ప్రతిభ ...

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ ఇయర్‌ వైస్‌ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 9 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్‌ లాగ్‌ విద్యార్థులు గమనించగలరని ...

Read More »

9 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధింపబడి ఒక సందిగ్ధావస్థ నెలకొని, నేటికి కొంత తేరుకొని ఎట్టకేలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కోర్సులకు పరీక్షలు జరుగనున్నాయి. పీజీ కోర్సులకు చెందిన థియరీ పరీక్షలు నవంబర్‌ 9 నుంచి 23 వ తేదీ వరకు ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్‌ ...

Read More »

రెండురోజులు ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ఇండియన్‌ అకడమి ఆఫ్‌ సైన్సెస్‌, బెంగళూరు, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమి, న్యూఢిల్లీ మరియు ది నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌, అలహాబాద్‌ వారి సౌజన్యంతో ”కోవిడ్‌-19: బేసిక్‌ టు క్లినికల్‌” అనే అంశంపై డిసెంబర్‌ 9,10 న రెండు రోజుల అంతర్జాల కార్యశాలను నిర్వహిస్తున్నట్లు కార్యశాల కో-ఆర్డినేటర్‌ డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ తెలిపారు. ఇందులో డా. అఖిల్‌ బెనర్జీ, కేరళ, డా. దీపక్‌ ...

Read More »

ఏ2, ఏ3 గేర్‌లో నడిపితే మంచి ధాన్యం వస్తుంది

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ మెంట్రాజ్‌ పల్లి గ్రామ శివారులో వరి కోత పనులు చేస్తున్న హార్వెస్టర్‌ను, కోసి ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని వరి ధాన్యాన్ని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, 247 రైస్‌ మిల్లర్లకు కేటాయింపు చేయడం జరిగిందని, వరి నాణ్యతా ...

Read More »

నవంబర్‌ 1 నుంచి పరీక్షలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో వాయిదా పడిన పరీక్షలన్ని నవంబర్‌ 1 వ తేదీ నుంచి పున:ప్రారంభం అవుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎడతెరపి లేకుండా ఉదతంగా, విస్తారంగా వర్షాలు పడి జన జీవనానికి ఆటంకం కలిగించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన డిగ్రీ, ఎంఎడ్‌, ఎల్‌ఎల్‌బి పరీక్షలు ఈ నెల ...

Read More »

రసాయన శాస్త్రంలో డాక్టరేట్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో గురువారం పి. రమేష్‌ నాయక్‌కు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఎ. నాగరాజు పర్యవేక్షణలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ”సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ హెటెరోసైక్లిక్‌ కాంపౌండ్స్‌ అండ్‌ స్టడీ ఆఫ్‌ థేర్‌ ఆంటిమైక్రోబియల్‌ ఆక్టివిటీస్‌” అనే అంశం పై చేసిన పిహెచ్‌. డి. పరిశోధానాంశానికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ నెల 10 వ తేదీన డిజిటల్‌ వేదిక ...

Read More »

దోస్త్‌ స్పెషల్‌ క్యాటగిరి ఎంపిక

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ ప్రక్రియ గురువారం ఆడిట్‌ సెల్‌ విభాగంలో నిర్వహించారు. ఇందులో స్పెషల్‌ క్యాటగిరికి ఎన్‌సిసిలో నలుగురు, సిఎపిలో ఒకరు హాజరయ్యారు. ఎన్‌సిసి, విద్యార్హతలు గల ధ్రువపత్రాల పరిశీలనా అధికారులుగా ఆచార్య. పి. కనకయ్య, డా. జి. బాలకిషన్‌, ఎన్‌సిసి ఆఫీసర్‌ అమెబ్కర్‌ బాబూరాం విచ్చేశారు.

Read More »

పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పరీక్షలన్ని వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా ఉదతంగా, విస్తారంగా వర్షాలు పడి జన జీవనానికి ఆటంకం కలిగిస్తుండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, బిఎడ్‌, ఎంఎడ్‌, ఎల్‌ఎల్‌బి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలను దసరా పండుగ అనంతరం ...

Read More »