Breaking News

Dichpally

నీటి కోసం తప్పని తిప్పలు

డిచ్‌పల్లి : మండలంలోని ఘన్‌పూర్ గ్రా మంలోని కాలనీ వాసులకు తా గునీటి కోసం తిప్పలు తప్పడం లేదు. గ్రామంలో తాగునీరు స రఫరా చేసే బోర్లలో భూగర్భ జ లాలు ఇంకిపోవడంతో తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ఆరంభం నుంచే కాలనీ వాసులు బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి న పరిస్థితి నెలకొంది. ఘన్‌పూర్‌లోని మూడు కాలనీలో ఉద యం నుంచి రాత్రి వరకు మ హిళలు నీటికోసం బిందెలతో క్యూ కడుతున్నారు. రెండు బోర్లవద్ద నీటికోసం పడిగాపులు ...

Read More »

21న ప్రాంగణ నియామకాలు

  డిచ్‌పల్లి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎంబిఎ విద్యార్థులకు, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఈనెల 21 శనివారం ఉదయం 10 గంటలకు ఆక్యుప్రొసిస్‌ గ్లోబల్‌ ప్రయివేటు కంపెనీ హైదరాబాద్‌ వారు ప్రాంగణ నియామకాలు జరుపుతున్నట్టు తెవివి బిజినెస్‌మేనేజ్‌మెంట్‌ హెడ్‌, డీన్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి తెలిపారు. తెవివి వ్యాపార నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాంగణ నియామకాలు నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంబిఎ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని ...

Read More »

ఉద్యమ స్పూర్తిని ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్తాయి వరకు పండగలా జరుపనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. జాతీయ నేతలు, అమరుల విగ్రహాలను శుభ్రం చేయించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ర్యాలీలు జరపాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ...

Read More »

సెస్‌తో తెలంగాణ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం

  డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ తో తెలంగాణ యూనివర్సిటీ ఎంఓయు కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో తెయు, సెస్‌ సంయుక్తంగా పిహెచ్‌డి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌తో అందిస్తాయి. సామాజిక శాస్త్రాల పరిశోధనలో ఈ ఒప్పందం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని తెవివి వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్ధసారథి అన్నారు. బుధవారం సెస్‌తో ఒప్పంద పత్రాలు మార్పిడి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశోధనల్లో సెస్‌ ఒక ప్రత్యేక ...

Read More »

తెలంగాణ తెలుగు సంచిక ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ సాహిత్య సంచిక తెలంగాణ తెలుగును తెవివి ఉపకులపతి సి.పార్థసారధి బుధవారం ఆవిష్కరించారు. తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఆచార్య కనకయ్య ప్రధాన సంపాదకుడుగా, అధ్యయన అధ్యాపకులు సంపాదకులుగా వెలువడుతున్న ఈ సంచికలో తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు రచించిన సాహిత్య విశ్లేషణ వ్యాసాలు ఉన్నాయని అన్నారు. తెలుగుభాష, తెలంగాణ భాష, తెలుగు సాహిత్యంపై ఈ సంపుటిలో వ్యాసాలున్నట్టు ఆచార్య కనకయ్య తెలిపారు.

Read More »

ఐసెట్‌ పకడ్బందీ నిర్వహణలో అబ్జర్వర్లది కీలకపాత్ర

  డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న నిర్వహించనున్న ఐసెట్‌-2016 ప్రవేశ పరీక్ష పకడ్బందీ నిర్వహణలో వర్సిటీ అబ్జర్వర్లది కీలకపాత్ర అని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. మంగళవారం ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు అబ్జర్వర్లుగా ఎంపికైన బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అబ్జర్వర్లు ఎలాంటి అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరీక్షా పత్రాలు అందుకుని, తిరిగి ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లు మంచి ప్యాకింగ్‌తో వెల్లే వరకు నిశిత దృష్టితో ...

Read More »

పిజి పరీక్షా కేంద్రం తనిఖీ

  డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిజి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న తెలంగాణ యూనివర్సిటీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తనిఖీ చేసినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, ప్రతి హాల్‌లోకి వెళ్లి పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. చేసిన ఏర్పాట్లు, వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు విజయవంతంగా రాస్తున్న విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్‌ వెంట సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ...

Read More »

ఐసెట్‌ పరీక్షకు 8 కేంద్రాలు

  డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల ప్రవేశాలకై నిర్వహించనున్న ఐసెట్‌-2016 పరీక్ష ఈనెల 19న నిజామాబాద్‌లో మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. నిజామాబాద్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఖైసర్‌ మహ్మద్‌ను నియమించినట్టు తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో సోమవారం పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ...

Read More »

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ‘దోస్త్‌’

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2016-17 విద్యాసంవత్సరం డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం డిగ్రీఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా ఆన్‌లైన్‌ పద్దతిలో నిర్వహిస్తారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. విద్యార్థి ఆన్‌లైన్‌ పద్ధతిలో రాష్ట్రంలోని ఏ డిగ్రీ కళాశాలకైనా, ఏ కోర్సుకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. సోమవారం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్లు విప్లవాత్మక మార్పునకు నాంది ...

Read More »

ఎంసెట్‌కు తెయులో పకడ్బందీ ఏర్పాట్లు

  – ప్రొఫెసర్‌ కనకయ్య డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంసెట్‌ పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్టు వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య తెలిపారు. పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సజావైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. శుక్రవారం ఎంసెట్‌ విధులకు సంబంధించి అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ ఎలాంటి అలసత్వం లేకుండా సమయపాలనతో, ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ అధ్యాపకులు ఎంసెట్‌ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షను సజావుగా నిర్వహించడానికి ...

Read More »

సిబిసిఎస్‌పై అవగాహన కార్యక్రమాలు

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఆదేశాల మేరకు సిబిసిఎస్‌ పద్దతిని తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. గురువారం వివిధ విభాగాల డీన్‌లు, పరీక్షల నియంత్రణ అధికారితో ఈ విషయమై సమావేశమయ్యారు. సిబిసిఎస్‌ విధానం పట్లఅందరికి అవగాహన ఏర్పడేందుకు వీలుగా రూసాలో భాగంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. అదేవిధంగా వివిధ విభాగాలకు చెందిన ...

Read More »

సమాజంలో రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పాలి

  – డాక్టర్‌ జట్లింగ్‌ ఎల్లోసా డిచ్‌పల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో బుధవారం చివరి సంవత్సరం విద్యార్థులకు మూట్‌ కోర్టు, మౌలిక పరీక్షలు నిర్వహించినట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జట్లింగ్‌ ఎల్లోసా తెలిపారు. పరీక్షలకు న్యాయ నిర్ణేతలుగా నిజామాబాద్‌ జిల్లా ప్రముఖ న్యాయవాది జె. వెంకటేశ్వర్‌, లెక్చరర్లు నాగజ్యోతి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు తమ న్యాయస్థాన సందర్శన, కేసుల విచారణ, వివిధ రకాల న్యాయస్థానంలో ఫైల్‌చేసే ఫాంలు, న్యాయవాదుల కార్యాలయాల్లో ...

Read More »

పదిలో మండల టాపర్లు వీరే

  మోర్తాడ్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని ఏర్గట్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీవర్షన్‌ బాబా, ప్రియాంక, సాయిప్రియ, తడపాకల్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాయిప్రసాద్‌లు 9.7 గ్రేడులు సాధించి మండల టాపర్లుగా నిలిచారని ఎంఇవో రాజేశ్వర్‌ తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులే 10వ తరగతి పరీక్షా పలితాల్లో ఉత్తమ ప్రతిబ కనబరిచారని ఎంఇవో రాజేశ్వర్‌ తెలిపారు. బుధవారం విద్యావనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన ...

Read More »

కట్లో తనిఖీలు…

తెవివి అధికారుల వింత ధోరణి సాయంత్రం ఐదు గంటల తరువాత బయలుదేరుతున్నారు రాత్రి 11 గంటల వరకూ ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు సాధారణంగా ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేయాలన్నది నిబంధన. ఆరు గంటల వరకూ కొనసాగించినా ఫర్వాలేదు. అయితే ఇందుకు భిన్నంగా తెలంగాణ విశ్వ విద్యాలయం అధికారులు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ తనిఖీలు చేస్తున్నారు. బస్టాండు సమీపంలో ఉన్న ఓ డిగ్రీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది ...

Read More »

టెక్నాలజి అభివృద్ది సాధనం

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచం టెక్నాలజితో అనూహ్యాంగా మార్పులు చెందుతుందని టెక్నాలజిని అభివృద్ది సాదనంగా వినియోగించుకోవాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి పిలుపునిచ్చారు. విద్యార్థులు టెక్నాలజితో వస్తున్న మార్పులను, టెక్నాలజితో సమాజంలో వెల్లువెత్తుతున్న చైతన్యాన్ని తెలుసుకుంటూ తదనుగుణంగా మారాలని, లేకపోతే మనుగడ లేదని ఆయన వివరించారు. మంగళవారం తెవివి మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో శిక్షణ అవకాశాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్‌ పాల్గొని ...

Read More »

నీటికొరత రానీయొద్దు

  డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని బాలుర, బాలికల వసతి గృహాల్లో ఎలాంటి నీటి కొరత రాకుండా చూడాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. హాస్టల్స్‌లో నీటి సరపరా తగినంత లేదన్న విద్యార్థుల విన్నపంతో రిజిస్ట్రార్‌ మంగళవారం సాయంత్రం బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించారు. నీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రిజిస్ట్రార్‌ ఆదేశించారు. ఆయన వెంట ...

Read More »

మే 5న యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవం

  డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల వార్షికోత్సవం మే 5వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. వార్షికోత్సవానికి అతితులుగా ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, జెఎన్‌టియు మొదటి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, జాతీయ బాలికల టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనాజైశ్వాల్‌, ఎవరెస్టు అదిరోహించిన మాలావత్‌ పూర్ణలు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విసి పార్థసారధి విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడా, ...

Read More »

ఎమ్మెల్సీ నిధుల నుంచి తెవివికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం

  డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత తన నియోజకవర్గ అభివృద్ది నిదుల నుంచి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రికి అందజేశారు. గతనెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు యూనివర్సిటీ అభివృద్ధికి తమ అభివృద్ది నిధులను కేటాయించాలన్న పిలుపుమేరకు ఆకుల లలిత సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పంపించారు. ఎమ్మెల్సీ ఆకుల ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఏర్పాటు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో నూతన విద్యార్థి సంఘంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం – టియు పేరుతో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.తిరుపతి, ఆత్మీయ అతిథిగా ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య, అతిథులుగా ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి, డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల విచ్చేసి మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అన్ని యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలుస్తుందని, విద్యార్థి నాయకులు క్రమశిక్షణగా ఉండాలని, లక్ష్యాలను సాధించాలని అన్నారు. యూనివర్సిటీ చరిత్రలో విద్యార్థి సంఘం ...

Read More »

ఫార్మసీలో పరిశోధనలకై అమెరికాకు డాక్టర్‌ శిరీష బోయపాటి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ శిరీష బోయపాటి ఫార్మసీ రంగంలో పరిశోధనలు చేయడానికి ఒక సంవత్సరం పాటు అమెరికా వెళ్తున్నారు. ఆమె అమెరికాలోని మేరిల్యాండ్‌ రాష్ట్రంలో ఉన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో హృద్రోగానికి సంబంధించిన ఔషధాల అభివృద్దిపై పరిశోదనలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, యుజిసిచే ఆమె ప్రతిష్టాత్మక రామన్‌ ఫెలోషిప్‌ కింద వచ్చే గ్రాంట్‌తో అమెరికాలో యేడాదిపాటు పరిశోదనలు చేస్తారు. ఈనెల 28న ఆమె అమెరికా వెళ్లనున్నారు. ...

Read More »