Dichpally

ఆంగ్ల భాషా నైపుణ్యాలు కీలకం

  – రిజిస్ట్రార్‌ లింబాద్రి డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషా నైపున్యాలు అత్యంత కీలకమని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ క్లబ్‌ ప్రారంభించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ప్రపంచ భాషగా ఆంగ్లం ప్రాధాన్యం బాగా పెరిగిందన్నారు. గ్రామీణ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం అపారంగా ఉన్నప్పటికి ఆంగ్లభాషపై పట్టులేకపోవడం వల్ల అనేక ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

వీరవనిత ఝాన్సీలక్ష్మిబాయి జన్మదిన వేడుకలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం వీరనారి ఝాన్సీలక్ష్మిబాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వీరవనిత ఆమె జయంతిని స్త్రీశక్తి దివస్‌గా జరుపుకుంటామని ఏబివిపి వర్సిటీ అధ్యక్షులు మహేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యంలో తల్లి మరణించినా తండ్రి పెంపకంలో పెరిగి ధైర్యసాహసాలు, పోరాట పటిమను అలవరుచుకున్నారన్నారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వీర వనిత అన్నారు. ...

Read More »

టూటా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు తెయు కళాశాల సెమినార్‌ హాల్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల మేళవింపు అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం సోదరభావం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి పండగ వెలుగుల పండగ అని మన జీవితాల్లోంచి చీకట్లు పారద్రోలడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ...

Read More »

స్టూడెంట్‌ జేఏసి ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మ దగ్దం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి జేఏసి ఆద్వర్యంలో గురువారం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మ దహనంచేశారు. తెయు కళాశాల భవనం ముందు విద్యార్థి జేఏసి రాష్ట్ర నాయకుడు యెండల ప్రదీప్‌ ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాభివృద్ది కార్యక్రమంలో భాగంగా గృహాల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర మంత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మంత్రి చిత్రపటానికి నిప్పంటించి దహనం చేశారు. తన ఆంద్ర నైజాన్ని బయట ...

Read More »

20,21 తేదీల్లో యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ అథ్లెట్స్‌ ఎంపిక

  డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాన యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ 2015 ఈనెల 20,21 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.మమత, టియు ఫిజికల్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.నేతలు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని యుజి, పిజి చదువుతున్న విద్యార్తులు పాల్గొనాలని వారు సూచించారు. ఉదయం 8.30 గంటలకు యూనివర్సిటీ గ్రౌండ్‌ డిచ్‌పల్లిలో అథ్లెట్స్‌ రిపోర్టు చేయాలని సూచించారు. ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ అసోసియేసన్‌ నిర్ణయించిన అర్హతలను బట్టి అథ్లెట్ల సెలక్షన్స్‌ ...

Read More »

తెయులో స్వచ్ఛభారత్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీఓ జాతీయ సేవాపథకం ఆద్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల చుట్టుపక్కల స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల చుట్టుపక్కల మొలిచిన పిచ్చిమొక్కలను తొలగించారు. స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలోని వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు, తేళ్ళు, పురుగుల నుంచి ప్రమాదాలు నివారించడానికి శుభ్రం చేశామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ఆర్తి మాట్లాడుతూ సమాజసేవలోభాగంగా చేసిన ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో స్వచ్చందంగా సేవ చేయడానికి దోహదపడుతుందన్నారు. వాలంటీర్లతో పాటు ...

Read More »

పైకా క్రీడలు ప్రారంభించిన ఎంపిపి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మంగళవారం జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల మైదానంలో పైకా క్రీడల్ని ఎంపిపి దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్తులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అందరు క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే తనయుడు బాజిరెడ్డి జగన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజ్‌, పిఇటిలు, గ్రామస్తులు విద్యార్థులు ...

Read More »

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెవివి వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్థసారధి తెలిపారు. ఆయన సోమవారం గోవాలో జరుగుతున్న ఏషియన్‌ సీడ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం విత్తన అభివృద్దికి అనుకూలమైన ప్రదేశమని తెలుపుతూ, ప్రభుత్వం మన రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మలిచేందుకు అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. రైతు ఆధారిత విధానాల అమలు, రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ...

Read More »

ప్రశాంతంగా ముగిసిన ప్రిపిహెచ్‌.డి పరీక్షలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తున్న రీసెర్చ్‌ స్కాలర్స్‌ కోసం నిర్వహించిన ప్రి పిహెచ్‌డి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నవంబర్‌ 13న రీసర్చ్‌ మెథడాలజీ పరీక్ష, సోమవారం సబ్జెక్టు స్పెషలైజేషన్‌ పరీక్ష ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. సోమవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి పరీక్షా కేంద్రాన్ని తనికీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న తీరును తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మూడు పరీక్ష హాల్స్‌లో దాదాపు 13 సబ్జెక్టులకు చెందిన ...

Read More »

ప్రశాంతంగా బి.ఈడి స్పాట్‌ అడ్మిషన్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో రెండు సంవత్సరాల బిఇడి 2015-16 అకడమిక్‌ సంవత్సరానికి సోమవారం రోజు ప్రశాంతంగా జరిగాయి. పూర్తి పారదర్శకతతో, మెరిట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా స్పాట్‌ అడ్మిసన్లు నిర్వహించాలని ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ఈ స్పాట్‌ అడ్మిషన్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆచార్య లింబాద్రి కమిటీకి ఆదేశాలిచ్చారు. నవంబర్‌ 13 వరకు అప్లికేషన్లు సమర్పించిన ...

Read More »

పిహెచ్‌డి దరఖాస్తు గడువు పెంపు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిహెచ్‌డి దరఖాస్తులు సమర్పించేందుకు గడువు తేదీ పెంచినట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 11న ముగిసిన గడువును, వరుస సెలవుల నేపథ్యంలో ఈనెల 21 శనివారం వరకు పెంచినట్టు ఆయన తెలిపారు. అబ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని నవంబర్‌ 21 వరకు పెంచినట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను అడ్మిషన్ల డైరెక్టర్‌ కార్యాలయంలో కొత్తగా పొడిగించిన తేదీ వరకు సమర్పించాలని అన్నారు.

Read More »

పైకా క్రీడలను విజయవంతం చేయాలి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల స్థాయి పైకా క్రీడలను ఘనంగా నిర్వహించడానికి మండల పిఇడిలందరు కృషి చేయాలని ఎంపిడిఓ గోపాలకృష్ణ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పైకా క్రీడల నిర్వహణ కోసం పిఇడిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ నుంచి ఖిల్లా డిచ్‌పల్లి జడ్పిహెచ్‌ఎస్‌ మైదానంలో మండల పైకా క్రీడలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పైకా క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల ...

Read More »

తెయులో బిఇడి ప్రవేశాల కోసం స్పాట్‌ అడ్మిషన్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్‌లోని బిఇడి కళాశాలలో 2015-16 అకడమిక్‌ సంవత్సరానికి మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్‌ అడ్మిషన్లు నవంబర్‌ 16న నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఎడ్‌సెట్‌-2015 ఎంట్రెన్స్‌ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు తెయు సారంగాపూర్‌లోని ఎడ్యుకేషన్‌ కళాశాలలో తమ అప్లికేషన్‌ పారంలు నవంబర్‌ 13 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలన్నారు. అప్లికేషన్‌ ఫారంలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లు, ...

Read More »

నవంబర్‌ 26 డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేది గడువు నవంబర్‌ 26 అని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. వంద రపాయల అపరాధ రుసుముతో పీజు చెల్లింపు చివరి తేదీ 30 అన్నారు. బి.ఎ, బి.కాం, బి.ఎస్‌సి, అన్ని కోర్సులు, బిఎస్‌డబ్ల్యు, బిబిఎ మొదటి, రెండవ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుందన్నారు. యుజి బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు కూడా ఇవే ...

Read More »

ఉర్దూ విభాగంలో స్వాగత సమావేశం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగత సమావేశం నిర్వహించారు. నిన్న మొన్నటివరకు అడ్మిషన్ల కోలాహలంతో నిండిన యూనివర్సిటీ ఆ ప్రక్రియ ముగిసి స్వాగత సమావేశాలలోకి అడుగుపెట్టిందని ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య అన్నారు. విద్యార్థులు కళాశాలకు తప్పకుండా హాజరుకావాలన్నారు. వారి వారి రంగాలలో ఉన్నత స్తానాన్ని పొందాలని ఉర్దూ విభాగాధిపతి డాక్టర్‌ అథర్‌ సుల్తానా చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ ...

Read More »

కెమిస్ట్రి ప్రయోగశాలల ప్రారంభం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఒకేరోజు రెండు క్యాంపస్‌లలో మొత్తం నాలుగు రసాయనశాస్త్ర ప్రయోగశాలలు ప్రారంభించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ సి.పార్ధసారథి, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి చేతుల మీదుగా ల్యాబులు ప్రారంభించారు. మొదట బిక్కనూరులోని సౌత్‌ క్యాంపస్‌లో రెండు ల్యాబులు, తర్వాత డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లో మరో రెండు ల్యాబులు సైన్స్‌డీన్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, ఇతర సైన్స్‌ ఫ్యాకల్టీ సభ్యుల ...

Read More »

యువజనోత్సవాల్లో తెయు విద్యార్థుల ప్రతిభ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా యువజన సంక్షేమశాఖ స్టెప్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన యువజనోత్సవాల్లో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తమ సత్తా చాటారు. మొత్తం ఏడు బహుమతులు గెలుచుకొని ప్రతిభ చూపారు. వర్సిటీ బృందానికి నాయకత్వం వహించిన సాంస్కృతిక సమన్వయకర్త డాక్టర్‌ త్రివేణి తెలిపిన వివరాల ప్రకారం వక్తృత్వ పోటీల్లో పి.రవళి మొదటి బహుమతి గెలుచుకుంది. అలాగే జానపద గీతాలాపనలో ఎ.శ్రీనివాస్‌ బృందం మొదటి బహుమతి, జానపద నృత్యాలలో సురేశ్‌ ...

Read More »

తెవివికి విచ్చేసిన కేంద్ర ప్రజా పనుల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీకి శుక్రవారం కేంద్ర ప్రజాపనులశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శైలేంద్ర శర్మ వచ్చారు. మెయిన్‌ క్యాంపస్‌లో బాలుర వసతి గృహం, భిక్కనూరులోని సౌత్‌ క్యాంపస్‌లో బాలికల, బాలుర వసతి గృహాల నిర్మాణ పనుల ప్రగతిని ఆయన రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తో కలిసి సమీక్షించారు. మెయిన్‌ క్యాంపస్‌లోని బాలుర వసతి గృహం పనులు వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి కావాలని, భిక్కనూరులోని వసతి గృహ పనులు పదినెలల్లో పూర్తికావాలని వారు ఇంజనీరింగ్‌ ...

Read More »

ఖిల్లా డిచ్‌పల్లి రామాలయాన్ని సందర్శించిన డిజిపి అనురాగ్‌ శర్మ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్‌ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లాలోని స్పోర్ట్స్‌ మీట్‌ వెళ్తున్న ఆయన ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు. ఖిల్లా రామాలయానికి డిజిపిరాక సందర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాలయానికి వచ్చిన డిజిపికి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ, డిచ్‌పల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక ...

Read More »

పెద్దమ్మ ఆలయంలో చోరీ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామం పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం పశువుల కాపరి ఆలయ తలుపులు తెరిచి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు ముదిరాజ్‌ కులస్తులు ఆలయం వద్దకు చేరుకొని గత నాలుగేళ్ళుగా తెరవని హుండిని సుమారు 500 మీటర్లు తీసుకెళ్ళి ధ్వంసం చేసి అపహరించినట్టు గమనించారు. దాంతోపాటు తులంనర బంగారు నగలు, వెండి వస్తువులను దొంగిలించినట్టు గ్రామ విఆర్వో రాజారాం తెలిపారు. ...

Read More »