Breaking News

Dichpally

తెలంగాణ యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు

  డిచ్‌పల్లి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017 నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్యను కలిసి శాలువా, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వర్సిటీని అందరం కలిసికట్టుగా అభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్ళాలని, నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లేదిశగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఇవో ఆచార్య కనకయ్య, అడిషనల్‌ సిఇవో పాత నాగరాజు, యెండల ప్రదీప్‌, ...

Read More »

తెవివిలో నూతన సంవత్సర వేడుకలు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బాలికల వసతి గృహంలో శనివారం 2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య విచ్చేసి కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కొత్త ఆశయాలతో, నూతన ఆలోచనలతో భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. వార్డెన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్రవంతి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలవైపు దూసుకెళ్తు మహిళా శక్తినిచాటాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహంలోని విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం డబ్బుకోసం రోడ్డెక్కిన రైతులు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి, ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు డబ్బు చెల్లించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ డిచ్‌పల్లి రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నెలరోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని సహకార బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖాతాల్లో డబ్బు జమచేస్తామని ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. తమ తమ ఖాతాల్లో డబ్బు జమచేసేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. అసలే నోట్ల ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీలను అనుమతించడం తగదు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ విద్యార్థి వేదిక నిరంతరం పోరాటం చేస్తుందని, అయితే తెలంగాణలో ప్రస్తుతం ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లు కేబినేట్‌ ఆమోదించడం విడ్డూరంగా ఉందని వేదిక తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం వర్సిటీలోని ఆర్ట్స్‌ & సైన్స్‌ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రమేశ్‌ మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానించడమంటే పేద విద్యార్థులను చదువుకు దూరం ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలనే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఎదుట ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు వర్సిటీ అధ్యక్షుడు అన్వేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని హామీలిచ్చి, ఇపుడు ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ...

Read More »

అలరించిన మానవ సదన్‌ విద్యార్థుల పాటలు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని న్యాయసేవా సంస్థ సభ్యులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం తేజస్‌ ఫౌండేషన్‌ న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మానవసదన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన అమ్మ యోగితా రాణా జీవితాన అని పాడినపాట అందరిని అలరించింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ తమకు తల్లిదండ్రులు లేరనే భావన మనసులో రానీయవద్దని, జిల్లా కలెక్టర్‌ ఇక్కడి విద్యార్థులకు ఎలాంటి ...

Read More »

తెయు పరీక్షల షెడ్యూల్‌…

డిచ్‌పల్లి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం వివిధ పరీక్షల తేదీలను విడుదలచేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిసెంబరు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆచార్య కనకయ్య తెలిపారు. అదేవిధంగా పిజి సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే బిసిఎ 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు యూనివర్సిటీ కళాశాలలో నిర్వహిస్తారని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. ...

Read More »

తెయులో బాలుర నూతన వసతి గృహాన్ని ప్రారంభించిన వైస్‌చాన్స్‌లర్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో బాలుర నూతన వసతి గృహాన్ని వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థుల, అధ్యాపకుల ఆనందోత్సాహాల మధ్య వైస్‌ఛాన్స్‌లర్‌ రెండో వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం సంప్రదాయబద్దంగా పూజాదికాలు నిర్వహించి, రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కొత్త వసతి గృహం అందుబాటులోకి రావడంతో బాలురకు క్యాంపస్‌లో వసతి కొరత తీరనుందని, నాలుగు వందల మందికి వసతి కల్పించవచ్చని విసి తెలిపారు. ఆధునిక హంగులతో, విశాలమైన గదులతో, ...

Read More »

పరిశోధనా ప్రాజెక్టులు సాధించండి…

  – తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ నుండి ఇతర పరిశోధనా సంస్థల నుండి రీసెర్చు ప్రాజెక్టులు సాధించాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అధ్యాపకులకు సూచించారు. ఈ మేరకు సోమవారం వర్సిటీ వివిధ విభాగాధిపతులతో సమావేశమై మాట్లాడారు. పరిశోదనా ప్రాజెక్టులు అధ్యాపకుల కెరీర్‌ అభివృద్ది కోసం ఎంతగానో తోడ్పడుతాయన్నారు. యుజిసి నిధులు ప్రాజెక్టులు, పరిశోధనలు వర్సిటీ ప్రతిష్టను పెంచుతాయని విసి అభిప్రాయపడ్డారు. 12వ పంచవర్ష ప్రణాళిక ...

Read More »

పిజి పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 26 చివరితేదీ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పిజి రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్‌ 26 వరకు పొడిగించినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కనకయ్య తెలిపారు. అలాగే అపరాధ రుసుము 100తో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ఫీజు చెల్లింపు నవంబర్‌ 26 వరకు చివరి తేదీ అని, అపరాధ రుసుముతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని సూచించారు. అలాగే బిసిఎ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ ...

Read More »

అనుబంధ కళాశాలలకు విసి హెచ్చరిక

  డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ త్వరలో నిర్వహించబోయే యుజి, పిజి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్టు తెలిస్తే అలాంటి కళాశాలలను బ్లాక్‌ లిస్టులో పెడతామని వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య హెచ్చరించారు. అలసత్వాన్ని, అవకతవకలను సహించేది లేదని, మాల్‌ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా పటిష్టంగా పరీక్షల నిర్వహణ ఉండాలని ఎవరినీ ఉపేక్షించేది లేదని విసి తీవ్రంగా హెచ్చరికలు చేశారు. శుక్రవారం పరీక్షల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అఫిలియేటెడ్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశమై మాట్లాడారు. అదేవిధంగా ...

Read More »

జాతీయ సేవా పథకం మహోన్నత పథకం

  – విసి సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం విద్యార్థుల్లో గొప్ప సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందని, ఇది ఒక మహోన్నత పథకం అని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. తెయు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా అద్భుతంగా విధులు నిర్వర్తించి రాష్ట్రస్థాయి బెస్టు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికైన డాక్టర్‌ ఆర్తిని శుక్రవారం విసి ఘనంగా సత్కరించారు. ఒక యువ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రాష్ట్రస్థాయిలో బెస్టు కో ఆర్డినేటర్‌గా ఎంపిక కావడం ...

Read More »

బిసి అధ్యాపకులకు సత్కారం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా అవార్డు అందుకున్న డాక్టర్‌ సి.హెచ్‌. ఆర్తి, ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు అందుకున్న డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ జే.వి.శివకుమార్‌లను గురువారం ఘనంగా సన్మానించారు. బిసి అధ్యాపకుల సంఘం ఆద్వర్యంలో కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెవివి బిసి టీచర్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు ప్రొఫెసర్‌ యాదగిరి మాట్లాడుతూ అధ్యాపకులు అధ్యాపక వృత్తిని గౌరవిస్తూ ఒక బాద్యతాయుత ...

Read More »

గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.సత్యనారాయణ చారి తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం, ఎలాంటి ఆభరణాలు లేకపోవడం, ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ లేకపోవడం కీలకమని ఆయన తెలిపారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. వారు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆచార్య సత్యనారాయణ ...

Read More »

కెమిస్ట్రి విభాగాధిపతిగా డాక్టర్‌ నాగరాజు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రి విభాగం అధిపతిగా డాక్టర్‌ నాగరాజు నియమితులయ్యారు. రెండు సంవత్సరాల పాటు డాక్టర్‌ నాగరాజు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ విభాగంలో నాగరాజు ప్రస్తుతం అసోసియేట్‌ ప్రొపెసర్‌గా ఉన్నారు. కెమిస్ట్రి విభాగాధిపతిగా నాగరాజు రెండు సంవత్సరాల ఆర్గానిక్‌ కెమిస్ట్రి, రెండు సంవత్సరాల ఫార్మాస్యుటికల్‌ కోర్సు, ఇతర కెమిస్ట్రి, యుజి కోర్సులకు కూడా విభాగాదిపతిగా కొనసాగుతారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. డాక్టర్‌ నాగరాజు కెమిస్ట్రి విభాగానికి రెండు సార్లు బోర్డఫ్‌ ...

Read More »

ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆత్మహత్యలు నివారించాలి

  – వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు సౌకర్యాలను ప్రజలందరికి చేరినపుడు ఆత్మహత్యలు లేని తెలంగాణగా ఉంటుందని, రైతు రాజ్యం కోసం ముఖ్యమంత్రి మిషన్‌ కాకతీయ లాంటి ఎన్నో రైతు కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం రైతు ఆత్మహత్యలు, నివారణ ఉపాయాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. గత మార్చి 30,31 తేదీల్లో అర్థశాస్త్ర విభాగంలో రైతు ఆత్మహత్యలు, నివారణోపాయాలు అనే ...

Read More »

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

  – ఆకుల పాపయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో భూస్వామ్య, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం, దేశ విముక్తికోసం భారత విప్లవోద్యమంలో పనిచేసిన అనేకమంది విప్లవవీరులు అమరులయ్యారని, వారందరికి సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి విప్లవ జోహార్లు అర్పిస్తుందని నిజామాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. భారత విప్లవోద్యమంలో అమరులైన యోధుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఐఎఫ్‌టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆకుల ...

Read More »

ఉర్దూ శాఖలో విద్యార్థుల స్వాగత సమావేశం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ శాఖలో ప్రథమ సంవత్సరం విద్యార్తులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగత సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉర్దూశాఖ అధ్యక్షులు డాక్టర్‌ అత్తర్‌ సుల్తానా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు నూతన విద్యార్థులకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా ఉర్దూ డిపార్టుమెంట్‌లోని ఉత్తమ విద్యార్థులకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. బిఓఎస్‌ ...

Read More »

ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు సిబిసిఎస్‌ విధానం

  – విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు ఏర్పరచడానికి ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ తోడ్పడుతుందని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. సంప్రదాయవిద్యా విధానంలో దిగజారుతున్న విలువల కట్టడికి, విద్యార్థులను అన్ని రంగాల్లో సుశిక్షితులను చేయడానికి ఈ సిబిసిఎస్‌ పద్ధతి ఉపయుక్తమవుతుందని ఆయన తెలిపారు. ‘చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ – పద్ధతులు, మూల్యాంకనం’ అనే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆర్తిక సహకారంతో ఒకరోజు ...

Read More »

రైతుల్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

డిచ్‌పల్లి: కొత్త రుణాలు ఇవ్వకుండా, పాత బకాయిలకు వడ్డీ మీద వడ్డీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తోందని భాజపా రాష్ట్ర కార్యదర్శి మురళీగౌడ్‌ అన్నారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో గురువారం భాజపా మండల కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్ఠతకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.38 వేల కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ పెట్టుబడి రాయితీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ...

Read More »