Breaking News

Dichpally

తెవివి పరిపాలనా భవనంలో వాటర్‌ప్లాంట్‌ ప్రారంభం

  డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెవివి బ్రాంచ్‌ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్యూరిఫైడ్‌ ప్లాంట్‌ను వర్సిటీ ఉపకులపతి సీనియర్‌ ఐఏఎస్‌ పార్థసారధి సోమవారం ప్రారంభించారు. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి కింద మొత్తం 1.5 లక్షల రూపాయలతో ఈ నీటి శుద్ది యంత్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, ఎస్‌బిఐ అధికారులు, బ్రాంచ్‌ సిబ్బంది, ఇంజనీరింగ్‌ సిబ్బంది, తదితరులు ...

Read More »

భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు గర్వకారణం

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐక్యరాజ్య సమితి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం భారతీయులందరికి గర్వకారణమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఆదివారం ఉదయం యోగా డేను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా సాదన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ...

Read More »

జూన్‌ 22 నుంచి పిహెచ్‌డి స్కాలర్స్‌కు కోర్సు వర్క్‌ తరగతులు

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీల్లో పిహెచ్‌డి పరిశోధక విద్యార్థులకు జూన్‌ 22 సోమవారంనుంచి కోర్సు వర్క్‌ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. సోషల్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపిన ప్రకారం అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాలకు చెందిన పిహెచ్‌.డి. విద్యార్థులకు పదిరోజుల పాటు తరగతులు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా రీసెర్చ్‌ మెథడాలజి, సంబంధిత సబ్జెక్టు అంశాల్లో తరగతులు ఉంటాయన్నారు. అలాగే ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ డీన్‌ ప్రొఫెసర్‌ పి.కనకయ్య ...

Read More »

తెవివిలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ డిచ్‌పల్లి క్యాంపస్‌లో ఆదివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 7.33 గంటల వరకు యోగా చేస్తారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రితోపాటు ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, అధికారులు, ఆచార్యులతోపాట ఇతర నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పాల్గొంటారు. ఇందుకోసం కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు ...

Read More »

ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఘన స్వాగతం

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్సీ గా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలితకు డిచ్‌పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను ర్యాలీగా జిల్లా కేంద్రానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ, బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, డిచ్‌పల్లి మండల జడ్పిటిసి కూరపాటి అరుణ ...

Read More »

కారు, లారీ ఢీ – ఒకరు మృతి

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం జాతీయ రహదారిపై లారీ కారు ఢీకొన్న సంఘటనలో 30 ఏళ్ళ వయసుగల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారిపై డివైడర్‌ను బలంగా ఢీకొంది. దీంతో పక్కనుంచి హైదరాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ...

Read More »

ప్రారంభమైన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 వేల మంది విద్యార్తులు మొత్తం 27 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 ...

Read More »

జూన్‌ 29 బిఇడి వార్షిక ఫీజుచెల్లింపు చివరితేది

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బిఇడి రెగ్యులర్‌ 2014-15 వార్షిక పరీక్షలు అలాగే 2013-14, 2012-13 బ్యాచ్‌ల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఫీజు చెల్లింపు జూన్‌ 29 వరకు చివరి తేది అని వర్సిటీ పరీక్షల నియంత్రణ అదనపు అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 200 రూపాయల అదనపు రుసుముతో జూలై 6వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read More »

అతర్‌ సుల్తానా, మూసా ఖురేషీలకు ఉర్దూ అకాడమిచే అరుదైన గౌరవం

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అతర్‌ సుల్తానా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మూసా ఖురేషిలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం జరిగినట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉర్దూ భాషా సెమినార్‌లో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలకు నాలుగువేల రూపాయల నజరానా, ప్రశంసాపత్రాలు పొందినట్టు తెలిపారు. అతర్‌ సుల్తానా నిజాం నవాబుల కాలంలో ఉర్దూ భాష అభివృద్ది, సాహిత్యంలో ...

Read More »

తెవివి ఆంగ్ల విభాగాధిపతిగా డాక్టర్‌ కె.వి.రమణాచారి

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధిపతిగా డాక్టర్‌ కె.వి. రమణాచారి నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని, ఈమేరకు నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డాక్టర్‌ రమణాచారికి అందజేశారు. మొత్తం యుజి, పిజిలో కలిపి 15 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన రమణాచారి గతంలో కాకతీయ యూనివర్సిటీలో కూడా తాత్కాలిక ప్రతిపాదికన బోధించిన అనుభవం ఉంది. ఆంగ్ల భాషలో భారతీయ రచనలు, బ్రిటీష్‌ లిటరేచర్‌లో స్పెషలైజేషన్‌ ...

Read More »

గురువారం నుంచి డిగ్రీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం 18వ తేదీ నుంచి తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు మొదలవుతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 27 వేల మంది విద్యార్థులు, 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు రాస్తారని తెలిపారు. జూలై 8 వరకు జరుగుతాయని విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. అన్ని పరీక్షా ...

Read More »

తెవివిలో ఇంజనీరింగ్‌ కళాశాల కోసం మంత్రికి వినతి

  డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టడానికి అవసరమైన అనుమతుల కోసం సహాయం చేయడానికి విజ్ఞప్తి చేయడానికి జిల్లాకు చెందిన క్యాబినెట్‌ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి కలిశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకంగా ఫుడ్‌ టెక్నాలజి కోర్సుకు సంబంధించిన కళాశాల మంజూరు చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రుద్రూరులో ఏర్పాటు చేయబోయే ఫుడ్‌ టెక్నాలజి కళాశాల ద్వారా విద్యార్థి లోకానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆ కోర్సు ...

Read More »

21న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనాలి

  డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని సెక్రెటరీ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 21వ తేదీన నిర్వహించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌లను ఆదేశించారు. వర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లందరు 21వ తేదీ జూన్‌ రోజున ఉదయం 6.30 గంటలకు విశ్వవిద్యాలయానికి విచ్చ యోగాలో పాల్గొనాలని, వాలంటీర్లందరు పాల్గొనేవిదంగా చూడాలని రిజిస్ట్రార్‌ సూచించారు. విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేసే ...

Read More »

విద్యావిధానంలో మార్పులకు సిద్ధం కావాలి

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవులు ముగిసి వర్సిటీలో అధ్యాపకులకు విదులు తిరిగి మొదలైన నేపథ్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సోమవారం అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత విద్యావిధానంలో సమూల మార్పులకు సన్నద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. యుజిసి ద్వారా డిగ్రీ, పిజి స్థాయిల్లో ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టం విధానం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. విద్యార్థి తాను ఎంచుకున్న కోర్సును, ఎంచుకున్న సబ్జెక్టును, ...

Read More »

ఆర్థిక మంత్రి ఈటెలను పరామర్శించిన తెవివి రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండ్రోజుల క్రితం మానకొండూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సోమవారం పరామర్శించారు. సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని ఉదయం ప్రత్యేక వార్డులో పలకరించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. యువకుడు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రావతరణ తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా తెలంగాణను ఆర్థికాభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ...

Read More »

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు

  డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సగానికిపైగా బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండానే నడుపుతున్నారు. పాఠశాలల నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలు బహిరంగంగా బోర్డులపై ఉంచాల్సి ఉండగా ఏ ఒక్క పాఠశాల కూడా ఈ విషయాన్ని పాటించడం లేదు. విద్యార్తులకు కావాల్సిన అన్నిరకాల వస్తువులు పాఠశాలల్లోనే విక్రయాలు చేస్తున్నారు. కనీస వసతులు లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయులను, విద్యార్థులను దోపిడి చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం పీపీఎఫ్‌ ...

Read More »

గన్నారంలో మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు

  – గన్నారంలో కలకలం – గ్రామస్తుల ఆందోళన – ఆకతాయిల పనే అంటున్న పోలీసులు డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు సర్కిల్‌ పరిధిలోని గన్నారం గ్రామంలో మావోయిస్టు పేరుతో వాల్‌పోస్టర్లు వెలిసిన సందర్భంగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో బస్టాండ్‌, సుభాష్‌ విగ్రహం, గాంధీ విగ్రహం మూడుచోట్ల సిర్నాపల్లి ఏరియా దళం (పీపుల్స్‌వార్‌) పేరిట హెచ్చరికలు చేసిన పోస్టర్లు శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. ఇది మావోయిస్టుల పనేనా లేదా ...

Read More »

అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా సంఘం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మహిళా డ్వాక్రా గ్రూపు సంఘం కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద మంజూరైన భవనం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రామంలో డ్వాక్రా మహిళాలకు నెలవారి సమావేశాలు నిర్వహించేందుకు భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని డ్వాక్రా సంఘాల మహిళలు పేర్కొంటున్నారు. భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘ భవనం పట్టించుకున్న ...

Read More »

ఎస్‌బిహెచ్‌లో సర్టిఫికెట్ల పంపిణీ

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఆర్‌బిఐ జనరల్‌ మేనేజర్‌ రాజు, ఎల్‌డివో ఏ.పుల్లారెడ్డి, మేనేజర్‌ మురళీధర్‌ శుక్రవారం సందర్శించారు. 131 మల్టీఫోల్‌ సర్వీసింగ్‌ బ్యాచ్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల అనుభవాలను తెలుసుకొని వారికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో జిఎం . బిఎం మాట్లాడుతూ చాలా మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన వారందరు జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా మంచిపేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ...

Read More »

బైక్‌, బోరువీల్‌ వాహనం ఢీ – ఒకరు మృతి

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం బస్టాండ్‌ ఎదుట శుక్రవారం ఉదయం ఆటో, బోరువీల్‌, బైక్‌ ఢీకొన్న సంఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్టు డిచ్‌పల్లి ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… మండలంలోని దూస్‌గాం తాండాకు చెందిన అంగోత్‌ రాము (23) డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వెళుతుండగా ఆటోను తప్పించబోయి బోర్‌వీల్‌ వాహనానికి ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలైన రామును స్థానికులు గమనించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి ...

Read More »