Breaking News

Dichpally

మండల నూతన కార్యవర్గం ఎన్నిక

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల నూతన టీఆర్‌ఎస్‌ కార్యవర్గంలో మండల అధ్యక్షుడిగా చక్కరకొండ కృష్ణను నియమించినట్లు నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. టీఆర్‌ఎస్‌ మండల కార్యవర్గంలో మరో కొందరిని సీనియర్‌ కార్యకర్తలకు స్థానం కల్పించడం జరిగిందన్నారు. మండల ఉపాధ్యక్షుడిగా బాలాగౌడ్‌, మోజిరాంనాయక్‌, ఈగ రాజరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా నర్సయ్య, గోపి, సహాయ కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడిగా సాయిరెడ్డి, బీసీ సెల్‌ ...

Read More »

తెయూలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాల సెమినార్‌ హాలులో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకగలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆర్‌. లింబాద్రి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అభివృద్ధి కోసం అప్పట్లోనే అందరికి విద్యను అందించాలని బ్రిటిష్‌ పాలన కౌన్సిల్‌ అధికారులకు సమాన విద్యను అందజేయాలని వివిధ రకాల ...

Read More »

తెవివిలో ఎంబిఎ విద్యార్థుల వీడ్కోలు సమావేశం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంబిఎ విద్యార్థులు కామర్స్‌ కళాశాల భవనంలో బుధవారం రాత్రి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులనుద్దేశించి ఎంబిఎ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి మాట్లాడుతూ విద్యార్థులు ఎంబిఎ వంటి వృత్తి విద్యా కోర్సుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అవుతుందని వివరించారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలన్నారు. కోర్సు పూర్తిచేసుకొని వెళుతున్న విద్యార్థులందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ప్రథమ, ...

Read More »

పార్టీయా… నామినేటేడా… టిఆర్‌ఎస్‌లో పదవుల ముసలం వర్గపోరుకు రంగం సిద్దం

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 7: టిఆర్‌ఎస్‌ పార్టీలో కొత్త ముసలం ప్రారంభం కానుంది. పదవుల కోసం నువ్వా నేనా అంటున్నారు. ముందుగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంతో పార్టీకి నాయకత్వంవహించేందుకు ససేమిరా అంటున్నారు. ఇక్కడ పదవులు తీసుకుంటే రేపు నామినేటేడెటన పదవుల కోసం పోటీ పడేందుకు అవకాశం కోల్పోతామని భావించి ముందుగానే పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నారు. మరోపక్క ఎవరికి వారే పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసి వర్గపోరుకు సిద్దం అవుతున్నారు. దీనికి తోడు పార్టీలో కీలకంగా వ్యవహరించి, సిఎంకు సన్నిహితంగా ఉండే ...

Read More »

నేడు పబ్లిక్‌ రిలేషన్‌ సెమినార్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగ ఆధ్వర్యంలో ‘ఆధునిక డిజిటల్‌ యుగంలో ప్రజాసంబంధా’లు అన్న అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు జాతీయ సెమినార్‌ నిర్వమిస్తున్నట్లు సెమినర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె. రాజారాం తెలిపారు. ఈ సెమినార్‌కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గటిక విజయ్‌కుమార్‌ పాల్గొంటారని అన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ మౌలానా ఆజాద్‌, ఉర్దూ ...

Read More »

డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను అందించాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులను డిస్టెంట్స్‌ పద్దతిలో ఏర్పాటు చేయాలని నిజామాబాద్‌, ఇతర జిల్లాల విద్యార్థులు టీయూ రిజిస్ట్రార్‌ లింబాద్రికి విన్నపం చేశారు. ఎమ్మెస్సీ మ్యాస్‌, ఫిజిక్స్‌, కెమెస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్‌, ఎంకాం తదితర కోర్సులను ఏర్పాటు చేయాలని పీజీ విద్యను చదవలేక ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారని డిస్టెంట్స్‌ పద్దతిలో వీటిని విద్యార్థులకు అందజేయాలని వారు కోరారు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారికి డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను ...

Read More »

దరఖాస్తు చేసుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 2014-15 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రెన్యూవల్‌, నూతన విద్యార్థుల ఉపకార వేతనాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రొఫెసర్‌ కనకయ్య అన్నారు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను రెండు సెట్లు కార్యాలయంలో స్కాలర్‌షిప్‌ సెక్షన్‌లో ఒకటి, ఇన్‌ఛార్జీకి ఒకటి అందజేయాలని అన్నారు. లేకుంటే దీనికి పూర్తి బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. ఇప్పటి వరకు కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులు 136 మంది, రెండు, మూడు, నాలుగు, ...

Read More »

7వ బెటాలియన్‌లో బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 7వ బెటాలియన్‌ డిచ్‌పల్లి లో బాబుజగ్జీవన్‌ రాం 108వ జయంతి ఉత్సవాలను ఆదివారం కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాదక్షుడు, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, క్విట్‌ ఇండియా ఉద్యమం విజయవంతం చేయడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని కొనియాడారు. పేదవాడి కన్నీటిని తుడిచిన జగ్జీవన్‌రాం ఈరోజే కాదు ...

Read More »

టిటిడిసిలో స్వచ్ఛభారత్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిటిడిసి శిక్షణ కేంద్రంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కంప్యూటర్‌ శిక్షణకు హాజరైన నిరుద్యోగులు శిక్షణ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గతంలో శిక్షణ కోసం వచ్చిన మహిళా సంఘాలు కూడా ఇక్కడ స్వచ్ఛభారత్‌ నిర్వహించారు.

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన మోహన్‌ (35) మృతి చెందినట్టు ఎస్‌ఐ ముజుబూర్‌ రహమాన్‌ తెలిపారు. మృతుడు మోహన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మోహన్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ...

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలోని చిన్న హనుమాన్‌ దేవాలయంలో హనుమాన్‌ జన్మదిన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విరివిగా గ్రామాల నుంచి బక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులోగల బాల ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ మాల ధారులు బాల హనుమాన్‌ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రగ్రహణం ఉన్నందున పూజాది కార్యక్రమాలతో పాటు, అన్నదానం కూడా ముగించేశారు. ...

Read More »

ఇంకెన్ని ముట్టడిస్తారు ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని పింఛన్‌ కోసం ఎన్నిసార్లు ముట్టడిస్తారని బీడీ కార్మికులకు అన్నారు. ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాలు పింఛన్ల కోసం మండల పరిషత్‌ కార్యాలయాన్ని గతంలో ముట్టడించడం జరిగిందని వినతిపత్రాలను అందజేశారన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులందరికి జీవన భృతి ఇచ్చే వరకు ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయాన్ని తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు ముట్టడించడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి మరోసారి 1.2 లక్షల మందికి జీవన భృతి ...

Read More »

ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన బీడీ కార్మికులు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని బుధవారం బీడీ కార్మికులు ముట్టడించి అధికారులను నిలదీశారు. బీడీలు చేస్తున్న కార్మికులకు పింఛన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. సకల జనుల సమ్మెలో నమోదు చేసుకున్న ప్రతి బీడీ కార్మికురాలికి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వారు వాపోయారు.ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌ అర్హులకు పింఛన్‌ వస్తుందని బీడీ కార్మికులకు నచ్చజెప్పారు. కార్మికులు విన్నకుండా కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిట్టాపల్లి గ్రామ సర్పంచ్‌ ...

Read More »

తెవివి స్టేడియం కోసం స్థల పరిశీలన

డిచ్‌పల్లి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇందూరుకే తలమానికంగా త్వరలోనే క్రీడా కేంద్రంగా మారనుందని విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి, రిజిస్ట్రార్‌ లింబాద్రి కృషితో త్వరలోనే స్టేడియం మంజూరు కానుందని పేర్కొన్నారు. మంగళవారం స్థల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రేమ్‌కుమార్‌, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాబురాం, ఎఇఎం రాజేశ్వర్‌రావులు యూనివర్సిటీకి వచ్చి రిజిస్ట్రార్‌ను కలిశారు. ఉన్నతాధికారులతో కలిసి స్టేడియం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ...

Read More »

మనిషి మనుగడకు మానవ హక్కులే కీలకం

  – జస్టిస్‌ సి.వి. రాములు డిచ్‌పల్లి, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ జీవన ప్రయాణంలో గౌరవంతో కూడిన జీవనానికి మానవహక్కులు ఎంతగానో తోడ్పడతాయని మనిషిని మనిషిగా గుర్తించిన మనిషికి గౌరవాన్ని ఇవ్వడానికి మానవహక్కులు అత్యంత ఆవశ్యకమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.రాములు అన్నారు. న్యాయకళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం మానవహక్కుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధానవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. పుట్టుకతో అందరు సామాన్యులేనని, కానీ ప్రతిచోట వివక్షత. కొన్నిచోట్ల కొన్ని వర్గాల వారు మానవహక్కులు ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  డిచ్‌పల్లి, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ఆద్వర్యంలో మెంట్రాజ్‌పల్లి గ్రామంలో మూడోరోజు గురువారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.లావణ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని గ్రామాల్లోని నీటిపరిశుభ్రత గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. పశువుల నీటితొట్టి వద్ద పాచి, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు శుభ్రం చేశారు. వాటర్‌ ట్యాంకులకు బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, విద్యావాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సర్పంచ్‌ ...

Read More »

డిగ్రీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు – రిజిస్ట్రార్‌ లింబాద్రి

  డిచ్‌పల్లి, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని గ్రాడ్యుయేట్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు మార్చి 27 శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఎ, బికాం, బిఎస్సీ, బిబిఎ లాంటి ఓరియంటల్‌ కోర్సులు, తదితర కోర్సుల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ...

Read More »

నేడు మానవహక్కులపై జాతీయ సదస్సు

  డిచ్‌పల్లి, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో శుక్రవారం మానవ హక్కులపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు డాక్టర్‌ జట్లింగ్‌ ఎల్లాసా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి, విశిష్ట అతిథులుగా జస్టిస్‌ పి.వి.రాములు, ఏ.నవమోహన్‌రావు, బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్లు రెడ్డి, కె.విష్ణుమూర్తి, రిజిస్ట్రార్‌ ఆర్‌.లింబాద్రి పాల్గొంటారని తెలిపారు.

Read More »

నిర్లక్ష్య వైఖరిని సరిదిద్దుకున్న పోలీసులు

  డిచ్‌పల్లి, మార్చి 25 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో సోమవారం రాత్రి బ్రహ్మంగారి దేవాలయంలో దుండగులు చోరికి విఫలయత్నం చేశారు. గ్రామస్తులు గమనించి వెంబడించి పట్టుకొనే ప్రయత్నంలో ఇద్దరుదుండగులు తప్పించుకున్నారు. ఈ విషయమై మంగళవారం ఉదయం పోలీసులకు పిర్యాదుచేశారు. ఎస్‌ఐ ముజీర్‌ ఆర్‌ రహమాన్‌ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఇందల్వాయి రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని నిలదీయగా సోమవారం రాత్రి దొంగతనానికి ప్రయత్నించింది నేనేనని, తనతో పాటు మరోవ్యక్తి శ్రీను ...

Read More »