Dichpally

ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆత్మహత్యలు నివారించాలి

  – వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు సౌకర్యాలను ప్రజలందరికి చేరినపుడు ఆత్మహత్యలు లేని తెలంగాణగా ఉంటుందని, రైతు రాజ్యం కోసం ముఖ్యమంత్రి మిషన్‌ కాకతీయ లాంటి ఎన్నో రైతు కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం రైతు ఆత్మహత్యలు, నివారణ ఉపాయాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. గత మార్చి 30,31 తేదీల్లో అర్థశాస్త్ర విభాగంలో రైతు ఆత్మహత్యలు, నివారణోపాయాలు అనే ...

Read More »

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

  – ఆకుల పాపయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో భూస్వామ్య, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం, దేశ విముక్తికోసం భారత విప్లవోద్యమంలో పనిచేసిన అనేకమంది విప్లవవీరులు అమరులయ్యారని, వారందరికి సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి విప్లవ జోహార్లు అర్పిస్తుందని నిజామాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. భారత విప్లవోద్యమంలో అమరులైన యోధుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఐఎఫ్‌టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆకుల ...

Read More »

ఉర్దూ శాఖలో విద్యార్థుల స్వాగత సమావేశం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ శాఖలో ప్రథమ సంవత్సరం విద్యార్తులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగత సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉర్దూశాఖ అధ్యక్షులు డాక్టర్‌ అత్తర్‌ సుల్తానా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు నూతన విద్యార్థులకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా ఉర్దూ డిపార్టుమెంట్‌లోని ఉత్తమ విద్యార్థులకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. బిఓఎస్‌ ...

Read More »

ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు సిబిసిఎస్‌ విధానం

  – విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు ఏర్పరచడానికి ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ తోడ్పడుతుందని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. సంప్రదాయవిద్యా విధానంలో దిగజారుతున్న విలువల కట్టడికి, విద్యార్థులను అన్ని రంగాల్లో సుశిక్షితులను చేయడానికి ఈ సిబిసిఎస్‌ పద్ధతి ఉపయుక్తమవుతుందని ఆయన తెలిపారు. ‘చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ – పద్ధతులు, మూల్యాంకనం’ అనే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆర్తిక సహకారంతో ఒకరోజు ...

Read More »

రైతుల్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

డిచ్‌పల్లి: కొత్త రుణాలు ఇవ్వకుండా, పాత బకాయిలకు వడ్డీ మీద వడ్డీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తోందని భాజపా రాష్ట్ర కార్యదర్శి మురళీగౌడ్‌ అన్నారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో గురువారం భాజపా మండల కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్ఠతకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.38 వేల కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ పెట్టుబడి రాయితీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ...

Read More »

న్యాయ విద్యార్థుల ఇంటింటి సర్వే

  డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల విద్యార్థులు ఈనెల 2,3 తేదీల్లో సమాజంలోని న్యాయ సమస్యలను గుర్తించి పరిశీలించడానికి నడిపల్లి, సుద్దపల్లి తాండా, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసినట్టు న్యాయ విభాగం ఆచార్యులు తెలిపారు. సర్వేను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ జట్లింగ్‌ ఎల్లోసా ప్రారంభించి మాట్లాడారు. న్యాయ విద్యార్థులకు సమాజంలోని సమస్యలే పెద్ద క్లాస్‌ రూం అని ఈ సర్వే ద్వారా గిరిజన తాండాల్లోగల సమస్యలు తలెత్తడానికి గల కారణాలు, వాటి ...

Read More »

టూటా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపక సంఘం (టుటా) కేంద్ర ప్రభుత్వ ఏడవ పే కమీషన్‌ అంశాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 7వ పే కమీషన్‌లో విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రావాల్సిన సదుపాయాలు, జీతభత్యాల విషయంలో చర్చాగోష్టి నిర్వహించారు. అధ్యాపక విధులు, యుజిసి నిబంధనలు, అధ్యాపకుల సెలవుల అంశం, మహిలా అధ్యాపకులకు ప్రత్యేక సెలవులు, అధ్యాపకులకు ఆరోగ్య భద్రతా కార్డులు తదితర అంశాలు చర్చించినట్టు తెలిపారు. సమావేశానికి టుటా అధ్యక్షులు ప్రవీణ్‌ మామిడాల ...

Read More »

అంతర్జాతీయ తెలుగు సాహిత్య సదస్సుకు డాక్టర్‌ త్రివేణి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆహ్వానం మేరకు నవంబర్‌ 5,6 తేదీల్లో సింగపూర్‌లో జరిగే 5వ అంతర్జాతీయ తెలుగుసాహిత్య సదస్సుకు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి పాల్గొని పత్ర సమర్పణచేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మలేషియా దేశాన్ని కూడా సందర్శించనున్నట్టు ఆమె తెలిపారు. ఇదివరకే అమెరికాలోని ఆటా సభలకు వెళ్లి అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికలపై సాహిత్య సదస్సుల్లో పత్ర సమర్పణలు చేయడం చాలా ఆనందంగా ...

Read More »

తెయు చీఫ్‌ వార్డెన్‌గా డాక్టర్‌ బి.సాయిలు నియామకం

  డిచ్‌పల్లి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డాక్టర్‌ బి.సాయిలు గురువారం నియమితులయ్యారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ సాయిలు గతంలో సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌గా, వార్డెన్‌గా పనిచేశారు. అదేవిధంగా మెయిన్‌ క్యాంపస్‌కు ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. తనపై నమ్మకంతో చీఫ్‌ వార్డెన్‌ బాధ్యతలు అప్పగించినందుకు విసి, రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

సాహస క్రీడలు విద్యార్థుల్లో స్పూర్తిని నింపుతాయి

  డిచ్‌పల్లి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహస క్రీడలు విద్యార్థుల్లో స్పూర్తిని నింపుతాయని, అవి వారిలో ధైర్య సాహసాలను పెంపొందిస్తాయని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. తెయు నుంచి ఆరుగురు విద్యార్థులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్యాంగ్‌ డ్యాం వాటర్‌స్పోర్ట్స్‌ శిక్షణ శిబిరంలో పదిరోజుల పాటు వాటర్‌ స్పోర్ట్స్‌లో వివిధ విన్యాసాలు చేసి వచ్చారు. ఈ శిబిరానికిజాతీయ సేవా పథకం విద్యార్థులు హాజరయ్యారు. శనివారం వారు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్తి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ప్రవీణాబాయి, ...

Read More »

జాతీయ సమగ్ర క్యాంప్‌లో తెయు విద్యార్థుల ప్రతిభ

  డిచ్‌పల్లి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో జరిగిన 7 రోజుల జాతీయ సమైక్యత సమగ్రత శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ప్రత్యేక ప్రతిభచూపి ప్రథమ బహుమతి పొందారు. అక్టోబరు 15 నుండి 21 వరకు శిబిరం జరిగింది. కళా, సాంస్కృతిక ప్రదర్శనలో తెయు విద్యార్థులు బతుకమ్మ ఆట, పాటలతో హోరెత్తించారు. వారి కళా ప్రదర్శన జాతీయసమగ్రత క్యాంప్‌లో హైలెట్‌గా నిలిచింది. మొత్తం 10 రాష్ట్రాల నుంచి 187 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్న ...

Read More »

24న ఇంటర్‌ కాలేజ్‌ క్రాస్‌ కంట్రీ 12 కి.మీ. మెన్‌ చాంపియన్‌షిప్‌-2016

  డిచ్‌పల్లి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24న ఇంటర్‌ కాలేజ్‌ క్రాస్‌ కంట్రీ 12 కి.మీ. మెన్‌ చాంపియన్‌షిప్‌-2016 నిర్వహిస్తున్నట్టు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ ఎం.డి.జమీల్‌ అహ్మద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.నేత తెలిపారు. చాంపియన్‌షిప్‌ తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలు, అపిలియేటెడ్‌ డిగ్రీ, పిజి చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహించబడుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య జయప్రకాశ్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య పాల్గొంటారని తెలిపారు. పాల్గొనే అభ్యర్థులు ...

Read More »

తెవివిని సందర్శించిన జవహార్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ ఆచార్యులు

  డిచ్‌పల్లి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిష్టాత్మక ఢిల్లీ జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ ఆచార్యులు అజయ్‌ తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సాంబయ్యను తన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆచార్య అజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీకి సువిశాల ప్రాంగణం, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండడం శుభసూచకమని పేర్కొన్నారు. విద్య, పరిశోధనా రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. భవిష్యత్తులో ఢిల్లీ జవహార్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో తెలంగాణ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంపై ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు. ...

Read More »

తెయులో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

  డిచ్‌పల్లి, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో శనివారం బతుకమ్మ సంబరాలు వేడుకగా జరిగాయి. వర్సిటీ మహిళా సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థినిలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆట,పాటలతో హోరెత్తించారు. తెయు సాంస్కృతిక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ త్రివేణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు పరిపాలనా భవనం ముందు ఘనంగా నిర్వహించారు. మొదట అందంగా, సంప్రదాయ బద్దంగా అలంకరించిన బతుకమ్మలకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, కంట్రోలర్‌ ఆప్‌ఎగ్జామినేషన్స్‌ ఆచార్య కనకయ్య, సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి, ...

Read More »

తెయు ప్రజాసంబంధాల అధికారిగా డాక్టర్‌ రాజారాం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.రాజారాం నియమితులయ్యారు. తెయు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ వై.జయప్రకాశ్‌రావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో డాక్టర్‌ రాజారాం సంవత్సరం పాటు ఉంటారన్నారు. గతంలో కూడా పిఆర్‌వోగా పనిచేశారన్నారు. తనపై నమ్మకంతో తన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన విసి, రిజిస్ట్రార్‌లకు రాజారాం కృతజ్ఞతలు తెలిపారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది ఆయనను అభినందించారు.

Read More »

తెయులో ముగ్గురు కొత్త డీన్లు

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మూడు ఫాకల్టీలకు కొత్త డీన్లు నియామకమయ్యారు. ఈ మేరకు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు ఉత్తర్వులు అందజేశారు. పాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, సోషల్‌ సైన్సెస్‌ ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, లా ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎం.వి.రంగారావులు నియమితులయ్యారు. వీరంతా కాకతీయ యూనివర్సిటీలో వివిధ ఉన్నత పదవులు నిర్వహించి అపార అనుభవం ఉన్నవారే. ఈ నియామకాలతో వివిధ ఫాకల్టీలు బలోపేతమవుతాయని, ...

Read More »

భవిష్యత్‌లో తెలుగుకు మంచిరోజులు

  – ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కడంతో తెలుగుకు భవిష్యత్‌లో మంచిరోజులు వస్తాయని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలుగు జాతీయస్థాయిలో ప్రాచీన భాష హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధానకారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడన్నారు. ప్రొఫెసర్‌ శివారెడ్డి శనివారం తెయు తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో జరిగిన అధ్యాపకుల సమావేశంలో ముఖ్య అతిథిగా ...

Read More »

లా కళాశాలలో ప్రపంచ లా దినోత్సవం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ప్రపంచ లా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జట్లింగ్‌ యెల్లోసా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా స్థిరత్వం ఉందని తెలిపారు. ప్రపంచంలో వివిధ దేశాలమధ్య, సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలు అన్ని కూడా ప్రపంచంలో లా ఉండడం వల్లనే పరిష్కారమవుతున్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి వచ్చిన సందర్భాన్ని ...

Read More »

పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కనకయ్య

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌గా ప్రొఫెసర్‌ పి.కనకయ్య నియమితులైనట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు ఈ నియామ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా 2014 ఫిబ్రవరి నుండి విదులు నిర్వహిస్తున్న ఆచార్యకనకయ్య ఇక పరీక్షల విభాగంపై దృష్టి సారించనున్నారు. పరీక్షల నియంత్రణ విభాగాన్ని మరింత సమర్థవంతంగా, తక్కువ ...

Read More »

క్యాంపస్‌ జీవితం అత్యంత కీలకం

  – జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ డిచ్‌పల్లి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థి జీవితంలో క్యాంపస్‌ జీవితం అత్యంత కీలకదశ అని జిల్లాఎస్పీ పి.విశ్వప్రసాద్‌ అన్నారు. క్యాంపస్‌ లైఫ్‌ అనేక విషయాలను, పాఠాలను, అనుభవాలను నేర్పిస్తుందని, క్యాంపస్‌ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఆయన తెయు బాలుర వసతి గృహంలో జరిగిన వినాయక ...

Read More »