Breaking News

Dichpally

జె.వి.శివకుమార్‌కు ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య జె.వి.శివకుమార్‌కు ప్రతిష్టాత్మక లయన్స్‌క్లబ్‌ ఇంటర్నేషనల్‌వారిచే ఉత్తమ అధ్యాపకుని సత్కారానికి ఎంపికయ్యారు. సెపెంటరు 7నహైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో శివకుమార్‌కు ప్రత్యేక సత్కారం ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాల బోధనానుభవం ఉండి గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ యూనివర్సిటీ లా విభాగంలో పనిచేస్తున్న శివకుమార్‌, తెవివి లా విభాగానికి తొలి హెడ్‌గా బాద్యతలు నిర్వహించారు. క్రిమినల్‌ లా లో స్పెషలైజేషన్‌ చేసిన ...

Read More »

బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది అని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 2013-14, 2014-15 ల్యాబుల వారికి బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, అలాగే 2011-12, 2012-13 బ్యాచుల వారికి చివరి అవకాశంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. ఇందులో భాగంగా థియరి, ప్రాక్టీకల్‌ పరీక్షలు నిర్వహిస్తామని సిఓఈ వెల్లడించారు. ఈ పరీక్షలన్ని కూడా సెప్టెంబరు మాసంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

Read More »

గణేశ్‌ ఉత్సవ క్రీడాపోటీలు ప్రారంభం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి గణేష్‌ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడాపోటీలు శుక్రవారం వర్సిటీ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ పోటీలు ప్రారంభించిన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటడం అభినందనీయమన్నారు. గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంచడం అభినందనీయమన్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా క్రీడాస్ఫూర్తితో ఈ పోటీలను నిర్వహించుకోవాలని సూచించారు. ఐఎంబిఎ, కెమిస్ట్రి ...

Read More »

కళాశాల తనిఖీ చేసిన విసి

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ కళాశాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం 9.50 గంటలకే వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్న విసి ఉదయం 10 గంటలకు అధ్యాపకుల రాకను గమనించారు. అధ్యాపకులు సకాలంలో వచ్చి ఆయా విభాగాలలో తరగతులు తీసుకునే విధానాన్ని పరిశీలించారు. వివిధ తరగతి గదుల్లో తనిఖీ చేసి విద్యార్థులు మరింత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రెగ్యులర్‌గా తరగతులు ...

Read More »

సామాజిక తెలంగాణకై ఉద్యమిద్దాం – ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో దళిత, బిసి, గిరిజన, మైనార్టీ ప్రజలకు మేలు జరగాలంటే అందరూ కలిసికట్టుగా సామాజిక తెలంగాణ సాధనకై పోరాడాలని ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం రోజు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. నిజమైన బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది ఫలాలు అందాలని వివరించారు. తెలంగాణ సాధనకై దళిత బహుజన ...

Read More »

పాముకాటుతో విద్యార్థిని మృతి

  – తెవివిలో సంతాపసభ డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ ఎకనామిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోశ అనే విద్యార్థిని తన స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ఉసిరిగాయలపల్లిలో పాముకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం కాటువేయడంతో మృతి చెందిందని కుటుంబీకుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనతో యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ముందు ఏర్పాటు చేసిన సంతాపసమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యతో సహా అధ్యాపకులు, ...

Read More »

తెవివిలో తీజ్‌ వేడుకలు  

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారా సంస్కృతికి ప్రతిరూపమైన తీజ్‌ వేడుకలు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత వారంరోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ రాథోడ్‌, డాక్టర్‌ మోతిలాల్‌ రాథోడ్‌, కార్పొరేటర్‌ చాంగుబాయి, తారాచంద్‌, బీంరావు పాల్గొన్నారు. సభాధ్యక్షత వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శాంతాబాయి మాట్లాడుతూ బంజారాల పవిత్ర తీజ్‌ పండగ ప్రాముఖ్యతను వివరించారు. విసి ప్రొఫెసర్‌ ...

Read More »

తెవివిలో జాతీయ క్రీడాదినోత్సవం

  డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు క్రీడల ద్వారా వారి శారీరక, మానసికంగా ఉల్లాసవంతులు కావడమేగాకుండా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించవచ్చని స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. మమత అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలో జాతీయ క్రీడాదినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలను అలవరుచుకోవాలని సూచించారు. బి.ఆర్‌.నేత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు తమకిష్టమైన క్రీడను ఎంచుకొని ...

Read More »

నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం తనిఖీ

  డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 400 విద్యార్థులకు సరిపడా కొత్తగా నిర్మిస్తున్న బాలుర వసతి గృహ భవనాలను వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య సోమవారం పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, సిపిడబ్ల్యుడి, యూనివర్సిటీ ఇంజనీర్లు ఉన్నారు. వసతి గృహ భవనాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసి అప్పగించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. వారివెంట ఇంజనీర్లు రాజన్న, వినోద్‌కుమార్‌, తదితరులున్నారు.

Read More »

పట్టపగలే చోరీ…

  బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని సిండికేటు బ్యాంకు వెనక ప్రాంతంలోగల బెజుగం రాఘవేందర్‌ అనే వ్యాపారి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. ఇంటివారు పట్టణంలో జరుగుతున్న పెళ్లికి కుటుంబీకులతో కలిసి తాళం వేసి వెళ్లగా దీన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన ఆయన తలుపులు, బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ...

Read More »

తెవివి లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తికి శ్రద్దాంజలి

  డిచ్‌పల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తి అనంత ఇటీవల స్వర్గస్తులు కావడంతో శుక్రవారం వర్సిటీ లా కళాశాలలో శ్రద్దాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, విద్యార్థులు అనంత చిత్రపటానికి పూలమాలలువేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివకుమార్‌, బిసి యూత్‌ జేఏసి రాష్ట్ర సలహాదారు రాజారాం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ప్రసన్నరాణి, సత్యనారాయణ చారి, విద్యార్థులు నవీన్‌, రాజు, శేఖర్‌రెడ్డి, మధు, నాగార్జున తదితరులు ...

Read More »

వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్యను అభినందించిన కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు

  డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యను డిచ్‌పల్లి తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. బుధవారం విసి చాంబరుకు విచ్చేసిన కమాండెంట్‌ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. కొద్దిసేపు విద్యాసంబంధ విషయాలు, తెలంగాణ అభివృద్దికై చేయాల్సిన కృషిని వారు చర్చించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు కలిసి చేయాల్సిన కృషి ఆవశ్యకతను, అవకాశాలను కూలంకషంగా చర్చించారు. ఇదే సందర్భంలో కమాండెంట్‌ శ్రీనివాసరావుకి ప్రతిష్టాత్మక ...

Read More »

దేశం గర్వించే పౌరులు కావాలి

  – తెవివి విసి సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంచుకున్న రంగంలో కష్టపడి, అంకిత భావంతో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పిలుపునిచ్చారు. మంగళవారం తెయులో 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా దాదాపు 500 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సామూమిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. యుజిసి ఆదేశించిన విధంగా సరిగ్గా ఉదయం 11 ...

Read More »

24న డిజిటల్‌ ఇండియాపై అవగాహన సదస్సు

  డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 20 డిగ్రీ కళాశాలల్లోని 20 ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు, 250 మంది విద్యార్థులతో ఆగష్టు 24న తెయులో డిజిటల్‌ ఇండియాపై అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఆర్తి తెలిపారు. ఆగష్టు 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర ఈ గవర్నెర్స్‌ మిషన్‌ టీం నుంచి రిసోర్సు పర్సన్లు వస్తాయని ఆమె అన్నారు. అవగాహన ...

Read More »

జీవశాస్త్రంలో ఆధునిక పరిశోధనలు జరగాలి

  డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు కనీస మౌలిక వసతులు సమకూర్చటానికి జీవశాస్త్రంలో ఆధునిక నాణ్యమైన పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.మోహన్‌రావు సూచించారు. సోమవారం తెవివిలోని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మైక్రోబియల్‌ బయోడైవర్సిటీ’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన మోహన్‌రావు మాట్లాడుతూ నేటి సమాజానికి కంప్యూటర్‌ అత్యాధునిక వస్తువుగా మారిందన్నారు. దీంతో అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ...

Read More »

తెయులో ఉత్సాహభరితంగా ఫ్రీడం రన్‌

  డిచ్‌పల్లి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీడం రన్‌ క్యాంపస్‌ నుంచి డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ వరకు ఉత్సాహభరితంగా సాగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఫ్రీడంరన్‌లో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు ముందుండి మొత్తం 2.5 కి.మీ.లు పరుగెత్తారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ రన్‌లో పాల్గొని దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకటరాములు, ఇతర సీనియర్‌ అధికారులు సిబ్బందితో కలిసి ...

Read More »

22న వృక్షశాస్త్ర విభాగంలో జాతీయ సెమినార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆగష్టు 22న జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నట్టు సెమినార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.మమత తెలిపారు. మైక్రోబియల్‌ బయోడైవర్సిటీ అనే అంశంపై ఈ సెమినార్‌ ఉంటుందన్నారు. ప్రధాన వక్తగా సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ సిహెచ్‌ మోహన్‌రావు పాల్గొంటారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లోని బోటనీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కన్వీనర్‌ పేర్కొన్నారు. సెమినార్‌కు చీఫ్‌ ప్యాట్రన్‌గా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య వ్యవహరిస్తారన్నారు. ...

Read More »

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టి.మృణాళిని, ప్రొఫెసర్‌ వాణి, లాతూర్‌కర్‌ – నాందేడ్‌ అన్నారు. ‘నాణ్యమైన విద్య – 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై తెవివిలో జరిగిన రెండ్రోజుల జాతీయ సెమినార్‌ శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యలో పెను మార్పులు ...

Read More »

తెవివిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుంది, ఇందులో భాగంగానే శుక్రవారం మధ్యాహ్నం వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లోపోటీలు నిర్వహించినట్టు తెలుగు అధ్యయన విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలశ్రీనివాసమూర్తి తెలిపారు. బంగారు భారతదేశం అనే శీర్షికతో వ్యాసరచన పోటీకి, నా కలల్లో భారతదేశం అనే శీర్సికతో వక్తృత్వ పోటీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. నిర్వాహకులుగా డాక్టర్‌ లక్ష్మణచక్రవర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ...

Read More »

ఉన్నత విద్యపై జాతీయ సెమినార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటి అసెస్‌మెంట్‌ విభాగం, నాక్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో క్వాలిటి ఎడ్యుకేషన్‌, ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌, ఛాలెంజెస్‌ ఫర్‌ 21 సెంచరీ అనే అంశంపై జరిగే జాతీయ సెమినార్‌ ఆగష్టు 18న ప్రారంభమవుతుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య హాజరవుతారని, కీ నోట్‌ స్పీకర్‌గా కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, ...

Read More »