Breaking News

Dichpally

తెయులో మరో ప్రతిష్టాత్మక ఎంఓయు

  డిచ్‌పల్లి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మరో ప్రతిష్టాత్మక ఒప్పంద పత్రం కుదుర్చుకుంది. ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్‌ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌తో బయోటెక్నాలజి, బోటనీ విభాగాలు ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయు ఈనెల 21న జరిగినప్పటికీ, సోమవారం ఉదయం సెక్రటేరియట్‌లోని విసి సి.పార్థసారధి చాంబర్‌లో ఒప్పంద పత్రాలు కుదుర్చుకున్నారు. సెంటర్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌ తరఫున ప్రిన్సిపాల్‌ సైంటిస్టులు డాక్టర్‌ ఒస్మాన్‌, డాక్టర్‌ మహేశ్వరిలు, టియు తరఫున విసి పార్థసారధి, బయోటెక్నాలజి, డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, ...

Read More »

తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ పి.సాంబయ్య

  డిచ్‌పల్లి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ నూతన వైస్‌ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ పసుల సాంబయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలనా విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరైన ప్రొఫెసర్‌ సాంబయ్య సోమవారం తెయు విసిగా మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, ఇతర అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఉదయమే తెయు క్యాంపస్‌కు చేరుకున్న ప్రొఫెసర్‌ సాంబయ్య ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్న వెంటనే లాంఛనంగా ...

Read More »

పిల్లలచేత… పిల్లలతో కలిసి…

  డిచ్‌పల్లి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్ల ద్వారా ప్రాణవాయువు, నీడ, వర్షం లభిస్తాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం డిచ్‌పల్లిలోని మానవతా సదన్‌లో అనాధ పిల్లలతో మామిడి మొక్క నాటించి వారితో కలిసి నీరుపోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెట్ల వల్ల ప్రాణవాయువు లభిస్తుందని, ఎండాకాలంలో నీడ దొరుకుతుందని, చెట్ల వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. నాటిన మొక్కలను చంటి పిల్లల్లాగా చూడాలని, నీరుపోసి పెద్దవిగా ఎదిగే దాకా సంరక్షించాలని వారికి ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ల ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ  – నిజామాబాదు:  ప్రొ. సాంబశివ రావు (ప్రొ. పబ్లిక్ అడ్మిన్, కేయూ) తెలుగు యూనివర్సిటీ: ఎస్. వి. సత్యనారాయణ (రి. ప్రొ. తెలుగు, ఓయూ). జేఎన్టీయూ – వేణు గోపాల్ రెడ్డి (ప్రో. కంప్యూటర్ సైన్స్, జేఎన్టీయూ).

Read More »

బాలశ్రీనివాసమూర్తి ప్రసంగానికి సినారె ప్రశంసలు

  డిచ్‌పల్లి, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహిత్యంపై వంశీ విజ్ఞాన పీఠం సంస్థ హైదరాబాద్‌ త్యాగరాయ గానసభ మినీ హాలులో నిర్వహిస్తున్న ప్రసంగ పరంపరలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనవిభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి ఉపన్యసించారు. ‘నారాయణరెడ్డి పరిశోధనలు’ అనే అంశంపై సమగ్ర ప్రసంగం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సినారె సిద్దాంత గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయాలు, ప్రయోగాలు’ లోని పలు వివేషాల్ని వివరించారు. మూడు తరాలకు ...

Read More »

సమాచార పౌరసంబంధాల శాఖతో తెలంగాణ యూనివర్సిటీ ఎంఓయు

  డిచ్‌పల్లి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖతో గురువారం తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక మెమోరాండం అఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ కుదుర్చుకుందని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సమాచారపౌర సంబంధాల శాఖ కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ సి.పార్ధసారధి ఈ ఒప్పంద పత్రంపై సంతకం చేశారన్నారు. సెక్రటేరియట్‌లోని పార్థసారధి చాంబరులో ఈ ఎంఓయు పత్రాల మార్పిడి జరిగిందని అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజారాం కార్యక్రమంలో ...

Read More »

ఘన్‌పూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

  డిచ్‌పల్లి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ గ్రామంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన వైద్యులు సుమారు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపినీ చేశారు. అవసరమున్న మోతిబిందు శస్త్రచిక్సితలు చేయించడానికి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సాయినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రిజిస్ట్రార్‌ లింబాద్రిని అభినందించిన కళాశాలల యాజమాన్య ప్రతినిధులు

  డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రయివేటు డిగ్రీ, పిజి కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ ప్రతినిదులు బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రిని కలిసి తన అమెరికా పర్యటనలో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ది కోసం కృషి చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చంతో సత్కరించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు గంగామోహన్‌, ఎ.హరిప్రసాద్‌, సభ్యులు హరిస్మరణ్‌, రాజు, నరాల సుధాకర్‌, సూర్యప్రకాశ్‌, సృజన్‌రెడ్డి తదితరులున్నారు.

Read More »

అమెరికా పర్యటన అనుభవాలు – తెయు అభివృద్దికి బాటలు

– రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన అమెరికా పర్యటన అనుభవాలు, ఉన్నత విద్యతో తాను అక్కడ గమనించిన అంశాలు తెలంగాణ యూనివర్సిటీ సమగ్ర అభివృద్దికి వినియోగిస్తానని తెయు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. తన అమెరికా పర్యటన అనుభవాలు తెయు అభివృద్దికి అవకాశాలు అన్న అంశంపై రిజిస్ట్రార్‌ లింబాద్రి తెయు అధ్యాపకులు, అకడమిక్‌ కన్సల్టెంట్ల సమావేశంలో ప్రసంగించారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో నాణ్యత విషయంలో రాజీ లేదని, సమయపాలన, పరిశోదన రంగాల్లో అత్యున్నత ప్రమాణాలు ...

Read More »

హరిత క్యాంపస్‌గా తెవివి

  – ఎమ్మెల్యే బాజిరెడ్డి డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని హరితవనంగా, హరిత క్యాంపస్‌గా మార్చాలని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా ఎమ్మెల్యే, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి నేతృత్వంలో గత రెండు సంవత్సరాల్లో ...

Read More »

తెవివి వసతి గృహాల సమీక్ష సమావేశం

  డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతిగృహ విద్యార్థులకు సంబంధించిన అడ్మిసన్లు, రికార్డులు, దరఖాస్తు ఫారాలు, అడ్మిషన్‌ పీజులు, డిపాజిట్లు తదితర విషయాలపై శుక్రవారం తెవివిలో సమీక్షించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య రికార్డులను పరిశీలించారు. రానున్న విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రారంభం కాబోయే హాస్టల్‌తో సహా అన్ని వసతి గృహాలు శుభ్రం చేసి ఉంచాలని, అలాగే యుజిసి నుంచి ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాలకు ...

Read More »

తెవివిలో మొక్కలు నాటిన బోధనేతర సిబ్బంది

  డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కు సంబంధించిన బోధనేతర సిబ్బందితో కలిసి ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య శుక్రవారం మొక్కలు నాటారు. సుమారు పదిరకాల మొక్కలు నాటామని, 34 మంది బోధనేతర సిబ్బంది, సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి మొక్కలు నాటడం అభినందనీయమని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజీలో గత ఎనిమిదేళ్ళుగా గార్డెన్‌ను అభివృద్ది చేయడమేగాకుండా రోడ్డుకిరువైపులా కాలేజ్‌ చుట్టు ఉన్న ఖాళీస్థలంలో ప్రతియేడు మొక్కల గురించి శ్రద్ద తీసుకుంటున్న సిబ్బంది ఉండడం ...

Read More »

నేడే తెవివి సెర్చ్‌ కమిటీ సమావేశం

తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి ఎంపికకు సమయం దగ్గర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. ఉపకులపతి నియామకానికి ప్రభుత్వం వేసిన ‘సెర్చ్‌ కమిటీ’ శుక్రవారం రాజధానిలో సమావేశం కానుంది. విశ్వవిద్యాలయ వీసీ నియామకం కోసం గత నెల 25న సెర్చ్‌ కమిటీని నియమించింది. కమిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రతినిధిగా బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ వీసీ బీవీ ప్రసాద్‌, యూజీసీ ప్రతినిధిగా కోల్‌కత యూనివర్సిటీ వీసీ ఆచార్య సురంజన్‌ దాస్‌, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన ...

Read More »

అమెరికాలో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను కలిసిన తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి

  డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలోని కాన్సులర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా యూసప్‌ సయ్యద్‌ను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అమెరికాలో కలిశారు. ఆయనతోపాటు చికాగో స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు రోహన్‌ అట్లే, రావ్‌ అచంట లు కూడా భారత కాన్సులర్‌ జనరల్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ అమెరికాకు వచ్చే అణగారిన, పేద వర్గాల పిల్లలకు ఆర్థిక సాయం అందించడానికి కౌన్సిలర్‌ జనరల్‌ నుంచి నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యారంగంలో, ...

Read More »

ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నాటి పరీక్షతో ప్రశాంతంగా ముగిసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. మొత్తం 32 వేల మంది రాసిన ఈ పరీక్షలు జూన్‌ 18న ప్రారంభమయ్యాయని, చివరిరోజు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్థసారధి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనికీ చేశారన్నారు. అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు తొందరగా ఇవ్వడానికి స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహిస్తున్నట్టు త్వరలోనే పలితాలు వెల్లడిస్తామని ...

Read More »

జూలై 8న జరగాల్సిన డిగ్రీ పరీక్ష వాయిదా

  డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 8వ తేదీన జరగాల్సిన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్ష ఈనెల 13వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా జూలై 8న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున ఆరోజు జరగాల్సిన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలన్ని జూలై 13వ తేదీన వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా పరీక్షలన్ని యథాతథంగా జరుగుతాయన్నారు. అలాగే గతంలో డిగ్రీలో టాలెంట్‌ సెర్చ్‌ ...

Read More »

విపత్తుల నివారణలో సన్నద్దత కీలకం

  – ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తుల నివారణ, నష్టాల తగ్గింపులో మానవ సన్నద్దత ముఖ్యమని తెవివి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు తెలిపారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఆద్వర్యంలో తెయుక్యాంపస్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విపత్తుల నివారణలో ప్రజలందరు భాగస్వాములు కావాలని, అందరికీ అవగాహన అత్యంత అవసరమని పేర్కొన్నారు. వరదలు, భూకంపాలు, తుఫానులాంటి సహజ విపత్తులు, మానవ తప్పిదాలతో ఏర్పడే విపత్తులు, వేలాదిమందిని బలిగొంటున్నాయని ...

Read More »

తెయులో మొక్కలునాటిన ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి

  డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఎమ్మెల్సీ డాక్టర్‌భూపతిరెడ్డి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, జడ్పి వైస్‌ఛైర్మన్‌ సుమన రెడ్డిలు మంగళవారం మొక్కలునాటారు. ఇతర తెరాసనాయకులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. డాక్టర్‌ భూపతిరెడ్డి మాట్లాడుతూ హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని సిఎం కెసిఆర్‌ను కొనియాడారు. పచ్చదనంతో శాశ్వతంగా కరువును నివారించవచ్చని గడ్డం సుమన అన్నారు. ...

Read More »

తెవివి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు

  డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ సభల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటనకు వెళ్లినందున ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు నియామకమైనట్టు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఆచార్య లింబాద్రి దాదాపు పదిరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నందున ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఆచార్య జయప్రకాశ్‌రావు ప్రస్తుతం అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా తాను విసి పార్థసారధి మార్గనిర్దేశంలో బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. ...

Read More »

సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తుల చిత్రపటాలకు పాలాభిషేకం

  డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోరుతూ, తెలంగాణ న్యాయస్థానాల్లో ఆంధ్ర ప్రాంత జడ్జిల నియామకానికి వ్యతిరేకంగా గళమెత్తి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ న్యాయమూర్తుల ఫోటోలకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో క్షీరాభిషేం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిసి జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ ఆధ్వర్యంలో తెయు పరిపాలనా భవనం ముందు కార్యక్రమం నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా చూడాలని, ఆంధ్రాప్రాంతం వారి ఆప్షన్‌లు రద్దు చేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ...

Read More »