Breaking News

Education

ఇంజనీరింగ్‌ బుర్రకు వ్యాపారం పదును

విద్యార్థులకు వ్యాపారంపై శిక్షణ  నూతన కార్యక్రమానికి రూపకల్పన చేసిన టాస్క్‌  ఐఎస్‌బీతో కలిసి ‘టెప్‌’ పేరుతో శిక్షణ కార్యక్రమాలు  హైదరాబాద్‌ కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి బిజినెస్‌ ఐడియా ఉంటుంది.. కాని దాన్ని ఎలా అమల్లోకి తేవాలో తెలియదు. దీంతో వారు ఆ ఐడియాను పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటారు. తక్కిన వారు ఇంజనీరింగ్‌ పూర్తవగానే ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప.. ఇతర వ్యాపారం గురించి ఆలోచించరు. దీంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా తగిన ఉద్యోగం దొరకడం కష్టమైపోయింది. ...

Read More »

పీహెచ్‌డీ ఉంటేనే ‘బీ టెక్‌’ బోధన

ఎంటెక్‌కు కూడా.. జేఎన్ టీయూహెచ్ నిర్ణయం  బీటెక్‌ కోర్సుల బోధనా సిబ్బందికి పీహెచడీ తప్పనిసరి చేస్తూ జేఎనటీయూహెచ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక కోర్సులో రెండు మూడు సెక్షన్స ఉన్నాయి. ఒక్కో సెక్షనలో 60 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల సంఖ్య ఒక సెక్షనకు మించితే బీటెక్‌ విద్యార్థులకు సబ్జెక్టు బోధించే టీచింగ్‌ ఫ్యాకల్టీకి తప్పనిసరిగా పీహెచడీ ఉండాలని, ఎంటెక్‌ కోర్సుల్లో సబ్జెక్టుకు ఇద్దరు పీహెచ్‌డీ పొందిన బోధనా సిబ్బంది ఉండాలని కొత్తగా నిబంధన విధించింది. బుధవారం ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో జేఎనటీయూహెచ అధికారులు ...

Read More »

బిఇడి రెండోదశ కౌన్సిలింగ్‌ను వెంటనే ప్రారంభించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బిఇడి రెండోదఫా కౌన్సిలింగ్‌ను వెంటనే ప్రారంభించాలని పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బిఇడి రెండో దశ కౌన్సిలింగ్‌ చేపట్టడంలో విఫలమైందన్నారు. బిఇడి మొదటి దశ కౌన్సిలింగ్‌ పూర్తయి, తరగతులు పూర్తయి రెండున్నర నెలలు గడుస్తున్నా నేటికి రెండోదశ కౌన్సిలింగ్‌ నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బిఇడి చదువుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్న వేలాది ...

Read More »

తెయు పరీక్షల షెడ్యూల్‌…

డిచ్‌పల్లి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం వివిధ పరీక్షల తేదీలను విడుదలచేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిసెంబరు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆచార్య కనకయ్య తెలిపారు. అదేవిధంగా పిజి సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే బిసిఎ 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు యూనివర్సిటీ కళాశాలలో నిర్వహిస్తారని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. ...

Read More »

పరిశోధనా ప్రాజెక్టులు సాధించండి…

  – తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ నుండి ఇతర పరిశోధనా సంస్థల నుండి రీసెర్చు ప్రాజెక్టులు సాధించాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అధ్యాపకులకు సూచించారు. ఈ మేరకు సోమవారం వర్సిటీ వివిధ విభాగాధిపతులతో సమావేశమై మాట్లాడారు. పరిశోదనా ప్రాజెక్టులు అధ్యాపకుల కెరీర్‌ అభివృద్ది కోసం ఎంతగానో తోడ్పడుతాయన్నారు. యుజిసి నిధులు ప్రాజెక్టులు, పరిశోధనలు వర్సిటీ ప్రతిష్టను పెంచుతాయని విసి అభిప్రాయపడ్డారు. 12వ పంచవర్ష ప్రణాళిక ...

Read More »

పిజి పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 26 చివరితేదీ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పిజి రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్‌ 26 వరకు పొడిగించినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కనకయ్య తెలిపారు. అలాగే అపరాధ రుసుము 100తో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ఫీజు చెల్లింపు నవంబర్‌ 26 వరకు చివరి తేదీ అని, అపరాధ రుసుముతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని సూచించారు. అలాగే బిసిఎ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ ...

Read More »

ప్రతి విద్యార్థి రీసెర్చ్‌ స్కాలర్‌గా ఎదగాలి: జవదేకర్

హైదరాబాద్‌: ప్రతి విద్యార్థి రీసెర్చ్‌ స్కాలర్‌గా ఎదగాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఆకాంక్షించారు. నగర పర్యటనలో భాగంగా ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రక్షణ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నామో విద్యారంగానికి అంతే బడ్జెట్‌ కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించే విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జవదేకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పాల్గొన్నారు. Email this page

Read More »

ఏది నరకం?

‘రాజద్రోహం’ మళ్ళీ రంగంమీదకు వచ్చింది. ఇటీవలే అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మీద ఆ నింద పడిన తరువాత, ఇప్పుడు కన్నడ నటి రమ్య మీద అదే ఆరోపణతో న్యాయస్థానంలో ఓ ఫిర్యాదు దాఖలైంది. స్వాతంత్య్రదినోత్సవానికి రెండురోజుల ముందు బెంగుళూరులో కశ్మీరీ కుటుంబాలతో ఆమ్నెస్టీ నిర్వహించిన ఒక సదస్సులో పాకిస్థాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు హోరెత్తాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సంస్థపై రాజద్రోహం కేసు పెట్టారు. పాకిస్థాన్‌ నరకం కాదని అన్నందుకు ప్రజారంగ అనే సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ...

Read More »

వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్యను అభినందించిన కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు

  డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యను డిచ్‌పల్లి తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. బుధవారం విసి చాంబరుకు విచ్చేసిన కమాండెంట్‌ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. కొద్దిసేపు విద్యాసంబంధ విషయాలు, తెలంగాణ అభివృద్దికై చేయాల్సిన కృషిని వారు చర్చించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు కలిసి చేయాల్సిన కృషి ఆవశ్యకతను, అవకాశాలను కూలంకషంగా చర్చించారు. ఇదే సందర్భంలో కమాండెంట్‌ శ్రీనివాసరావుకి ప్రతిష్టాత్మక ...

Read More »

ఏపీ, తెలంగాణాల్లో 1,245 బ్యాంక్ క్లర్క్ పోస్టులు

రిక్రూటర్ : ఐబిపిఎస్ పోస్టులు : బ్యాంక్ క్లర్క్స్ మొత్తం పోస్టులు : 19,243 ఆంధ్రప్రదేశ్ : 699 తెలంగాణ : 546 అర్హతలు : ఎనీ డిగ్రీ వయోపరిమితి : 20 – 28 సం.లు రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఎంపిక : ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష దరఖాస్తు : ఆన్ లైన్ తుది గడువు : 12-09-2016 ప్రిలిమినరీ ఎగ్జామ్ : 26 & 27-11-2016 మెయిన్ ఎగ్జామ్ : 31 -12-2016 & 01-01-2017 పూర్తి ...

Read More »