Breaking News

Features

‘జల్లికట్టు’బాటు!

చెన్నయ్‌ మెరీనా బీచ్‌లో వేలాదిమంది యువతీయువకులు చలికీ ఎండకీ సముద్రపు గాలికీ వెరవకుండా నాలుగురోజులుగా భీష్మించుకు కూర్చున్న దృశ్యం అద్భుతంగా ఉన్నది. నచ్చినవారు మాట్లాడుతుంటే మెచ్చినవారు చప్పట్లు కొడుతుంటే, ఉద్వేగం తప్ప ఏ మాత్రం ఉద్రిక్తత లేని ఆ వాతావరణం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ప్రజాసమస్యల మీద పదిమంది ఒక్కచోటచేరితే శాంతిభద్రతలంటూ లాఠీ విదిలించే పాలకులు ఈ దృశ్యం చూసి ఏమనుకుంటున్నారో? వేలమంది చేరినా అక్కడ ఏ ఉత్పాతమూ సంభవించలేదు. అంటువ్యాధులు సోకలేదు. కుర్రకారు ఎప్పటికప్పుడు రోడ్లనూ తీరాన్నీ శుభ్రపరుస్తూ గతంలో కంటే శుభ్రంగా కాపాడుతున్నారు. ...

Read More »

అన్నదాతకిది కాంతి లేని సంక్రాంతి

సంక్రాంతి దేశమంతా వేర్వేరు పేర్లతో చేసుకుంటున్నా తెలుగువారికి మాత్రం ఇది పెద్ద పండగేకాదు పెద్దల పండగ కూడా. తమ పెద్దలను స్మరించుకొని, గత స్మృతలుగుర్తుతెచ్చుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడపాల్సిన పండుగ ఇది. మరే పండుగలకు లేని విశిష్టత ఈ పండుగకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా సంక్రాంతికి కూడా తక్కువేమి చేయరు. అన్నిటికంటే మించి పల్లెసీమలకి ముఖ్యంగా రైతుల జీవనంతో ఈ పండుగ ముడిపడి ఉందనేది వాస్తవం. అందుకే పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగకు మాత్రం ...

Read More »

అమలుకాని ఆదేశాలెందుకు?

గత నాలుగౖెెదు సంవత్సరాలుగా తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలు అనావృష్టి తో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆల స్యంగా నైనా వర్షాలు కురిసాయి. అధికశాతం సాగునీటి వనరు లన్నీ కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గినా రబీలో ఆ నష్టాలను పూడ్చుకోవచ్చని రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో సాగుకు సమయాత్తంఅవ్ఞతున్న తరు ణంలో పెద్దనోట్లరద్దు పిడుగుపాటులా వారితలపై పడింది. అప్పులు ఇచ్చేసంగతి అలా ఉంచండి. తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తీసుకోలేని విచిత్ర పరి స్థితులు ఎదుర్కొంటున్నారు. రైతుల సంక్షేమమే ...

Read More »

చిచ్చురేపిన మణిపూర్‌ కొత్తజిల్లాల ప్రహసనం

ముఖ్యమంత్రిఒక్రమ్‌ ఇబోబిసింగ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటుచేయాలని తల పోస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాలు ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో మరో ఏడు జిల్లాలు ఏర్పాటుచేసి మొత్తం 16 జిల్లాలు చేయాలన్న ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ప్రభుత్వ నిర్ణయం కేవలం నాగాల ప్రాబల్యాన్ని అడ్డుకోడానికేనన్న వాదనకు బలం చేకూరుతోంది. అసోం,నాగాలాండ్‌, మి జోరమ్‌, మైన్మార్‌ సరిహద్దులుగా ఉన్న ఈ ఈశాన్య భారత్‌లోని చిన్నరాష్ట్రంలో మీటీలు,కుకీలు,నాగాలు బల మైన సామాజికవర్గాలుగా ఉన్నాయి. 60శాతంవరకూ ఉన్న మీటీలు తదితర వర్గాలు మణిపూర్‌లోయల్లోని నాలుగుజిల్లాల్లో విస్తరించారు మొత్తం తొమ్మిదిజిల్లాల్లో ఐదు ...

Read More »

రాజీనామా వెనుక ఆంతర్యం?

దేశంలో రాజకీయకారణాలతోకొందరు తమతమ పదవులనుంచి వైదొలుగుతుంటే మరికొందరు పాలకుల మైండ్‌గేమ్‌తో అసహనంపెరిగి తమ పాతవృత్తులనే ఎంచుకుని తప్పుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ దిశగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ రాజీనామా మరోసారి ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. గతంలో ఆర్‌బిఐగవర్నర్‌గా రఘురామ్‌రాజన్‌ పదవినుంచి దిగిపోయినవైనం ఎంత సంచలనానికి దారితీసిందో ప్రస్తుతం నజీబ్‌ జంగ్‌ రాజీనామా కూడా అంతేప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. దేశరాజధాని ఢిల్లీ కేంద్రపాలితప్రాంత రాష్ట్రంలో పాలకపార్టీకి కంటిమీ ద కునుకులేకుండాచేసిన వ్యక్తిగా నజీబ్‌జంగ్‌ పేరుతెచ్చు కున్నవ్యక్తి. ఢిల్లీప్రభుత్వ లెఫ్టినెంట్‌గవర్నర్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీతో ...

Read More »

‘లఘువుగా మారుతున్న ‘గురువు

ప్రొఫెసర్‌ వేధింపుల వల్ల వైద్యవిద్యార్థిని బలి, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారి విద్యార్థిని ప్రాణాలు బలిగొన్నాడు, గైడ్‌ వేధిం పుల కారణంగా దళిత విద్యార్థి ఆత్మహత్యయత్నం, అధ్యాపకుడు దూషించాడని అవమానభారంతో విద్యార్థిని బలవన్మరణం ఇలా ఒకే రోజున ఒకే దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు ఇవి. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు, భారతీయ విద్యావిధానంలో సంస్కృతిలో ఒకప్పుడు గొప్పస్థానంలో నిలబడిన గురువ్ఞ ఉనికే నేడు ప్రశ్నార్థ కంగా మారుతోంది.ఒకప్పుడు ఎంతటి మహారాజు కొడుకైనా సామా న్య విద్యార్థిలాగా గురుకులాల్లో ఈత చాపలపై కూర్చుని విద్య ...

Read More »

రాహుల్‌ ఆరోపణలు

దేశ ప్రజలకు ఉపకరించే పార్లమెంటు సమావేశాలను ఎందుకూ కొరగాకుండా చేసిన అధికార, విపక్షాలు ఇప్పుడు సభ వెలుపల అమోఘంగా యుద్ధం చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ యుద్ధక్షేత్రంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్య విమర్శలు పతాకస్థాయికి చేరాయి. ఈ రాష్ట్రంలో తొలి రెండుస్థానాల్లో ఉన్న ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ కాంగ్రెస్‌లు ఎక్కువ వీరంగం వేయడాన్ని బట్టి ఈ యుద్ధం యూపీ ఎన్నికలకే పరిమితమైనది కాదని అనుకోవాలి. రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు ప్రభావమేమిటో నిగ్గుతేలాక, నరేంద్రమోదీ వేయబోయే ప్రతీ రాజకీయ ...

Read More »

బ్రిటన్‌ ఆంక్షలతో భారత్‌ ఐటికి చేటు!

UK visa భారతీయ వలసపౌరులపై బ్రిటిష్‌ప్రభుత్వం వీసా ఆంక్షలు కఠినతరం చేయడం వల్ల భార తీయ ఐటి కంపెనీలు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంక్లిష్టపరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భావనలో ప్రపంచ దేశాలున్న తరు ణంలో డేవిడ్‌కేమరూన్‌ వారసురాలిగా వచ్చిన థెరిసామే ప్రధానిగా వలసవీసా నిబంధనలనుప్రత్యేకించి భారతీ యుల కోసమే మార్పులుచేర్పులు చేయడం భారత్‌ ఐటి రంగానికి ఏమాత్రం నచ్చలేదు. పైగా దీనివల్ల బ్రిటన్‌లో సేవలందిస్తున్న భారత్‌ ఐటి కంపెనీలపై వత్తిడి మరింత పెరుగుతుంది. రెండోశ్రేణి ...

Read More »

అలెప్పో విజయం

‘అలెప్పోను మరిచిపోకు’ అని అరుస్తూ టర్కీ రాజధాని అంకారాలో రష్యా రాయబారిని ఒక పోలీసు అధికారి కాల్చిచంపిన ఘటన సిరియా యుద్ధంలో రష్యా వ్యవహార శైలిని ముందుకు తెస్తున్నది. రష్యా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఒక ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆరంభించి, టర్కీతో స్నేహాన్ని రాయబారి తన ప్రసంగంలో ప్రశంసిస్తుండగా, వెనకనే నిల్చుని వున్న టర్కీ పోలీసు అధికారి ఆయనపై కాల్పులు జరిపాడు. చేతిలో తుపాకీ పట్టుకొని ఊగిపోతూ, నేలమీద పడివున్న రాయబారి మృతదేహాన్ని ఆడపాదడపా కాలుస్తూ, రష్యాకు వ్యతిరేకంగా అతడు పలువ్యాఖ్యలు చేశాడు. ...

Read More »

అణువిద్యుత్తే ఇక శరణ్యం

ప్రపంచంలో 16శాతం జనాభా మనదేశంలోనే ఉన్న ప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన బొగ్గు సహజ వాయువ్ఞ, చమురు తదితర శిలాజ ఇంధన వనరులు మనదేశంలో తక్కువగా ఉన్నాయి. 2006 నాటి అంచనా ప్రకారం ప్రపంచంలోని బొగ్గు నిల్వల్లో మనదేశం 1లక్ష 54వేల మిలియన్‌ టన్నులు బొగ్గు నిల్వలు కలిగి ఉంది. అంటే కేవలం ప్రపంచంలో ఏడు శాతం మాత్రమే నిల్వలు కలిగి ఉన్నాం. వీటిలో కేవలం 80వేల మిలియన్‌ టన్నులు మాత్రమే వెలికి తీసే అవకాశం ఉంది. ఏటా 1200 మిలియన్‌ టన్నుల చొప్పున ...

Read More »