మరో నెలరోజుల్లో సాకారం కానున్న తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ దిశా సూచికలు- రేపటి ఎన్నికలు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ఇప్పుడిక ప్రగతి పథంలో పరుగులెత్తించేదెలాగన్నది కీలకాంశం. తెలంగాణ శ్రమజీవుల గడ్డ. అడవులు, నదీనదాలు, బొగ్గు, సున్నపురాయి వంటి ఖనిజాలు సహా అపార సహజవనరుల అడ్డా. ఒకవైపు రతనాలు పండిస్తూనే- వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళ్లే అవకాశాలు అనంతం. దూకుడుతో ఈ కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే దిగ్దర్శకులే నేతలుగా రావాలిప్పుడు… కావాలిప్పుడు! దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమైంది. నవ తెలంగాణలో ...
Read More »నోటావల్ల ప్రయోజనం ఏమిటి? – షేక్ కరిముల్లా
గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని, వారికి ప్రశ్నించే హక్కు లేనట్లేనని’’ శెలవిచ్చారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ఎంతో వౌలికమైంది. అది ఒకరు ఇచ్చేది కాదు. ఇచ్చింది కాదు. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కు. కలెక్టర్ అలా మాట్లాడిన రోజే దినపత్రికలలో ‘‘ఒక టీడీపి ఎమ్మెల్యే 36 గంటలలో మూడు పార్టీలు మారి చివరాఖరుకు టీఆర్ఎస్లో తేలారు’’ అనే వార్త. ఉదాహరణలతో ప్రచురితమైంది. ఒక్క ఆ నాయకుడే ...
Read More »అమ్మకానికి ప్రజాస్వామ్యం – టంకశాల అశోక్
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఏప్రిల్ 19న హైదరాబాద్ వచ్చినపుడు ఎన్నికల కోసం డబ్బు ఖర్చు దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. ఇంతవరకు రవాణాలో తనిఖీ అధికారులకు పట్టుబడిన డబ్బంటూ వారు చెప్పిన లెక్కలు ఇందుకొక సూచన మాత్రమే. ఆ రోజు వరకు దేశమంతటా కలిసి దొరికిన డబ్బు 335 కోట్ల రూపాయలు కాగా అందులో 105 కోట్లు కేవలం ఇక్కడే పట్టుబడ్డాయి.ఈ సమాచారానికి అదనంగా కొన్ని ప్రశ్నలు వేసుకొని చూడండి. ఇది పట్టుబడిన నగదు మొత్తం అయినపుడు పట్టుబడనిది ఎంత? పోలింగుకు ...
Read More »నిజామాబాద్ జిల్లా పాలనా ప్రాదేశిక వ్యవస్థీకరణ – అభివృద్ధి పరంపర
నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా 1952 రాష్ట్ర పునర్వవ్యస్థీకరణలో పలు మార్పులకు లోనైంది. అప్పటి వరకు నాందేడ్, నిర్మల్, దెగ్లూర్, బైంసా ప్రాంతాలను నిజామాబాద్ నుంచి తొలగించి మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాల్లో విలీనం చేశారు. అప్పట్లో 7 తాలూకాలుగా నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, మద్నూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి కేంద్రాలతో ఏర్పాటు అయింది. 1979లో తాలూకాల పునర్వవ్యస్థీకరణలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు మరో రెండు తాలూకాలుగా దోమకొండ, భీంగల్ ఏర్పాటయ్యాయి. 1956లో పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పాటై జిల్లాలో నిజామాబాద్, ...
Read More »