Breaking News

Features

కైరానా కిటుకు

అలహాబాద్‌లో రెండురోజుల పాటు జరిగిన భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితం 2019 లోక్‌సభ ఎన్నికల తీర్పును నిర్ణయిస్తుంది కనుక ఆ రాష్ట్రాన్ని ఆరునూరైనా దక్కించుకోవాల్సిందేనని. ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సదస్సులో చర్చలు జరిగినా అవన్నీ వేరు, యూపీ లెక్క వేరు. ఈ అతిపెద్ద రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి అభివృద్ధి నినాదాలకంటే, ‘ముజఫర్‌ నగర్‌’ వాదనలే తమకు అధికంగా ఉపకరిస్తాయని ఆ ...

Read More »

శిశుశోకం!

విశ్వనగరాలు, స్మార్ట్‌సిటీలు, బుల్లెట్‌రైళ్ళ బంగారులోకంలో విహరిస్తున్న మనకు దారిద్ర్యాన్ని, వైఫల్యాలను తెలియచెప్పే లెక్కలు సహజంగానే ఆసక్తి కలిగించవు. జీడీపీ మాయలో అపరిమితవేగంగా ఎదిగిపోతున్న ఆర్థికవ్యవస్థంటూ ఎగిరి గంతులేస్తున్నప్పుడు అన్నార్తుల ఆకలిబాధను గుర్తుచేస్తున్న వాస్త వాలు రుచించవు. అభివృద్ధిలో అగ్రదేశాలను అందుకుంటున్నామని ఆనందిస్తున్న తరుణంలో, యునిసెఫ్‌ తన వార్షిక నివేదికలో ఏడాది కాలంలో 12 లక్షలమంది భావిపౌరులను నిర్లక్ష్యంతో చంపేసు కున్నామన్న చేదునిజాన్ని విప్పిచెప్పి కళ్ళుతెరిపించింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) మంగళవారం విడుదల చేసిన నివేదిక భారతదేశం నిజస్వరూపాన్ని చూపించింది. పాకిస్థాన, ...

Read More »

మరో ఉగ్రదాడి

ఆసియా-యూరప్‌ ఖండాల వారధి టర్కీలో మంగళవారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత పాశవికమైనది. రాజధాని ఇస్తాంబుల్‌లోని అటాటుర్క్‌ విమానాశ్రయంలో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతోనూ, తమను పేల్చివేసుకోవడం ద్వారా యాభైమంది ప్రయణీకుల ప్రాణాలు తీసి 250మందిని క్షతగాత్రులను చేశారు. యూరప్‌లోని మూడవ అతిపెద్ద విమానాశ్రయం, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్‌లో ఈ విధ్వంసానికి పాల్పడటం ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ తన ఉనికిని యావత్ ప్రపంచానికి మరొకమారు చాటిచెప్పి భయోత్పాతంలో ముంచెత్తే ప్రయత్నం చేసింది. ఇది దొంగచాటుగా జరిపిన దాడి కాదు. విమానాశ్రయంలోకి ...

Read More »

లీటర్ గోమూత్రంలో తులం బంగారం..

గోమూత్రం అంటే భారతీయులకు ఎనలేని గౌరవం. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో గోమూత్రం ఉండాల్సిందే. ఇప్పుడు మరోసారి గోమూత్రం ప్రత్యేకత బయటపడింది. గోమూత్రంలో ఔషధ గుణాలే కాదు బంగారం ఉందని చెబుతున్నారు గుజరాత్ పరిశోధకులు. జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటి పరిశోధకుడు డాక్టర్ బీఏ గోలకియా ఈ ప్రయోగం చేశారు. సుమారు 400 గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రాలను పరిశీలించారు. లీటర్ మూత్రాన్ని సేకరించి పరిశీలించగా మూడు నుంచి 10 గ్రాముల బంగారం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ బంగారం అయాన్ల రూపంలో ఉన్నట్లు చెబుతున్నారు ...

Read More »

శ్రీనగర్‌ ఘాతుకం

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతాసిబ్బంది మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. ఈ అతిపెద్ద దాడి ఏ అర్ధరాత్రో జరిగింది కాదు. శిక్షణకు హాజరైన సిబ్బందిని వెనక్కు తెస్తున్నప్పుడు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు తెగబడి జరిపినది ఇది. నలభైమంది సిబ్బంది ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన నియమాలను బేఖాతరుచేసిన కారణంగానే మరొక పాతికమంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో ‘పాకిస్థాన ముర్దాబాద్‌’ అంటూ బీజేపీ ప్రతినిధులు నినాదాలు చేయడం, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పొరుగుదేశం కంకణం కట్టుకుందంటూ హోంమంత్రి ...

Read More »

పాటేడ్తాంది

కనిపెంచి నడకలు నేర్పి హొయలు కూర్చి బతుకుబాట మీద తన పాదాలకు పరుగు నేర్పినోడు లేడని పాటేడ్తాంది కూలి చాలని బతుకులకు బతుకుపాఠాన్ని నేర్పి పాలేరుల బతుకుల పల్లెరుల్ని ఎరుకపర్చి సబ్బండ వర్ణాల సోపతిని నేర్పి అడవి నిశ్శబ్దంలో… శబ్ద విస్ఫోటనంగా తనను మలచినవాడు లేడని పాటేడ్తాంది కుమ్మరి సారెకు పదాలను అల్లి గిరగిరా తిప్పినోడు సాలెల మగ్గానికి కండె ఊసల తాలమైనోడు మాదిగ డప్పుకు ఢమరుకం కంటే ధీటైన నాదాన్ని ఇచ్చినోడు సాకిరేవు బండకు సల్లకుండకు సలాములతో గౌరవ పరిచినోడు ఎలమంద గొంతులోంచి ...

Read More »

విందులు సరే, రిజర్వేషన్లేవీ?

రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగ బద్దమైన వెసులుబాటు. ఇది సమాజంలోని అణగారిన వర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకునే ఒక ముఖ్యమైన ప్రక్రియ. రిజర్వేషన్ అంటే సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో, మిగతా వర్గాల సరసన సమాన అవకాశాలను కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధిలో భాగం కల్పించటం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి చెబుతూ, దీన్ని 2014 సార్వత్రక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ...

Read More »

మోదీ గారి ‘సంజయ్‌ గాంధీ’

నాతో సహా పలువురు వ్యాఖ్యాతలు నరేంద్రమోదీని ఇందిరాగాంధీతో పోల్చారు. మోదీ నిశ్చయంగా ఇందిర అనంతరం అత్యంత అధికారపూర్వక ప్రధానమంత్రి. పూర్తికాలం పదవిలో ఉన్న మరో ఇద్దరు ప్రధానమంత్రులు వాజపేయి, నరసింహారావు కంటే కూడా మోదీ అత్యంత సాధికార ప్రధాని అనడంలో సందేహం లేదు.                         ఇందిర మాదిరిగానే మోదీ కూడా ఒంటరి వ్యక్తి. బహుశా ఆయన ఏకైక ఆంతరంగికుడు, ఒక విధంగా తనతో సమానుడుగా పరిగణించే ఏకైక వ్యక్తి అమిత్ షా. మోదీ గుజరాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాకు మొత్తం పన్నెండు మంత్రిత్వ శాఖల బాధ్యతలు ...

Read More »

ఎన్‌ఎస్జీ పోరాటం!

తాష్కెంట్‌లో స్విచ్ వేస్తే సియోల్‌లో బల్బు వెలగాలి. అనుకున్నట్టు గానే, ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో భారత ప్రధాని కాలు మోపారు. ఆయన అక్కడకు వెళ్ళింది ‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీవో) సమావేశంలో పాల్గొనడానికి. పాకిస్థాన్‌‌‌తో పాటు భారతదేశానికి కూడా ఈ గ్రూపులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే పని ఇందులో ముందుకు కదులుతుంది. కానీ, ఇంతకంటే ప్రధానమైనది చైనా అధ్యక్షుడితో భేటీ. నూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్ఎస్జీ)లో భారత సభ్య త్వాన్ని వ్యతిరేకిస్తూ, వారం రోజులుగా గొంతుబాగా పెంచిన చైనాను బుజ్జగించే ప్రయత్నమిది. ఎన్ఎస్జీ సభ్యత్వానికి ...

Read More »

ప్రజల పండుగలు ప్రభుత్వ పండుగలుగా…

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రభుత్వ యంత్రాంగం ఆద్వర్యంలో నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలోని తహసీల్‌ కార్యాలయం ఆవరణలో ఇమామ్‌లకు, మౌజన్‌లకు గౌరవ వేతనం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 632 మందికి వెయ్యి ...

Read More »

పద్మ అవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జీవిత కాల సాఫల్యం కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డులకు ఈనెల 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. 2017 జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం అందజేసే పద్మ విభూషణ్‌, పద్మ ...

Read More »

బ్రెగ్జిట్‌ ఉత్కంఠ!

యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగేదీ లేనిదీ బ్రిటిష్‌ ఓటరు గురువారం తేల్చిచెప్పబోతున్నాడు. ఈ నిర్ణయం బ్రిటన్ భవిష్యత్తుతో పాటు ఈయూ అస్తిత్వాన్ని కూడా ప్రభావితం చేయబోతున్నది. నాలుగుదశాబ్దాల క్రితం యూరోపియన్ ఎకనామిక్‌ కమ్యూనిటీ(ఈఈసీ)లో చేరే సందర్భంలో వ్యతిరేకుల కన్నా, అనుకూలుర సంఖ్యే అధికంగా ఉండేది కనుక ఫలితాల విషయంలో ఎవరికీ భయాలు లేకపోయాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నం. వ్యతిరేకుల శాతమే అధికంగా ఉన్నదని భారీ సర్వే ఒకటి తేల్చిచెప్పింది. ఈయూతో కలిసున్న కారణంగా బ్రిటన్ పూర్తి పరాధీనమైపోయి, ఏ విషయంలోనూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నదనీ, ...

Read More »

బర్నింగ్‌ ఇష్యూ’ బారిన తెలుగు కథ

మనవి కాని సామాజిక ఐడెంటిటీలను సహానుభూతితో దగ్గరగా పరిశీలించి కొంతమేరకు అర్థం చేసుకోగలం. కానీ ఎంత లోతుకెళ్లినా జన్మతః ఆ ఐడెంటిటీని మోస్తున్నవాడిలాగా దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోగలమా? పీడితపక్షం వహించటం ఎప్పుడూ ఆదర్శమే. కానీ ‘పాపం పీడితులూ’ అన్న మన ఉదాత్తమైన సానుభూతే వాళ్లకు మంచి చేయదుగా. ‘‘సింహాల తరఫున చరిత్రకారులు వచ్చేవరకూ వేట చరిత్ర ఎప్పుడూ వేటగాడినే కీర్తిస్తుంది’’ అన్న చినువా అచెబె మాటొకటుంది. అయితే మన తెలుగు సాహిత్యంలో అటు సింహాలూ ఇటు వేటగాళ్ల చరిత్రల్ని కూడా హైనాలే రాస్తున్నాయి. ...

Read More »

ఇదేమి న్యాయం?

గుల్బర్గ్‌ సొసైటీ నరమేథం కేసులో నిందితులకు అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు ఖరారు చేసిన శిక్షలు బాధితులకు అన్యాయంగా అనిపించడం సమంజసం. పద్నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఊచకోతలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది దారుణ మారణకాండకు బలయ్యారు. పదిహేను రోజుల క్రితం న్యాయస్థానం తీర్పు ప్రకటిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిందితులుగా పేర్కొన్న 66 మందిలో 24 మందిని మాత్రమే దోషులుగా నిర్థారించి, బీజేపీ నాయకుడు బిపిన పటేల్‌ సహా 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టేసినప్పుడే బాధితులు ...

Read More »

బ్యాంకుల విలీనం

భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది పక్కనబెట్టి, దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో కొత్త అధ్యాయానికి ఎన్‌డీఏ ప్రభుత్వం తెరతీసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులనూ, కొసరుగా భారతీయ మహిళ బ్యాంకును విలీనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ నిర్ణయం వల్ల ఎస్‌బీఐ 37లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో భారీ బ్యాంకుగా ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అనుబంధ బ్యాంకులను మాతృసంస్థ ఎస్‌బీఐతో విలీనం చేయాలన్న ప్రతిపాదన పాతదే. యూపీఏ హయాంలోనైనా, ఎన్‌డీఏ హయాంలోనైనా ఈ ...

Read More »

తిండి కొద్ది తిప్పలు!

తినకముందు ఆకలికుట్టు.. తిన్నాక దండికుట్టు అంటే ఇదేనేమో?! మనోళ్లకు తిండి రుచిగా ఉండాలి. అగ్గువకు దొరకాలి. ఈజీగా అందాలి. కానీ పోషకాలు.. ఆరోగ్యం విషయానికొచ్చేసరికి అంత శ్రద్ధ చూపరు. ఆధునిక పోకడలను ఆసరా చేసుకొని పాష్ ముసుగులో పాచి పదార్థాలకు రంగులేసినా తినేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం. పిల్లల్ని పొద్దున్నే స్కూల్‌కి పంపించాలి. ఒకవైపు స్కూల్ టైమ్ అవుతుంది. మరోవైపు బోలెడన్నీ పనులు నెత్తిమీద. ఏం చేయాలి? చకాచకా షాప్‌కి వెళ్లి చాయ్‌లో వేసుకోవడానికి నాలుగు బ్రెడ్ ముక్కలు.. లంచ్ బాక్స్‌లో పెట్టేందుకు రెండు ...

Read More »

ఓర్లాండో ఘాతుకం

అమెరికాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత అమానుషమైనది. ఈ తరహా కాల్పులకు మారుపేరైన దేశంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం ఆ దేశాన్ని మరోమారు కుదిపేసింది. స్వలింగ సంపర్కుల ప్రత్యేక నైట్‌క్లబ్‌ ‘పల్స్‌’లో ఈ దారుణం చోటుచేసుకోవడం, కాల్పులకు పాల్పడిన వ్యక్తి అఫ్ఘాన్ మూలాలున్న ఒమర్‌ సిద్దిఖీ మతీన కావడం ఈ ఘటనకు మరిన్ని కోణాలను చేర్చింది. ఘటన జరగగానే ‘ఇది మా పనే’ అని ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌, మర్నాడు దానిని ‘అమెరికాలోని మా కాలిఫైట్‌ ...

Read More »

మోదీ జైత్రయాత్ర

అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఆ దేశపు చట్టసభ సభ్యులనే కాక, దాన్ని మాధ్యమాల్లో వీక్షించిన వారిని కూడా మంత్రముగ్ధులను చేసింది. అబ్రహం లింకన సూక్తులతో ఆరంభించి భారత-అమెరికా సంబంధాలను, అంతర్జాతీయ పరిణామాలను లోతుగా చర్చిస్తూ, అనుబంధాలను స్పృశిస్తూ, అలవోకగా ఒక ప్రవాహంలాగా సాగిన ఈ ప్రసంగానికి కాంగ్రెస్‌సభ్యులు తొమ్మిదిసార్లు లేచినిలబడి కరతాళధ్వనులతో ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాల మధ్య స్నేహం, సహకారం ఏ స్థాయికి విస్తరించగలిగే అవకాశాలున్నాయో ఆయన ప్రసంగం విప్పిచెప్పింది. ఇరుదేశాల దీర్ఘకాలిక ...

Read More »

స్నేహ వారధి!

అమెరికాలో మూడురోజుల పర్యటన ఆరంభానికి ముందు భారతప్రధాని తన ఐదుదేశాల యాత్రలో ఇప్పటికే మూడింటిని పూర్తిచేశారు. ఈ పర్యటనలో ఒబామాతో భేటీ ఎంత ప్రధానమైనదో, ఆఖరు నిముషంలో వచ్చి చేరిన స్విట్జర్లాండ్‌, మెక్సికోలతో వ్యవహారం కూడా అంతే ప్రధానమైనది. స్విట్జర్లాండ్‌ వ్యాపారవేత్తలను భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించడం, నల్లధనం, పన్ను ఎగవేతలు ఇత్యాది అంశాలపై సమష్టి పోరాటానికి సంకల్పించడం వంటివి అటుంచితే, ఏ లక్ష్యంతో ప్రధాని ఈ దేశంలో కాలుమోపారో అది ఇప్పటికే నెరవేరింది. ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’(ఎనఎ్‌సజీ)లో భారత సభ్యత్వానికి తాను మద్దతు ...

Read More »

యజమాని కోసం పులితో పోరాడిన కుక్క

విశ్వాసానికి మారుపేరు కుక్కలు. ఈ మాట మరోసారి రుజువైంది. యూపీలోని బర్బత్ పూర్ కు చెందిన గురుదేవ్ సింగ్ రాత్రి సమయంలో తన ఇంటి బయట నిద్రపోతున్నాడు. ఆయన పక్కనే పెంపుడు కుక్క జాకీ పడుకుంది. అప్పుడే సమీపంలో ఉన్న దూడ్వా జాతీయ పార్కు నుంచి ఓ పులి అటువైపుగా వచ్చింది. గురుదేవ్ సింగ్ ను సమీపిస్తుండగా… అతన్ని అలర్ట్ చేసింది జాకీ. నిద్ర నుంచి మేల్కొన్న గురుదేవ్ పూర్తిగా అలర్ట్ అయ్యే వరకు జాకీనే పులి అడ్డుకుంది. దానితో పోరాడుతూ అలా అడవుల్లోకి ...

Read More »