గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటి దినోత్సవం సందర్బంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మొక్కలకు నీళ్లు పట్టారు. గాంధారి మండలం పొతంగల్ కలాన్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నాటిన మొక్కలకు నీళ్లు పట్టారు. అక్కడ రెండు మొక్కలను నాటారు. ప్రకృతి వనంలోని మొక్కలను తిలకించారు. మొక్కలు ఏపుగా పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిదంగా గ్రామానికి సమీపంలో కోతులకు ఆహార కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మొక్కలను ...
Read More »తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంఎల్‌సి జన్మదిన వేడుకలు
గాంధారి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రామారెడ్డి మండల కేంద్రంలోని కాలభైరవ స్వామి ఆలయంలో శనివారం నిర్వహించారు. ఆలయంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు ఆధ్వర్యంలో రామారెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా బాద్యులు వంశీ, వెంకటరెడ్డి, చక్రధర్, రాజు, పద్మజా, జీవన్ గౌడ్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
Read More »తాడ్వాయి జట్టుకు కెసిఆర్ కప్
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కెసిఆర్ కప్ వాలీబాల్ క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరిగాయి. సెమీఫైనల్స్‌లో తాడ్వాయి, యన్యన్ స్పోర్ట్స్ కామారెడ్డి జట్లు తలపడ్డాయి.ఫైనల్స్‌లో రెండు జట్లు మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. మొదటి స్థానంలో విజేతగా నిలిచిన తాడ్వాయి జట్టుకు కెసిఆర్ కప్‌తో పాటు 20 వేల నగదు బహుమతిని, కప్ ను, మెడల్స్‌ను, ద్వితీయ స్థానంలో ...
Read More »నేరల్ తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు
గాంధారి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం నేరల్ తండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. తండా వాసుల సహకారంతో గ్రామ రక్షణ కొరకు ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తండాలోని ప్రధాన కూడళ్లలో కెమెరాలు బిగించినట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో వాటిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కామెది బాయి చందా నాయక్, ఉప సర్పంచ్ నర్సింగ్, వైస్ ఎంపీపీ భజన్ లాల్ ...
Read More »బాధితునికి ఆర్థిక సహాయం అందజేత
గాంధారి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల మొక్కజొన్న కేంద్రం వద్ద ప్రమాదానికి గురైన హమాలీ కుటుంబానికి పలువురు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన కల మల్లేష్ స్థానిక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద హమాలీ పనిచేస్తుండగా ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సొసైటీ చైర్మన్ ఐడీసీఎంస్ డైరెక్టర్ సాయికుమార్, స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, వీడీసీ చైర్మన్ మల్లేష్ ...
Read More »అటవీఅధికారుల నుండి భూములకు రక్షణ కల్పించాలి
గాంధారి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిరుపేదలైన తమకు అన్ని హక్కులు కల్పించి ఇచ్చిన వ్యవసాయ భూములకు అటవీ అధికారుల నుండి కాపాడి రక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. గాంధారి మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామశివారులో గత 40 సంవత్సరాలనుండి సర్వే నెంబర్ 118 లో నిరుపేద రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించి నూతన పట్టా పాసుపుస్తకాలు కూడా జారీచేసింది. ఇట్టి భూమికి పట్టతో సహా అన్ని హక్కులు కల్పించింది. ఇట్టి భూమిని ...
Read More »కరోనా డ్రై రన్లో నిర్లక్ష్యం ..మెడికల్ ఆఫీసర్ పై బదిలీ వేటు
గాంధారి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా డ్రై రన్లో మెడికల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హెచ్చరించారు. జిల్లాలోని గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై రన్ కార్యక్రమంలో భాగంగా నిబంధనలు సరిగ్గా పాటించని మెడికల్ ఆఫీసర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. నిబంధనలు పాటించని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేశారు. నిర్లక్ష్యంగా ...
Read More »మొక్కలు సంరక్షించాలి
గాంధారి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి జడ్పీ సీఈఓ చందర్ నాయక్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో ప్రభుత్వంచే నిర్వహిస్తున్న పలు నర్సరీలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను దగ్గరినుండి పరిశీలించారు. నర్సరీలతో పాటు ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతకాలన్నారు. ప్రత్యేకంగా నర్సరీలలో పెరుగుతున్న మొక్కలపై శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అయన వెంట ఎంపీడీఓ ...
Read More »రైతులకు మద్దతుగా వామపక్షాల ధర్నా
గాందారి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు మద్దతుగా దేశవ్యాప్త వామపక్షాల పిలుపులో భాగంగా సోమవారం వామపక్ష నాయకులు గాంధారి మండలంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వామపక్ష నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీకి రైతులు ...
Read More »చికిత్స పొందుతూ ప్రియుడు మృతి
గాంధారి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటనలో ఆదివారం ప్రియురాలు మతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ప్రియుడు మతి చెందాడు. గాంధారి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన గాండ్ల సాయి కుమార్, వడ్లూర్కు చెందిన రమ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియురాలు రమ్య ఆదివారం మతి చెందగా, అదే ...
Read More »గాంధారిలో ఒకరికి పాజిటివ్
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. 18 మందికి పరీక్షలు నిర్వహించగా గాంధారికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగతా 17 మందికి నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. కాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ తరలించామన్నారు. కరోనా విజృంభనతో కామారెడ్డి వ్యాపారులు బుధవారం నుండి పట్టణంలో వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ...
Read More »స్వచ్ఛ గాంధారి
గాంధారి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం గాంధారి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ గాంధారిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త బుట్టలు ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత కొరకు చెత్తబుట్టలు సద్వినియోగం చేసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో గాంధారి మండల నాయకులు పాల్గొన్నారు.
Read More »భౌతికదూరం పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం
గాంధారి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనాను నియంత్రించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పిలుపునిచ్చారు. భౌతికదూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో మొత్తం 31 మంది లబ్ధిదారులకు ఈ విడతలో చెక్కులను పంపిణి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మొత్తం దేశం కరోనా రోగంతో విలవిలలాడుతోందని ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్ ...
Read More »రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గాంధారి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గాంధారి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం మండలంలోని గుడిమెట్ గ్రామ శివారులో ఓమ్ని వాహనం కామారెడ్డి నుండి గాంధారి వైపు వస్తుండగా, ఎదురుగా గాంధారి నుండి కామారెడ్డి వైపు పల్సార్ బైక్ టిఎస్ 17 సి 5846 ని ఢీకొనడంతో బైక్ రోడ్డుపై పల్టీలు కొట్టుకుంది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న నారాయణ ...
Read More »శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
గాంధారి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. స్థానిక జూనియర్ కాలేజీ మైదాన ఆవరణలో డీసీఎంఎస్ ద్వారా శనగలను కొనుగోలు చేస్తున్నట్లు డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్, స్థానిక సొసైటీ చైర్మన్ సాయికుమార్ తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా మార్కెటింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వం శనగకు మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4875 నిర్ణయించిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి ...
Read More »రైతుకు సేవచేసే భాగ్యం కలిగింది
గాంధారి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుకు సేవచేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ముదెల్లి సహకార సంఘం నూతన చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం అన్నారు. ఇటీవల జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గం బుధవారం రైతుల సమక్షంలో కొలువుదీరింది. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ సాయిరాం, వైస్ చైర్మన్ బన్సీలాల్ భాద్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ శ్రీనివాస్, కార్యదర్శి కృష్ణారెడ్డి అయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం చైర్మన్ సాయిరాం మాట్లాడుతూ కేవలం సహకార సంఘం ...
Read More »సమన్వయంతో పనిచేస్తేనే అభివద్ధి సాధ్యం
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివద్ధి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే సాధ్యమౌతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. గురువారం గాంధారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధ బలరాం అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సురేందర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామాల అభివద్ధిపై సూచనలు చేశారు. సమన్వయంతో పని చేసి గ్రామాల అభివద్ధికి బాటలు వేయాలన్నారు. గ్రామాలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ...
Read More »చిల్లర ధాన్యాన్ని కోనుగోలు చేయవద్దు
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ఆవరణలో వేరే చోట చిల్లర ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని కామారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం గాంధారి మండలకేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో ఇతర వ్యాపారస్తులు చిల్లర ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు అన్యాయానికి గురవుతారని అన్నారు. వ్యాపారులు ...
Read More »రోడ్డు ప్రమాదంలో ఏఈఓ మతి
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో లింగంపేట్ ఏఈఓ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలంలో ఏఈఓగా పనిచేస్తున్న ఖలీల్ అహ్మద్ గురువారం సాయంత్రం గాంధారి మండలం చందా నాయక్ తండా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన జేసీబీ సహాయంతో ఒక వ్యక్తి చెట్టును కూల్చివేయడానికి ప్రయత్నించడం, చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడడంతో దానిని తప్పుకోబోయి ...
Read More »అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ
గాంధారి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో సోమవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయంలో స్థానిక జడ్పీటీసీ శంకర్ నాయక్, సర్పంచ్ సంజీవ్, ఎంపీటీసీలు శ్రీనివాస్, తూర్పు రాజులు, బలరాజ్ తహశీల్దార్ లత, టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యం పటేల్ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. పోతాంగల్ కలాన్, వెంకటాపుర్, సర్వపూర్, గౌరారం, తదితర గ్రామాల్లో ఎంపీపీ అనిత బలరాం నాయక్, తెరాస నాయకులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ...
Read More »