Breaking News

Gandhari

కామారెడ్డికి తరలిన బిజెపి శ్రేణులు

  గాంధారి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బిజెపి జిల్లా కార్యకర్తల సమావేశానికి గాంధారి బిజెపి నాయకులు తరలివెళ్లారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించే జిల్లాస్తాయి కార్యకర్తల సమావేశంలో మండలానికి చెందిన బిజెపి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద నాయకులు నినాదాలు చేస్తు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్ళారు. బిజెపి సభకు వెళ్లిన వారిలో జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పోతంగల్‌ …

Read More »

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

  గాంధారి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు సకాలంలో రేషన్‌ సరుకులను అందజేస్తున్న డీలర్ల సమస్యలు పరిష్కరించాలని గాంధారి మండల రేషన్‌ డీలర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట టెంట్‌వేసి ధర్నా చేశారు. కమీషన్‌లు వద్దు వేతనం ముద్దు అనే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ డీలర్లు ఆందోళనలు చేపడుతున్నారు. మండల కేంద్రంలో తహసీల్దార్‌ ఎస్‌.వి. లక్ష్మణ్‌కు జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం కోశాధికారి జివాడి శంకర్‌రావు ఆధ్వర్యంలో వినతి …

Read More »

తెరాస బహిరంగ సభకుతరలిరావాలి

  గాంధారి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించతలపెట్టిన బహిరంగ సబకు కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలిరావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో బహిరంగంగా సభ నిధులను సమకూర్చడానికి కూలీ పనిచేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కల్లు డిపోలకు వెళ్ళి కల్లు పెట్టెలను అమ్మారు. అదేవిధంగా పెట్రోల్‌ పంపులో ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ పోసి కూలీ పనిచేశారు. దీంతోపాటు ప్రయివేటు మెడికల్‌ హాల్‌లో కాటన్‌లను అమ్మారు. ఎమ్మెల్యే …

Read More »

సారారహిత జిల్లాగా మారుస్తాం

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వంద శాతం నాటుసారా రహిత జిల్లాగా కామారెడ్డిని తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా ఇఎస్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మండలంలోని దుర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాల్లో పర్యటించి నాటుసారా తయారుచేయవద్దని తాండా వాసులకు అవగాహన కల్పించారు. తాండా వాసులతో నాటుసారా తయారు చేయకుండా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ …

Read More »

స్థానిక సమస్యలు పరిష్కరించాలి

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .మండలంలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని సిపిఐ (ఎం) నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్తానిక గిర్దావర్‌ శ్రీనివాస్‌ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మట్లాడుతూ మండలంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాండాల్లో మంచినీళ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నర్సాపూర్‌ లాంటి గ్రామాలకు రోడ్లు లేవని అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. పోడుభూమి సాగుదార్లపై ఫారెస్టు అధికారులు వేదింపులు ఆగడం లేదన్నారు. పంటలు పండినా ఫలితం …

Read More »

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .గాంధారి మండలంలో గురువారం నాటికి అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. మండల కేంద్రంలో ఫైరింజన్‌తో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. వారోత్సవాల చివరిరోజు స్థానిక జడ్పిటిసి తానాజీరావు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితిలో అగ్ని మాపక సిబ్బంది …

Read More »

చలివేంద్రం ప్రారంభం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామంలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రహ్లాద్‌, ఎంపిటిసి లక్‌పతి, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

రైతు బాంధవుడు కెసిఆర్‌

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రైతు బాంధవుడిగా కొలుస్తున్నారు. కెసిఆర్‌కు రుణపడి వుంటామని గ్రామ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు. ఆదివారం గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో రైతులు, నాయకులు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు 100 శాతం రుణమాపీ చేయడమే గాకుండా, రైతులు వ్యవసాయంలో పడే బాధలను చూసి ఉచితంగా ఎరువులను అందిస్తామని ప్రకటించారు. ఎకరానికి 4 వేల రూపాయలు ఎరువులు ఉచితంగా అందజేస్తున్న కెసిఆర్‌కు రైతులు నీరాజనాలు …

Read More »

మొక్కజొన్న పంట దగ్దం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పోతంగల్‌ కలాన్‌లో ఆదివారం మొక్కజొన్న పంట దగ్దమైంది. గ్రామానికి చెందిన మామిడి సాయిలుకు చెందిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా పంట మొత్తం కాలి బూడిదైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో 50 వేల పంట నష్టం సంభవించినట్టు సమాచారం. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సాయిలు వేడుకుంటున్నాడు. Email this page

Read More »

రిజర్వేషన్ల అమలుపై గిరిజనుల హర్షం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై గాంధారి మండల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానిక నెహ్రూ చౌరస్తా వద్ద కెసిఆర్‌ భారీ చిత్రపటానికి 100 లీటర్లతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కెసిఆర్‌ వెంట రాష్ట్రంలోని గిరిజనులంతా వున్నారన్నారు. …

Read More »