Breaking News

Health

50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!

బోస్టన్‌ :మెనోపాజ్‌(మహిళల్లో రుతుక్రమం ఆగిపోవటం) దశ వస్తే పిల్లల్ని కనడం అసాధ్యం. అయితే, 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని కొందరు ఆశపడుతుంటారు. దానికోసం అమెరికాలోని మాస్సాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు ‘అండాశయ కణజాల ఘనీభవనం’ పద్ధతిని కనిపెట్టారు. ప్రయోగ దశలో ఉన్న ఈ పద్ధతి పిల్లల్ని కనాలనుకునే మహిళలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. Email this page

Read More »

పగటి నిద్ర పని పట్టండి

 సమయం మధ్యాహ్నం 2 గంటలు. అప్పటికే నాలుగు కప్పుల కాఫీ తాగారు. అయితే నిద్ర మాత్రం ఆగడం లేదు. ఆఫీసులో చేయాల్సిన పని చాలా ఉంది. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల పగలు నిద్ర వస్తుందని అనుకుంటారు. కానీ అదొక్కటే కారణం కాదు. చాలా అంశాలు పగటి నిద్రకు కారణమవుతాయి. అవేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలు మీకోసం… హెవీలంచ్‌ : మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్‌ లేకుండా చూసుకోవాలి. హెవీలంచ్‌ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్‌ …

Read More »

అరటి పండు..లంబాలైఫ్‌

చంటబ్బాయ్‌ సినిమాలో శ్రీలక్ష్మి ఓ వంటకానికి అరటిపండు లంబా లంబా అని పేరెందుకు పెట్టిందో తెలియదు. కానీ, అరటి పళ్లతో గుండెకు లంబా (దీర్ఘమైన) లైఫ్‌ ఉంటుందటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందని పలు పరిశోధనల్లో తేలింది. అరటి పండులోని పోషకాలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. బనానాలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. గుండె కొట్టుకోవడంలో పొటాషియం ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు బ్లడ్‌ప్రెషర్‌ను కూడా …

Read More »

మొలకల దోసెలతో ఎంతో బలం

 కండపుష్టికి ప్రొటీన్‌ ఆహారమే ప్రాణం. ప్రత్యేకించి వృక్ష సంబంధమైన ప్రొటీన్‌ కావలసి వస్తే, ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మొలకెత్తిన గింజల పైనే దృష్టిపెడుతున్నారు. పొద్దు పొద్దున్నే అల్పాహారంగా మొలకలనే తినడం కొందరు ఉచితమని కూడా భావిస్తున్నారు. కాకపోతే మొలకెత్తిన గింజలను పచ్చిగా తినడం వల్ల కొంత మందికి కొన్ని వాత రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపులో వికారం, వాంతి వస్తున్న భావన, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే వీలుంది. మొలకలు బలవర్థకమైన ఆహారమే అయినా, వాటిని పచ్చిగా తింటే …

Read More »

అజీర్తి వేధిస్తోందా?

అజీర్తి సమస్య వేధిస్తోందా? తేన్పులు, పొట్ట ఉబ్బరం ఎంతకీ తగ్గడం లేదా? అయితే ఇలా చేసి చూడండి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. పొట్ట నిండిన ఫీలింగ్‌ రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి పీచుపదార్థాలు బాగా ఉపయోగపడతాయు. తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలకు పూర్తిగా స్వస్తి చెప్పండి. భోజనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సమయానికి భోజనం చేయకపోతే శరీరం కొవ్వును నిలువ చేసుకుంటుంది. అంతేకాకుండా సమయం తప్పిన తరువాత తిన్నట్లయితే ఎక్కువ ఆహారం తినే …

Read More »

సింగిల్‌ డాక్టర్‌ ప్రభుత్వ ఆసుపత్రి

  నందిపేట, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోగల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సింగిల్‌ డాక్టర్‌తో నెట్టుకొస్తుంది. రాత్రి, పగలు విడతలవారిగా ఇద్దరు డాక్టర్లతో 24 గంటలు వైద్య సేవలందించాల్సి ఉంది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఒక్క డాక్టరే సేవలందిస్తున్నాడు. డాక్టరుతో పాటు సిబ్బంది కొరత ఉండడం, డాక్టర్‌ శాఖాపరమైన సమావేశాలకు వెళ్లినపుడు రోగులను పరీక్షించే నాథుడే కరువయ్యాడు. ఇక్కడ రోజుకు సుమారు 70 నుంచి 80 మంది ఔట్‌పేషెంట్‌ రోగులు పరీక్షలు చేయించుకొని మందులు …

Read More »

సమ్మర్… స్లిమ్మర్ టెక్నిక్స్

ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ:వేసవంటే ఎండలు, ఉక్కపోత సంగతేమోగానీ అధిక బరువును తగ్గించుకోడానికి ఇదే అదును అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు. విపరీతమైన వర్క్‌అవుట్లు, నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండానే లక్ష్యాన్ని చేరుకోవచ్చని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. కొన్ని నిబంధనలు తప్పనిసరని చెబుతున్నారు.  వేసవి మొదలైంది. ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే బరువు తగ్గాలని అనుకునేవాళ్లకు ఇదే మంచి కాలం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చని అంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అరుణ. వేసవిలో కొద్దిసేపు వ్యాయామం చేసినా …

Read More »

పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!

పెళ్ళి అనే బంధంతో ఒక్కటైన రెండు మనసులు.. తమ జీవితంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏడడుగులు నడిచి నాలుగు నెలలు గడవకముందే.. ఏమైనా విశేషమా…? అంటూ పెద్దలు ఆరా తీస్తుంటారు..? అయిదో నెల దాటిందంటే చాలు.. డాక్టర్లను ఓసారి కలవకపోయారా..? అని ఉచిత సలహాలిస్తుంటారు. భార్యాభర్తలే కాదు.. వారి కుటుంబాలు కూడా తమ ఇంట్లో బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాతముత్తాతల కాలం నాడయితే.. స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి శాతం 80 నుంచి 90 …

Read More »

భలే భలే.. కౌగిలి

మాటలకందని సంతోషాన్ని మనసైనవారిని చెప్పాలంటే కౌగిలింతకు మించిన మార్గంలేదు. మనసు ఆవేదనతో ఉన్ననాడు కావాల్సిన వారి ఒడిలో ఒదిగి బాధను చెప్పుకుంటాం. ఒక్కో ఆలింగనానికి ఒక్కో అర్థం ఉంది. కాటుకలంటించే కౌగిలింతలు, ముచ్చెమటలు పట్టించే కౌగిలులు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. ఫ్రెండ్లీగా.. స్నేహితుల మధ్య గిలిగింతలు పెట్టేంత కాకపోయినా.. సాధారణ కౌగిలింతలకు కొదవేం ఉండదు. వెనక నుంచి వచ్చి అమాంతంగా హత్తుకునే పద్ధతి ఉంది చూశారూ.. ఇది ఫ్రెండ్లీ హగ్‌ అన్నమాట. ఇలాంటి కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారు. నమ్మకంతో.. ఈ …

Read More »

ఆందోళన చెందడమూ ఆరోగ్యమే!

ఎవరైనా ఆందోళన చెందుతుంటే ఇంట్లో వాళ్లు అలా ఉండొద్దు…ఒంటికి మంచిది కాదు.. అని చెప్తుంటారు. మాటి మాటికీ ఆందోళన చెందడం వల్ల శరీరారోగ్యానికి మంచిది కాదని వైద్యులు కూడా చెప్తుంటారు. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. అదేమిటంటే ‘మరకా మంచిదే’ లాగ…. ఆందోళనపడటం కూడా మనుషులకు మంచిదేనని శాస్త్రవేత్తలు తమ స్టడీలో తేల్చారు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా… ఆందోళన పడడం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి సాంత్వన పొందుతారని, డిప్రెషన్‌ పాలబడరని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు …

Read More »