Breaking News

Health

యోగాతో చలికి చెక్

చలికాలం వచ్చింది. గతానికన్నా ఎక్కువగానే చలి పులి నగరవాసులను బెదిరిస్తోంది. సాయంత్రం అయితే చాలు.. ఇళ్ల వద్దనే నగరవాసులు ఉండిపోవాలన్నట్లుగా శీతగాలులు భయపెడుతున్నాయి. సహజంగానే శీతాకాలం రాగానే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. జలుబు దాంతో పాటు దగ్గు, జ్వరం, పెదాలు పగలడం, చర్మం పొడిగా మారడం, ఒళ్లు నొప్పులు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, ఈ సీజన్‌లో కామన్‌ అయినా స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులకు ఇది అనువైన సీజన్‌ కావడంతో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ద్రుఢంగా ...

Read More »

30 ఏళ్ళ‌లోపే పెళ్ళి కాలేదా… ఐతే స్మెర్మ్ బ్యాంక్‌‌లో సేవింగ్ సేఫ్

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ళు. కానీ, ఇపుడున్న‌కాంపిటీటివ్ యుగంలో మ‌గ‌వారికైనా, ఆడ‌వారికైనా పెళ్ల‌వ‌డానికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. జీవితంలో బాగా సెటిల్ అయిన త‌ర్వాతే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న‌ వారంద‌రికీ పెళ్లి లేట‌యిపోతోంది. కెరీర్‌కి, పెళ్లికి ముడిపెట్ట‌డం అంత మంచిది కాదంటున్నారు… పెద్ద‌లు. కెరీర్ కోసం చూసుంటే, యుక్త వ‌య‌సు దాటిపోయి, త‌ర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. తాజాగా సర్వేల ప్రకారం 30 దాటితేనే కాని యువతీయువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి ...

Read More »

అర్జంట్‌గా వెళ్లాల్సి వస్తోందా?

మూత్రవిసర్జనను కొంత సమయం వరకు అపుకోవచ్చు. కానీ కొందరిలో మాత్రం అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు యూరిన్‌ బ్లాడర్‌ ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ కారణమని అంటున్నారు వైద్యులు. వయసు పైబడిన వారు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడాన్ని చూస్తుంటాం. సాధారణంగా బ్లాడర్‌ ఫుల్‌ అయినా మూత్రాన్ని ఆపుకునే శక్తి ఉంటుంది. కానీ బ్లాడర్‌ ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ సమస్య ఉన్న వారు ఏ మాత్రం ఆపుకోలేకపోతారు. బ్లాడర్‌ కొద్దిగా నిండగానే అత్యవసరంగా వెళ్లాల్సి వస్తుంది. ...

Read More »

మగవాళ్లకు కూడా ఆ పిల్స్ వచ్చేశాయ్ !

శాస్త్రసాంకేతికరంగాల నూతన ఆవిష్కరణలతో మానవుడు రోజురోజుకూ తన సహజత్వాన్ని కోల్పొతున్నాడు. గర్భనిరోధానికి ఆడవారు, మగవారూ పడేపాట్లకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ టాబ్లెట్ కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని (కదిలికను) కొంతకాలంపాటు నిస్సత్తువుగా ఉంచే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్‌కి ‘సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్’గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్నినిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు. ఈఆవిష్కరణతో మానవజీవితంలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకాలం గర్భాన్ని నిరోధించడానికి కేవలం ఆడవారు ...

Read More »

పరగడుపున నీటితో ప్రయోజనాలెన్నో

ఉదయాన నిద్రలేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విశేషాలు ఇవి. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.  ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ...

Read More »

కనీసం వారానికి ఒకసారి ఖచ్చితంగా శనగలు తినాలి..!! ఎందుకు ?

శనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా.. ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెజిటేరియన్స్.. ప్రొటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు.. ఏడాది మొత్తం అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం చాలా మంచిది. శనగల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ని తేలికగా పొందవచ్చు. శనగలను.. పేదవాడి బాదాం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. బాదాంలో లభించే ప్రొటీన్ శాతం.. శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని ...

Read More »

నెల రోజులలో గర్భవతి అవ్వాలంటే?

గర్భవతి అవ్వాలనుకుంటే, సాధారణంగా నెలల తరబడి వేచి వుండటానికి అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా? అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించటమెలా? పరిశీలించండి. మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ ...

Read More »

సెక్స్‌కు షెడ్యూల్ వేస్కుంటున్న తెలుగు జంటలు… పిల్లల్లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ….

ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినట్లు మాత్రం జరగడంలేదు. చదవు, కెరీర్, ఉద్యోగం, ఉన్నతస్థానం… ఆర్థికంగా నిలదొక్కుకోవడం… ఇలా అన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయికి 40 ఏళ్లు, అమ్మాయికి 30 ఏళ్లు. అప్పుడు చాలా లేటుగా పెళ్లి. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత… అయ్యో పిల్లలు కలగడంలేదే అంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ చక్కెర్లు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం నిర్వహించిన సర్వేలో ...

Read More »

ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

బరువు తగ్గించుకోవాలంటే మొదట గుర్తొచ్చేది డైట్ . డైలీ డైట్ లో ఫ్యాటీఫుడ్స్ ఉండటం, ఈ ఫుడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉండటం మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఎక్స్ ట్రా పౌండ్ బరువు తగ్గడానికి ఎలాంటి చాన్సెస్ ఉండవు . వ్యాయామం ఎంత చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు . హెల్తీగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే మొదట డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు మంచి బ్యాలెన్సింగ్ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే శరీరం ...

Read More »

తోటకూర తింటే ఇన్ని లాభాలా?

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ ...

Read More »

బరువు తగ్గాలనుకునే వారికి సంజీవని లాంటి వార్త !

స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి. అందులో కొన్ని మీకోసం. 1. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. 2. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా ...

Read More »

రోజూ ఒక అరటిపండు నెలరోజులు తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

చాలా సాధారణంగా.. అందరూ తీసుకునే ఫ్రూట్ బనానా. ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండుని తింటారు. ఇది.. ఏడాదంతా అందుబాటులో ఉండటం వల్ల.. దీన్ని ప్రతి ఒక్కరూ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇష్టపడతారు. కానీ.. చాలామంది అరటిపండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలియదు. అరటిపండు అంటే.. చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా.. రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ.. రోజుకి ఒక అరటిపండు కూడా.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. బరువు ...

Read More »

వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!

ఒకరోజు ఫుల్ టైం ఫ్రీగా గడపాలని, ఫుల్ గా ఎంజాయ్ చేయాలని మీరు ఫీలవుతుంటారా ? మరి మీ శరీరం కూడా అలానే ఫీలవుతుందని.. ఎందుకు రియలైజ్ కావడం లేదు ? చాలా మంది ఎక్స్ పర్ట్స్.. మీ శరీరానికి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అని సూచిస్తూ ఉంటారు. వారానికి ఒకసారి.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచి ఐడియా అని చెబుతున్నారు. హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్ అందరూ వినే ఉంటారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వల్ల పొందే ప్రయోజనాల ...

Read More »

పచ్చిమిర్చి పవర్‌ ఎంతంటే..

వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చి వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. మిర్చిని వాడేందుకు ప్రయత్నించండి. మీరు నమ్ముతారో లేదో పచ్చిమిర్చి ‘విటమిన్‌ సి’ కి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్న మాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి ...

Read More »

బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతాలు చేసే.. టీ ఫ్లేవర్స్..!!

ఫ్యాట్ అనేది చాలా కామన్ విషయం. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తున్నారు. ఫ్యాట్ వల్ల ఒక వ్యక్తి ఆకర్షణపై ప్రభావం చూపుతుంది. మీరు అందంగా కనిపించాలంటే.. ఫ్యాట్ లేకుండా.. ఫ్లాట్టమ్మీ క లిగి ఉండాలి. చాలా కొద్దిగా తిన్నా, కొంచెమే తాగినా కూడా.. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుంది. అన్నింటిలోకెల్లా బెల్లీ ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. మీకు తెలుసా.. ? కొన్ని డ్రింక్స్ వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. వ్యాయామం కంటే.. రెండు రెట్టు వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.. ...

Read More »

హెల్త్‌ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌

  వర్ని, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా 25 సంవత్సరాల సర్వీసు కలిగిన వర్ని పిహెచ్‌సి హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రకటించారు. డ్రై డే, ఐరన్‌ పోలిక్‌ మాత్రలు ప్రాధాన్యతపై అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చిన హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రికి సంబంధించిన జూలై నెల పర్యటన డైరీని తనికీచేసి నివేదించాలని ఐకెపి ఎపిఎంను కలెక్టర్‌ ఆదేశించారు. పై ...

Read More »

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా బాన్సువాడ, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం వర్ని ఎంపిడివో కార్యాలయంలో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఐకెపి ఎపిఎం, ఇవో పంచాయతీరాజ్‌లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు నివారించడంలో సమన్వయంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వాంతులు విరేచనాలను ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల హాజరు పర్యవేక్షణ చేయాలి

– జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యాధికారులు నిర్ణీత సమయంలో విధుల్లో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ హాజరు పర్యవేక్షణ సరిగా లేదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం స్తానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా పర్యటించి వైద్యాధికారులు, సిబ్బంది హాజరును పరీక్షించారు. బయోమెట్రిక్‌ ద్వారా నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది హాజరు సరైన పద్దతిలో పర్యవేక్షణ చేస్తున్నట్టు కనిపించడం లేదన్నారు. చాలా మంది ...

Read More »

ఒకే బ్లడ్ గ్రూప్ అయితే… పిల్లలకు లోపాలా?

నాది, మావారిది ఒకే బ్లడ్ గ్రూప్. నాకు ఇటీవలే పెళ్లైంది. మా ఫ్రెండ్స్‌లో చాలామంది ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని చెబుతున్నారు. అది నిజమేనా? అలాగే నా భర్త మా బంధుల అబ్బాయే. దీనివల్ల కూడా పిల్లలు అవయవ లోపాలతో పుడతారని అందరూ అంటున్నారు.  మా అమ్మానాన్నలది కూడా మేనరికమే. దాంతో ఇంకా భయంగా ఉంది. ఇటు పిల్లలు కావాలని తొందరగా ఉన్నా, ఎక్కడ వారికి లోపాలుంటాయేమోనని కంగారుగా ఉంది. దయచేసి దీనికి ఏమైనా ట్రీట్‌మెంట్ లేక ...

Read More »

మగవారు వాడే పిల్స్ ఉంటాయా?

సందేహం నా వయసు 23. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంకో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మొదట్లో డాక్టర్ సలహా మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నాను. దాంతో చాలా నీరసంగా, లావు అయ్యాను. దాంతో పిల్స్ వేసుకోవడం ఆపేసి కండోమ్స్ వాడుతున్నాం. కానీ అది సేఫ్టీ కాదని చాలా చోట్ల చదివాను. మగవారు వాడే పిల్స్ ఏమీ ఉండవా? ఈ ప్రశ్నను మావారు అడగమన్నారు. ఎక్కడ చదివినా ఆడవారు వాడేవే ఉన్నాయి తప్ప మగవారికి ఉన్నట్లు ఎవరూ చెప్పట్లేదు. అలా ఏమైనా ...

Read More »