Breaking News

Health

31 నుంచి యోగా శిక్షణ

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఈనెల 31వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు ద్యానవైద్య యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకురాలు రేణుకమాత ఆదివారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు రెండు బ్యాచులుగా యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు ఈ శిబరంలో హాజరు కావాలని ఆమె కోరారు.

Read More »

రోగులకు మెరుగైన సేవలతోనే ఆసుపత్రి గుర్తింపు

  – ఎమ్మెల్యే గణేష్‌ గుప్త నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోగులకు మెరుగైన సేవలు అందించడంతోనే ఆసుపత్రికి గుర్తింపు లభిస్తుందని నిజామాబద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. దీంతోపాటు ఆసుపత్రి స్వచ్చంగా, శుభ్రంగా నడిపించాలని పేర్కొన్నారు. ఈమేరకు నిజామాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రతిభ సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిని ఆయనశుక్రవారం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు అందుబాటులో స్తానిక హైదరాబాద్‌ రోడ్డులో ఆసుపత్రి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతిప్రజ్వలన ...

Read More »

మదర్‌ థెరిస్సా రోగులపాలిట దేవత

  నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరాశ్రయులకు, అనాధలకు, రోగులకు సేవలందించి వారి పాలిట దేవతల లాగా ఉన్నారని మదర్‌ థెరిసా సేవలను కొనియాడారు. అనాథలకు, రోగులకు సేవచేయడం ఎంతో గొప్ప విషయమని స్నేహసోసైటి రూరల్‌ రికన్‌స్ట్రక్షన్స్‌ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య అన్నారు. బుధవారం నగరంలోని మారుతినగర్‌లోని స్నేహసోసైటి రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అంధుల మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఇందూరు,మేఘన డెంటల్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మదర్‌థేరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా హజరైన ...

Read More »

పర్యావరణంతోనే ప్రజారోగ్యం

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని దేవునిపల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో ప్రజా సైన్స్‌ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై కళాజాత నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రజలందరు హరితహారంలో భాగంగా మొక్కలునాటి పల్లెలను పచ్చగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం కళాజాతలో కళాకారులు ప్రజలను చైతన్య పరిచేవిధంగా మంత్రాల గురించి, చెట్లు నాటడం, పరిసరాల శుభ్రత ...

Read More »

వైద్యునిగా సేవలందించే అదృష్టం దేవుడిచ్చిన వరం

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం కలగడం దేవుడిచ్చిన వరమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి నిర్ణీత సమయంలో ప్రజలకు సేవలు అందించాలని, మనం అందిస్తున్న సేవలకు ప్రజల్లో కనిపించే ఆనందం ఎంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు. ఇతరులకు సేవచేయడం ద్వారా భగవంతుడు మరో రకంగా మనల్ని ...

Read More »

ఆరోగ్యశ్రీ సిబ్బంది వినూత్న నిరసన

  నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయమైన సమస్యలను పరిష్కరించడం పక్కన బెట్టి తమ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ట్రస్టు అధికారులు కుట్ర పన్నడం సిగ్గుచేటని ఆరోగ్యశ్రీ జిల్లా కార్యదర్శి స్వామి గంగసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల మొండి వైఖరి నిరసించారు. ఆరోగ్యశ్రీ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు ...

Read More »

ఆహారభద్రతకు బయోటెక్నాలజీలో పరిశోధనలు అవసరం

  – ప్రొఫెసర్‌ రాజం డిచ్‌పల్లి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి ఆహారభద్రతను అందించడంలో బయోటెక్నాలజి రంగంలో మరిన్ని పరిశోధనలు కీలకమని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ ఎం.వి.రాజం అన్నారు. శుక్రవారం ఆయన తెవివి బయోటెక్నాలజి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న సైన్స్‌ అకాడమీల లెక్చర్‌ వర్క్‌షాప్‌లో ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఆర్‌ఎన్‌ఎ రంగంలో పరిశోధనల ద్వారా పంట తెగుళ్ళను, వ్యాధులను, కీటకాలను నివారించవచ్చన్నారు. కీటకాల ద్వారా భారత్‌లో అపారపంట నష్టం జరుగుతుందని, లోతైన పరిశోధనల ద్వారా ...

Read More »

గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకునేలా చూడాలి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలు పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలని, మాతా, శిశువులను కాపాడడానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్‌ యోగితారాణా స్త్రీ, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మార్పుకార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలో గల సుమారు 4 వేల మంది గర్భిణీలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం, పీరియాడికల్‌గా వైద్య ...

Read More »

కొనసాగుతున్న యోగా శిక్షణ

  కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీషిర్టీసాయి నిలయంలో ధ్యాన, వైద్య, యోగ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. పదిరోజుల పాటు శ్రీసత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో యోగ తరగతులు చెబుతున్నారు. ఈనెల 17న ప్రారంభమైన యోగ తరగతులు 25వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. మానసిక ప్రశాంతత, దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఉపశమనం తదితర సమస్యలకు యోగాతో సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఉచితంగా మందులు సైతం పంపిణీచేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ...

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

  ఆర్మూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మగ్గిడి గ్రమానికి చెందిన లింగం గుండె జబ్బుతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. గుండె ఆపరేషన్‌ చేయించుకునే స్తోమత లేక లింగం నరకయాతన అనుభవిస్తున్నాడు. లింగంకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గుండె చికిత్సకు డబ్బులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి గురువారం అందజేశారు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించడంతో కేసీఆర్‌ లక్ష రూపాయలు మంజూరు చేసినట్టు ఆయన ...

Read More »

ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మరొకరికి డెంగ్యూ వ్యాధి నిర్దారణ

  డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధి తాండవ మాడుతున్నా పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్యశాఖ ఎఎన్‌ఎంలు ఆపై వైద్యులు. డిచ్‌పల్లి గ్రామానికి చెందిన రెంజర్ల గంగాసాయిలు (12) డెంగ్యూ వ్యాధి సోకిందని జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆసుపత్రిలో రక్తపరీక్షల కోసం వెళ్లగా డెంగ్యూ వ్యాధి సోకినట్టు నిర్దారించారు. వ్యాధి సోకిందని తెలిసిన కుటుంబీకులు ఆదివారం ఉదయం 12 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా ఆదివారం సెలవు వైద్యులెవరు లేరని, ...

Read More »

మచ్చర్లలో ఇద్దరికి డెంగ్యూ

  ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో ఇద్దరికి డెంగ్యూ వ్యాధి సోకింది. గ్రామంలోని నర్సారెడ్డి, ఆయన కుమారుడికి డెంగ్యూ వ్యాధి సోకిందని, దీంతో వారిని హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి కుటుంబీకులు చికిత్సలు చేయిస్తున్నారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి సోకడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అధికారులు స్పందించి వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read More »

శనివారం జ్ఞాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమం

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమాన్ని కామారెడ్డిలోని పార్శి రాములు కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎంఎంవై ద్వారా మానసిక ప్రశాంతత, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యల పరిష్కారం, దీర్ఘకాలిక రుగ్మతలైన బిపి, షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, అల్సర్‌, తదితర రోగాలకు ఉపశమనం పొందవచ్చన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈనెల 17 ...

Read More »

డెంగ్యూ వ్యాధికి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

  – ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని సేవలు కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకనుంచి డెంగ్యూ వ్యాధికి చికిత్స జరపనున్నట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలిపారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్లేట్‌లెస్‌ తయారుచేసే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి గురైన రోగికి ప్లేట్‌లెస్‌ తగ్గిపోవడం వల్ల చనిపోయే ప్రమాదముంటుందని డెంగ్యూ వ్యాధి కోసం లక్షలు వెచ్చించి హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తున్న ...

Read More »

విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో వైద్యులు పుట్ట మల్లికార్జున్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. అనంతరం బాలల హక్కులు, పరిరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కమిటీ అధ్యక్షుడు భద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇటుక బట్టీలు, ఇళ్ళు నిర్మాణ పనుల్లో తమ బాల్యాన్ని మగ్గనీయకుండా ...

Read More »

ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. అనంతరం విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. జయశంకర్‌ తెలంగాణ కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు వెంకటస్వామి, రాజమౌళి, శ్రీనివాస్‌, బ్రహ్మం, చక్రి, కిష్టయ్య, రఘుకుమార్‌, లక్ష్మణ్‌ తదితరులు ...

Read More »

ముర్రుపాలు బిడ్డకు సంజీవని

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముర్రుపాలు బిడ్డకు సంజీవనిలా పనిచేస్తుందని, ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకా అని 24వ వార్డు కౌన్సిలర్‌ రేణుక అన్నారు. ఆగష్టు 1వ తేదీ నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం 24వ వార్డులో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డకు ఆరునెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, ఇతర ఆహారపదార్థాలు ఇవ్వకూడదన్నారు. 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు అంగన్‌వాడి కేంద్రంలో ...

Read More »

ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సంఘీభావం

  ఇందూరు, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బుధవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మెకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను త్వరలో ప్రభుత్వం దృస్టికి తీసుకెలతామని హామీ ఇచ్చారు. అలాగే న్యాయం చేకూరేలా చూస్తామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించే ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది, జేఏసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వర్షాకాలం వ్యాధులతో జాగ్రత్త

  – అధికారులను ఆదేశించిన ఏజేసి నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలంలో వ్యాధుల సీజన్‌ ప్రారంభమైనందున డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో వైద్య శాఖాధికారులు, సంబంధిత అధికారులతో టాస్క్‌ఫోర్సు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీజన్‌లో ఇప్పటికి 39 కేసులను డెంగ్యూ అనుకూల కేసులుగా గుర్తించడం జరిగిందని, ముఖ్యంగా నిజామాబాద్‌ నగరంలో అధికంగా ...

Read More »

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం

  ఇందూరు, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య శ్రీ ఉద్యోగుల అరెస్టుకు నిరసనగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్‌ వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఉద్యోగులు ప్రభుత్వ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉద్యోగులను చిన్న చూపుచూస్తుందని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించడమే గాకుండా ఉన్నవారికి సరైన వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. రాత్రింబవళ్ళు ...

Read More »