Breaking News

Health

అధికారుల నిర్లక్ష్యంతో సోకిన డెంగ్యూ వ్యాధి

  – నలుగురికి నిర్ధారణ – 8 మందికి రక్తపరీక్షలు డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో డెంగ్యూ వ్యాధి సోకి 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. 12 మందిలో నలుగురికి డెంగ్యూ వ్యాధి సోకినట్టు అధికారులు నిర్ధారించారు. మరో 8 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన నలుగురిలో కొప్పుల నిఖిల్‌ (9), గురడి ప్రత్యుష (14), గురడి చరణ్‌ హైదరాబాద్‌లోని అంకుర్‌ ఆసుపత్రిలో చికిత్స ...

Read More »

శనివారం నుంచి తల్లిపాల వారోత్సవాలు

రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మపాలు నవజాత శిశువుకు అమృతంతో సమానం… పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతియేటా ఆగష్టు మొదటివారంలో తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.   శిశువు పుట్టిన అరగంటలోపే తల్లిపాలు పడితే పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ...

Read More »

ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరంచేసేందుకు తెరాస కుట్ర

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని ప్రభుత్వ టూరిజం హోటల్‌ హరిత రెస్టారెంట్‌ను లీజ్‌పేరుతో ప్రయివేటు పరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఎం మండల కార్యదర్శి రాజలింగం ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హరిత హోటల్‌ను టూరిజం శాఖలోని ఉన్నతాధికారి బంధువులు లీజ్‌ పద్దతిలో కాజేయాలని కుట్రకు టూరిజం శాఖ ఎం.డి. క్రిస్టినా ఆమోదముద్ర వేయడం హేయమైనచర్యగా అభివర్ణించారు. ఓవైపు కామారెడ్డిని జిల్లాగా చేస్తామని కేసీఆర్‌ ప్రకటించి కామారెడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ ...

Read More »

6వ రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె

ఇందూరు, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒంటికాలుపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు స్వామి మాట్లాడుతూ వారంరోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో సెలవులతో కూడిన వేతనం అందజేయాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు రత్నమాల మాట్లాడుతూ ఎన్నిసార్లైనా తమ సమస్యలపై అటు రాష్ట్ర్ర ప్రభుత్వానికి, ...

Read More »

రక్తదానం మహాదానం

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో బుధవారం రోటరీ క్లబ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 50 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు విద్యార్థుల నుంచి సేకరించారు. ఈ సందర్బంగా ఆజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ...

Read More »

గొర్లకు నట్టల మందు పంపిణీ

  ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 23వ వార్డులో స్థానిక మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ఆధ్వర్యంలో గొర్రెలకు వ్యాధులు సోకకుండా నట్టల మందులు వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గొర్లకు వ్యాధులు సోకుండా సకాలంలో మందులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఆమె వెంట పలువురు కౌన్సిలర్లు, తదితరులున్నారు.

Read More »

4వ రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ సమ్మె

  ఇందూరు, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం 4వరోజు జిల్లా వ్యాప్తంగా 97 మంది వారి విధులు బహిష్కరించి స్తానిక కలెక్టరేట్‌ వద్ద రిలే నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, డివిజన్‌ టీం లీడర్లు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల టీం లీడర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కాకుండా ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ద్వారానే నేరుగా ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ సేవలను మరింత విస్తరిస్తాం

  – ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ బాబురావు కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను మరింత విస్తరిస్తామని లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ ఎన్‌ఆర్‌సి డాక్టర్‌ బాబురావు అన్నారు. కామారెడ్డి పట్టణంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ఆప్‌ కామారెడ్డి వివేకానంద సంయుక్తంగా క్లబ్‌ ఇన్‌స్టాలేషన్‌ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. బాబురావు ముఖ్య అతిథిగా హౄజరై ప్రసంగించారు. క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, ఆపన్నులకు సహాయం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ...

Read More »

అధిక బరువు నిర్దారణ శిబిరానికి స్పందన

  కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ ఆసుపత్రిలో శుక్రవారం న్యాన్‌కైండ్‌ ఫార్మా ఆధ్వర్యంలో ఉచిత అధిక బరువు నిర్దారణ శిబిరాన్ని నిర్వహించారు. దీనికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వారి బరువు కొలతలను నిర్దారించుకున్నారు. డిఎంఐ పరీక్షలు జరిపి ఉండాల్సిన బరువు, ఇపుడున్న బరువును ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, ఫార్మా సిబ్బంది సాయినాథ్‌, సంతోష్‌, నరేశ్‌, ...

Read More »

పచ్చదనంతోనే ఆరోగ్యం

  – పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం పచ్చగా, పాడి పంటలతో, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు పెంచడం ఒక్కటే పరిష్కారమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వినాయక్‌నగర్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ ఎంపి కవితతో కలిసి అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్దాంజలి, జోహార్లు అర్పించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యుల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో కామారెడ్డిలో పలువురువైద్యులను సన్మానించారు. వైద్యులు అజయ్‌కుమార్‌, రాధారమణ, రమేశ్‌బాబు, చందన, విక్రమ్‌రెడ్డి, అరవిందకుమార్‌, జమాల్‌, సంగీత్‌కుమార్‌, కల్పన, సరితారెడ్డిలను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ బైరయ్య మాట్లాడుతూ వైద్యులు ప్రజా ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వారిని సన్మానించుకోవడం అందరికి గర్వకారనమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు దామోదర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జయప్రకాశ్‌, ప్రవీణ్‌, ...

Read More »

డాక్టర్‌ ఎం.డి.అశోక్‌కు ఘన సన్మానం

  ఆర్మూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రముఖ వైద్యులు ఎం.డి. అశోక్‌, డాక్టర్‌ రమేశ్‌ ను బుధవారం అమ్మ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఇలాగే తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అమ్మ సంస్థ ప్రధాన కార్యదర్శి సాయి, బాల్కొండ ఎంపిపి అర్గుల రాదా, రాధా చిన్నయ్య, సభ్యులు రాజేందర్‌, భూషణ్‌, రాజన్న, రఘు, భూమన్న, సుధాకర్‌, ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా డాక్టర్స్‌ డే

  ఆర్మూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బిసిరాయ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవాన్ని రోటరీక్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో స్తానిక ప్రజ్ఞా పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్‌ అశోక్‌ను, డాక్టర్‌విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈసమావేశంలో ఆర్‌సి అధ్యక్షులు, ఎన్‌.విజయసారధి మాట్లాడుతూ రోటరీక్లబ్‌ ఆద్వర్యంలో మారుమూల ప్రాంతాల్లో తరచుగా వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలుపుతూ ప్రజారోగ్యానికి డాక్టర్లు చేస్తున్న సేవలను ముఖ్యంగా అమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అశోక్‌ చేస్తున్న సేవలను ...

Read More »

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాలి

  – ఎమ్మెల్సీ ఆకులలలిత రెంజల్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత వర్షాకాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి అంటువ్యాధలు ప్రబలకుండా వైద్యులు ఎప్పటికప్పుడు తగు చర్యలుతీసుకోవాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత సూచించారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైద్యవర్గాలు అప్రమత్తంగా ఉండి వైద్యసేవలందించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిప చర్యలు తప్పవన్నారు. నిత్యవసర సరుకులు అసలైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. అంతకుముందు ...

Read More »

ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికే ఆరోగ్యలక్ష్మి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య లక్ష్మి పథకం సరిగా అమలయ్యేలా చూసే బాధ్యత గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక మీనా గార్డెన్‌లో ఆరోగ్యలక్ష్మి, మహిళల / బాలల సంరక్షణపై నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలకు ఒకరోజు శిక్షణ, అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ...

Read More »

ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

  ఆర్మూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆర్మూర్‌ క్షత్రియ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా ఉచిత యోగ శక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా సంస్థ ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పతంజలి మహర్షి అందించిన యోగశాస్త్రాన్ని, యోగ ప్రాముఖ్యతను, దాని గొప్పతనాన్ని ప్రపంచం తెలుసుకోవడానికి దేశ ప్రధాని మోది కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. యోగాతో మానసిక ఉల్లాసం, శరీర సంతులనం కలుగుతాయన్నారు. ...

Read More »

భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు గర్వకారణం

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐక్యరాజ్య సమితి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం భారతీయులందరికి గర్వకారణమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఆదివారం ఉదయం యోగా డేను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా సాదన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ...

Read More »

చిరుజల్లులతో ప్రబలనున్న అంటువ్యాధులు

  నవీపేట, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గత రెండ్రోజుల నుంచి కురుస్తున్న చిరుజల్లులకు అంటువ్యాదులు ప్రబలే అవకాశముంది. పలు మురికి వాడల్లో ఇప్పటికే రోడ్లు బురదమయమై పందులకు ఆవాసంగా మారాయి. ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. అంటువ్యాధులకు సంబంధించిన మందులు స్థానిక ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read More »

ఘనంగా యోగా దినోత్సవం

  నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని, అందరూ ప్రతిరోజు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక శ్రీరామ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలు ఈరోజు ...

Read More »

ప్ర‌పంచ యోగా దినోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయండి

  ఆర్మూర్, జూన్ 19 : ప‌్ర‌పంచ యోగ దినోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌ముఖ యోగ గురువు యోగి భీమ‌య్య పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని రోడ్లు భ‌వ‌నాల అతిథీ గృహంలొ ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌పంచ వ్యాప్తంగ 200 కోట్ల మంది యోగను నిత్యం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. యోగ ఆస‌నాల వ‌ల్ల వ్య‌క్తి యొక్క మాన‌సిక, శారీర‌క బాద‌లు ద‌ర‌మై, ఆరోగ్యంగ ఉంటార‌న్నారు. భార‌త దేశంలో పుట్టిన యోగ ప్ర‌పంచ వ్యాప్తంగ ప్ర‌సిద్ది చెందినందు వ‌ల్ల భార‌తీయులు ...

Read More »