Breaking News

Health

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids అంటారు . ఇది జంతు జీవనానికి ప్రధానమైనది . మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము . ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు ...

Read More »

మత్తులేక లొల్లి… లొల్లి….

  – కల్తీకల్లులేక ఆసుపత్రి పాలవుతున్న కల్లుప్రియులు కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లుల్లో కల్తీ చేసే రసాయనాలను నియంత్రించేందుకు గత కొంత కాలంగా ఆబ్కారీ అధికారులు దాడులు చేయడంతో కల్లు తయారీదారులు మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. దీంతో మత్తుకు బానిసలైన కల్లు ప్రియులపై ఈ ప్రభావం పడి మత్తులేక చిత్తవుతున్నారు. నిద్రలేమి, మూర్చ, పిచ్చి గా ప్రవర్తించడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో కామారెడ్డి డివిజన్‌లోని ఆయా గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు సర్కారు ...

Read More »

అలరించిన విద్యార్తుల యోగా విన్యాసాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గంజ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్తులు చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సహజ ఆనంద యోగా గురుజీ ఆచార్య రమేశ్‌ నేతృత్వంలో వారంరోజులుగా పాఠశాలలో విద్యార్థులకు యోగా విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. గురూజీ నేర్పిన యోగాసనాలు విద్యార్తులు చక్కగా ప్రదర్శించారు. అనంతరం తల్లిదండ్రులు, గురువులకు కాళ్లు కడిగి పాద పూజ చేయించారు. విద్యార్థులకు యోగాతోపాటు మానవతా విలువలు, సంస్కారం ...

Read More »

పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించారు. అంగన్‌వాడి ప్రతినిదులు, ఉపాధ్యాయులు పోషకాహారం గురించి వివరించారు. ఆకుకూరలు, పచ్చ కూరగాయలు, పాలు, పండ్లు, నువ్వులు, బెల్లం, తదితర ఆహార పదార్థాలను సమ పాళ్ళలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయని, వాటిని సంపూర్ణ ఆహారం అంటారని సూచించారు. ఇవి తీసుకోవడం వల్ల గర్భిణీలకు బరువు పెరగడంతో పాటు బాలింతలకు ...

Read More »

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణిలు,బాలింతల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారమే ముఖ్యమని, తద్వారా తల్లి,బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నగర మేయర్‌ ఆకులసుజాత తెలిపారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌భవన్‌లో ఐసీడీఏస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ముఖ్యంగా గర్భిణిలు రక్తహినతతో భాదపడటం మూలంగానే పుట్టే పిల్లలు తక్కువ బరువుతో, పూర్తిగా ఆరోగ్యవంతంగా లేకుండా జన్మించడానికి కారణమన్నారు. పిల్లలకు ...

Read More »

విగ్రహానికి ఆశ వర్కర్ల వినతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్టుతెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశ కార్యకర్తలను ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా అర్హత కల్పించి రూ. 15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా సమ్మెచేస్తున్నా ...

Read More »

యోగాతో మానసిక ఉల్లాసం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్తులు చిన్నప్పటి నుంచే యోగా అలవరుచుకుంటే మానసిక ఉల్లాసంతో పాటు ఏకాగ్రత సాధించి ఉన్నత స్తాయికి ఎదగగలుగుతారని మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌గౌడ్‌, యోగా గురు ఆచార్య రమేశ్‌లు అన్నారు. బుధవారం కామారెడ్డి గంజ్‌ ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. విద్యార్తులకు యోగాసనాలతో పాటు మానవతా దృక్పథ విలువల గురించి నేర్పించారు. మానవత్వ విలువలను విద్యార్థి దశలోనే అలవరుచుకోవాలని చదువుతోపాటు సంస్కారాన్ని అలవరుచుకోవాలని సూచించారు.

Read More »

మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్‌ల ర్యాలీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటీకరణ, కార్మిక చట్టాల్లో సవరణలు వ్యతిరేకిస్తూ బుధవారం తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోడి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని, సామాజిక భద్రతకు పెద్ద పీట వేయాలని, కార్మిక చట్టాల సవరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ...

Read More »

మురికి కాలువలు శుభ్రం చేయాలి

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో మురికి కాల్వలను శుభ్రం చేయాలని ఇన్‌చార్జి ఇవో పిఆర్‌డి ధనుంజయ్‌ గౌడ్‌ గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తిచెంది విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. అందువల్ల మురికి కాలువలను తక్షణమే శుభ్రం చేయాలని చెప్పారు. గ్రామాల్లో దోమలతో వ్యాధులు ప్రబలుతున్నందున వాటిని మురికి నీరు నిల్వఉండకుండా చూడాలని ఆయన చెప్పారు.

Read More »

పేరుకే పెద్దాసుపత్రి… చికిత్సకు దిక్కేది…

  ఇందూరు, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అది ఓ ఏడంతస్తుల అద్దాల మేడ… జిల్లాలోని నిరుపేదలందరికి ఉచిత వైద్యం అందించేందుకు కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఆసుపత్రి అది. కాని పేరుకు మాత్రమే పెద్దాసుపత్రిగా మారింది. చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వెళ్లే అంతే సంగతులు. ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. దీంతో ఈ దవాఖాన పేరు చెప్తేనే ప్రజలు జంకుతున్నారు. అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు తప్ప ఇటువైపు రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో ...

Read More »

వ్యాయామంతో శారీరక ఆరోగ్యం

  – మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ అన్నారు. కామారెడ్డి సిరిసిల్లా రోడ్డులో రాయల్‌ పవర్‌ వ్యాయామ శాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అందరు వ్యాయామ శాలను వినియోగించుకొని శారీరక దారుఢ్యాన్ని, వ్యాధులు లేని జీవితాన్ని పొందాలని సూచించారు. జిమ్‌ నిర్వాహకుడు ఎజాజ్‌ మాట్లాడుతూ జిమ్‌లో ...

Read More »

డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

  – గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై హెల్త్‌ సూపర్‌వైజర్‌ మండిపాటు డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధి సోకడానికి కారణాలను హెల్త్‌ సూపర్‌వైజర్‌ అఖిల్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం గ్రామంలోని అన్ని కాలనీల్లో పర్యటించి నీటి తొట్టిలను, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించగా పాతబడిన నీటి తొట్టిలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పుట్టుకువచ్చి డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదముందని గ్రామ పంచాయతీ వారికి ...

Read More »

ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి – పట్టించుకోని అధికారులు

  డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో పందులు యథేచ్చగా తిరగడం వల్లే డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి తాండవమాడుతున్నా పంచాయతీ సిబ్బంది, అధికారలు మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని అంటున్నారు. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్లే ఈ వ్యాధి సోకుతుందని పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య అధికారులు సూచించగా, పందులు పెంచేవారికి తహసీల్దార్‌ రవిందర్‌ మందలించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పందులు ఉంచాలని ఆదేశించగా అధికారుల సూచనలు ...

Read More »

31 నుంచి యోగా శిక్షణ

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఈనెల 31వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు ద్యానవైద్య యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకురాలు రేణుకమాత ఆదివారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు రెండు బ్యాచులుగా యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు ఈ శిబరంలో హాజరు కావాలని ఆమె కోరారు.

Read More »

రోగులకు మెరుగైన సేవలతోనే ఆసుపత్రి గుర్తింపు

  – ఎమ్మెల్యే గణేష్‌ గుప్త నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోగులకు మెరుగైన సేవలు అందించడంతోనే ఆసుపత్రికి గుర్తింపు లభిస్తుందని నిజామాబద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. దీంతోపాటు ఆసుపత్రి స్వచ్చంగా, శుభ్రంగా నడిపించాలని పేర్కొన్నారు. ఈమేరకు నిజామాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రతిభ సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిని ఆయనశుక్రవారం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు అందుబాటులో స్తానిక హైదరాబాద్‌ రోడ్డులో ఆసుపత్రి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతిప్రజ్వలన ...

Read More »

మదర్‌ థెరిస్సా రోగులపాలిట దేవత

  నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరాశ్రయులకు, అనాధలకు, రోగులకు సేవలందించి వారి పాలిట దేవతల లాగా ఉన్నారని మదర్‌ థెరిసా సేవలను కొనియాడారు. అనాథలకు, రోగులకు సేవచేయడం ఎంతో గొప్ప విషయమని స్నేహసోసైటి రూరల్‌ రికన్‌స్ట్రక్షన్స్‌ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య అన్నారు. బుధవారం నగరంలోని మారుతినగర్‌లోని స్నేహసోసైటి రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అంధుల మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఇందూరు,మేఘన డెంటల్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మదర్‌థేరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా హజరైన ...

Read More »

పర్యావరణంతోనే ప్రజారోగ్యం

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని దేవునిపల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో ప్రజా సైన్స్‌ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై కళాజాత నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రజలందరు హరితహారంలో భాగంగా మొక్కలునాటి పల్లెలను పచ్చగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం కళాజాతలో కళాకారులు ప్రజలను చైతన్య పరిచేవిధంగా మంత్రాల గురించి, చెట్లు నాటడం, పరిసరాల శుభ్రత ...

Read More »

వైద్యునిగా సేవలందించే అదృష్టం దేవుడిచ్చిన వరం

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం కలగడం దేవుడిచ్చిన వరమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి నిర్ణీత సమయంలో ప్రజలకు సేవలు అందించాలని, మనం అందిస్తున్న సేవలకు ప్రజల్లో కనిపించే ఆనందం ఎంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు. ఇతరులకు సేవచేయడం ద్వారా భగవంతుడు మరో రకంగా మనల్ని ...

Read More »

ఆరోగ్యశ్రీ సిబ్బంది వినూత్న నిరసన

  నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయమైన సమస్యలను పరిష్కరించడం పక్కన బెట్టి తమ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ట్రస్టు అధికారులు కుట్ర పన్నడం సిగ్గుచేటని ఆరోగ్యశ్రీ జిల్లా కార్యదర్శి స్వామి గంగసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల మొండి వైఖరి నిరసించారు. ఆరోగ్యశ్రీ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు ...

Read More »

ఆహారభద్రతకు బయోటెక్నాలజీలో పరిశోధనలు అవసరం

  – ప్రొఫెసర్‌ రాజం డిచ్‌పల్లి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి ఆహారభద్రతను అందించడంలో బయోటెక్నాలజి రంగంలో మరిన్ని పరిశోధనలు కీలకమని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ ఎం.వి.రాజం అన్నారు. శుక్రవారం ఆయన తెవివి బయోటెక్నాలజి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న సైన్స్‌ అకాడమీల లెక్చర్‌ వర్క్‌షాప్‌లో ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఆర్‌ఎన్‌ఎ రంగంలో పరిశోధనల ద్వారా పంట తెగుళ్ళను, వ్యాధులను, కీటకాలను నివారించవచ్చన్నారు. కీటకాల ద్వారా భారత్‌లో అపారపంట నష్టం జరుగుతుందని, లోతైన పరిశోధనల ద్వారా ...

Read More »