Breaking News

Health

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని ఎల్ల‌మ్మగుట్టలోగల‌ మెడికవర్‌ ఆసుపత్రి, సరస్వతి నగర్‌లోని ఇందూరు సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్‌ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్‌టి నెంబర్‌ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ధరల‌ను రోగుల‌కు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాల‌ని సూచించారు. ...

Read More »

బీర్కూర్‌లో కరోనా పాజిటివ్‌ 18, నెగిటివ్‌ 61

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బీర్కూర్‌లో నిర్వహించిన కరోనా రాపిడ్‌ టెస్టుల్లో 18 మందికి పాజిటివ్‌, 61 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్నారం 8, బీర్కూర్‌ 4, నాచుపల్లి 3, హాజిపూర్‌ 1, బొమ్మన్‌దేవుపల్లి 1, అంకోల్‌ 1 కేసులు నమోదైనట్టు తెలిపారు.

Read More »

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామరెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానం చేసే వారికి కావల‌సిన రవాణా సదుపాయాల‌ను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా ...

Read More »

అక్కడ అన్ని సౌకర్యాలున్నాయి….

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. బుధవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల‌ మేరకు జిల్లా కలెక్టర్‌ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమంలో పాజిటివ్‌ వచ్చిన రోగుల‌ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల‌తో మాట్లాడి, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌కు గాని, ప్రైవేట్‌ హాస్పిటల్‌ గాని, ఇంటివద్ద సౌకర్యాలు ఉన్నవారిని వారి వారి ఇళ్లకు గాని డాక్టర్ ...

Read More »

127 సెంటర్లలో టెస్టులు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ టెస్టులు ఈనెల‌ 21వ తేదీ నుండి 127 సెంటర్లలో ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వినాయక్‌ నగర్‌ మరియు అర్సపల్లిలోని యూపిహెచ్‌సి కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎవ్వరూ భయపడ వద్దని, ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారికి, హైరిస్క్‌ జోన్లో ఉన్న వారికి, గర్భవతుల‌కు ఎక్కువగా బయట ...

Read More »

అశ్రద్ద చేయకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాల‌ని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాల‌ని తన కుటుంబ ...

Read More »

రెండు ల‌క్షల‌ ఇళ్లలో సర్వే

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెండు ల‌క్షల‌ ఇండ్లను సర్వే చేపట్టి వ్యాధులు ఉన్న వారిని గుర్తించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో 400 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా, సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ...

Read More »

కోమలంచలో ఒకరికి కరోనా

నిజాంసాగర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన ఒకరికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన 33 కేసులు కాగా అందులో కోలుకున్నవారు 11 మంది, ఇందులో కరోన ఆక్టివ్‌ కేసులు 22 మంది అని తెలిపారు.

Read More »

నిజామాబాద్‌లో కోవిడ్‌ టెస్టింగ్‌ వ్యాన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి కోవిడ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నగరంలో అధిక జనాభా ఉన్నందున కోవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నవని, ప్రజలు భయపడి టెస్ట్‌ు ...

Read More »

కోవిడ్‌ గురించి విస్తృత ప్రచారం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాల‌ని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు కామారెడ్డిలో వ్యాపార, వాణిజ్య సంస్థలు గత వారం నుంచి పూర్తి ...

Read More »

రక్తదాత.. ప్రాణదాత…

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన శిరీష (26) గర్భిణీ రక్తహీనతతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో బాధ పడడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి వ్యవసాయ విస్తరణాధికారి అశోక్‌ రెడ్డి సహకారంతో బి నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ బి నెగిటివ్‌ గ్రూపు రక్తం పదివేల‌ మందిలో 300 ...

Read More »

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో సోమవారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెల‌లుగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్‌ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని ...

Read More »

మద్యం దుకాణాలు తెరవడం సరికాదు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గుడి, బడి బంద్‌ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాల‌ని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్‌ టిజివిపి ప్రొబిషనల్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిల‌పక్ష ...

Read More »

ల‌క్ష్యసాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అస్తిత్వ సిద్ధాంత కర్త, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 87 వ జన్మదిన వేడుకలు తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని పరిపాల‌నా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కోవిడ్‌ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి, పరిసర ప్రాంతాల‌లో శానిటైజర్‌ స్ప్రే చేసి జయంతి ఉత్సవాన్ని జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం హాజరై ఆచార్య జయశంకర్‌ సార్‌ చిత్ర ...

Read More »

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో నిపుణులైన వైద్యుల‌చే కరోనా కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్‌ సెల్‌ 24 గంటలు పనిచేస్తుందని, జిల్లా ప్రజల‌కు కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలున్నా 8309219718 నెంబర్‌లో సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

Read More »

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన జలుబు లాంటి వ్యాధి అని, దీనికి అతిగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటివద్దే 17 రోజుల‌ పాటు గృహ నిర్బంధంలో ఉంటూ వైద్యశాఖ సూచనలు పాటించాల‌న్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని మందులు వాడాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, రెండు ...

Read More »

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ జిల్లాలో మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి అవసరమైన వసతులు లేనివారి కోసం అన్ని వసతుల‌తో మాక్లూర్‌ లోని నర్సింగ్‌ కాలేజీలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, సెంటర్లో ...

Read More »

మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఇందులో నవోదయ విద్యాల‌యానికి చెందిన వారు ఉన్నారన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కరోన పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 16 కు చేరిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌ ధరించాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా ...

Read More »

పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాల‌ వారోత్సవాల‌ సందర్భంగా బుధవారం ఐసిడిఎస్‌ ఎల్లారెడ్డి ఆద్వర్యంలో సిడిపివో సరిత, సిబ్బంది, అంగన్‌వాడి టీచర్‌ు ఎల్లారెడ్డి పట్టణంలోని బాలింతల‌ ఇంటికి వెళ్ళి తల్లిపాల‌ ప్రాముఖ్యతను వివరించారు. తల్లి పాలు తాగడం బిడ్డ జన్మహక్కు అని, తల్లిపాల‌లో శిశువు ఎదగడానికి సహాయపడే ప్రోటీన్లు, విటమిన్లు వంటివి సమపాళ్ళలో ఉండడం వల‌న తల్లిపాలు బిడ్డ యొక్క పోషక అవసరాల‌ను తీర్చడంలో సహాయపడడంతో పాటు బిడ్డ యొక్క పెరుగుదల‌ అభివృద్ధికి మరియు మానసిక అభివృద్దికి తోడ్పడతాయని ...

Read More »

నలుగురికి కరోన పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా నలుగురికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. వీరిలో నవోదయకి చెందిన వారు ముగ్గురు, నిజాంసాగర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 14 కు చేరిందన్నారు.

Read More »