Breaking News

Health

క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి

  – నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరైన పద్దతిలో మందులు వాడితే క్షయ వాధిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ అన్నారు. ప్రపంచ టి.బి . దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఉందని, నివారించడంతోపాటు, నయం చేయడానికి ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ శిబిరం

నిజామాబాద్‌, మార్చి 15 కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మోకాళ్ళ నొప్పులు, మెడ, నడుమునొప్పి, కాళ్ళ తిమ్మిర్లు, బిపి, తదితర వ్యాధులున్న రోగులకు ఆక్యుప్రజర్‌ విధానంతో చికిత్స అందించారు. ప్రజలు ఆక్యుప్రజర్‌ విధానాన్ని వినియోగించుకొని రోగాలనుంచి ఉపశమనం పొందాలని డాక్టర్‌ పి.కె.చౌదరి సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు నరేశ్‌ కుమార్‌, ప్రతినిధులు గంగాధర్‌, లింబాద్రి, గోపి, రమేశ్‌, శ్యాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంతా మా యిష్టం – మెడికల్‌ కంపెనీల మాయ

– రిజిస్ట్రేషన్‌ లేకుండా ఉచిత వైద్యశిబిరాల మెడికల్‌ ‘కంపెనీ’లు నిజామాబాద్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ : అంతా మా యిష్టం అంటూ, మేం చెప్పిందే వేదమంటూ, మేము చేసేదే వైద్యమంటూ పలు మెడికల్‌ కంపెనీలు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్‌ లేకుండా ఉచిత వైద్యశిబిరాల పేరిట ప్రజలకు ఎటువంటి వ్యాధి లేకున్నా రోగిగా మారుస్తున్నారు. ఈ సంఘటన నగరంలో బుధవారం ఓ ప్రయివేటు మెడికల్‌ ప్రాక్టీషనర్‌ క్లినిక్‌లో చోటుచేసుకుంది. అక్కడ బోన్‌ డెన్సిటోమెట్రీ రిపోర్టు పేరుతో ఎలాంటి సర్టిఫికెటు లేకున్నా అక్కడికొచ్చే రోగులకు శరీరంలోని కాల్షియం నిర్దారించాడు ...

Read More »

ఎముకల నిపుణులలో జిల్లావాసికి బంగారుపతకం

నిజామాబాద్‌, మార్చి 07 నిజామాబాద్‌ న్యూస్‌ : నగరంలోని శ్రీరక్ష ఆసుపత్రి వైద్యులు రాందాస్‌ ఎం.ఎస్‌ ఆర్థోపెడిషన్‌కు ప్లేస్‌మెంట్‌ ఆఫ్‌ ధోరాసిక్‌ పాలిక్లి స్క్రూస్‌ యూసింగ్‌ ఫ్రీ హ్యాండ్‌ టెక్నిక్‌ వితౌట్‌ ఇమేజ్‌ గైడెన్సు అనే కొత్త స్పైన్‌ ఆపరేషన్‌ టెక్నిక్‌లో 100 శాతం మంచి ఫలితాలు సాధించారు. ఈమేరకు ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన కృషికి గాను బంగారు పతకం లభించిందన్నారు. నడుమునొప్పి, కాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఉత్తమ చికిత్సలు తమ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందన్నారు. తన ...

Read More »

మానసిక శారీరక ఉల్లాసం కోసం ”ఎన్‌.సి.సి” – యండమూరి వీరేంద్రనాథ్‌

  నిజామాబాద్‌ ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: ఆదివారం నిజామాబాద్‌ నగర శివారులోని ముబారఖనగర్‌లోగల ఆర్‌బివిఆర్‌ఆర్‌ పాఠశాలలో ఎన్‌సిసి ‘సి’ సర్టిఫికెట్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఇందులో మొత్తం 272 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందినవారు. ఈ పరీక్షలు ఉదయం 10గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగింది అనంతరం మధ్యాహ్నం 2.30Û నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల వరరకు ప్రాక్టికల్స్‌లను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు రాష్ట్ర పరీశీలకులుగా కర్నూలు ...

Read More »

ఆస్పత్రులను ప్రారంబించిన కవిత

  నిజామాబాద్‌ అర్భన్‌, ఫిబ్రవరి 20: నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోని నూతన ప్రైవేట్‌ ఆస్పత్రులను నిజామాబాద్‌ ఎంపి కె.కవిత ప్రారంభించారు. హయతీ, కిర్తిసాయ మల్టీ స్పెషలిటీ, యాపిల్‌ దంతవైద్యశాలలను ముఖ్య అతిథిగా హాజరై కవిత ప్రారంబోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి రోగులు హైదరాబాద్‌ వరకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిహెచ్‌ శ్రీకృష్ణ, డాక్టర్‌ ప్రేమలత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్‌ ...

Read More »

ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఐటి దాడులు

  -దాగుడు మూతలు అడుతున్న వైద్యులు నిజామాబాద్‌, ఫిబ్రవరి 20: నగరంలోని డాక్టర్స్‌ కాలనీలో గల ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గురు, శుక్రవారాల్లో ఐటి ఆధికారులు అకస్మత్తుగా దాడులు నిర్వమించారు. నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోని రాఘవేంద్ర కిడ్ని న్యూరో ఆస్పత్రి, శివసాయ మల్టీ స్పెషలిటీ, ప్రగతి నర్సింగ్‌ హోమ్‌లలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ప్రతి రోజు వైద్యులు రాసే రిజిస్టార్లను, మిగతా రాకార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటి ఆదనపు కమిసనర్‌ బి.రవిందర్‌ ఆధ్వర్యంలో కృష్ణమోహన్‌, గోవిందరాజులు, ఇన్స్‌పెక్టర్లు ప్రదీప్‌, జ్యోతికుమార్‌ దాడులు జరిపారు.

Read More »

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సత్యనారాయణ

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 13: నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్డర్‌ సత్యనారాయణను నియమించారు. ఈ పదవిలో పని చేసిన డాక్టర్‌ భీంసింగ్‌ ఇటీవల సెలవుపై వెల్లిన సంగతి తెలిసిందే. ఈయన స్థానంలో సీనీయర్‌ అయిన వైద్యుడు సత్యనారాయణ ఇంచార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ సూపరింటెండెంట్‌గా పని చేసిన అనుభవం ఉంది.

Read More »

క్యాన్సర్‌ విద్యార్థినికి ఆర్థిక సహాయం

  బాన్సువాడ, ఫిబ్రవరి 10: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని మంజుల బ్లెడ్‌ క్యాన్సర్‌తో కొంత కాలంగా బాధపడుతోంది. చికిత్స పొందుతున్న మంజులకు ప్రతి నెల రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్న కుటుంబ సభ్యులు వైద్య చికిత్సలు చేయించలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మంజుల తండ్రికి తెలిసిన వారి ద్వారా వారధి స్వఛ్చంద సేవ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు స్పందించిన సంస్థ రూ.6500ల ఆర్థిక సహాయం చేశారు. మంజుల చికిత్స నిమిత్తం జిల్లాలో దాతలు ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీలో స్వైన్‌ ఫ్లూ మందుల పంపిణీ

  -డిచ్‌పల్లి, ఫిబ్రవరి 11: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ యూనివర్సిటీలో టిఆర్‌ఎస్‌ విభాగ ఆధ్వర్యంలో స్వైన్‌ ఫ్లూ నివారణ మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టిఆర్‌ఎస్‌ విభాగ అధ్యక్షుడు మంత్రి మహేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి చెంది అనేక మందిని బలి తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుందని అందులో భాగంగానే తెలంగాణ యూనివర్సిటీలో స్వైన్‌ ఫ్లూ నిరోధక హోమియో మాత్రల పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ ...

Read More »

వైద్య సేవలు మరింత అందుబాటులోకి

-ఎంపి కవిత నిజామాబాద్‌, ఫిబ్రవరి7: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: పార్టమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ విధానంలో ఇంటిగ్రేటెడ్‌ డిసీజెస్‌ సర్వేలైన్స్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. వరంగల్‌ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో తిలకించారు. ఎంపి కవితతో పాటు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫదర్‌ రాజు, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, నగర ...

Read More »

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కిలో బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌

  డిచ్‌పల్లి, జనవరి 29: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని డిచ్‌పల్లి మండలం గాంధీనగర్‌ కాలనీలో సర్పంచ్‌ అంజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులెవరికైనా ఆహార భద్రత పథకం అందని యెడల గ్రామ పంచాయితీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పధకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్ల ఎమ్‌పిటిసి సాయన్న, ఎమ్‌పిటిసి రవికుమార్‌, ...

Read More »

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24: నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసారు. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న స్వైన్‌ ఫ్లూని అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో నివారణ చర్యల కోసం నడుం బిగించింది. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐదవ అంతస్తులో స్వైన్‌ఫ్లూ కేంద్రం ఏర్పాటు చేశారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాలు పంపిణి చేసి ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్షించి ఏర్పాట్లు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం ...

Read More »

స్వైన్‌ఫ్లూ’ బారి నుండి ప్రజలను కాపాడాలి – డా. బాపురెడ్డి

  ప్రజలపై యమపాశంగా మారుతున్న ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి బారి నుండి ప్రజలను ప్రభుత్వమే కాపాడాలని డాక్టర్‌ బాపురెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడూతూ, ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి ”హెచ్‌1” అనే వైరస్‌ ద్వారా సోకుతుందని,.ఈ వ్యాధి పందులు,పక్షుల ద్వారా వ్యాపిస్తుందన్నారు. జలుబు, దగ్గు, దమ్ము ఎక్కువగా రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ి ‘స్వైన్‌ఫ్లూ’ అవగాహనపై బ్యానర్లను పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాధి నివారణకు సంబంధించిన ” టిఎఎమ్‌ఎఫ్‌ఎల్‌యు, రాలెంజా ” అనే ...

Read More »

యువతలో మార్పు రావాలి

-ఎమ్మెల్యే బిగాల -నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 7; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; యువతలో మార్పుతో పాటు చైత్యనం కలిగించడం ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యతనేనని, అందుకు ప్రతి ఒక్కరు బాద్యతగా వ్యవహారించాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త అన్నారు. ఇందూరు యువసేన అసోసియేషన్‌ అధ్వర్యంలో బుధవారం ఉమెన్స్‌ కాలేజీలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితులుగా అర్బన్‌ యమ్‌.ఎల్‌.ఎ బిగాల గణేష్‌గుప్తా, నిజామాబాద్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా ఉండలని, అర్థరాత్రి ...

Read More »

ప్రముఖ రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి అస్వస్థత

  పలువురు ప్రముఖుల పరామర్శ నిజామాబాద్‌, జనవరి 7; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ కేశవరెడ్డికి అస్వస్థత గురయ్యారు. గత15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయనను ఇటీవల జిల్లా కేంద్రం ఖలీల్‌వాడీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చెర్పించారు. ఆయన గతంలో డిచ్‌పల్లి విక్టోరియా ఆసుపత్రిలో చర్మవ్యాధి నిపుణుడిగా పనిచేసి పదవీ విరమణ పోందారు. నిజామాబాద్‌. ఆర్మూర్‌లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇతనికి భార్య ధీరమతి, ఇద్దరు పిల్లలున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు… తెలుగు సాహిత్యరంగంలో ప్రముఖ ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »