Breaking News

Health

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో సోమవారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెల‌లుగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్‌ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని ...

Read More »

మద్యం దుకాణాలు తెరవడం సరికాదు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గుడి, బడి బంద్‌ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాల‌ని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్‌ టిజివిపి ప్రొబిషనల్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిల‌పక్ష ...

Read More »

ల‌క్ష్యసాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అస్తిత్వ సిద్ధాంత కర్త, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 87 వ జన్మదిన వేడుకలు తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని పరిపాల‌నా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కోవిడ్‌ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి, పరిసర ప్రాంతాల‌లో శానిటైజర్‌ స్ప్రే చేసి జయంతి ఉత్సవాన్ని జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం హాజరై ఆచార్య జయశంకర్‌ సార్‌ చిత్ర ...

Read More »

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో నిపుణులైన వైద్యుల‌చే కరోనా కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్‌ సెల్‌ 24 గంటలు పనిచేస్తుందని, జిల్లా ప్రజల‌కు కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలున్నా 8309219718 నెంబర్‌లో సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

Read More »

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన జలుబు లాంటి వ్యాధి అని, దీనికి అతిగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటివద్దే 17 రోజుల‌ పాటు గృహ నిర్బంధంలో ఉంటూ వైద్యశాఖ సూచనలు పాటించాల‌న్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని మందులు వాడాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, రెండు ...

Read More »

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ జిల్లాలో మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి అవసరమైన వసతులు లేనివారి కోసం అన్ని వసతుల‌తో మాక్లూర్‌ లోని నర్సింగ్‌ కాలేజీలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, సెంటర్లో ...

Read More »

మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఇందులో నవోదయ విద్యాల‌యానికి చెందిన వారు ఉన్నారన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కరోన పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 16 కు చేరిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌ ధరించాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా ...

Read More »

పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాల‌ వారోత్సవాల‌ సందర్భంగా బుధవారం ఐసిడిఎస్‌ ఎల్లారెడ్డి ఆద్వర్యంలో సిడిపివో సరిత, సిబ్బంది, అంగన్‌వాడి టీచర్‌ు ఎల్లారెడ్డి పట్టణంలోని బాలింతల‌ ఇంటికి వెళ్ళి తల్లిపాల‌ ప్రాముఖ్యతను వివరించారు. తల్లి పాలు తాగడం బిడ్డ జన్మహక్కు అని, తల్లిపాల‌లో శిశువు ఎదగడానికి సహాయపడే ప్రోటీన్లు, విటమిన్లు వంటివి సమపాళ్ళలో ఉండడం వల‌న తల్లిపాలు బిడ్డ యొక్క పోషక అవసరాల‌ను తీర్చడంలో సహాయపడడంతో పాటు బిడ్డ యొక్క పెరుగుదల‌ అభివృద్ధికి మరియు మానసిక అభివృద్దికి తోడ్పడతాయని ...

Read More »

నలుగురికి కరోన పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా నలుగురికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. వీరిలో నవోదయకి చెందిన వారు ముగ్గురు, నిజాంసాగర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 14 కు చేరిందన్నారు.

Read More »

వాటిని గుర్తించి సీజ్‌ చేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరల‌కు విక్రయించే మెడికల్‌ షాపుల‌ను గుర్తించి వెంటనే సీజ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, డ్రగ్‌ ఏ.డి రాజ్యల‌క్ష్మిల‌ను మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. అధిక ధరల‌కు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాద్యులైన మెడికల్‌ షాపుల‌పై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజల‌కు వాస్తవ ధరకు అందేట్టు చూడాల‌ని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రస్తుతం ...

Read More »

రక్తదానం

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చెందిన హీనా అంజుమ్‌ 30 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ పట్టణ కేంద్రంలోని అఖిల‌ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో బిగ్‌ సి మొబైల్స్‌ స్టోర్‌ మేనేజర్‌ రమేష్‌ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర ...

Read More »

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ...

Read More »

100 బెడ్లకు ఆక్సీజన్‌ ఏర్పాటు చేశాం

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. మంగళవారం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆర్మూరు ఏరియా హాస్పిటల్‌లోని అన్ని వార్డుల‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన పేషంట్లని అడ్మిట్‌ చేసుకోవడానికి 30 బెడ్స్‌తో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వెంటిలేటర్‌ అవసరమున్న వాళ్లను నిజామాబాద్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొవిడ్‌ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు ...

Read More »

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కరోనా వ్యాధి బారిన పడి కొందరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కరోణ వ్యాధికి మందు లేకపోవడం వల‌న ఎవరికైతే కరోణ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు ప్లాస్మా దానం చేసినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో చాలామంది కరోణ వ్యాధి నుంచి కోలుకుని నెగిటివ్‌ ఫలితాలు రావడం జరిగిందని వీరందరూ ప్లాస్మా దానం ...

Read More »

ఆపదలో ముందుండేది వైద్యులే

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఆపద వచ్చినా ముందు నిల‌బడేది ప్రభుత్వ వైద్యులేనని, వైద్యులు కనబడని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నారని, వైద్యుల సేవ‌లు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో ఆదివారం వైద్య శాఖ అధికారుల‌తో సీజనల్‌ వ్యాధులు, కరోనా పరిస్థితుల‌పై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాధికి భయపడకుండా వైద్యులు ప్రజల‌కు భరోసా ఇచ్చి వైద్యం అందించాల‌ని సూచించారు. కష్టకాలంలో ...

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి రక్తలేమితో జికె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి ఏ పాజిటివ్‌ రక్త దాత కామారెడ్డి పట్టణానికి చెందిన రంజిత్‌, ధర్మారం గురుకుల‌ జూనియర్‌ అసిస్టెంట్‌తో మాట్లాడి సేవ దృక్పధంతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో టీజీవిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ...

Read More »

సాధారణ ప్రజల‌ ప్రాణాలు కాపాడడం ముఖ్యం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ -19 కేసులు, మరణాల‌ వాస్తవ గణాంకాల‌ను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆరోపించారు. జూలై 25 నాటికి (రాత్రి 8 గంటల‌ వరకు) కేసుల‌ కోసం కోవిడ్‌ -19 కేసులు స్థితిగతుల‌పై ప్రజారోగ్య డైరెక్టర్‌ జారీ చేసిన సవరించిన మీడియా బులెటిన్‌ గణాంకాల‌ను దాచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని స్పష్టంగా తెలుపుతుందని షబ్బీర్‌ అలీ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ...

Read More »

50 పడకలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాల్కల్‌ రోడ్‌లోగల‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కరోనా పాసిటీవ్‌ వచ్చిన వారికి చికిత్స అందించటానికి 50 పడకలు మరియు అవసరమైన డ్రగ్స్‌ అతి త్వరలో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో ముందు ముందు కరోనా పేషెంట్లు ఎక్కువయితే ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ...

Read More »

అవసరమున్న రోగుల‌కు అందివ్వాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థకు సంబంధించిన కొత్త అంబులెన్స్‌ వాహనాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రెడ్‌ క్రాస్‌ కొత్త అంబులెన్స్‌ను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంబులెన్స్‌తో ప్రజల‌కు మరింత చేరువ కావాల‌ని, రక్తదానం క్యాంపులు నిర్వహించి, సేకరించిన రక్తాన్ని అవసరమున్న రోగుల‌కు అందివ్వాల‌ని తెలిపారు. రెడ్‌క్రాస్‌ మిగులు డబ్బుతో అంబులెన్స్‌ వాహనం కొనుగోలు చేసినందుకు కలెక్టర్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ ...

Read More »

చిన్నారికి రక్తదానం

కామరెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల‌సేమియా వ్యాధితో చికిత్స పొందుతున్న 1 సంవత్సరం పాపకు అత్యవసర సమయంలో అంజయ్య రక్తదానం చేశారు. గాంధారికి చెందిన 1 సంవత్సరం పాప మౌనిక తల‌సేమియా వ్యాధితో కామారెడ్డి ఆర్‌కె హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరముందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి కామారెడ్డికి చెందిన అంజయ్యతో రక్తదానం చేయించారు. అంజయ్య స్వచ్చందంగా రక్తదానం చేసి తన సేవ దృక్పథాన్ని ...

Read More »