Breaking News

Hyderabad

తుంబే ఆసుపత్రిలో అరుదైన చికిత్స

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోగల తుంబే ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కృష్ణచైతన్య తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలుడికి కడుపులో కంతి ఏర్పడిందని, గత కొన్నిరోజులుగా ఎన్నో ఆసుపత్రుల్లో పరీక్షించినా ఎవరు తమ వల్ల కాదన్నారని తెలిపారు. చివరికి తుంబే ఆసుపత్రిలో సంప్రదించగా బాలునికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా కడుపులో కంతిని గుర్తించారని అరుదైన చికిత్స ద్వారా కడుపులోంచి నాలుగున్నర కిలోల కంతిని బయటకు తీశామని ...

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించడంతో పాటు, జిల్లా కలెక్టర్లతో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులు కొనసాగించాలని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు కోసం కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రెసిడెన్షల్‌ ...

Read More »

మీరే నాయకత్వం వహించాలి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా మీరే కొనసాగాలని సంఘం నాయకులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కోరుతున్నారు. ఈ నెల 9న శ్రీరాంపూర్‌లో జరిగిన టిబిజికెఎస్‌ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ (సి.డబ్లు.సి) ఎంపి కవితని గౌరవాధ్యక్షురాలుగా కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానం ప్రతిని టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మంగళవారం హైదరాబాదులో ఎంపి కవిత ను కలిసి అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘం గౌరవాధ్యక్ష ...

Read More »

14న తెరాస పార్లమెంటరీ సమావేశం

నిజామాబాద్‌ ప్రతినిధి మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 వ తేదీన నిజామాబాద్‌ లో జరగనున్న టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంటరీ సమావేశం విజయవంతం చేసేందుకు బుధవారం హైదరాబాద్‌ లోని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు భిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, బోధన్‌, ఆర్మూర్‌, కోరుట్ల, ...

Read More »

దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లీనరీ లోపు 100 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల బాధ్యురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంపి కవితను మహేశ్‌ బిగాల కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎన్‌ఆర్‌ఐ శాఖల ఏర్పాటు, శాఖల పనితీరు, కార్యకలాపాలపై ఎంపి కవిత చర్చించి పలు సూచనలు చేశారు. ఇటీవలే ఏర్పడిన కెనడా దేశం టీఆర్‌ఎస్‌ శాఖతో కలిపి ...

Read More »

జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణి

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 19 జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు రేపు చెక్కుల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (టియుడబ్లుజే హెచ్‌-143) ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సర్‌, ఆందోల్‌ ఎమ్మెల్యే, జర్నలిస్ట్‌ ఉద్యమ నేత చంటి క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన ...

Read More »

రోజుకు వంద మంది సర్పంచ్‌లకు శిక్షణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లకు ఈ నెల 16వ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ రిసోర్సు పర్సన్‌ ఐదుగురికి చొప్పున సర్పంచ్‌లకు ఒక్కో బ్యాచ్‌కు యాభై మంది చొప్పున రోజుకు రెండు బ్యాచ్‌ల్లో వందమందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని పన్నెండు వేల మందికిపైగా సర్పంచ్‌లు ఉన్నారు. ఐదు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలను గ్రావిూణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ...

Read More »

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్‌ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్‌ అధికారులు ...

Read More »

వాట్సప్‌ గ్రూపులు ఆగిపోతే…..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌ చేశారో ఏమని కంప్లైంట్‌ చేశారో తెలియకుండా వరుసగా వాట్సాప్‌ మెసెంజర్‌లు బ్లాక్‌ అవుతున్నాయి. అందులో తొలి బాధితుడు ఎంపీ సీఎం రమేష్‌. టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. వాట్సప్‌ సమాచారం పరుగులు పెడుతున్న వేళ ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం ...

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ ఆంకర్ ప్రదీప్

31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ్డ ఆంకర్ ప్రదీప్. బ్రీత్ అనలైజర్ లొ 178 పాఇంట్స్ చూపించడంతొ పొలీసులు అదుపులోకి తీసుకున్నారు

Read More »

మరికొన్ని గంటల్లో పట్టాలపైకి మెట్రో

పదేళ్లక్రితం మొదలైన ప్రయత్నం.. మధ్యలో పరిస్థితులు మారాయి.. ప్రభుత్వాలు మారాయి.. నిర్మాణ సంస్థలు మారాయి.. కానీ ఒక్కటి మాత్రం మారలేదు.. అదే హైదరాబాద్‌లో మెట్రో రైలు నడపాలన్న సంకల్పం!  ఎన్నో అవాంతరాలు.. మరెన్నో ప్రయత్నాలు.. నేతల పట్టుదల.. నిర్మాణ సంస్థ కఠోరశ్రమ.. వెరసి మెట్రో స్వప్నం సాకారమైంది.. ఏసీలో ప్రయాణం.. నిమిషాల్లో చేరే గమ్యం.. భాగ్యనగరవాసులకు ఇప్పుడు ‘గాలిలో తేలినట్టుందే’ పాట గుర్తొస్తోంది.. ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ ప్రజలు ఏళ్ల తరబడి కలలుగంటున్న మెట్రో కార్యరూపం దాల్చింది. కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ...

Read More »

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకం

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకం తీసుకొచ్చారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిబంధనల ఉల్లంఘనపై సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీసులు మాత్రమే ఫొటోలు తీసి.. చలానాలు రాసేశారు. పాయింట్లు వేసి భయపెట్టేవారు. ఇక నుంచి ఆ అవకాశాన్ని జనానికి కూడా కల్పించారు. ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుంటే ఫొటో తీసి పంపిస్తే చాలు వెంటనే వాళ్లకు చలానా వస్తోంది. అంతేనా మీ ఫోన్ నెంబర్ కు కూడా పాయింట్లు యాడ్ అవుతాయి. పాయింట్లు పెరిగే కొద్దీ.. మీ ఖాతా డబ్బులు కూడా ...

Read More »

అవినీతి కేసులో షబ్బీర్ అలీ.. ఈడీ చార్జిషీట్!

  హైదరాబాద్: ఈడీ చార్జిషీట్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్‌, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్‌ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన.. షబ్బీర్ అలీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.

Read More »

ఇంజనీరింగ్‌ పనులకు సోషల్‌ ఆడిట్‌..!

 స్థానికుల సంతకం తప్పనిసరి  అవకతవకలకు చెక్‌  ఇప్పటికే గూగుల్‌ మ్యాప్‌ సహా ప్రతిపాదనలు రెడీ హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం.. అవినీతికి కేరాఫ్‌. అక్రమాల పుట్ట. వేయని రోడ్లు వేసినట్టు.. తరలించని నాలా పూడిక వ్యర్థాలను తరలించినట్టు.. అదీ ఆటో లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో.. చూపడంలో ఆరితేరిన ఘనులు. మళ్లీ మాన్‌సూన్‌ వచ్చింది. ఇప్పటి వరకు వర్షాలు అంతగా కురవకున్నా.. సాధారణంగా హైదరాబాద్‌లో ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఇలాంటి సీజనల్‌ పనుల కోస మే కొందరు ఇంజనీర్లు వేచి చూస్తుంటారు. వర్షాలకు ...

Read More »

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన పాప రెండంటే రెండు తప్పులు! బావిలో పడిన చిన్నారిని పైకి తీసే క్రమంలో కుటుంబసభ్యులు, గ్రామస్థులు, అధికారులు చేసిన రెండు తప్పిదాలే ఆ పాపను పాతాళానికి తోసేశాయి! గురువారం సాయంత్రం 6:30 గంటలకు చిన్నారి బోరుబావిలో పడిన విషయాన్ని 10 నుంచి 15 నిమిషాలలోపే తల్లితండ్రులు, స్థానికులు గుర్తించారు. అప్పటికి పాప పది అడుగులలోతునే ఉంది. దీన్ని గుర్తించిన తల్లితండ్రులు, స్థానికులు చిన్నారిని ...

Read More »

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

హైదరాబాద్:  బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారుడిది ఏ బ్యాంకు అయినా సరే గొప్ప శుభవార్త ఇది. ఆర్బీఐ ఇప్పుడు బ్యాంక్ నెంబర్ పోర్టుబులిటీని త్వరలో కల్పించబోతోంది. చాలా కాలంగా ఉన్న మొబైల్ నెంబర్లు మారిపోకుండా పోర్టుబులిటీ సౌకర్యం కల్పించినట్టు ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఓ కొత్త శకానికి ఆర్బీఐ తెర తీసింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఖాతా సంఖ్యతో మరో బ్యాంకు కస్టమర్‌గా మారినప్పుడు సైతం దాన్నే ఉంచుకోవచ్చు. త్వరలో ఈ అవకాశం కల్పించబోతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆధార్ నమోదు సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా ...

Read More »

హైదరాబాద్‌లో నెల రోజులుగా నో క్యాష్‌ బోర్డులు

90 శాతం ఏటీఎంలు మూతే నగదు కోసం హోం బ్రాంచీలకు ఖాతాదారుల పరుగు ఏటీఎంల సంఖ్య తగ్గించే చర్యలు నగరంలో నెలరోజులుగా 90 శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంల ముందు నో క్యాష్‌, నాట్‌ వర్కింగ్‌ అనే బోర్డులను రోజూ పెడుతుండటంతో నగరవాసులు హోం బ్రాంచీలకు పరుగుపెడుతున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళితే గంటల సమయం వృథా అవుతోందని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత నగదు చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు చేరడం లేదని పలువురు అధికారులు అంటున్నారు. ...

Read More »

అనుష్క మూడు చీరలు వాడింది : రాజమౌళి సతీమణి

హైదరాబాద్: బాహుబలి ది కంక్లూజన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. బాహుబలి సినిమాకు రాజమౌళి దర్శకులు కాగా ఆయన సతీమణి ప్రభా రాజమౌళి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేశారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రాజమౌళి సతీమణి మాట్లాడుతూ బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క ఒకే చీరలో కాదు మూడు చీరల్లో కనిపించిందని యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు బుదలిచ్చారు. అయితే సెకండ్ పార్ట్‌లో మాత్రం ఎక్కువ చీరలు వాడినల్లు తెలిపారు.

Read More »

ఆర్టీసీ ప్రయాణికులకు నిలువనీడేది?

గ్రేటర్‌ పరిధిలో 2300 బస్‌షెల్టర్ల అవసరం ఉండగా 1300 బస్‌షెల్టర్లే ఉన్నాయి. మరో వెయ్యి బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా.. ఆ దిశగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇక కొత్తగా నిర్మించే బస్‌షెల్టర్లను ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తామన్న అధికారుల ప్రకటనలు నెలలు గడిచినా కార్యరూపం దాల్చడం లేదు. అంతేకాదు.. గ్రేటర్‌ పరిధిలో 116 ప్రాంతాల్లో అత్యవసరంగా 150 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆర్టీసీ నివేదిక సమర్పించినా.. అదీ కాగితాలకే పరిమితమైందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిత్యం వేలల్లో ...

Read More »

29నే ఉగాది : గంగు భానుమూర్తి

హైదరాబాద్‌: ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు సూచించారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో దృక్‌, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు మంగళవారం జరిగింది. శ్రీనివాస వాగ్ధేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవ హరించగా.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు, పలువరు సిద్ధాంతులు పాల్గొన్నారు. కాగా, ఉగాదిని 29వ తేదీన జరుపుకోవాలని ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా సూచించారు.

Read More »