Breaking News

International

భారత్‌ సర్కారుది నమ్మక ద్రోహం

  డోకా లా మాదే   1959లోనే నెహ్రూ అంగీకరించారు..  చైనా కూడా 1962 నాటిది కాదు భారత్‌కు పరోక్ష హెచ్చరికలు అమెరికా-చైనా బంధంపై వ్యతిరేక శక్తుల ప్రభావం బీజింగ్‌: భారత్‌-చైనా మధ్య మాటల ‘యుద్ధం’ కొనసాగుతోంది. సరిహద్దు రగులుతోంది. ‘సమస్యకు సరైన పరిష్కారం కనుగొనకపోతే భారత్‌పై చైనా యుద్ధానికి కూడా దిగవచ్చు’ అని ఆ దేశ విశ్లేషకులు హెచ్చరించేదాకా పరిస్థితి వెళ్లింది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతం భూటాన్‌ పరిధిలోకి వస్తుందని, అక్కడ చైనాసైన్యం రోడ్డు నిర్మించడమంటే ‘యథాతథ స్థితి’ని దెబ్బతీయడమేనని భారత్‌ …

Read More »

బెడ్‌రూంలోకి వెళ్లిన 11 ఏళ్ల బాలుడికి భారీ షాక్..!

అలాస్కా: బాలుడి పేరు జాచ్ లాండీస్.. వయసు 11 సంవత్సరాలు.. తన స్నేహితులతో ఆడుకుని ఇంటికి వచ్చాడు. కాళ్లు, చేతులూ కడుక్కుని తన బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కేకలు వేస్తూ, ఏడుస్తూ రూం నుంచి బయటకు పరుగెత్తకొచ్చాడు. కారణం ఏంటంటే.. ఓ పెద్ద ఎలుగుబంటి బాలుడి రూంలోకి వచ్చింది. కిటీకీ అద్ధాలను పగలకొట్టి లోపలికి ప్రవేశించింది. బాలుడి అరుపులు విన్న ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. రూంలోని సామాన్లను చెల్లాచెదురు చేసింది. గోడలను బలంతో కొట్టింది. ఈ క్రమంలో ఎలుగుబంటికి గాయాలయ్యాయి. దీంతో …

Read More »

ఒక టీచర్.. తన స్టూడెంట్స్‌తో దారుణం చేశాడు

ఫ్లోరిడా: గురువు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలంటారు. కానీ, ఫ్లోరిడాలో ఒక టీచర్, తన స్టూడెంట్స్‌తో దారుణం చేశాడు. శుక్రవారం ఈ విషయం బయటపడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ముగ్గురు బాలికలు కోర్టులో సాక్ష్యం చెప్పారు. అతడు, తమతో ఎంత నీచంగా ప్రవర్తించాడో వివరించారు. వారి సాక్ష్యం ఆధారంగా జడ్జ్ అతడికి 6 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీఆర్గాన్(28) అనే వ్యక్తి, స్థానికంగా ఒక స్కూల్లో పిల్లలకు ఈత నేర్పిస్తుంటాడు. ముగ్గురు బాలికలను అతడు …

Read More »

10 కోట్ల ఏళ్ల నాటి పక్షి శిలాజం!

బీజింగ్‌: భూమిపై డైనోసార్లు జీవించిన కాలం. అంటే.. దాదాపు 10 కోట్ల సంవత్సరాల క్రితం!! ఈ యుగంలో కర్పూర పచ్చనిధి లేదా సీమ గుగ్గిలంగా పరిగణించే జేగురు రంగు స్ఫటికంలో చిక్కుకున్న ఓ చిన్న పిల్ల పక్షిని చైనా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ స్ఫటికంలో.. పక్షి రెక్కలు, ముక్కు, తోక, ఇతరత్రా భాగాలు స్పష్టంగా కనిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 10 కోట్ల ఏళ్లనాటి స్ఫటికంలో ఇంత విస్పష్టంగా పక్షి శిలాజం కనిపించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మయన్మార్‌లోని ఓ గనిలో తవ్వకాలు జరుపుతుండగా …

Read More »

కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం తల్లి చేసిన నిర్వాకమిది

కువైట్: అనుకున్నదొకటి.. అయినదొకటి.. ఈ పాట తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుంటే ఒక్కోసారి మనం చేసే పనులు కూడా తారుమారు అవుతుంటాయి. ఓ ప్రతిఫలం ఆశించి ఓ పనిచేస్తే.. దానికి భిన్నమైనది ఎదురవుతుంటుంది. అలాంటి సంఘటనే కువైట్‌లో ఓ యువతికి జరిగింది. 25 ఏళ్ల ఓ యువతి అదే వీధిలో ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం కాస్తా తల్లికి చెప్పింది. అయితే వారిది డబ్బున్న కుటుంబం కావడంతో నోరు తెరిచి అడిగేందుకు వెనకడుగు వేసిందా తల్లి. బాగా …

Read More »

ట్రంప్‌ కారా! మజాకా!

అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడు ఉపయోగించే కారంటే.. మామూలుగా ఉంటుందా? ఆ కొత్త కారు గురించి ఆసక్తికరమైన విషయాలు..  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉపయోగిస్తున్న కొత్త కారును ‘బీస్ట్‌’ అని పిలుస్తున్నారు. జనవరిలోనే ఈ కారు ఉపయోగించాల్సింది. కానీ అప్పటికి ఆ కారు సిద్ధం కాలేదు. ఇలాంటి కార్లు మొత్తం 12 ఉంటాయి. …

Read More »

అమ్మ పుట్టినరోజునే ఆమెను హత్యచేశాడు. కారణం..

ఫ్లోరిడా: ప్రాణం పోసిన అమ్మ పుట్టిన రోజు వచ్చిందంటే ఆమె కడుపున జన్మించిన వారికి చెప్పలేని సంతోషం ఉంటుంది. అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని అత్రుతగా ఎదురుచూస్తారు. కానీ.. అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ యువకుడు విరుద్ధంగా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లిని ఆమె పుట్టిన రోజు నాడే కడతేర్చాడు. జోషూ లియోన్ కర్మోనా అనే 18 ఏళ్ల యువకుడు అమ్మను చంపేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూశాడు. ఆమె పుట్టిన రోజు నాడే ఆమెను చంపాలని ముహూర్తంగా ఎంచుకున్నాడు. అనుకున్న రోజు రానే …

Read More »

చనిపోయిన బామ్మ స్కానింగ్‌లో కనిపించింది..

లండన్‌: బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన లూయీస్‌ కోర్కిల్‌ అనే మహిళ 15 వారాల గర్భవతి. ఆస్పత్రికి వెళ్లి గర్భాన్ని స్కాన్‌ చేయించుకుంది. తర్వాత స్కానింగ్‌ చిత్రాలను చూసి లూయాస్‌ షాక్‌కు గురయింది. ఈ చిత్రాల్లో చనిపోయిన ఆమె బామ్మ ముఖం కనిపిస్తోంది. 2001లో తన 66వ ఏట బామ్మ చనిపోయింది. ‘‘మొదట స్కానింగ్‌లో బామ్మ ముఖం చూసి షాక్‌ అయ్యాను. ప్రింట్‌ తీసుకొని చూశాను. ఖచ్చితంగా అది బామ్మ ముఖమే. దీంతో, నాకు అమ్మాయే పుట్టబోతుందనుకున్నాను. డాక్టర్లు అబ్బాయి పుడతాడని చెప్పారు. బహుశా నా …

Read More »

ఒక్కసారిగా రంగు మారిన నీళ్లు… బెంబేలెత్తిన ప్రజలు!

స్పెయిన్: స్పెయిన్‌లోని వలిరా నదిలో ఉన్నట్టుండి నీరు మొత్తం ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ నీరు అసాధారణ రంగులో కనిపించినప్పటికీ విషపూరితమైనవి కావని సియోడిఅర్జెల్ నగర మేయర్ ప్రజలకు అభయమిచ్చారు. సమీపంలోని వాటర్ బాటిలింగ్ ప్లాంట్‌పై పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. గతేడాది స్పెయిన్ ఈశాన్య ప్రాంతాలతో పాటు కాటలోనియాలోని వేలాది మంది ప్రజలు అతిసార వ్యాధికి గురయ్యారు. దీనికి కారణం వాటర్ బాటిలింగ్ ప్లాంటు నిర్వాకమేనని తేలడంతో…. నీరు, పర్యావరణంపై ఈ …

Read More »

కాలేజీ అమ్మాయిల గదిలో ఎలుక.. ఏం చేశారంటే…

బొద్దింకలు, బల్లులు, ఎలుకలు వంటివాటిని చూస్తే అమ్మాయిలకు ఎంతో భయం. అలాంటిది ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు ఎంతో తెలివిగా ఓ ఎలుక బారి నుంచి తప్పించుకున్నారు. తమ గదిలో తిష్ఠ వేసిన ఎలుకను ఆ అమ్మాయిలు బయటికి పంపించిన తీరు అందరికీ నచ్చింది. జోడీ మెకిన్ అనే యువతి గదిలో ఓ ఎలుక ఉండటాన్ని గమనించింది. దాన్ని సాధ్యమైనంత త్వరగా బయటికి పంపించేయాలని నిర్ణయించుకుంది. తన స్నేహితురాళ్ళతో మాట్లాడింది. దానిని బోనులో పెట్టి, బంధించి చంపేయకుండా, కొత్తగా ఆలోచించి బయటికి పారిపోయేలా చేయాలని …

Read More »