Breaking News

jagtyal

కథలాపూర్‌లో రాళ్ల వాన

జగిత్యాల‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల‌ జిల్లా కథలాపూర్‌ మండలంలోని పోతారం, అంబారిపేట, తండ్రియా, గంభీర్‌ పూర్‌ గ్రామాల‌తో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలుల‌తో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఇటీవల‌ కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన తమను ఆదుకోవాల‌ని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read More »

అకాల‌ వర్షాలు అపార నష్టాలు

జగిత్యాల్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం జగిత్యాల‌ జిల్లా రాయికల్‌ మండలం రాజనగర్‌ గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్లవానతో వడ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రైతు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట మొత్తం ఇలా వర్షం పాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ల‌బోదిబో మంటున్నారు. అన్నమో రామ చంద్ర అంటూ తల‌లు పట్టుకుంటున్నారు. పూర్తిగా ఎండిన వడ్లు అధికారుల‌ షరతులు, మిల్ల‌ర్ల ఆగడాల‌తో తూకం చేయకుండా జాప్యం చేయడంతో రైతుల‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ...

Read More »

జగిత్యాల‌లో శాంతికమిటీ సమావేశం

జగిత్యా, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ఉన్నందున రంజాన్‌ పండుగ సందర్భంగా తీసుకోవల‌సిన ముందు జాగ్రత్తల‌పై కలెక్టర్‌ చాంబర్‌లో ముస్లిం పెద్దల‌తో జిల్లా కలెక్టర్‌ జి.రవి, ఎస్పీ సింధూశర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల‌ ప్రకారం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు ఉందని, రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున సామూహికంగా ప్రజలు ఒకే దగ్గర గుమిగూడి ఉండకుండా చూడాల‌న్నారు. గతంలో జరిగిన పండుగల‌లో క్రిస్టమస్‌, శ్రీరామనవమి, హనుమాన్‌ ...

Read More »

జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆందోళన

జగిత్యాల, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూరియా కొరత కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలను కాపాడుకునేందుకు వెంటనే జిల్లాకు సరిపడు యూరియాను తెప్పించి కొరత నివారించాలని కోరుతూ బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొరత కారణంగా తాము పంటలు నష్టపోతున్నామని ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని, ...

Read More »

ఇసుక డంపులపై పోలీసుల దాడులు

జగిత్యాల, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మపురి ఎస్‌.ఐ శ్రీకాంత్‌ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజారాం, జైన గ్రామంలో గల 70 ఇసుక డంప్‌ల పై దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 2100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేయడం జరిగింది. సీజ్‌ చేసిన ఇసుకను సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి అప్పగించడం జరిగింది. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, అక్రమంగా నిలువ ...

Read More »

చనిపోయి బతికింది…?

జగిత్యాల, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా సారాంగపూర్‌ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ తలకు గాయమవడంతో కుటుంబీకులు అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మ తదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో కనకమ్మ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె బతికే ఉందని గుర్తించి ఆనందంతో హుటాహుటిన ...

Read More »

జగిత్యాల ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపి అర్వింద్‌

జగిత్యాల, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోను, జగిత్యాలలో కూడా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, హనుమాన్‌ జయంతి రోజు నిజామాబాద్‌లో, ఎన్నికల ఫలితాల రోజున జగిత్యాలలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ కార్యకర్తల మీద తమ ప్రతాపాన్ని చూపించారని ఎంపి అర్వింద్‌ ధర్మపురి అన్నారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ సింధుశర్మతో ఎంపి అర్వింద్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాల రోజు జగిత్యాల జిల్లా రాఘవపేటలో జరిగిన విజయోత్సవ ర్యాలీని అక్కడి ఎస్‌ఐ అడ్డుకోవడమే కాకుండా ...

Read More »

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది

ఎంపి కవిత మెట్‌పల్లి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెట్‌ పల్లి బార్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు మద్దతు తెలిపింది. సోమవారం ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌ రావు నివాసంలో ఎంపి కవితని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కలిశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పుప్పాల లింబాద్రీ, సీనియర్‌ లాయర్లు రాజ్‌ మహమ్మద్‌, ఆనంద్‌ గౌడ్‌, వెంకట నరసయ్య, తెడ్డు ఆనంద్‌, ఆకుల సురక్ష తదితరులు ఎంపినీ కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ...

Read More »

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి

ప్రాంతీయ పార్టీల కూటమితో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం : ఎంపి కవిత మెట్‌పల్లి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ ఉండాల్సిన ప్రధాని తెలంగాణ, ఆంధ్ర ఇతర రాష్ట్రాల్లో తలదూర్చడం ఎంతవరకు సబబు అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్‌ అడుగుతున్నారని చెప్పారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలో మున్సిపల్‌ ఆఫీస్‌ సమీపంలో జరిగిన రోడ్‌ షోలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోడీ గ్రాఫ్‌ పడిపోయిందని, రాహుల్‌ గాంధీ పరిస్థితి కూడా ...

Read More »

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే టిఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. డాక్టర్‌ సంజయ్‌ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారని ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్‌ను కూర్చోబెట్టారని ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. ఆదివారం రాయికల్‌ మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత మాట్లాడారు. జగిత్యాల జిల్లా చేస్తామని చెప్పినట్లుగానే జిల్లా చేశామన్నారు. ...

Read More »

బిజెపికి లొల్లి ఎక్కువ పని తక్కువ

కోరుట్ల, ఏప్రిల్‌ 3 ఐలాపూర్‌లో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపికి లొల్లి ఎక్కువ ..పని తక్కువ.. కార్యకర్తలు ఉండరు.. ఓటు వేసే వాళ్ళు ఉండరు అని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కోరుట్ల మండలం ఐలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవితకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన బిజెపి అన్ని మరచి పోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి అసత్యాలను ...

Read More »

తెలంగాణ పౌరుషాన్ని డిల్లీలో చాటాను

జగిత్యాల, మార్చ్‌ 30 కోరుట్ల రోడ్‌షో లలో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో తెలంగాణ పౌరుషాన్ని డిల్లీలో చాటానని తెలిపారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. శనివారం రాత్రి కోరుట్ల టౌన్‌లో లక్ష్మీ థియేటర్‌, బుర్జు, వెంకటేశ్వర ధియేటర్‌ వద్ద జరిగిన రోడ్‌షోలలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేశానని తెలిపారు. ఎంపీగా మీరు గెలిపిస్తే నియోజకవర్గం పరిధిలో 15 వేల కోట్ల రూపాయల అభివద్ధి పనులను చేశానని చెప్పారు. ఎంపీగా నియోజకవర్గ ...

Read More »

కార్యకర్తలను కాపాడుకుంటా

నిజామాబాద్‌, మార్చ్‌ 30 కాంగ్రెస్‌ అభ్యర్థి మధుగౌడ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీకి మూలస్తంబాలైన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నిజామాబాద్‌ మాజి ఎంపీ మధు యాష్కి అన్నారు. శనివారం కోరుట్లలోని కింగ్స్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మధు యాష్కీ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పార్టీ అధికారంలో లేదని అధైర్య పడొద్దని మీకు ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా కలవచ్చని మీ కుటుంబ సభ్యునిగా మీకు తోడుంటానని మధుగౌడ్‌ భరోసానిచ్చారు. ...

Read More »

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య తెచ్చుకోదు..సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది.. మనం 16 గెల్చుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలో మనమే నిర్ణయించవచ్చని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ మండలం మొగిలిపేట, సిర్పూర్‌, మల్లాపూర్‌లలో రోడ్‌షోలో ప్రసంగించారు. బతుకమ్మతో కవిత, హాజరైన ప్రజలు పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న మన నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోనే ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాయికల్‌ మండలం బోర్నపెల్లి గ్రామంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సతీమణి రాధిక సంజయ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగిత్యాల నియోజకవర్గ అభివద్ధికి కషి చేసిన కవిత కోసం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతొ గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వ హయంలో ఎన్నో అభివద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు. బోర్నపెల్లి ...

Read More »

16 ఎంపీలను ఇస్తే కెసిఆర్‌ 116 చేస్తారు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 116 మంది ఎంపీలను కూడగడతారని నిజామాబాద్‌ ఎంపి కవిత చెప్పారు. దేశాభివద్ధికి దార్శనికత, జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జగిత్యాల, బాల్కొండ నియోజక వర్గాల్లో రోడ్‌షోలలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ బి.జె.పిలు దేశానికి చేయాల్సిన అభివద్ధిని చేయలేదని విమర్శించారు. మనరాష్ట్రం హక్కులు ...

Read More »

సిఎం కెసిఆర్‌ విజన్‌ దేశానికి దిక్సూచి : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం సాయంత్రం మెట్‌పల్లిలో కోరుట్ల నియోజక వర్గం టిఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేతో కలిసి మండలాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారంగా గ్రామ నాయకుల పనితీరును విశ్లేషించారు. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల అవసరాలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారం కోసం సూచనలు చేశారు. కోరుట్ల, మెట్‌ పల్లి టౌన్‌ లపై ...

Read More »

ఎంపి కవిత గెలుపుకోసం కుల సంఘాల విరాళాలు

జగిత్యాల, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో ఎంపి కవితను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సర్వత్రా సుముఖత వ్యక్తమవుతుంది. అంతేగాకుండా కల్వకుంట్ల కవిత గెలుపు కోసం ఏకగ్రీవ తీర్మానాలు, కులసంఘాలు విరాళాలు సైతం అందజేస్తున్నారు. ఆ వివరాలు… జగిత్యాలలో పద్మశాలి సంఘం రూ.1,00,116, సీనియర్‌ సిటిఎం ఫోరమ్‌ రూ.1,01,116, ఒడ్డెర సంఘం రూ. 50,000, మున్నూరుకాపు సంఘం రూ.25,000, నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రూ.25,000, రజక సంఘం రూ. 25,000, స్వర్ణ కార సంఘం రూ.25,000, రైతు ...

Read More »

దేశ రాజకీయాలకు కెసిఆర్‌ నాయకత్వం ఎంతో అవసరం

జగిత్యాల, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్‌ లాంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఎంతో అవసరమని, ఈ నెల 19న నిజామాబాద్‌లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంపి కవిత కోరారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌తో కలిసి ఆమె మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులు దేశభక్తి, రామమందిరం పేరిట ప్రజల్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం ...

Read More »

గల్ప్‌ బాధితులకు అండగా తెలంగాణ జాగృతి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కోసం ఏజెంట్లను నమ్మి లక్షలు అప్పు చేసి గల్ఫ్‌ వెళ్తే అక్కడ పని, వీసా సరిగా లేదని, పని దొరకక నానా కష్టాలు పడ్డ 13 మందికి తెలంగాణ జాగతి ఖతర్‌శాఖ అండగా నిలిచింది. వారిని స్వదేశానికి చేర్చడంలో సహాయపడింది. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్‌ మీట్‌లో తెలంగాణ జాగతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జిల్లా అధ్యక్షులు అమర్‌దీప్‌ గౌడ్‌ బాదితుల వివరాలు వెల్లడించారు. ఏజెంట్లను ...

Read More »