Breaking News

Kamareddy

రేషన్‌ డీలర్ల నిరసన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏళ్లతరబడి రేషన్‌డీలర్లుగా ప్రభుత్వం అందిస్తున్న నెలవారి సరుకులను ప్రజలకు అందజేస్తున్నామని, కానీ డీలర్లకు మాత్రం ఎలాంటి ఉద్యోగ భద్రత లేదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తున్న రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేయాలని డిమాండ్‌ …

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనంలో అంబలి కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. పలువురు దాతలు, అధికారులు అంబలి కేంద్రం నిర్వహణకు ముందుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి కేంద్రాలను, చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, అధికారులు ఉన్నారు. Email this page

Read More »

2019లోనూ భాజపాదే అధికారం

  తెరాస పాలనకు స్వస్తి పలకాలి – కేంద్ర సహాయమంత్రి రమేశ్‌ జిగాగి నాగి కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 ఎన్నికల్లో దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలుపు తథ్యమని బిజెపి శ్రేణులు ఆ దిశగా కష్టపడాలని కేంద్ర సహాయమంత్రి రమేశ్‌ జిగాగి నాగి సూచించారు. సోమవారం కామారెడ్లి జిల్లా కేంద్రంలో బిజెపి జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై రమేశ్‌ మాట్లాడారు. మోడి పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని, …

Read More »

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేసి పరిష్కరించాలని పెండింగ్‌ లేకుండా చూడాలని జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం జనహిత భవనంలో జిల్లా స్తాయి అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆరునెలల కాలంలో సాధించిన ప్రగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఓడిఎస్‌ పూర్తిచేసిన గ్రామాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చిలో చనిపోయిన డిఆర్‌డిఎ శాఖ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌ భార్యా, పిల్లలను సమావేశానికి పిలిపించి గెజిటెడ్‌ అధికారుల ద్వారా …

Read More »

ప్రజావాణిలో 49 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 49 ఫిర్యాదులు వచ్చినట్టు కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించినట్టు తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖాధికారులకు జిల్లా కలెక్టర్‌సత్యనారాయణ ఫిర్యాదులను పంపించారు. జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. Email this page

Read More »

ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని, అప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారని మండల న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా జడ్జి ఉదయ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎస్‌పిఆర్‌ పాఠశాలలో శనివారం నిర్వహించిన న్యాయచైతన్య సదస్సుకు ఆయనతో పాటు సీనియర్‌ సివిల్‌ జడ్జి జైరాజ్‌లు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయం, వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు …

Read More »

డిగ్రీ ప్రవేశాలను బయోమెట్రిక్‌ ఆధారంగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాలను బయోమెట్రిక్‌ ఆధారంగా నిర్వహించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌, టివియువి ప్రతినిదులు డిమాండ్‌ చేశారు. శనివారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, టివియువి రాష్ట్ర ఉపాద్యక్షుడు కుంబాల లక్ష్మణ్‌లు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో దోస్త్‌ 2016-17 డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించడం జరిగిందని, కొన్ని కళాశాలలు విద్యార్థులకు తెలియకుండానే అడ్మిషన్లు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇది పునరావృతం కాకుండా బయోమెట్రిక్‌ ద్వారా అడ్మిషన్లు జరపాలని కోరారు. …

Read More »

జాతీయ నాయకుల చరిత్రలను పాఠ్యాంశంలో చేర్చాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ విలువలను భవిష్యత్తు తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో జాతీయనాయకుల జీవిత చరిత్రలను చేర్చాలని శనివారం కామారెడ్డికి వచ్చిన ఎన్‌సిఇఆర్‌టి సభ్యుడు మురళీ మనోహర్‌కు తపస్‌ ప్రతినిదులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన్ను సన్మానించారు. అనేకరంగాల్లో విజయాలు సాధించినవ్యక్తులు, జాతీయ నాయకుల చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి జాతీయసమగ్రతను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో తపస్‌ నాయకులు రమేశ్‌ గౌడ్‌, గిరి, పటేల్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

వ్యవసాయాన్ని పండగ చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం దండగ అని గత ప్రభుత్వాలు అన్నాయని, వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి లక్ష్యమని రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో జరిగిన చర్చాగోస్టిలో మంత్రి హాజరై మాట్లాడారు. ఇకనుంచి రాష్ట్ర రైతులు అప్పుల చేయకుండా, ఇతరులపై ఆదారపడకుండా తమ పెట్టుబడులతో తామే వ్యవసాయం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎకరాకు 4 వేలు నగదు …

Read More »

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7,8 వార్డుల్లో నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణ పనులను శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్తిక సంఘం నిదులు రూ. 4 లక్షలతో 7వ వార్డులో, మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో 8వ వార్డులో పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, మోహన్‌, నాయకులు రాజేందర్‌, రాములు, శైలేందర్‌, భరత్‌, బలరాం, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »