Breaking News

Kamareddy

బాధిత కుటుంబానికి అండగా…

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బిబిపేట్‌ గ్రామానికి చెందిన బురెంకి అంజమ్మకు (30) 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. అంజమ్మ భర్త శ్రీనివాస్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో న్యూరో అత్యవసర చికిత్స నిమిత్తం 2 లక్షల రూపాయలు అవసరం వుండగా ప్రభుత్వ విప్‌ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఎల్‌వోసి కాపీని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ రాంరెడ్డి, కష్ణమూర్తి, దోమల సిద్దరాములు, అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ తదితరులున్నారు.

Read More »

కేసు నమోదు కాగానే బాధితునికి సహాయం

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగానే 25 శాతం సహాయం బాధితునికి ఆన్‌ లైన్‌ ద్వారా చెల్లిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో ఒక వంద 33 కేసులు నమోదు కాగా ఒక వంద రెండు కేసులకు ప్రభుత్వం సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. ఇరవై మూడు కేసులను పోలీసులు రిజెక్ట్‌ ...

Read More »

ధరణి పోర్టల్‌తో సులభతరం

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయడం సులభతరంగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే కొన్న వారి పేరుతో రికార్డులు మార్పు చేసి కొత్త పాస్‌ పుస్తకం నకలు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 59 వేల మంది వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో నమోదైనట్లు చెప్పారు. ...

Read More »

చెత్తను సంపద కేంద్రానికి తరలించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడవలసిన బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి పై ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకతి వనాల్లో నాటిన మొక్కలు వంద శాతం సంరక్షణ చేసే విధంగా చూడాలన్నారు. రోడ్‌ సైడ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు సంరక్షణ చేయాలని కోరారు. కంపోస్టు షెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. ...

Read More »

చలికాలంలో వ్యాప్తిచెందే వ్యాధులపై అవగాహన

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధులకు తోడు ప్రస్తుతం కరోనాను నివారణ, నియంత్రణ గురించి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు, వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో పాటించాలని డిఎం హెచ్‌వో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో అంటువ్యాధులు మరియు కోవిడ్‌ 19ను పూర్తిస్థాయిలోవ్యాప్తిని అరికట్టేందుకు విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. వైద్యుల సూచనలు, వ్యక్తిగత, ...

Read More »

ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం మహర్షి వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ మాట్లాడుతూ ఇద్దరు మహనీయుల జయంతి వేడుకలు ఒకే రోజు జరగడం గర్వంగా ఉందన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారతదేశ తొలి ప్రధాని, 530 సంస్థానాలను దేశంలో విలీనం చేసి ఉక్కుమనిషిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

రూ.1850 క్వింటాల్‌ ధర

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వేలో మొక్క జొన్నలు సాగుచేసిన రైతుల నుంచి కొనుగోలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బిక్కనూర్‌ మండల కేంద్రంలో శనివారం ఆయన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులనుద్దేశించి మాట్లాడారు. దళారుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.1850 క్వింటాల్‌ ధర నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలో 33 వేల ఎకరాలలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను ...

Read More »

రైతులు అధైర్య పడొద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివవారం కామారెడ్డి జిల్లా, ఎస్‌ఎస్‌ నగర్‌ మండలంలోని, అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఆదనపు కలెక్టర్‌ యాది రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ రైతుల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు రైతుల కోసం రైతు బంధు కానీ రైతు ...

Read More »

ప్లాస్మాదానం.. ప్రాణదానం….

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్‌ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన వ్యాపారి జలిగామ చంద్రశేఖర్‌ మానవత దక్పథంతో బి పాజిటివ్‌ ప్లాస్మాను సన్‌ షైన్‌ వైద్యశాల హైదరాబాదులో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని బాలు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో ...

Read More »

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పలు అభివద్ది పనులకు శుక్రవారం శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీబీపేట్‌ మండలంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని, జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో దాత తిమ్మన్నగారి సుభాష్‌ రెడ్డి స్వంత నిధులు సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ...

Read More »

కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. కామరెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చలికాలంలో, పండగల సందర్భంగా అధికంగా ఉండే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు ...

Read More »

మొక్కజొన్న మద్దతు ధర రూ.1850

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వానకాలం 2020 మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1850 నిర్ణయించి కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ, రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసిన రైతుల వివరాలను రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగినందున, పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు, ...

Read More »

దళారులకు అమ్మి మోసపోవద్దు

కామరెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులకు తమ ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డిసిసిబి వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, కామారెడ్డి ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, సొసైటీ చైర్మన్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అనుమతి లేని లక్కీ డ్రాలను నమ్మొద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ వారు స్థానిక సిరిసిల్లా రోడ్డులో గల ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో లక్కీ డ్రా నిర్వహిస్తుండగా కామారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేనందున లక్కీ డ్రా సీజ్‌ చేసి లక్కీ డ్రా నిర్వహిస్తున్న కోల వెన్ను, కొతిమేకర్‌ శ్యామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్సు అధికారి మాట్లాడుతూ ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత లక్కీ డ్రా లను నమ్మవద్దని ...

Read More »

జిల్లాలో 35 మొన్నజొన్న కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం 35 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుల నుంచి మొక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేయాలని సూచించారు. దళారుల వద్ద మొక్కజొన్నలు కొనుగోలు చేయవద్దని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మొక్కజొన్నలను ఇక్కడ కొనుగోలు చేయకూడదని హెచ్చరించారు. ...

Read More »

31 లోగా జియో ట్యాగింగ్‌ చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నాటిన మొక్కలకు ఈనెల 31లోగా జియో ట్యాగింగ్‌ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో జియో ట్యాగింగ్‌పై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా నాటిన మొక్కలు, ట్యాగింగ్‌ చేసిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్య, ఎక్సైజ్‌, మున్సిపల్‌, అటవీ, నీటిపారుదల, వ్యవసాయం తదితర శాఖలు నాటిన మొక్కలకు 100 శాతం జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. ...

Read More »

రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

కామారెడ్డి  అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సంధ్య 25 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణం వివేకానంద కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంశీధర్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల ...

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, గుండారం, ఎల్లాపుర్‌ తండా గ్రామానికి చెందిన మాలోత్‌ సుప్రియ 24 సంవత్సరాలు. ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణమే సుప్రియని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కాగా పురిటి నొప్పులు అధికం అవడంతో మార్గ మధ్యలో అర్గొండ గ్రామం వద్ద అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. మూడవ ప్రసవం కావడంతో పండంటి అడబిడ్డ జన్మించింది. తల్లి ...

Read More »

ఇదే బతుకమ్మ ప్రత్యేకత…

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మ పేర్చి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివద్ధి పథ లో నడిపించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించారన్నారు. గ్రామాభివద్ధికి ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామరెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 5 మందికి 5 లక్షల 580 రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,947 మందికి 29 కోట్ల 6 లక్షల 8 వేల 942 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు గోవర్ధన్‌ తెలిపారు. అలాగే కామారెడ్డి మున్సిపాటీలో నూతనంగా కొనుగోలు చేసిన తడి చెత్త, పొడి చెత్త వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి ...

Read More »