Breaking News

Kamareddy

31 లోగా జియో ట్యాగింగ్‌ చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నాటిన మొక్కలకు ఈనెల 31లోగా జియో ట్యాగింగ్‌ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో జియో ట్యాగింగ్‌పై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా నాటిన మొక్కలు, ట్యాగింగ్‌ చేసిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్య, ఎక్సైజ్‌, మున్సిపల్‌, అటవీ, నీటిపారుదల, వ్యవసాయం తదితర శాఖలు నాటిన మొక్కలకు 100 శాతం జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. ...

Read More »

రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

కామారెడ్డి  అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సంధ్య 25 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణం వివేకానంద కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంశీధర్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల ...

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, గుండారం, ఎల్లాపుర్‌ తండా గ్రామానికి చెందిన మాలోత్‌ సుప్రియ 24 సంవత్సరాలు. ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణమే సుప్రియని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కాగా పురిటి నొప్పులు అధికం అవడంతో మార్గ మధ్యలో అర్గొండ గ్రామం వద్ద అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. మూడవ ప్రసవం కావడంతో పండంటి అడబిడ్డ జన్మించింది. తల్లి ...

Read More »

ఇదే బతుకమ్మ ప్రత్యేకత…

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మ పేర్చి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివద్ధి పథ లో నడిపించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించారన్నారు. గ్రామాభివద్ధికి ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామరెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 5 మందికి 5 లక్షల 580 రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,947 మందికి 29 కోట్ల 6 లక్షల 8 వేల 942 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు గోవర్ధన్‌ తెలిపారు. అలాగే కామారెడ్డి మున్సిపాటీలో నూతనంగా కొనుగోలు చేసిన తడి చెత్త, పొడి చెత్త వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీ, రైతుల విజయం…

కామరెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కజొన్న ప్రభుత్వం కొనదు అనే ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్‌ మరియు రైతులు చేసిన దీక్షలు చూసి ప్రభుత్వం భయపడి శనివారం దిగివచ్చి మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిందని, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌ మరియు రైతుల విజయం అని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఇదేవిధంగా రైతులతో కలిసి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును కూడా రద్దు ...

Read More »

కరోనా పరీక్షలు పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకుండా చేసినవారికి ప్రశంస పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, ప్రథమ, ద్వితీయ కాంటాక్ట్‌ వ్యక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. సమావేశంలో ...

Read More »

రహదారి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి నెం.161 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిట్లం, బిచుకుంద మండలాలకు చెందిన 12 గ్రామాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైవే రోడ్డు ఎత్తుగా ఉండటం వల్ల పక్కన ఉన్న 12 గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి ...

Read More »

పార్టీలకతీతంగా పనిచేస్తాం…

కామరెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్‌ గ్రామ అభివధి కమిటీని గ్రామ ప్రజల సమక్షంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దూలం నారాయణ, కార్యదర్శిగా తెడ్డు సాయిలు, సహాయ కార్యదర్శిగా ఒడ్డెం రమేష్‌, కోశాధికారిగా కొత్తపల్లి నర్సింలు, ఉపాధ్యక్షులుగా పెద్దపోతనగారి స్వామీ, గడ్డమీది నరేష్‌, ఏడ్ల బాల్‌ సాయిలు, సుంకరి అశోక్‌లతో పాటు 30 మందిని కార్యవర్గ సభ్యులుగా మరియు సలహాదారులుగా ఎన్నుకున్నారు. వీరందరూ గ్రామ అభివద్ధికి పార్టీలకతీతంగా పని చేస్తామని అన్నారు. ...

Read More »

డిగ్రీలు, పిజిలు చదివారు.. ఇప్పుడేమయింది…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కారణంగా గత మార్చి నుండి పాఠశాలలు మూసివేయటంతో ప్రయివేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. అనంతరం రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దోమకొండ మండలానికి చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు పోతు కిషోర్‌ ఆత్మకు ...

Read More »

మహాధర్నా… పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద గురువారం నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర క్వింటాలుకు రూ. 1 వేయి 860 కల్పించాలని, సన్న రకం వడ్లు రూ. 2 వేల 500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా ...

Read More »

చుక్కాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సుందరీకరణ

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామంలో ఆలయానికి దేవి నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ రోజున గ్రామంలో స్వామివారి రధోత్సవం జరగనుంది. ఊరేగింపును దష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం అందమైన రంగులు, విద్యుతన దీపాలతో సుందరీకరణపనులు పూర్తిచేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్‌.వెంకటనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సంతోషకుమార్‌, అర్చకులు పరంధామచార్యులు, ప్రధానార్చకులు శ్రీనివాస చార్యులు, నరసింహ చార్యులు, సంజీవాచార్యులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, ...

Read More »

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న దసరా ఉత్సవాలను రద్దు చేయడం జరిగిందని పట్టణ సర్పంచ్‌ తునికి వేణు బుధవారం తెలిపారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున రావణ దహనం కార్యక్రమంతో పాటు అలాయి బలాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ...

Read More »

నిబంధనలు పాటించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. తహసిల్దార్‌ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ను ఈ నెల 25 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌ 10 చొప్పున మాదిరి రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. పకడ్బందీగా ధరణి ...

Read More »

ట్రిపుల్‌ ఐటీకి మోడల్‌ విద్యార్థులు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట మోడల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని షకీనా బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కె.వినీల్‌ కుమార్‌ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా తెలిపారు. జిల్లాలోని బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలో గల తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు బాసర త్రిబుల్‌ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ రాజారెడ్డి తెలిపారు. ...

Read More »

వాహనాల తనిఖీ

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలో గల టోల్‌ గేట్‌ వద్ద అధిక లోడుతో వెళుతున్న వాహనాలను మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ సింగం శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలకు ఆయన జరిమానాలు విధించారు. రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అధిక లోడుతో వెళితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలు ఎవరు నడప వద్దని ...

Read More »

మందుబాబును తట్టిలేపిన గోవు

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జొక్కల్‌ మండల కేంద్రంలో బుధవారం ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోగా అటుగా వెళ్తున్న ఆవు వచ్చి అతన్ని తట్టిలేపే ప్రయత్నం చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి లేచే వరకు గోవు ప్రయత్నం చేసింది. చివరికి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూగ జీవి వచ్చి అతన్ని లేపడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Read More »

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన నగేష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల కాలంలోనే 300 యూనిట్ల ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 40 మందికి 40 లక్షల 5 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల 942 మందికి 29 కోట్ల 6 లక్షల 10 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లావానితో సమానంగా పెంచాలన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 26 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవన్‌లో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి స్వీకరించారు. రెవెన్యూ 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 11, వ్యవసాయానికి 3, విద్యుత్‌కు సంబంధించి 2 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఏవో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »