కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండ లక్ష్మణ్ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ, యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రామారెడ్డిలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇసాయిపేట నరేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
Read More »రైతు ఆదాయం రెండింతలు చేసేందుకే…
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపి చట్టరూపం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామంలో పాలాభిషేకం చేశారు. మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టించి పండించిన తమ పంటకు మద్దతు ధరతో పాటు, పంటను తమకు వీలైన చోట అమ్ముకోవడానికి మార్కెట్ కూడా ఉంటుదని ప్రధానమంత్రి నరేంధ్ర మోది భరోసా ఇచ్చారన్నారు. ముఖ్యంగా రైతులను ...
Read More »ప్లాస్మాదానం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు బి పాజిటివ్ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ అసోసియేట్ మేనేజర్ కాశేట్టి ఆంజనేయులు సహకారంతో బి పాజిటివ్ ప్లాస్మాను యశోద వైద్యశాలలో అందజేసి ప్రాణాలు కాపాడారు. 15 రోజుల క్రితం కూడా ఎల్లారెడ్డి చెందిన పేషెంట్‌కి కిమ్స్ వైద్యశాలలో ప్లాస్మా అందజేశారు. ఒక ...
Read More »కరోనా పరీక్షలకు కిట్లు అందుబాటులో ఉంచాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టరేట్ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ వైద్యులతో మాట్లాడారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో మాట్లాడిన ప్రైమరీ, సెకండరీ వ్యక్తులకు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని వైద్యులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసంలో వసతులు లేకపోతే ఆరోగ్య కేంద్రంలో క్వారంటైన్ ఏర్పాటుచేసి ఉంచాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన ...
Read More »తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 26 చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ యూత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇసాయిపేట నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటనికి ఆద్యులు, తెలంగాణ వీర వనిత, ఆంధ్ర మహాసభ సభ్యులు, ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని, తన సొంత భూమి ని అక్రమంగా ...
Read More »పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్‌లో శుక్రవారం పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పల్లె ప్రకతి వనంలో నాలుగు వేల మొక్కలు ఉండే విధంగా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. రైతు వేదిక భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని పేర్కొన్నారు. పిట్లం మండలం కుర్తి గ్రామంలో రైస్ మిల్లు ను పరిశీలించారు. ...
Read More »లక్ష్యానికి అనుగుణంగా తయారుచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలతో గ్రామీణ ప్రజలకు మానసిక ప్రశాంతత లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్, గాంధారి మండల కేంద్రాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని చెప్పారు. ఈనెల 27లోగా రైతు వేదిక భవనాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్, గాంధారిలోని రైతు వేదిక ...
Read More »నడక దారి ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్బన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అర్బన్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మ్యాప్ చూశారు. పార్కు లో నడక దారి ఏర్పాటు చేయాలని సూచించారు. మియావాకీ విధానంలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ ...
Read More »మందుల చట్టం నిబంధనలు పాటించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత ఔషద దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ మందులు, యాంటి బయోటెక్స్, ఇతర మందుల ఎంఆర్పి ధరలు, నిలువ, నాణ్యత పరిశీలించారు. అదేవిధంగా అమ్మకం, కొనుగోలు బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్ పయిరి మందులు ఎప్పటికప్పుడు తొలగించాలని, కస్టమర్లకు తప్పనిసరిగా కొనుగోలు బిల్లులు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ...
Read More »అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి, భూంపల్లి గ్రామ శివారులోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే సర్పంచ్, కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూంపల్లిలోని అంబరీషుని గుట్టపై ఉన్న పల్లె ప్రకతి వనాన్ని సందర్శించారు. నాటిన మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంకీ ...
Read More »‘దోస్త్’ ప్రక్రియలో అక్రమాలకు తెరలేపిన డిగ్రీ కళాశాలలు
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్ఎస్ఎఫ్, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దోస్తు అడ్మిషన్ల ప్రక్రియలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వాటికి అనుబంధంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలోని విద్యార్థులను వారికి తెలియకుండానే వారి ఫోన్ నెంబర్లు బదులు అధ్యాపకులు మరియు ఇతరుల ఫోన్ నెంబర్లతో అడ్మిషన్లను భర్తీ చేయడం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్ ...
Read More »అభివృద్ది పనులు ప్రారంభం
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుమారి నిట్టు జాహ్నవి మరియు నిట్టు వేణుగోపాల్ రావు సహకారంతో మంగళవారం దేవునిపల్లి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరీ స్వామి ఆధ్వర్యంలో ఎస్సి కాలనీలో ఎస్‌సిఎస్‌పి (ఎస్ఎఫ్సి) నిధులలో భాగంగా 20 లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీ మరియు మురుగు నీటి కల్వర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా 35వ వార్డు కౌన్సిలర్ పోలీసు క్రిష్ణాజీరావు మరియు మాజీ సర్పంచ్ ...
Read More »25 లోగా పూర్తి చేయాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం టెలి కాన్ఫరెన్సు ద్వారా ఆర్ఓలు, పంచాయితీరాజ్ ఇఇ డిఇ, ఎఇలతో రైతు వేదికల నిర్మాణ పనులను సమీక్షించారు. జిల్లాలో 104 క్లస్టర్లలో రైతు వేదిక భవనాలు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన 71 రైతు వేదిక భవన నిర్మాణాలు ఈ నెల 25 లోగా పనులు పూర్తి చేసుకోవాలని, ...
Read More »కామారెడ్డిలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వి. లక్ష్మారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో గొర్రెలకు, మేకలకు పిపిఆర్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పిపిఆర్ టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గొర్రెల మార్కెట్ యార్డ్ కోసం రూపాయలు 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉపాధి ...
Read More »ఫోన్ ఇన్‌లో 22 ఫిర్యాదులు
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేటులో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో 22 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, తీసుకున్న చర్యలపై రిపోర్టు సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ 8, జిల్లా గ్రామీణాభివద్ధి 3, సివిల్ సప్లయ్ 2 వ్యవసాయం, విద్య, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ, కామారెడ్డి మున్సిపాలిటీ ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు రావడం జరిగింది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి ...
Read More »క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున అధికారులందరూ వారి హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సెల్ కాన్ఫరెన్సు ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులు తహశీల్దార్, అధికారులు వర్షాలు, వరదలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మండల వారిగా సమీక్షించారు. ఏ సమయంలో అడిగినా వివరాలు అందించే అధికారులందరూ తమ హెడ్ క్వార్టర్స్‌లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ...
Read More »అనారోగ్యంతో ఉంటే ఆ మాత్రలు వేయొద్దు
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి 1-19 వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వైద్య అధికారులు, ఐసిడిఎస్, మున్సిపల్, విద్యాశాఖ, మెప్మా అధికారులతో వచ్చే అక్టోబరు 5 నుండి 12 వరకు నిర్వహించే 9 వ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యనిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ...
Read More »మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో ఎండ్రియాల్ గ్రామానికి చెందిన వినోద్ మరియు కామారెడ్డికి చెందిన విజయ్ గౌడ్ సకాలంలో స్పందించి వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలు మాట్లాడుతూ గత ...
Read More »సి విటమిన్ పండ్ల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం మహ్మదాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో కరోనా వ్యాధి సోకిన వారికి అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రేవతి శ్రీనివాస్ చేతుల మీదుగా సి విటమిన్ సంబంధించిన పండ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, ...
Read More »ఎంఐఎం మెప్పు కోసమే…
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రాంతం నిజాం ఆధీనంలోనే ఉండిపోయిందని, రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ఎంతో మంది సాయుధ పోరాటం చేశారని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగా సెప్టెంబర్ 17, ...
Read More »