Breaking News

Kamareddy

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కాలోజీవాడి గ్రామానికి చెందిన పైడి జగన్‌ రెడ్డి (59) తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ దేశానికి గొర్ల కాపరిగా వెళ్లాడు. గత 17 రోజుల క్రితం విధినిర్వహణలో అక్కడే గుండె పోటుతో మతి చెందాడు. విషయం తెలుసుకొని మతుడు పైడి జగన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను గల్ఫ్‌ వెల్పేర్‌ అండ్‌ కల్చరల్‌ అద్యక్షుడు పాట్కూరి బసంత్‌ రెడ్డి, ఓర్ల శ్రీనివాస్‌ రెడ్డి మతుని కుటుంబాన్ని ...

Read More »

ప్రతిభా పరీక్ష విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభా పరీక్షను ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు పదవ తరగతి చదువుతున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు వారి యొక్క పేర్లను క్రింద తెలుపబడిన నంబర్లకు నమోదు ...

Read More »

హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న లచ్చా గౌడ్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Read More »

ఏసిబికి చిక్కిన అధికారి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపెట్‌ గ్రామంలోని స్మశాన వాటిక బిల్లు నిమిత్తం కాంట్రాక్టర్‌ వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కిన మాచారెడ్డి మండల ఈజీఎస్‌ ఎపిఓ రాజేందర్‌.

Read More »

జాహ్నవి అను నేను ….

కామారెడ్డి, జనవరి 27 కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి ఎంపికయ్యారు. 25 ఏళ్ల యువ రాజకీయ నాయకురాలిగా కామారెడ్డి రాజకీయ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళ, కామారెడ్డి మునిసిపల్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సష్టించారు. ఇంతకీ ఎవరీ జాహ్నవి? కామారెడ్డి రాజకీయ వేత్త, తెరాస పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ నిట్టు వేణు గోపాల్‌ రావు కూతురు. ఎం.ఎ, బీఈడీ పూర్తి చేసి, లా కాలేజీలో ...

Read More »

ఒక్క ఓటే గెలుపు తీర్పు చెప్పింది

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఒక్క ఓటు విలువ కూడా ఎంతో విలువైనదని చాలా సందర్బాలో విన్నాం, చూశాం. అది కళ్లముందు మరోసారి ప్రత్యక్షమైన రోజు శనివారం వచ్చింది. కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో బిజెపి అభ్యర్థి పండ్ల ప్రవీణ్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మసూద్‌ అలీని ఓడించి ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఓడిపోవడం, అదీ ఒక్క ఓటు తేడాతో పరాజయాన్ని చవిచూడడం కామారెడ్డిలో టాక్‌ ఆఫ్‌ ది ...

Read More »

మిషన్‌ గులాబి షురూ

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మిషన్‌ ఆకర్ష్‌ గులాబికి తెరలేపారు. స్వతంత్ర అభ్యర్తులుగా గెలుపొందిన వారిని మిషన్‌ ఆకర్ష్‌తో పార్టీలోకి చేర్చుకున్నారు. ఎన్నికల తంతు ముగిసిన శనివారం తొలిరోజునే నలుగురిని పార్టీ కండువా కప్పి శిబిరంలో చేర్చుకోగా మరో ఇద్దరిని సైతం ఈరాత్రికే పార్టీలోకి ఆకర్షిస్తున్నట్టు సమాచారం. ఛైర్మన్‌ ఎన్నిక వరకు అందరిని శిబిరానికి తరలించనున్నట్టు తెలుస్తోంది.

Read More »

కామారెడ్డి మునిసిపాలిటీ తెరాస కైవసం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మునిసిపల్‌ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయ దుందుభి మోగించింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఎవరి నియోజకవర్గ పరిధిలో వారి మునిసిపాలిటీల్లో తెరాస జెండా ఎగురవేయాలని లేని పక్షంలో దాని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇదివరకే హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆ పార్టీ మొత్తం 49 స్థానాలకు గాను 29 స్థానాల్లో ...

Read More »

కస్తూర్బా పాఠశాలలో బాలిక దినోత్సవం

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియల్‌ గ్రామంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలికల ప్రాముఖ్యతను తెలియచేస్తూ బాలికల పట్ల చూపుతున్న నిరాదరణను నాటికలు, నృత్యాల ద్వారా విద్యార్థినిలు వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అంగన్‌వాడి పర్యవేక్షకురాలు నాగమణి మాట్లాడుతూ లింగనిర్దారణ పరీక్షలు ఎవరు చేయించినా నేరమని, సమాజంలో వివక్ష రూపుమాపాలని కోరారు. కుటుంబంలో పురుషునికి ఇచ్చిన ప్రాధాన్యత ...

Read More »

రీపోలింగ్‌లో 68.28 శాతం ఓటింగ్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ 41 వార్డు 101 పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 22 తేదీతో పోలిస్తే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది.

Read More »

బీబీపేట మండల కేంద్రంలో వాటరింగ్‌ డే

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పత్తి శుక్రవారం నిర్వహించే వాటరింగ్‌ డే సందర్భంగా శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలోని హరితవనంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రేమ కుమార్‌, పిడి డిఆర్‌డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపిడిఓ నారాయణ, తహశీలుదారు నర్సింహులు, గ్రామ సర్పంచ్‌ టి.లక్ష్మీ, ఉప సర్పంచ్‌ సాయినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని లింగపూర్‌ గ్రామంలో శుక్రవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించి బాలికల చేత సురక్ష ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ కుటుంబంలో ఆడపిల్లల పట్ల చూపే తేడా మానుకోవాలని, అన్ని రంగాలలో కూడ వారు రాణిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌ ఉమారాణి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు ప్రోత్సహించినా, బాల్య వివాహాలు నిర్వహించినా అంగన్‌వాడి సిబ్బందికి తెలియచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌ టి.పద్మ, మహిళ ఉపాద్యాయులు, ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎఎంసి గోదాములో ఏర్పాటు చేసిన కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ సందర్శించి చేపట్టిన పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టరు తేజస్‌ నందలాల్‌ పవర్‌, ఇన్‌ఛార్జ్‌ మున్సిపల్‌ కమీషనర్‌ శైలజ, రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీ 41 వార్డు 101 పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ పరిశీలించారు. తహశీల్దారు ...

Read More »

ఓటరు నమోదు, అవగాహన, విలువ కవితా సంపుటి ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌ శేషారావు ఓటరు నమోదు – అవగాహన – ఓటు విలువ అనే కవిత సంపుటి వెలువరించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శేషారావు పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కవితా సంపుటిని పూర్తిగా గ్రామీణ భాషలోరాసి అందరికి అర్థమయ్యేవిధంగా రూపొందించారు. కాగా శుక్రవారం కామారెడ్డి ఆర్‌డివో రాజేందర్‌ కుమార్‌, దోమకొండ ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ చేతుల మీదుగా ...

Read More »

ప్రశాంత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 22న బుధవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రశాంత పోలింగ్‌ నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా కలెక్టరు, జిల్లా సాధారణ పరిశీలకులు సందీప్‌ కుమార్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌ శ్వేత సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన తిలిపియా చందుసింగ్‌ (55), తిలీపియా దేకత్కవు (50) సంఘటన స్థలంలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేసి మృత దేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read More »

తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి బయంతో భారీ యెత్తున ఎలెక్షన్‌ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అభివ ద్ది పనులు చేయక, అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ వొట్లతో ప్రజలను మోసగించాలని చూస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రజలను మోసం చేయడానికి కామారెడ్డిలో లేని వారి వోట్లు నమోదు చేసి తద్వారా ఎన్నికల్లో గెలుపొందాలనే పన్నాగం పన్నారన్నారు. సోమవారం ప్రచారం ముగిసిన అనతరం విలేకరులతో ...

Read More »

ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలోని 49 వార్డులలో బోగస్‌ ఓట్ల విషయమై కామారెడ్డి గుడ్‌ సిటిజన్‌ ఫోరం తరఫున ఈనెల 18న ఆర్‌డివోకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని న్యాయవాది రజనికాంత్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ అయినటువంటి ఎన్నికలు అవినీతి రహితంగా, పారదర్శకంగా, ఓటర్లు సరైన అవగాహనతో తమ ఓటుహక్కు వినియోగించుకొని తద్వారా సాధికారతను సాధించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్ల ...

Read More »

కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ విస్తృత ప్రచారం

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ 3, 4, 5, 28, 26, 29, 30, 31, 45, 46, 47 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని, యువతకు నిరుద్యోగ భతి ఇస్తానని ఎగ్గొట్టిన ప్రభుత్వం తెరాస అన్నారు. కేజీ నుండి పిజి ...

Read More »

సదాశివపేట మునిసిపాలిటి తెరాస కైవసం చేసుకుంటుంది

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఎంపీ బి.బి పాటిల్‌, జాహీరాబాద్‌ ఎమ్మెల్యే మానిక్‌ రావు, సదాశివపేట మున్సిపాలిటీకి పోటీచేస్తున్న తెరాస కౌన్సిలర్‌ అభ్యర్థులు, తెరాస కార్యకర్తలు సదాశివపేట మునిసిపల్‌ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులు తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More »