Breaking News

Kamareddy

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

– కెసిఆర్‌ ఆటలు చెల్లవు కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ఇకపై కెసిఆర్‌, తెరాస ఆటలు చెల్లవని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ సర్పంచ్‌ పిరంగి రాజేశ్వర్‌తోపాటు అంబర్‌పేటకు చెందిన 500 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 18వ వార్డు మునిసిపల్‌ కౌన్సిలర్‌ ముదాం సిద్దమ్మ, మాజీ కౌన్సిలర్‌ ముదాం ఎల్లయ్యలు పార్టీలో చేరారు. వీరితోపాటు రాజంపేట, కొటాల్‌పల్లి, రాఘవపూర్‌, వెల్పుగొండ, ...

Read More »

పూజారి హత్యను నిరసిస్తూ విహెచ్‌పి ర్యాలీ

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ సాయిబాబా ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ హత్యను నిరసిస్తూ కామారెడ్డిలో శనివారం రాత్రి విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో వేకువజామునే సుప్రభాతం పెట్టిన పూజారిపై దుండగుడు దాడికి దిగి తీవ్రంగా గాయపరచగా పూజారి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. పూజారిని హత్యచేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం పూజారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ఎన్నికల విధులను అధికారులు సమన్వయంతో నిర్వహించాలి

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే అధికారులు పోలింగ్‌రోజు నాయకత్వం, సహకారం, సమన్వయంతో క్రియాశీలకంగా ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. డిసెంబరు 7న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి సెక్టోరల్‌ అధికారులు, అసెంబ్లీ స్తాయి మాస్టర్‌ ట్రెనర్స్‌కు శనివారం జనహితలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌రోజు తీసుకోవాల్సిన చర్యలు, తదితరాలపై వివరించారు. పోలింగ్‌రోజు ఉదయం 7 గంటలకు ముందే నిర్వహించే మాక్‌ పోలింగ్‌ అనంతరం ...

Read More »

వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో ప్యానుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

Read More »

తెరాసలో చేరికలు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ, బీబీపేట మండలాల్లోని ఆయా పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెరాస పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు ఆంజనేయులు, బల్వంత్‌రావు తదితరులున్నారు.

Read More »

సెక్టోరల్‌ అధికారుల విదులు ఎంతో ముఖ్యమైనవి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ అధికారుల విధులు ఎంతో ముఖ్యమైనవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సెక్టోరల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సదుపాయాలు, రూట్ల వారిగా వివరాలు, ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత పలు దఫాల్లో సెక్టోరల్‌ అధికారుల విదులు బాధ్యతాయుతంగా ఉంటుందని, అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమీషన్‌ ...

Read More »

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం సూచిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు పారదర్శకంగా, జవాబుదారిగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. రాజకీయ పార్టీ నుంచి ఏజెంట్లను ఎన్నికల సమయంలో తీసుకోవల్సిన అనుమతులు, ముందస్తు చర్యలపై అధికారులకు గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిరోజు జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు పూర్తి సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఎన్నికల తేదికి వారంరోజుల ...

Read More »

70 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడతాం

– స్వామి పరిపూర్ణనంద కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడుతుందని స్వామి పరిపూర్ణనంద అన్నారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన బిజెపి విజయభేరి యాత్రలో పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రజలు బిజెపికి పట్టం కట్టారని, 22 రాష్ట్రాల్లో పార్టీ సుపరిపాలన అందిస్తోందని పేర్కొన్నారు. అదే పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వందేమాతరం మీద అభ్యంతరం తెలిపిన అభ్యర్థి కావాలో, అవినీతి చేసిన అభ్యర్తి ...

Read More »

మచ్చలేని నాయకుని గెలిపించాలి

– అధర్మ, అవినీతి పార్టీలను తరిమికొట్టాలి – స్వామి పరిపూర్ణనంద పిలుపు కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతి, అధర్మ పార్టీలను తరిమికొట్టి మచ్చలేని వ్యక్తులను గెలిపించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు స్వామి పరిపూర్ణనంద పిలుపునిచ్చారు. గురువారం రాత్రి కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రధాని మోడిచేస్తున్న సంక్షేమ పథకాలే కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని పేర్కొన్నారు. కామారెడ్డికి చెందిన ఇరుపార్టీల అభ్యర్థులు గాంధీ విగ్రహం వద్ద అవినీతికి పాల్పడినట్టు విమర్శలు ...

Read More »

రాబోయేది తెరాస ప్రభుత్వం

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో 16వ వార్డు నుంచి 23వ వార్డు వరకు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హాజరై మాట్లాడారు. కెసిఆర్‌ చేస్తున్న వందలాది సంక్షేమ పథకాలే తెరాస ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాయన్నారు. ప్రజల్లో తెరాసకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. వివిధ వార్డులకు చెందిన ఆయా పార్టీ కార్యకర్తలను తెరాసలోకి ఆహ్వానించి కండువాలు వేశారు. ...

Read More »

8 నుంచి సైన్స్‌ఫేర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ పాఠశాలలో ఈనెల 8వ తేదీ నుంచి 10 వరకు జిల్లా స్థాయి గణిత వాతావరణ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎగ్జిబిషన్‌లో వెయ్యిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటారన్నారు. ఎగ్జిబిషన్‌ మూడురోజులపాటు వీక్షించడానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.

Read More »

రాశివనాన్ని మరింత అభివృద్ది చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న రాశి వనాన్ని మరింత అభివృద్ది చేయడానికి అన్ని చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబరులో జరిగిన రాశివనం నిర్వహణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రాశివనం నిర్వహణ అభివృద్ది కోసం పలు సూచనలు చేశారు. రాశివనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సుపరిపాలన కోసం బిజెపిని గెలిపించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో అందిస్తున్నట్టుగా రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే అది బిజెపివల్లే సాధ్యపడుతుందని ఆ పార్టీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం గురువారం సిఎస్‌ఐ మైదానంలో జరగనున్న పరిపూర్ణనంద స్వామి బహిరంగ సభకు సంబందించిన ఏర్పాట్లను పరిశీలించారు. స్వచ్చమైన పరిపాలన సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ బిజెపి వల్లే సాధ్యపడుతుందని స్వామి పరిపూర్ణనంద బిజెపిలో చేరారన్నారు. పార్టీలో చేరిన తర్వాత స్వామిజి తొలి రాజకీయ పర్యటనను కామారెడ్డి ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల పరిధిలోని పొందుర్తి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పాతరాజంపేట గ్రామానికి చెందిన లక్కాకుల చంద్రయ్య (45) వ్యక్తిగత పనుల నిమిత్తం మోటరు సైకిల్‌పై వెలుతుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ఆత్మహత్య యత్నానికి పాల్పడ కండక్టర్‌ మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తనను అక్రమంగా సస్పెండ్‌ చేశారని పేర్కొంటూ గతనెల 28న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రాజా సులేమాన్‌ అనే కండక్టర్‌ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. దేవునిపల్లి సద్గురుకాలనీలో నివాసముంటున్న రాజా సులేమాన్‌ ఆర్టీసి కండక్టర్‌గా విదులు నిర్వహిస్తున్నాడు. అతన్ని విదుల నుంచి సస్పెండ్‌ చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు ...

Read More »

జడ్పి మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు కాంగ్రెస్‌లో చేరిక

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లా జడ్పి మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు అన్వర్‌ పాషా బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో షబ్బీర్‌ అలీ పాషాకు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ది చేస్తుందనే దీమాతోనే పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, కారంగుల అశోక్‌రెడ్డి, పండ్ల రాజు తదితరులున్నారు.

Read More »

భారీ మెజార్టీతో గెలిపించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ కోరారు. దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బుధవారం తెరాసలోకి రావడం ఆయన కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే కామరెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రావు, ప్రేమ్‌కుమార్‌, బల్వంత్‌రావు, పిప్పిరి ఆంజనేయులు తదితరులున్నారు.

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ అన్నారు ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సువిద యాప్‌ ద్వారా, పివిజల్‌ యాప్‌ద్వారా వచ్చిన అనుమతులు, ఫిర్యాదులపై సమీక్షించారు. పోలింగ్‌ సిబ్బంది వివరాలను ఎన్‌ఐసి ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్ల వివరాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ అవసరమున్న స్టేషన్ల వివరాలు, దివ్యాంగుల కోసం చేస్తున్న ...

Read More »

కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆద్వర్యంలో రాస్తారోకో

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజాంసాగర్‌ చౌరస్తాలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్‌ ఆపరేటర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అందరి ఇళ్లకు వినోదాన్ని అందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌ కోరారు.

Read More »

దక్షిణ ప్రాంగణం పట్ల వివక్షత వీడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ ప్రాంగణం పట్ల వివక్షత విడనాడాలని విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బలరాం నాయక్‌ను సోమవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించినప్పటికి కోర్సులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయన్నారు. ఇక్కడి భవనాలను వేరే విద్యాసంస్థల కిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా పిజి కోర్సులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం కలుగుతుందని ...

Read More »