Kamareddy

ఫోటో ఆల్బ‌మ్‌ సమర్పించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 9 లోగా రైతు వేదికలు పూర్తి చేసుకోవాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ శరత్‌ పంచాయితీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం జనహితలో రైతు వేదికలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల‌ 9 లోగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేసి ఫోటో ఆల్బ‌మ్‌ సమర్పించాల‌ని ఆదేశించారు. రైతు వేదిక భవనాల‌ చట్టూ పెద్ద మొక్కలు పచ్చదనం పెంపొందించాల‌ని, విద్యుత్‌, తాగునీటి నల్లాలు తదితర ...

Read More »

బ్యాంకు నుంచి ఇప్పించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల‌ రైతుల‌కు పంట రుణాల‌ను వ్యవసాయ అధికారులు బ్యాంకు నుంచి ఇప్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల‌ వ్యవధిలో అన్ని మండలాల్లో 75 శాతం మంది రైతుల‌కు పంట రుణాలు అందే విధంగా చూడాల‌ని సూచించారు. బ్యాంకులో రైతు పెండిరగ్‌ రుణాలు ఉంటే వన్‌ టైం సెటిల్మెంట్‌ చేయాల‌ని సూచించారు. వారికి తిరిగి రుణాలు ఇప్పించాల‌ని ...

Read More »

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌తో నూతన శోభ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం భూంపల్లిలోని పల్లె ప్రకృతి వనంను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాల‌తో పల్లెల్లో నూతన శోభను సంతరించుకోనున్నాయని చెప్పారు. ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గుట్ట సమీపంలో వాహనాల‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాల‌ని కోరారు. ప్రతి వెయ్యి మొక్కల‌కు ఒక వన సంరక్షకుడు ఏర్పాటుచేసి నెల‌కు ...

Read More »

రాష్ట్రంలో కామారెడ్డి ఫస్ట్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల‌కు రూ.19 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో మంగళవారం ఐకెపి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్‌ రుణాల ల‌క్ష్యం‌ రూ.57 కోట్లకు ఇప్పటివరకు రూ.30 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 56 శాతం ల‌క్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ల‌క్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు కృషి ...

Read More »

సేవాభారతికి రూ.20 వేల‌ విరాళం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ బాధితుల‌కు సేవలందిస్తున్న సేవాభారతికి తమవంతు చేయూతగా 20 వేల‌ రూపాయల‌ విరాళాన్ని కామారెడ్డికి చెందిన రవి కిరణ్‌, రణజిత్‌ మోహన్‌ (ఏబివిపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు), వారి తండ్రి ధర్మరాజం జ్ఞాపకార్థం మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు జిల్లా సంఘచాల‌క్‌ బొడ్డు శంకర్‌, ఇందూర్‌ విభాగ్‌ ప్రచారక్‌ ఏలేటి రాజారెడ్డి, గోవర్ధన్‌, సేవాభారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

నివాళి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రణబ్‌ ముఖర్జీ అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, ఆయన దేశానికి ఎన్నో సేవ‌లు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి రాజ ముద్ర వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ...

Read More »

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామరెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానం చేసే వారికి కావల‌సిన రవాణా సదుపాయాల‌ను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా ...

Read More »

దివ్యాంగుడికి చేతికర్రల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వికలాంగుల‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నసురుల్లాబాదు మండలం నాచుపల్లికి చెందిన అబ్దుల్‌ అబీబ్‌ సాబ్‌ అనే దివ్యాంగుడికి సోమవారం చేతికర్రల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల‌ మేరకు పంపిణీ చేసినట్లు ఐసిడిఎస్‌ పిడి అనురాధ తెలిపారు.

Read More »

8 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జనహిత భవనంలో ఉపాధిహామీ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, స్మశాన వాటిక పురోగతిపై సమీక్ష చేశారు. కంపోస్టు షెడ్లను సెప్టెంబర్‌ 8 లోగా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రైతు కల్లాలు ప్రతి సాంకేతిక సహాయకుడు ఇరవై ఐదు చొప్పున పూర్తిచేయాల‌ని కోరారు. గ్రామాల్లో అర్హత గల‌ ...

Read More »

జిల్లా ముఖ్య అధికారి జన్మదినం నేడు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన జన్మదినం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ జనహిత భవన్‌లో కేక్‌ కట్‌ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి, వివిధ శాఖల‌ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »

పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ దుకాణాల్లో కార్డు వినియోగదారులు బియ్యం తీసుకోవడానికి వస్తేనే వారి వేలిముద్రతో బియ్యాన్ని అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నెల‌ 20వ తేదీ వరకు బియ్యాన్ని డీల‌ర్లు వినియోగదారుల‌కు అందించాల‌ని సూచించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరిగిన తహసీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీలో వడ్లను రైస్ మిల్లుల‌ ద్వారా సెప్టెంబర్‌ 2 ...

Read More »

రెండు కళాశాల‌లను ప్రారంభించాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజూరైన పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లను ప్రారంభించాల‌ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కి బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లు లేకపోవడం వ‌ల్ల‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కామారెడ్డి 6 జిల్లాల‌కు కేంద్రంగా ఉందని, ఇక్కడ టెక్నికల్‌ విద్యాసంస్థలు లేకపోవడం వ‌ల్ల‌ ఇతర ...

Read More »

వంద శాతం హాజరయ్యేలా చూడాలి

కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతుల‌కు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్లో విద్యాశాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. టీవీలు లేని పేద విద్యార్థుల‌ను గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాల‌యాల్లో పాఠాలు వినే విధంగా చూడాల‌న్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. విద్యార్థుల‌కు ఏమైనా సందేహాలుంటే ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాల‌ని కోరారు. ఆన్‌లైన్‌ తరగతుల‌ సమయంలో ...

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయేషా 28 సంవత్సరాల‌ గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తం బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన అంకాపు నవీన్‌ సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సకాలంలో స్పందించి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీల‌కు రక్తం ల‌భించడం లేదని అలా ఎవరైనా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నట్లు అయితే వారు 9492874006 నెంబర్‌కి ...

Read More »

మౌలిక వసతుల‌ ఏర్పాటుకు కృషి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మౌలికవసతుల‌ ఏర్పాట్ల కోసం మంజూరైన 63 కోట్ల రూపాయల‌తో చేపట్టిన పలు పనుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికల్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. మాంసాహార మార్కెట్ల ఏర్పాట్ల విషయంలో స్థలాన్ని పరిశీలించామని, టెండర్లు పూర్తవగానే త్వరితగతిన పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Read More »

బీమా వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట బీమా వంద శాతం పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్లో శనివారం అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఎఈవోలు క్లస్టర్‌ పరిధిలోని రైతులందరికీ భీమా చేయాల‌ని సూచించారు. పంట సాగు వివరాలు ఆన్‌లైన్‌లో వందశాతం నమోదు చేయాల‌ని కోరారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పిట్లం మండలంలో 600 మెట్రిక్‌ టన్నుల‌ యూరియా ప్రైవేటు డీల‌ర్ల వద్ద ఉందని, లాక్‌ డౌన్‌ కారణంగా ...

Read More »

అమరవీరుల‌కు ఘన నివాళి

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విచ్చల‌విడిగా పెంచిన విద్యుత్‌ ఛార్జీల‌ను తగ్గించాల‌ని 2000 సంవత్సరంలో జరిగిన పోరాటంలో అమరులైన పోరాట అమరవీరుల‌కు ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమరవీరుల‌ స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు చెప్పిన విధంగా విచ్చల‌విడిగా విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలందరితో పాటు వామపక్ష పార్టీల‌న్నీ ఐక్యంగా ...

Read More »

భూముల రక్షణకు నిరసన దీక్షలు

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగ దండోరా జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎస్సీ ఎస్టీ భూముల‌ రక్షణ కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బాగయ్య అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షురాలు ల‌క్ష్మి పెంటయ్య, లింగం, కిరణ్‌ తదితరులు కూర్చున్నారు. దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్‌, సహాయ కార్యదర్శి పి.బాల‌రాజు, ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర నాయకుడు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూముల‌ను ...

Read More »

వికలాంగునికి యాక్టివ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబిపేట మండలం మాంధపూర్‌ గ్రామానికి చెందిన వికలాంగుడు మోహన్‌ రెడ్డికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మూడు చక్రాల‌ యాక్టివ్‌ వాహనం అందజేశారు. జనగామ గ్రామానికి చెందిన సుభాష్‌ రెడ్డి ఆర్థిక సహాయంతో అందజేశారు. ప్రతి ఎన్నిక ప్రచారంలో గంప గోవర్ధన్‌కు మద్దతుగా గ్రామాల్లో స్వచ్చందగా ప్రచారం చేయటంతో మోటారు సైకిల్‌ను అందజేశారు.

Read More »

వారం రోజుల్లో పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల‌లో పల్లె ప్రకృతి వనాల‌ను పూర్తిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం ఆయన తాడ్వాయి మండలం కరడ్‌ పల్లి, కన్కల్‌, దెమికాన్‌, గాంధారి మండలం జువ్వాడి, గుర్జల్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల‌కు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల‌ని సూచించారు. దాతల‌ సహకారంతో పల్లె ప్రకృతి వనాల‌ను పచ్చదనంతో కళకళలాడే విధంగా చూడాల‌న్నారు. హరిత హారంలో నాటిన మొక్కల‌ను 100 శాతం సంరక్షణ చేయాల‌ని ...

Read More »