Breaking News

Kamareddy

కార్మికుల సమ్మెకు పలువురి మద్దతు

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె సోమవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వలిఉల్లా ఖాద్రి, సిపిఐ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌లు సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు అడగగానే 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం కార్మికుల పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందని ప్రశ్నించారు. కార్మికులను రెగ్యులర్‌ ...

Read More »

విద్యారంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను ప్రవేశపెట్టడాన్ని మానుకోవాలి

  – ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వల్లాఉల్లా ఖాద్రి కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఆ ఆలోచనలు మానుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వల్లాఉల్లా ఖాద్రి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో సోమవారం నిర్వహించిన ఏఐఎస్‌ఎప్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్‌లు హాజరై మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో పూజలు, కర్మకాండలు, ...

Read More »

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండగను పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయ శివ పంచాయతన దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. 108 అష్టోత్తర కలశాలతో పుష్కర గోదావరి జలాలతో పంచామృతాలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.

Read More »

తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం అద్యక్షునికి సన్మానం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపాల్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ రెడ్డి కులస్తుల్లో ఆర్థికంగా వెనకబడిన వారు చాలా మంది ఉన్నారని, రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సంఘం ఆద్వర్యంలో కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డిలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్లో రెడ్డి సంఘం ముందుండాలని ...

Read More »

ఘనంగా ఛత్రపతి సాహూజీ మహరాజ్‌ జయంతి వేడులు

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి సాహూజీ మహరాజ్‌ 158వ జయంతి వేడులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం సాహూజీ మహరాజ్‌ చేసిన సేవలను కొనియాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని బలహీన వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కౌన్సిలర్లు ...

Read More »

యోగాచార్యులకు సన్మానం

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రామాలయంలో ఆదివారం జైహనుమాన్‌ యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగాచార్యులను సన్మానించారు. జైహనుమాన్‌ యోగా కేంద్రం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యజ్ఞం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యోగా గురువు గరిపల్లి అంజయ్యకు జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యోగా రత్న బిరుదు ప్రదానం చేశారు. ఆయనతోపాటు పలువురు యోగా ఆచార్యులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో యోగా గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో రాంచంద్రం, అంజయ్య, రాంరెడ్డి, సిద్దిరాములు, కిషన్‌, ...

Read More »

మోకాళ్లపై కూర్చొని అర్థనగ్న ప్రదర్శన

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం మునిసిపల్‌ కార్మికులు అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని తెలంగాణ కార్మిక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గుర్రపు నారాయణ, కాంగ్రెస్‌ నాయకులు వేనుగోపాల్‌గౌడ్‌, శ్రీనివాస్‌, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 21 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి కార్మికుల ...

Read More »

పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దుదాం

  – ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాస్ట్రాన్ని పచ్చని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఇందులో అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి అటవీశాఖ కార్యాలయంలో అధికారులకు ప్రభుత్వం సరఫరా చేసిన వాహనాలు అందజేశారు. 63 బైకులను, 13 స్కూటీలను అధికారులకు, సిబ్బందికి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం ...

Read More »

సంక్షోభంలో విద్యారంగం

  – ఏఐపిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి జబ్బర్‌ కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతుందని ఏఐపిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా జనరల్‌ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 14 లక్షలకు పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను అడ్డుకోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వం ...

Read More »

సబ్‌ జైలును పట్టణ శివారుకు తరలించాలి

  – జైళ్ళ డిఐజికి నాయకుల వినతి కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో జనావాసాల మధ్య ఉన్న సబ్‌ జైలును పట్టణ శివారు ప్రాంతానికి తరలించాలని డిఐజి జైల్స్‌ కె. కేశవనాయుడుకు పట్టణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాంకుమార్‌గౌడ్‌, నాయకులు శనివారం వినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి సబ్‌జైలును పరిశీలించేందుకు వచ్చిన డిఐజిని నాయకులు కలిసి సమస్యలు విన్నవించారు. సబ్‌జైలును శివారు ప్రాంతానికి తరలించి పట్టణ నడిబొడ్డులో ఉన్న సబ్‌ జైలు కారాగార స్థలాన్ని కామారెడ్డి ...

Read More »

ఒంటికాలుపై నిలబడి గ్రామసేవకుల నిరసన

  కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూగ్రామ సేవకులు ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో కూర్చున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం గ్రామ సేవకులు, పారిశుద్య కార్మికుల పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందని ప్రశ్నించారు. ఉన్నవారికి మరిన్ని డబ్బులిస్తూ లేనివారికి కనీస జీతాలు ఇవ్వకపోవడం గర్హణీయమన్నారు. కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ప్రస్తుతం ఆ ...

Read More »

భిక్షాటన చేసి మునిసిపల్‌ కార్మికుల నిరసన

  కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శనివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. పట్టణంలో కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కార్మికులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎన్నికల తర్వాత వాటిని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. 20 రోజులుగా తాము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా ఆరోగ్యంలో ముందుండే మునిసిపల్‌ ...

Read More »

17వ రోజు కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె బుధవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. శిబిరంలో కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక వారిని మోసగించడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కేసీఆర్‌కు పుట్టగతులుండవని అన్నారు. కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ...

Read More »

ప్రగతిపనులు ప్రారంభం

  కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రగతి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సిసిరోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

16వ రోజు కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక వారిని మోసగించడం సిగ్గుచేటన్నారు. కార్మికుల ...

Read More »

ఏటిడబ్ల్యుఓతో బంజారా నాయకుల వాగ్వాదం

  – ఎస్‌ఎన్‌హెచ్‌ హాస్టల్‌ను తెరిపించాలని గొడవ కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గత నాలుగు సంవత్సరాల క్రితం పూర్తయిన గిరిజన వసతిగృహాన్ని ప్రారంభించాలని మంగళవారం జిల్లా అధికారి ఏటిడబ్ల్యువో నర్సింహాతో కామారెడ్డి బంజారా నాయకులు వాగ్వాదానికి దిగారు. వసతి గృహ కొత్త భవనాన్ని పరిశీలించడానికి వచ్చిన అధికారితో నాయకులు మాట్లాడారు. 2009లో మంజూరైన గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఇప్పటివరకు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి డివిజన్‌ పరిధిలో అత్యధికంగా గిరిజన విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, ...

Read More »

ఎమ్మెల్యే ఏనుగు భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి తన నియోజకవర్గంలో దళితుల భూములను ఆక్రమించుకున్నారని దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ఏనుగు దురాక్రమణలపై మంగళవారం కామారెడ్డిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వెంకట్‌ హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ఏనుగు తన అధికారాన్ని పరపతిని వినియోగించుకొని దళితులకు సంబంధించిన భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రజా సంఘాల నాయకులపై ...

Read More »

వినియోగదారులకు సేవలందించి మన్ననలు పొందాలి

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులకు మంచి సేవలందించి మన్ననలు పొందాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్‌ బేకరి, ఫాస్టు ఫుడ్‌ సెంటరును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యత, పరిశుభ్రమైన ఆహారపదార్థాలు విక్రయించి వారి ఆదరాభిమానాలు చూరగొనాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి మోహన్‌రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు చందు, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ ...

Read More »

15వ రోజుకు చేరిన మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె సోమవారంతో 15వ రోజుకు చేరుకుంది. మునిసిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులకు పూలమాలలువేసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల మంది కార్మికులు వివిధ మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు తెరాస ప్రభుత్వం ఇచ్చిన ...

Read More »

పుష్కరాలకు తరలిన భక్తులు

  కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండడంతో భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో తరలివెళ్తున్నారు. మూడు జిల్లాల ప్రధాన కూడలిగా కామారెడ్డి ఉండడంతో భక్తుల రాకతో కిక్కిరిసిపోతుంది. పట్టణం రద్దీగా మారింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు ఎటు వెళ్ళాలన్న కామారెడ్డి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ధర్మపురి, బాసర, కందకుర్తి, పోచంపాడ్‌ తదితర పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తుల రద్దీతో పట్టణం పండగ వాతావరణం సంతరించుకుంది. కామారెడ్డి ...

Read More »