Breaking News

Kamareddy

ఛలో హైదరాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చి 16 -హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టం కోసం డిమాండ్‌ కామారెడ్డి న్యూస్‌ : హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ యార్డు హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, ఏఐటియుసి ప్రతినిధి వి.ఎల్‌.నర్సింహారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలందరికి ఒకే రేట్లను నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాడ్యువిటి ప్రమాదనష్టపరిహారం, ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ శిబిరం

నిజామాబాద్‌, మార్చి 15 కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మోకాళ్ళ నొప్పులు, మెడ, నడుమునొప్పి, కాళ్ళ తిమ్మిర్లు, బిపి, తదితర వ్యాధులున్న రోగులకు ఆక్యుప్రజర్‌ విధానంతో చికిత్స అందించారు. ప్రజలు ఆక్యుప్రజర్‌ విధానాన్ని వినియోగించుకొని రోగాలనుంచి ఉపశమనం పొందాలని డాక్టర్‌ పి.కె.చౌదరి సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు నరేశ్‌ కుమార్‌, ప్రతినిధులు గంగాధర్‌, లింబాద్రి, గోపి, రమేశ్‌, శ్యాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలోని 15, 16 వవార్డుల్లో పలు అభివృద్ధి పనులు ఆదివారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 15వ వార్డులో లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను, 16వ వార్డులో సిసి రోడ్డు, డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసి ఛైర్మన్‌ జగన్నాథం, కౌన్సిలర్లు భూంరెడ్డి, మోహన్‌, అంజద్‌, ...

Read More »

గ్రామీణ డాక్‌ సేవక్స్‌ సమ్మె

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టినట్టు ఆలిండియా డాక్‌ సేవక్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు యూసుఫ్‌ అలీ తెలిపారు. కామారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు పనిచేయించుకుంటూ డాక్‌ సేవకులను తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ...

Read More »

కవిత్వంలో ప్రతి అక్షరం ఆయుధం అవ్వాలి

నిజామాబాద్‌, మార్చి 15 – ప్రజాకవి సి.హెచ్‌.మధు కామారెడ్డి న్యూస్‌ : రచయిత కవిత్వంలోని ప్రతి అక్షరం ఆయుధమై తిరగబడాలని ప్రజాకవి సి.హెచ్‌. మధు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో యువకవి ధర్పల్లి సాయికుమార్‌ రచించిన ‘అశ్రుగీతం’ కవితా సంపుటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధిక్కారం కవి సహజ నైజమని, కవికి ఆలోచనతోపాటు అక్రోశం, ఆవేశం కూడా అవసరమని అన్నారు. సామాజిక రుగ్మతల పట్ల కవికి ...

Read More »

అలరించిన మనోవైకల్య ,  అందుల , బదిరుల విన్యాసాలు 

ఘణంగా గా కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల  కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి విద్యార్ధి సమాఖ్య జిల్లా కన్వీనర్ పసుల చరణ్ ఆద్వర్యం లో స్థానిక కళా భారతి లో ఘనంగా జరిగాయి . ప్రభుత్వ అందుల పాటశాల , ప్రభుత్వ బదిరుల పాటశాల , మనో వికాస కేంద్రం , బాలసదన్ , ఆనంద నిలయం , సహాయ అనాదాశ్రమం లోని విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది . మర్రిపెల్లి ...

Read More »

ఐఎఫ్‌టియు రాష్ట్ర మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చి 13 కామారెడ్డి న్యూస్‌ : ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభల గోడప్రతులను ఆటో యూనియన్‌ ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎఫ్‌టియు రాష్ట్ర 8వ మహాసభలు ఈనెల 13,14,15 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు వేలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించామన్నారు. మరో రెండ్రోజులపాటు ముఖ్య నాయకులు ప్రసంగిస్తారని ...

Read More »

కామారెడ్డిని అగ్రగామిగా నిలపాలి

నిజామాబాద్‌, మార్చి 13 – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కిరాణ వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రసంగించారు. కామారెడ్డి వ్యాపారులకు రాష్ట్ర స్థాయిలో పేరుందని, వ్యాపారాన్ని మరింత అభివృద్ది పరచాలని ఆకాంక్షించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారుల సంక్షేమానికి తనవంతు ...

Read More »

కామారెడ్డి జిల్లా కేంద్రంగా కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-నెరవేరనున్న కామారెడ్డి వాసుల కల -ఫలించిన జిల్లా సాధన సమితి పోరాటం కామారెడ్డి ఫిబ్రవరి 13 (నిజామాబాద్ద్ న్యూస్.ఇన్ ): కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభిచనుంది. కామారెడ్డి జిల్లా అవుతుందో లేదో అని డోలాయమానంగా ఉన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటనతో దానికి తెరపడ్డట్టు అయ్యింది. కామారెడ్డి వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. గురువారం జిల్లాలోని సదాశివనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డిని ...

Read More »

మిషన్‌ కాకతీయతో తెలంగాణ భూములు సస్యశ్యామలం

– రూ.40 వేల కోట్లతో రాష్ట్రంలో వాటర్‌ గ్రిడ్‌ – 46 వేల చెరువుల పునరుద్దరణ – నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా – సిఎం కేసీఆర్‌ వెల్లడి కామారెడ్డి న్యూస్‌ : మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా సధాశివనగర్‌ మండల కేంద్రంలోని పాత చెరువు వద్ద మిషన్‌ కాకతీయ- మన ఊరు – మనచెరువు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ...

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు… నగదు స్వాధీనం

  కామారెడ్డి, ఫిబ్రవరి 06: కామారెడ్డి పట్టణ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారినుంచి 12 తులాల బంగారం నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లికి చెందిన శేకర్‌ కొత్త బస్టాండు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీల్లో అనుమానస్పదంగా పట్టుబడ్డారు. ఇతన్ని విచారించగా పట్టణంలో చోరీలు చేసినట్లు అంగీకరించారన్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని విచారించగా పట్టణంళో ఆయా చోట్ల ...

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. ...

Read More »

సీపీఎం జిల్లా కార్యదర్శిగా వెంకటి

కామారెడ్డి, జనవరి 7: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; సీపీఎం జిల్లా కార్యదర్శిగా దండి వెంకటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని కామారెడ్డిలో రెండు రోజులపాటు జరిగిన సిపిఎం పార్టీ 20వజిల్లా మహాసభ జరిగింది. మహాసభ అనంతరం నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా దండి వెంకటీ, కార్యవర్గ సభ్యులుగా పెద్ది వెంకట్‌రాములు, ఏ.రమేశ్‌బాబు, ఎం.గంగాధరప్ప, నూర్జహాన్‌, కే.చంద్రశేఖర్‌, కమిటీ సభ్యులుగా లత, వెంకట్‌గౌడ్‌, నత్తద్‌రాములు, వెంకటేశ్‌, గోవర్దన్‌, శంకర్రావు, జే.రవీందర్‌, కందూరి రేణుక, టీ చక్రపాణిలను ఎన్నుకున్నారు.

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

జిల్లాలో ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం – వాణిజ్య పంటల వైపు అడుగులు

ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం -వాణిజ్య పంటల వైపు అడుగులు నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయరంగంలో అభివృద్ధి పథంలో కొనసాగేందుకు వనరులు వున్నా అనుకున్నంత మేరకు పురోగతి సాధించ లేకపోతుంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి నిజాంసాగర్‌, అలీసాగర్‌ ప్రాజక్టులతో పాటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొంత వరకు వుంది. అయితే గత దశాబ్దాలుగా నిజాంసాగర్‌, అలీసాగర్‌ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిలువ లేక జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి. ...

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

కామారెడ్డి డీఎస్పీ ఆఫీస్ పరిశీలించిన ఎస్పీ

కామారెడ్డి నవంబర్ 23: నిజామాబాద్ జిల్లా ఎస్పీ చంద్రశేఖర రెడ్డి నేడు కామరెడ్డి డీఎస్పీ ఆఫీసును పరిశీలించినారు. కామారెడ్డి డివిజన్ పరధిలొని  పోలీస్ స్టేషన్లలో వివిధ రకాల నేరాల  కేసులు వాటి పురోగతి పైన డీఎస్పి భాస్కర్  నించి వివరాలు తీసుకున్నారు. కేసులకు సంభందించిన ఫైళ్ళను పరిశీలించినారు. కామారెడ్డి డివిజన్ పరధిలొని సిఐలు ఎసైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలపై పలు సూచనలు చేశారు.

Read More »