Breaking News

Kamareddy

అభివృద్ది పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 20వ వార్డులో శనివారం మురికి కాలువల నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో కాలు వనిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు అంజద్‌, భూంరెడ్డి, సంగి మోహన్‌, ఏఇ గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు సంజీవ్‌, రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సారిక కుటుంబానికి న్యాయం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అత్తగారి కుటుంబం చేతిలో దారుణ హత్యకు గురైందని, వారి కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శనాచారి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్ళి సారిక తల్లిదండ్రులు శ్రీనివాసచారి, లలితలను పరామర్శించి వారిబాధలు తెలుసుకున్నట్టు చెప్పారు. వరంగల్లులో మాజీ ...

Read More »

స్త్రీ శక్తి దివస్‌ సందర్బంగా ఆటల పోటీలు

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ శక్తి దివస్‌ను పురస్కరించుకొని శనివారం డిగ్రీ కళాశాల విద్యార్తినిలకు ఏబివిపి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. గత రెండ్రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు శనివారంతో ముగిసినట్టు ఏబివిపి మహిళా కో కన్వీనర్‌ రాంపురం రమ్య తెలిపారు. ముగింపు ఆటకు ముఖ్య అతిథిగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.ఎన్‌.గిరి హాజరయ్యారు. విద్యార్థినిలకు ఝాన్సీలక్ష్మిబాయి గురించి వివరించి, ప్రతి స్త్రీ ధైర్యసాహసాలు కలిగి ఉండాలన్నారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అన్నట్టుగా మహిళలు అన్ని ...

Read More »

పాఠశాలలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివనాగేశ్వరి మాట్లాడుతూ విద్యార్తులు, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు మొక్కలునాటి పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూంరెడ్డి, సిద్దమ్మ, అంజద్‌, సంగి మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సౌత్‌ క్యాంపస్‌ సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియు సౌత్‌ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్బంగా జిల్లా కార్యదర్శి భానుప్రసాద్‌ మాట్లాడుతూ టియు సౌత్‌ క్యాంపస్‌ సమస్యలకు నిలయంగా మారిందని, యూనివర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో వీధి దీపాలు లేక రాత్రిపూట విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో ప్రమాదాలు జరిగి విద్యార్థులు గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ...

Read More »

పాదయాత్రల పేరుతో కాంగ్రెస్‌ నాయకుల డ్రామాలు

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెనిద్ర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మారిస్తే కాంగ్రెస్‌ నాయకులు ఏదో ఘోరం జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతూ పాదయాత్రల పేరిట డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డిఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం దోమకొండ మండలానికి చెందిన వివిద పార్టీలకు సంబంధించిన 200 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. వారిని ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులకు ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో కేర్‌ ఆసుపత్రి హైదరాబాద్‌ వారి సహకారంతో బుధవారం కామారెడ్డి గంజ్‌ ధర్మశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బిపి, షుగర్‌, ఎముకల బలపరీక్ష, ఫిజియో థెరఫి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. డాక్టర్‌ శశికాంత్‌ బృందం ఆద్వర్యంలో శిబిరం నిర్వహించారు. ఈ పరీక్షలకు గాను ఒక్కొక్కరికి సుమారు 4వేలు ఖర్చవుతుందని, దీన్ని ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు. శిబిరంలో 275 మంది రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో క్లబ్‌ ...

Read More »

64వ రోజుకు చేరిన ఆశల దీక్షలు

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు బుధవారం నాటికి 64వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆశలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం సమంజసం కాదన్నారు. మంగళవారం శాంతియుతంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దాడిచేసి కొట్టి అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ...

Read More »

మల్లారెడ్డి యాజమాన్యం దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడ్చల్‌ మల్లారెడ్డి బి.ఫార్మసి కళాశాల విద్యార్థి భార్గవ్‌ యాజమాన్యం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం కామారెడ్డిలో టిజివిపి, ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో మల్లారెడ్డి యజమాన్యం దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర నాయకులు సందీప్‌లు మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలల్లో యాజమాన్యం ఆగడాలు మితిమీరిపోతున్నాయని, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ...

Read More »

కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో బుధవారం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కిలో రూ. 135 రాయితీ కందిపప్పును ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు. కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సామాన్యునికి కందిపప్పు అందేలా ప్రబుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విక్రయ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో నగేశ్‌, తహసీల్దార్‌ అనిల్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు ...

Read More »

రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన డిఆర్‌ఎం

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అరుణాసింగ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని, ఫుట్‌పాత్‌లను, ప్లాట్‌ఫారంలను, క్యాంటీన్‌ను, మేనేజరుగదితో పాటు ఇతర గదులను పరిశీలించారు. స్టేషన్‌లో సమకూర్చాల్సిన వసతులగురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను మరింత ఆదునీకరించి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. స్టేషన్‌లో నీటి ఎద్దడి నెలకొందని, దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాట్‌ఫాం పైనషెల్టర్‌, తదితరాలను ఆధునీకరిస్తామని తెలిపారు. స్టేషన్‌లో ...

Read More »

గుర్తు తెలియని వృద్దురాలి మృతి

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంగణంలో బుధవారం గుర్తు తెలియని వృద్దురాలు (60) మృతి చెందింది. పట్టణ ఎస్‌ఐ శోభన్‌ కథనం ప్రకారం… ఆర్టీసి ప్రాంగణంలో బుధవారం ఉదయం వేళ గుర్తు తెలియని వృద్దురాలు మృతి దేహం లభించిందన్నారు. మృతురాలు గోచిచీర కట్టుకొని మెరుణ్‌ రంగు చీర ఉందన్నారు. కుడిచేయిపై పొన్నచెట్టు పచ్చబొట్టు, ఎడమచేయిపై చందమామ పచ్చబొట్టు, నుదురు, గదవపై పచ్చబొట్లు ఉన్నాయన్నారు. మృతురాలు గుండు చేయించుకొని ఉందని తెలిపారు. కేసు ...

Read More »

కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలని మునిసిపల్‌ పాలకవర్గ ప్రతినిదులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలని కౌన్సిల్‌ తీర్మానం చేసినప్పటికి మూడునెలలకోసారి సమావేశం నిర్వహించడం వల్ల పట్టణంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభించడం లేదన్నారు. మంచినీటి సమస్య, పారిశుద్యం, అభివృద్ది పనుల్లో నాణ్యత లోపం తదితర ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయన్నారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌, అధికారులు కమీషన్లు పంచుకుంటూ పట్టణ ...

Read More »

9న ఛలో నిజామాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌టి ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న ఛలో నిజామాబాద్‌ బహిరంగ సభకు సంబందించిన గోడప్రతులను నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంఆర్‌పిఎస్‌టి రాష్ట్ర కార్యదర్శి బలరాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మణ్‌ మాట్లాడుతూ డప్పుకొట్టే ప్రతి మాదిగకు, చెప్పులు కుట్టే చర్మకారులకు 2 వేల పింఛన్లు సాధించుకోవడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్నామన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రిని కలిసి సమస్యలు విన్నవించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పేరిట ఇతర సామాజిక ...

Read More »

మంజీరా కళాశాలలో స్వాగత హంగామా

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో సైన్స్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. విద్యార్తినిలు గోపికమ్మ చాలునులేమ్మా… నేనొక్కడినే అంటూ స్టెప్పులు వేసి అలరించారు. విద్యార్థులు పలు గేయాలపై నృత్యాలు చేసి, నాటకాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మంజీరా విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ వారికి వారే పోటీపడుతున్నారని ప్రశంసించారు. తమ విద్యార్తులు ఎన్నో విజయాలు, ఉద్యోగాలను సాధించారని ...

Read More »

ఆశల ఆర్డీవో కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

  – 400 మహిళా కార్యకర్తల అరెస్టు కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆశల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు 400లకుపైగా మహిళా కార్యకర్తలను, ఆశలను సిఐటియు నాయకులను అరెస్టు చేసి అనంతరం సొంతపూచికత్తుపై విడుద లచేశారు. సిఎస్‌ఐ మైదానం నుంచి భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ...

Read More »

ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచే ప్రయత్నం చేస్తున్నాం

  కేంద్ర గ్రామీణాభివృద్ది సంయుక్త కార్యదర్శి అపరంజిత సారంగి కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనిదినాలను వంద నుంచి 150 రోజులకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృస్టికి తేనున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది సంయుక్త కార్యదర్శి అపరంజిత సారంగి తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలోని తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మండలంలో సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలోని కేంద్ర బృందం మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరు తెన్నులను పరిశీలించారు. చేపట్టిన పనులను తనిఖీచేసి, ఉపాధి ...

Read More »

టెక్నోజియాన్‌ 15 లో కామారెడ్డి విద్యార్థికి ప్రథమ బహుమతి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఐటి వరంగల్‌ ప్రతిస్టాత్మకంగా మూడురోజులు టెక్నోజియాన్‌ – 15 నిర్వహించి పలితాలు ప్రకటించారు. కోవర్‌ మామియా (నేలపై, నీటిలో నడిచే వాహనం) తయారుచేసి ప్రదర్శించినందుకుగాను కామారెడ్డికి చెందిన సిహెచ్‌.సామ్రాట్‌ కౌటిల్య టీంకు ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కౌటిల్య సారద్యంలో అతని బృందం అసద్‌, పృథ్వీ, వినీత్‌, శ్రీహితలకు ప్రథమ బహుమతిగా రూ.8 వేలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఎన్‌ఐటి వరంగల్‌వారు బహుకరించారు. పంచాయతీరాజ్‌, ఐటిశాఖ మంత్రి ...

Read More »

పేదలందరికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ళు ఇవ్వాలి

  – సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలందరికి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండివెంకట్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన డివిజన్‌ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని పక్కదారి పట్టించేందుకు స్తానిక ప్రజాప్రతినిధులు కుట్ర చేసే ప్రమాదముందని, సిపిఎం ఆధ్వర్యంలో సొంతిల్లులేని నిజమైన పేదలకు పార్టీలకు ...

Read More »

ప్రభుత్వ అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ అనుమతిలేకుండా నడుస్తున్న కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం టిజివిపి నాయకులు కామారెడ్డి ఉపవిద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో కామారెడ్డి ప్రాంతంలో అనేక పేర్లతో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయన్నారు. వాటిల్లో కనీస సదుపాయాలు లేవని, ఫీజులు దండుకుంటున్నారని చెప్పారు. అధిక ఫీజులను అరికట్టి సదుపాయాలు కల్పించేలా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో టిజివిపి ...

Read More »