Breaking News

Kamareddy

వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులకు నాణ్యమైన సేవలందించి వారి మెప్పు పొందాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. పట్టణంలోని నాజ్‌ థియేటర్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన విజయ్‌ మెస్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించి వ్యాపారాభివృద్ది చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ కైలాష్‌ లక్ష్మణ్‌రావు, కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, నర్సింలు, బట్టు మోహన్‌, రామ్మోహన్‌ నాయకులు పిప్పిరి వెంకటి, రాంకుమార్‌గౌడ్‌ తదితరులు ...

Read More »

ఆర్యవైశ్య అభ్యున్నతికి కృషి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆర్యవైశ్యుల అబ్యున్నతికి తనవంతు కృషి, సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్‌ కాలనీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీనివాస్‌రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో చాలా మంది ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, రాజకీయాల్లో పురోగతి సాధించాల్సిన అవసరముందన్నారు. ఆర్యవైశ్యులు ఐక్యతతో ముందుకు సాగి అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. సంఘం ప్రతినిదులు ...

Read More »

ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటో కార్మికులందరికి ఇళ్ల స్తలాలు కేటాయించి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆటో కార్మికులు సోమవారం ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి కొత్త బస్టాండ్‌ వద్ద గత 30 సంవత్సరాలుగా ఆటోలు నడుపుకుంటూ కుటుంబపోషణ సాగిస్తున్నామన్నారు. తమ తండ్రులు సైతం ఇదే వృత్తిలో ...

Read More »

సామాజిక విలువల పరిరక్షణకు కృషి చేయాలి

  – ప్రొఫెసర్‌ రాహుల్‌ ముఖర్జీ కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పతనమవుతున్న సామాజిక విలువల పరిరక్షణకు కుల, మత రహిత సమాజ నిర్మాణం కోసం నేటి యువత కృషి చేయాలని సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ప్రోగ్రాం ప్రొఫెసర్‌ రాహుల్‌ ముఖర్జీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో సోమవారం సింగపూరు జాతీయ యూనివర్సిటీకి సంబంధించి సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్‌ ముఖర్జీ, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇంద్రకాంత్‌రావు ...

Read More »

ఆశ వర్కర్ల తహసీల్‌ కార్యాలయం ముట్టడి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని ఆశ కార్యకర్తలు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆశ కార్యకర్తలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కనీస వేతనాల కింద ...

Read More »

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రయివేటు పాఠశాలల్లో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. కృష్ణాష్టమివేడుకల సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో వేడుకలు ఘనంగా జరిపారు. నృత్యాలుచేస్తూ ఆట, పాటలు ఆడారు. అనంతరం ఉట్టిని పగులకొట్టారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం

ఏఐపిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బర్‌ కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఏఐపిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బర్‌ అన్నారు. కామారెడ్డిలో శనివారం నిర్వహించిన ఏఐపిఎస్‌యు జిల్లా స్తాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయని తద్వారా ప్రయివేటు పాఠశాలలు లబ్దిపొందుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ప్రోత్సహించడం వల్ల ఈ పరిస్తితి నెలకొందని పేర్కొన్నారు. విద్యా ...

Read More »

అనాథ బాలల కోసం విరాళాల సేకరణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం ఇమన్యుయల్‌ అనాథ ఆశ్రమం దోమకొండ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఇమాన్యుయల్‌ ఆశ్రమంలో వీధి బాలలను, తల్లిదండ్రులను కోల్పోయి ఎలాంటి ఆశ్రయం, ఆసరా లేనివారిని గుర్తించి ఆశ్రమంలో చేర్చుకుంటున్నామని తెలిపారు. ఆశ్రమ నిర్వాహకుడు దాస్‌ ఎల్లం మాట్లాడుతూ దనవంతులు, వ్యాపారులు ఖర్చు చేసే డబ్బులో కొంత మొత్తాన్ని ఆశ్రమంలోని అనాథ పిల్లలకు విరాళంగా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు పట్టణంలో పంచిపెట్టి, పలువురి నుంచి విరాళాలు సేకరించారు. ...

Read More »

అంగన్‌వాడి కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలోగల అంగన్‌వాడి కేంద్రంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్‌వాడి విద్యార్తులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు బోధన చేశారు. అంగన్‌వాడి నిర్వాహకులు ఉపాధ్యాయ వృత్తి గురించి విద్యార్థులకు వివరించారు. ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్తాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »

లిటిల్‌ స్కాలర్స్‌లో కృష్ణాష్టమి వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో శనివారం విద్యార్తులు కృస్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, రాధా, గోపికల వేసధారణలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉట్టిని పగులకొట్టి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు అరుణ, రాజేశ్‌, పావని, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయులకు సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, వివేకానంద వాసవి వనిత క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఇందిరా నగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో పాటు 22మందిని సన్మానించారు. వారికి శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు యాదా నాగేశ్వర్‌రావు, హరిదర్‌, లత, సంతోష్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి

– డిప్యూటి డిఇవో బలరాం కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు విద్యార్తులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని, ఆ ఒక్క అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని కామారెడ్డి డిప్యూటి డిఇవో బలరాం అన్నారు. సర్వేపల్లి రాదాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో గురుపూజోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బలరాం మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్తాయి వరకు ఎదిగి దేశానికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. ఉపాధ్యాయులు కష్టపడి పనిచేసి ప్రభుత్వపాఠశాలల్లో చదివే ...

Read More »

విలేకరులకు సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ వివేకానంద ఆధ్వర్యంలో శనివారం పలువురు విలేకరులను ఘనంగా సన్మానించారు. విలేకరుల ప్రాముఖ్యత, సేవా భావాల గురించి తెలిపారు. విలేకరులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలుగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృస్టికి తీసుకెళ్లి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దోహదం చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు హరిదర్‌, శంకర్‌రెడ్డి, భాస్కర్‌, సంతోష్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కార్మికుల సొమ్మును బిజెపి తమ సొమ్మని చెప్పడం సరికాదు

-సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజలింగం కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మాణ రంగ కార్మికుల సొమ్ము ఖర్చును బిజెపి తమ ప్రభుత్వ ఖర్చని చెప్పుకోవడం సిగ్గుచేటని సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజలింగం అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంవత్సరానికి 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో కార్మికుల రిజిస్ట్రేషన్‌ సొమ్ము, ...

Read More »

విగ్రహానికి ఆశ వర్కర్ల వినతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్టుతెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశ కార్యకర్తలను ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా అర్హత కల్పించి రూ. 15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా సమ్మెచేస్తున్నా ...

Read More »

ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర టెక్నో స్కూల్లో శుక్రవారం కృష్ణాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేష ధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. ఉట్టినికొట్టి ఆట పాటలతో నృత్యాలు చేస్తూ అలరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నియామక పత్రాల అందజేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రతినిదులకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ నియామక పత్రాలు అందజేశారు. మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా యాద నాగేశ్వర్‌రావు, రాష్ట్ర రాజకీయ కమిటీ వైస్‌ఛైర్మన్‌గా ముప్పారపు ఆనంద్‌, తదితరులు ఎన్నికయ్యారు. వీరిని జిల్లా ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు కైలాష్‌ శ్రీనివాస్‌ రావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి వారిలో రాజకీయ చైతన్యంనింపేందుకు సభ్యులు కృసి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిదులు భాస్కర్‌, రవిందర్‌, ...

Read More »

వైభవంగా సామూహిక కుంకుమార్చన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ షిర్టీసాయి నిలయంలోశుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సంతోషిమాత ఆలయాన్ని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చనలో పాల్గొని పూజలు జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజమౌళి, భాస్కర్‌, శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, సీతారామారావు, పరమేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని వివిధపాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన నాటక ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గురుభక్తిపై చేసిన నాటిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు అరుణ, పావని, ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.

Read More »

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా టిజివిపి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా టిజివిపి కామారెడ్డి జిల్లా శాఖాధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాలలో శుక్రవారం విద్యార్తులచే ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకుని లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న భవాని అనే విద్యార్థిని ఆత్మశాంతించాలని మౌనం పాటించారు. ఈ సందర్బంగా టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ విద్యార్తులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా తోటి విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలగాలని సూచించారు. ఇటీవల సీనియర్‌ విద్యార్తి ర్యాగింగ్‌ భరించలేక సాయినాథ్‌ అనే బిటెక్‌ విద్యార్తి ...

Read More »