Breaking News

Kamareddy

చార్జీల‌ పేరుతో దోపిడి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్‌ కార్యాల‌యం వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో విద్యుత్‌ అదనపు బిల్లుల‌ను వెంటనే రద్దు చేయాల‌ని సర్‌ చార్జీల‌ను ప్రభుత్వమే భరించాల‌ని, విద్యుత్ బిల్లుల‌ చెల్లింపులో వెసులుబాటు కల్పించాల‌ని, రాష్ట్ర అధ్యక్షుని సూచన మేరకు విద్యుత్‌ ఎస్‌ఇని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీల పేరుతో టీఆర్‌ఎస్‌ సర్కారు దోపిడీ చేస్తోందని, అశాస్త్రీయ, అసంబద్ధ ...

Read More »

వారిని అభినందించిన డిఎస్పీ

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ రక్తదాతల‌కు ప్రశంస పత్రాలు అందజేశారు. అభినందన కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పి ల‌క్ష్మీనారాయణ గారి చేతుల‌ మీదుగా ఉత్తమ రక్తదాతల‌కు ప్రశంసా పత్రాలు అందజేసినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. లాక్‌ డౌన్‌ విధించినప్పటినుండి 60 రోజుల కాలంలో 70 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని, 2016లో కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని ఏర్పాటు ...

Read More »

కామారెడ్డిలో ఇదీ సంగతి…

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా వాసి ద్వారా కామారెడ్డి రాం మందిరం రోడులో గల‌ ఇద్దరికి పాజిటివ్‌ రాగా వారికి సంబందించిన ప్రాథమిక సంక్రమణ దారుల‌ను గుర్తించిన వారిలో రాం మందిరం రోడు ప్రాంతానికి చెందిన ఒకరు శనివారం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కాగా ఆదివారం ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, వీరిలో ఒకరు రాం మందిరం రోడుకు చెందిన వారు కాగా మరొకరు అయ్యప్ప కాల‌నీకి చెందిన ...

Read More »

అనర్హులుగా తేలితే క్యాన్సల్‌ చేస్తాము…

బాన్సువాడ, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ.6.37 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని, ఇరుకు గదుల‌ ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

స్పీకర్‌ అభినందించారు…

బాన్సువాడ, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్‌లో ‘యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ‘ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ’ వారు ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని’ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సభ్యుల‌కు, రక్తం దానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకుల‌ను అభినందించారు. రక్తం ప్రాణాధారమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

చార్జీల‌ మోత…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజల‌పై అధికంగా విద్యుత్‌ ఛార్జీల‌ మోత విధిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా విద్యుత్‌ కార్యాల‌యం ముందు సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌ కార్యాల‌యం జూనియర్‌ అసిస్టెంట్‌ మహేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలందరికి కరెంట్ బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చాయని, ప్రజలు ఉపాధి కోల్పోయి ...

Read More »

తెలంగాణ ఖాకీల‌ పహారా మధ్య నలిగిపోతోంది…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల దీక్షకు బయల్దేరుతున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ను పోలీసులు గృహ నిర్బందం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతోందని, ప్రజలు, నాయకుల‌ స్వేచ్చను హరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల‌పై నోరుమెదపనివ్వడం లేదని, రైతు సాగునీటి సమస్యపై గాంధేయ మార్గంలో సామరస్యంగా దీక్ష చేస్తామన్న తమను నక్సలైట్‌ల‌ కంటే ఎక్కువ తమపై నిర్బంధం పెట్టి అణిచి ...

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ రెండవ సారి ప్రధాని అయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేయాల‌ని రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాటిపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని 33, 17, 16 వార్డుల్లో కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక నిర్ణయాల‌తో ప్రజల‌ మనోభావాల‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్న మోదీ పాల‌న ప్రపంచ ...

Read More »

ప్రశ్నించే గొంతును అణిచివేయడం తగదు

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, కవులు, రచయితలు, మేధావుల‌ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసిన వారిని విడుదల‌ చేయాల‌ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును అణచివేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కుని చేయడమే అన్నారు. కవులు, రచయితలు, మేధావుల‌పై ప్రజాస్వామ్య వాదుల‌పై ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వాలు జీర్ణించుకోలేక వారిని అక్రమ అరెస్టు చేసి సంవత్సరాల‌ ...

Read More »

ఆరునెలల‌ గడువు ఇవ్వండి

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సంధర్భంగా ఉపాధి కోల్పోయిన సామాన్య, మధ్య తరగతి ప్రజల‌ నుండి ఇంటి పన్ను, వాటర్‌ పన్ను వసూలు చేయద్దని కామారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యం ముందు నిరసన అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినట్టు సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ పెట్టడం వ‌ల్ల‌ సామాన్య, మధ్య తరగతి చిన్న, చితక నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి ...

Read More »

అందరికీ అండగా…

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశం మేరకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఆబియాన్‌లో భాగంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల‌ జీవితాల‌ను అతలాకుతలం చేసిన కరొనా లాక్‌ డౌన్ కాలంలో నష్టపోయిన యావత్‌ భారత ...

Read More »

అంతిమ యాత్రలో ఆమెకు తోడుగా

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నా అన్న వారు ఎవరు లేక అంతిమ యాత్రకు నోచుకోని సంఘటన గురువారం కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో చోటు చేసుకుంది. చివరికి కొందరు తామున్నామని అండగా నిలిచి మానవత్వం బ్రతికే ఉందని చాటుకున్నారు. అంతిమ యాత్రకు కూడా నోచుకోలేక ఎందరో చివరికి మున్సిపాలిటీ పాల‌వుతున్న సంఘటనలు ఎన్నో. కామరెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో నివాసముంటున్న బాలామణి (60) గురువారం మృతి చెందింది. ఆమెకు కూతరు శ్రావణి తప్ప ఎవరు లేరు. బాలామణికి ...

Read More »

తాగిన మైకంలో…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల‌ దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

నెల‌రోజుల‌ జీతం అదనంగా ఇవ్వాలి…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన కాలంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేస్తున్న కార్మికుల‌కు 1 నెల‌ జీతం అదనంగా ఇవ్వాల‌ని ఏఐటియుసి ఆధ్వర్యంలో కామారెడ్డి హాస్పిటల్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కరోన కాలంలో కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్‌, ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కార్మికుల‌కు ఒక్క నెల‌ జీతం అదనంగా ఇవ్వాల‌ని వారు డిమాండ్‌ చేశారు. ఇంతటి ...

Read More »

అందరం కలిసి పోరాడాలి…

బాన్సువాడ, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరా పిఏసిఎస్‌ సొసైటీ పరిధిలోని శ్యామ్‌ రావ్‌ తండా గోడౌన్‌ ఆవరణలో, రుద్రుర్‌ మండలం రాయకూర్‌ పిఏసిఎస్‌ సొసైటీ ఆవరణలో సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల‌ను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోన కట్టడి నుండి కొంచం ఉపశనం ఇవ్వగానే ప్రజలంతా కరోన పోయిందనుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ...

Read More »

కామారెడ్డిలో మరో పాజిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో రామ మందిర్‌ ప్రాంతంలో మెదక్‌ కోవిడ్‌ పాజిటివ్‌ కేసు యొక్క ప్రైమరీ కాంటాక్ట్‌లో ఆరుగురిని గుర్తించడం జరిగిందని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరిని హోమ్‌ క్వారంటైన్‌లో వుంచడం జరిగిందని, వీరిలో ఇద్దరికి ప్రాథమిక ల‌క్షణాలు వుండడం వల‌న హైదరాబాదుకు పంపినట్టు పేర్కొన్నారు. వారి పరీక్ష ఫలితాలు గురువారం విడుదల‌య్యాయని, వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఇతను హైదరాబాదు యశోదాలో చికిత్స ...

Read More »

అనేక సమస్యల‌కు శాశ్వత పరిష్కారం చూపారు….

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికీ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం కార్యక్రమాన్ని కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని 34 వ వార్డులో ప్పర్యటించి ప్రతి ఇంటికీ ప్రధాని నరేంద్ర మోదీ లేఖల‌ను అందజేశారు. ఈ సంధర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల‌లో అభివృద్ధి చెందుతుందని గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యల‌కు శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. ...

Read More »

ప్రజా ఉద్యమం తప్పదు…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోలో లాక్‌ డౌన్‌లో నలిగిపోతున్న ప్రజల‌కు పిడుగుల‌ కరెంట్ బిల్లులు చూస్తేనే కరెంట్‌ షాక్‌ తగిలేలా ఉందని, ఈ సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా మంటే ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును ప్రభుత్వం నొక్కేస్తుందని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలి షబ్బీర్‌ అన్నారు. గురువారం తెల్ల‌వారకముందే తన ఇంటి ముందు పోలీసుల‌ కవాతు… హౌస్‌ అరెస్టు ఏంటని షబ్బీర్‌ ప్రశ్నించారు. ఇలా అయితే లాభం లేదు ప్రజా ...

Read More »

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం 3 గంటల‌ సమయంలో సంతాయిపేట్‌ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య, చిట్యాల‌ గ్రామానికి చెందిన జంగం భూలక్ష్మి కామారెడ్డి డెంటల్‌ హాస్పిటల్‌ నుండి తిరిగి తమ ఎక్స్‌ఎల్‌ బండిమీద చిట్యాల‌ గ్రామానికి బయల్దేరారు. తాడ్వాయి గ్రామం దాటినా తరువాత హనుమాన్‌ గుడివద్ద వెనకనుండి బ్లూ కల‌ర్‌ ఎఫ్‌జెడ్‌ బైక్‌ మీద వచ్చిన వారు లక్ష్మి మెడనుండి పుస్తెల‌ తాడు తెంపుకొని పారిపోయారు. బైక్‌ మీద వచ్చిన వారు ఒకరు మెరూన్ ...

Read More »

వివాహిత ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవుని పల్లి గ్రామానికి చెందిన పుల్ల‌న్నగారి నవ్య (29) వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకుని చనిపోయింది. కాగా మృతురాలి భర్త గత ఐదు సంవత్సరాల‌ క్రితం మరణించాడు. గత నెల‌ 16వ తేదీ ఆమె భర్త వర్ధంతి నుండి మానసికంగా కుంగిపోతూ, తల్లిదండ్రుల‌కు భారమయ్యానని ఉరి వేసుకుని చనిపోయింది. వివాహితకు తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడు సంవత్సరాల‌ బాబు ఉన్నారు. తండ్రి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు ...

Read More »