కామరెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను మాజీ మంత్రి మాజీ, మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత్ చైనా బార్డర్లో 20 మంది సైనికులు మృత్యువాత పడటం చాలా బాధాకరమైన విషయమని, సైనికుల మరణంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతి చెందితే గవర్నర్ లాంటి ...
Read More »భావితరాలకు చక్కటి వాతావరణం అందించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురువారం తడి, పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే లాభాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొలగించి, వర్షపు నీరు గుంతల్లో నిలవకుండా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల విషయంలో ...
Read More »పభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల జోలికొస్తే ఊరుకునేది లేదు
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కొందరు భూ కబ్జాదారులు కబ్జా చేశారని కళాశాల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల భూములను పరిశీలించినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ డిగ్రీ కళాశాల భూముల్ని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇవ్వడంతో అనేక ఉద్యమాల నేపథ్యంలో కళాశాల భూములు తిరిగి కళాశాలకు అప్పగించడం జరిగిందని, కానీ ...
Read More »కేకు కట్చేయొద్దు… అన్నదానం చేయండి….
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలను కేకే కట్ చేయకుండా పేదలకు అన్నదానం, అనారోగ్యంతో ఉన్నవారికి పాలు పండ్లు పంపిణీ చేయాలని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన నా దేశ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్న వేళ అనాధలుగా ప్రాణాలు వదులుతున్న వేళ నేను నా పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుంటానని, నా జీవితంలో ఇలాంటి దుర్దినాలు ఎప్పుడూ ...
Read More »చైనా వస్తువులు బహిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చైనా సైనికులు దొంగచాటుగా జరిపిన దాడిలో భారత ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు మృతికి టిఎన్ఎస్ఎఫ్, విజేఎస్ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, విజెఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ దొంగచాటుగా దెబ్బతీసి భారత సైనికులు 20 మందిని చైనా సైనికులు చంపడం సిగ్గుచేటని సైనికుల మీద జరిగిన దాడి దేశ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాలని అన్నారు. ...
Read More »జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సిఎం
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా (ఎన్ఆర్ఇజిఏ) పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్‌ను, కాలువల్లో పూడిక తీత పనులు, కాలువల మరమ్మతు పనులను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్, సిక్తా పట్నాయక్, ఆర్.వి. కర్ణన్‌ను అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కలను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీని సీఎం కె. చంద్రశేఖర్ రావు అభినందించారు.
Read More »17 మందికి నెగెటివ్
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం పంపించిన 18 మంది ప్రాథమిక సంక్రమణ దారుల నమూనాలో గాంధారికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇతడికి అనుమానిత లక్షణాలు వుండగా నమూనా సేకరించడం జరిగిందని, మిగతా 17మందికి నెగేటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాదుకు తరలించినట్టు తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇట్టి పాజిటివ్ కేసుల ప్రాథమిక ...
Read More »ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి…
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశము నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి సమిష్టి నిర్ణయం మేరకు బుధవారం నుండి అన్ని వ్యాపార సంస్థలను ఉదయం 9 గంటలనుండి తెరచి సాయంత్రం 4 గంటలకు స్వచ్చందంగా అందరూ మూసివేయాలని తీర్మానించారు. కాబట్టి పట్టణంలోని అన్ని వర్తక వాణిజ్య సంస్థలు ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకటించిన ...
Read More »జీవో 68 అమలు చేయాలి
కామరెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు 68 జీవో అమలు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం జిల్లా వైద్యాధికారి సూపరింటెండెంట్ అమృతకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.దశరథ్ మాట్లాడుతూ కరోన కాలంలో కామారెడ్డి, బాన్స్వాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్, ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు ...
Read More »చార్జీల పేరుతో దోపిడి
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో విద్యుత్ అదనపు బిల్లులను వెంటనే రద్దు చేయాలని సర్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని, రాష్ట్ర అధ్యక్షుని సూచన మేరకు విద్యుత్ ఎస్ఇని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పేరుతో టీఆర్ఎస్ సర్కారు దోపిడీ చేస్తోందని, అశాస్త్రీయ, అసంబద్ధ ...
Read More »వారిని అభినందించిన డిఎస్పీ
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ రక్తదాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. అభినందన కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఉత్తమ రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. లాక్ డౌన్ విధించినప్పటినుండి 60 రోజుల కాలంలో 70 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని, 2016లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు ...
Read More »కామారెడ్డిలో ఇదీ సంగతి…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా వాసి ద్వారా కామారెడ్డి రాం మందిరం రోడులో గల ఇద్దరికి పాజిటివ్ రాగా వారికి సంబందించిన ప్రాథమిక సంక్రమణ దారులను గుర్తించిన వారిలో రాం మందిరం రోడు ప్రాంతానికి చెందిన ఒకరు శనివారం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కాగా ఆదివారం ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, వీరిలో ఒకరు రాం మందిరం రోడుకు చెందిన వారు కాగా మరొకరు అయ్యప్ప కాలనీకి చెందిన ...
Read More »అనర్హులుగా తేలితే క్యాన్సల్ చేస్తాము…
బాన్సువాడ, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూ.6.37 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని, ఇరుకు గదుల ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం ...
Read More »స్పీకర్ అభినందించారు…
బాన్సువాడ, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్లో ‘యువర్స్ లైఫ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ’ వారు ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని’ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులకు, రక్తం దానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. రక్తం ప్రాణాధారమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ...
Read More »చార్జీల మోత…
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లాక్ డౌన్ సమయంలో ప్రజలపై అధికంగా విద్యుత్ ఛార్జీల మోత విధిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా విద్యుత్ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ మహేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా దశరథ్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలందరికి కరెంట్ బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చాయని, ప్రజలు ఉపాధి కోల్పోయి ...
Read More »తెలంగాణ ఖాకీల పహారా మధ్య నలిగిపోతోంది…
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జల దీక్షకు బయల్దేరుతున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్‌ను పోలీసులు గృహ నిర్బందం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతోందని, ప్రజలు, నాయకుల స్వేచ్చను హరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై నోరుమెదపనివ్వడం లేదని, రైతు సాగునీటి సమస్యపై గాంధేయ మార్గంలో సామరస్యంగా దీక్ష చేస్తామన్న తమను నక్సలైట్ల కంటే ఎక్కువ తమపై నిర్బంధం పెట్టి అణిచి ...
Read More »ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ రెండవ సారి ప్రధాని అయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేయాలని రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాటిపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని 33, 17, 16 వార్డుల్లో కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న మోదీ పాలన ప్రపంచ ...
Read More »ప్రశ్నించే గొంతును అణిచివేయడం తగదు
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, కవులు, రచయితలు, మేధావులను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును అణచివేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కుని చేయడమే అన్నారు. కవులు, రచయితలు, మేధావులపై ప్రజాస్వామ్య వాదులపై ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వాలు జీర్ణించుకోలేక వారిని అక్రమ అరెస్టు చేసి సంవత్సరాల ...
Read More »ఆరునెలల గడువు ఇవ్వండి
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లాక్ డౌన్ సంధర్భంగా ఉపాధి కోల్పోయిన సామాన్య, మధ్య తరగతి ప్రజల నుండి ఇంటి పన్ను, వాటర్ పన్ను వసూలు చేయద్దని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినట్టు సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టడం వల్ల సామాన్య, మధ్య తరగతి చిన్న, చితక నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి ...
Read More »అందరికీ అండగా…
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరొనా నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశం మేరకు ఆత్మ నిర్భర్ భారత్ ఆబియాన్లో భాగంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరొనా లాక్ డౌన్ కాలంలో నష్టపోయిన యావత్ భారత ...
Read More »