Breaking News

Kamareddy

ఆసుపత్రిపై దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

  – డిఎస్పీకి వినతి కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం కామారెడ్డి పట్టణంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపాలంటూ పట్టణంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ చేపట్టారు. ఐఎంఎ ఆధ్వర్యంలో వైద్యులు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని డిఎస్పీ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, ...

Read More »

నవ తెలంగాణ కోసం సిపిఎం పోరాటం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నవ తెలంగాణగా సాధించుకునే దిశగా సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలోని ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో తెరాస కేవలం ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలు, శ్రామిక వర్గాల ఆందోళనలు పెరిగిపోయాయన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నిలక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని, ...

Read More »

వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లోసేవలందించిన వారికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో సన్మానించారు. ఉత్తమ సంఘ సేవకుడిగా కె.నరేందర్‌రెడ్డి, ఉత్తమ వైద్యునిగా రమేశ్‌బాబు, సుధీర్‌కుమార్‌, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పద్మజ, శివ, ఉత్తమ అర్చకులుగా జార్జ్‌ మాథ్యు కల్లు, ఉత్తమ అంగన్‌వాడి వర్కర్లుగా సుజాత, మల్లికార్జున్‌, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగులుగా నరేందర్‌, అమృత, ఉత్తమ ఎన్జీవోగా మాసల లక్ష్మినారాయణ, ఉత్తమ క్రీడాకారునిగా సహస్ర, ఉత్తమ పరిశోధకునిగా గడిసెకుర్తి రాజేందర్‌లను ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, నాయకులు రాజేందర్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, ...

Read More »

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిద ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో నగేశ్‌, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ భాస్కర్‌, స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జాతీయజెండా ఆవిష్కరించారు. బిజెపి, తెరాస, కాంగ్రెస్‌, తెదేపా, సిపిఐ, సిపిఎం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం,శ్రీసాయిసుధ ...

Read More »

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ది స్నేహ ఏ ట్రూ ప్రెండ్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో 130 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ది స్నేహ సొసైటీ తరఫున గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ...

Read More »

నేడు జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ రాక

– మాజీ ఎమ్మెల్యే యెండల కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం జరగనున్న జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి, అనంతరం జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరుకానున్నట్టు నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడి ఏడాది పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి గడ్కరీ వివరిస్తారన్నారు. ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల పర్మనెంట్‌కై 1న ఛలో హైదరాబాద్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ వ్యవస్థలో కాంట్రాక్టు పద్దతిలో కాలం వెళ్ళదీస్తున్న కార్మికులను పర్మనెంట్‌ చేయాలనే డిమాండ్‌తో జూన్‌ 1న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజనర్సు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, వారిని పర్మనెంట్‌ చేస్తామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నప్పటికి ఇంతవరకు పర్మనెంట్‌ చేయకపోగా వారికి కల్పించాల్సిన కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇతర ...

Read More »

నీటి సరఫరా కేంద్రాన్ని ఆకస్మికంగా తనికీ చేసిన చైర్‌పర్సన్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో గల నీటి సరఫరా వ్యవస్థను శుక్రవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఆకస్మిక తనిఖీ చేశారు. 5వ వార్డులోని సైలానిబాబా కాలనీ ప్రాంతంలో మునిసిపల్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా పట్టణానికి నీటి సరఫరా చేస్తుంటారు. ఛైర్‌పర్సన్‌ ఆకస్మిక తనికీ చేసి నీటి సరపరా జరుగుతున్న తీరును వాటర్‌ ట్యాంకర్ల రిజిష్టర్లను, ట్యాంకర్ల ట్రిప్పుల సమయాన్ని పరిశీలించారు. గైర్హాజరైన వాటర్‌ ట్యాంకర్‌ల కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత విధించాలని ...

Read More »

మూలికల పేరుతో ఘరానా మోసం…

  – చాకచక్యంతో దొంగలను పట్టుకున్న పోలీసులు కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూలికల పేరిట చోరీలకు పాల్పడుతున్న దొంగలను కామారెడ్డి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. డిఎస్పీ కథనం ప్రకారం… నర్సాపూర్‌కు చెందిన ఒంటెద్దు రవి, ఒంటెద్దు శ్రీనివాస్‌, ఒంటెద్దు సాయిలు ముగ్గురు కలిసి మూలికలు విక్రయిస్తూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వీరు ఇందల్వాయికి చెందిన అబ్దుల్‌ సయీద్‌కు ఈనెల 22న మూలికలతో సర్వరోగాలు ...

Read More »

అధికఫీజులు వసూలు చేస్తే ఉద్యమం తప్పదు

  – విద్యార్థి సంఘాల హెచ్చరిక కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ ఫీజుల పేరిట అదిక ఫీజులు వసూలు చేస్తే ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ జివో 42, ఆర్‌టిఇ 2009 ప్రకారం హైస్కూల్‌ ఫీజు రూరల్‌లో 10,800, అర్బన్‌లో 12 వేలు ఉండగా, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వీటిని పట్టించుకోకుండా అడ్మిషన్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాల ...

Read More »

పోలీసుల దాడిని ఖండిస్తూ పండ్ల వ్యాపారుల నిరసన

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండ్ల వ్యాపారులపై గురువారం పోలీసులు జరిపిన దాడిని నిరసిస్తూ పండ్ల వ్యాపారులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీలను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ధర్మశాల నుంచి సుభాష్‌ రోడ్డు వరకు పండ్ల బండ్లతో రోడ్లపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటే పోలీసులు ట్రాఫిక్‌ సమస్యల పేరిట ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడులు జరపడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు జరిపిన దాడిలో తగిలిన ...

Read More »

మహానాడుకు తరలిన తమ్ముళ్ళు

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి టిడిపి నాయకులు శుక్రవారం కామారెడ్డి నుంచి తరలివెళ్లారు. అంతకుముందు స్థానిక మునిసిపల్‌ వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీని జాతీయ స్థాయిలో, తెలంగాణలో మరింత పటిష్టం చేస్తామని ప్రతిన బూనారు. మహానాడుకు వెళ్లిన వారిలో నాయకులు నజీర్‌, చీల ప్రభాకర్‌, రాజమౌళి, కొత్తింటి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వడదెబ్బతో రిటైర్డ్‌ ఉద్యోగి మృతి

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. శుక్రవారం ఎండదెబ్బకు తాళలేక మరోవ్యక్తి మృతి చెందాడు. పట్టణానికి చెందిన అల్ల శంకర్‌ (58) అనే వృద్దుడు వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. శంకర్‌ ఆర్టీసిలో డ్రైవర్‌గా పనిచేసి ఇటీవలే రిటైర్‌ అయ్యాడు. గురువారం సాయంత్రం ఆయన మృతి చెందాడు.

Read More »

ఘనంగా తాగుబోతు రమేశ్‌ కల్యాణం

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ధమాన కమేడియన్‌, నటుడు తాగుబోతు రమేశ్‌ వివాహం గురువారం కామారెడ్డి పట్టణంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. స్టేషన్‌ భిక్కనూరుకు చెందిన స్వాతితో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వివాహం జరిగింది. వివాహానికి ప్రముఖ కమేడియన్‌ చమ్మక్‌ చంద్రతోపాటు ఇతర నటులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో వివాహ రిసెప్షన్‌ జరగనుంది.

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికుల దాడి

మాచారెడ్డి, మే 27 : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. సీపిఐ, సీఐటియై ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లా రోడ్డులో బీడీ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. అయితే అక్కడే నాయకులు మాట్లాడుతూ కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. సిఎం ఇంట్లో మూడు మంత్రు పదవులు ఉందోచ్చుగాని ఒక్క ఇంట్లో ఇద్దరికి పెన్షన్‌లు ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ నాయకుడు పైడాకుల రాములు జోక్యం చేసుకోని ప్రసంగానికి అడ్డు పడ్డాడు. దీంతో అగ్రహానికి ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందే

  – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణతో కాంట్రాక్టు విధానంలో కార్మిక వర్గం బద్రత లేని జీవితాలతో వెట్టిచాకిరికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

అందరి సహకారంతో ట్రాఫిక్‌ సమస్య అధిగమిస్తాం

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్యగా మారిందని, వ్యాపారస్తులు, ప్రజలు, అధికారులు అందరి సహకారంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమిస్తామని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై కామారెడ్డి పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌లో మంగళవారం సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డులోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు సంబంధించి గతం నుంచి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ. 6 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లోనూ ప్రగతి పనులు చేపడతామని, అన్ని వార్డులకు సమంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, నాయకులు చంద్రశేఖర్‌, ఇమ్రాన్‌, అక్బర్‌, లక్ష్మణ్‌, ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుకు బంగారు భవిత

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక అయిన రైతుకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని పొందుర్తి, రాజంపేట్‌, పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేశారు. అనంతరం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ ...

Read More »