Breaking News

Kamareddy

టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికుల దాడి

మాచారెడ్డి, మే 27 : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. సీపిఐ, సీఐటియై ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లా రోడ్డులో బీడీ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. అయితే అక్కడే నాయకులు మాట్లాడుతూ కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. సిఎం ఇంట్లో మూడు మంత్రు పదవులు ఉందోచ్చుగాని ఒక్క ఇంట్లో ఇద్దరికి పెన్షన్‌లు ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ నాయకుడు పైడాకుల రాములు జోక్యం చేసుకోని ప్రసంగానికి అడ్డు పడ్డాడు. దీంతో అగ్రహానికి ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందే

  – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణతో కాంట్రాక్టు విధానంలో కార్మిక వర్గం బద్రత లేని జీవితాలతో వెట్టిచాకిరికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

అందరి సహకారంతో ట్రాఫిక్‌ సమస్య అధిగమిస్తాం

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్యగా మారిందని, వ్యాపారస్తులు, ప్రజలు, అధికారులు అందరి సహకారంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమిస్తామని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై కామారెడ్డి పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌లో మంగళవారం సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డులోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు సంబంధించి గతం నుంచి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ. 6 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లోనూ ప్రగతి పనులు చేపడతామని, అన్ని వార్డులకు సమంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, నాయకులు చంద్రశేఖర్‌, ఇమ్రాన్‌, అక్బర్‌, లక్ష్మణ్‌, ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుకు బంగారు భవిత

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక అయిన రైతుకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని పొందుర్తి, రాజంపేట్‌, పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేశారు. అనంతరం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ ...

Read More »

జీవనభృతి కోసం లొల్లి… లొల్లి…

  – సిబ్బందిని నిలదీసిన బీడీ కార్మికులు కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవనభృతి కోసం కామారెడ్డి పట్టణంలో ప్రతీరోజు లొల్లి లొల్లి జరుగుతుంది. అర్హులైన లబ్దిదారులు కార్యాలయం చుట్టు రోజు చక్కర్లు కొట్టినా తమకు జీవనభృతి ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపడుతున్నారు. శనివారం కామారెడ్డి పోస్టాఫీసు కార్యాలయం వద్ద జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా తమకు ఆధార్‌ నెంబరు లేదని, ఎస్‌కెఎస్‌లో పేరులేదని, ఏదో ఒక సాకు చెప్పి తిప్పి ...

Read More »

వడదెబ్బతో వృద్ధుడి మృతి

  కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డుకు చెందిన అన్నేపల్లి చిన్నబూదయ్య (55) అనేవృద్దుడు శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పుల కారణంగానే బూదయ్య మృతి చెందినట్టు కాలనీవాసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వెళ్ళగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుల కళ్ళలో ఆనందం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకే మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రారంభించినట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో శనివారం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలోని చెరువులు నిరాదరణకు గురై వ్యవసాయం దిగుబడులు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లోని సారవంతమైన ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకై గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ డివిజన్‌ నాయకుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి లకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, బిసిలకు సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగానికి విధి విధానాలు రూపొందించాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఈనెల 20న ప్రచార ...

Read More »

ఎవరికి వారే యమునా తీరే…

  కామారెడ్డి బల్దియాలో అధికారులు, సభ్యుల పరిస్థితి కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో పాలకవర్గ సభ్యులు, అధికారుల పరిస్థితి ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా మారింది. అధికారుల మాట బల్దియా ప్రజాప్రతినిధులు వినరు… బల్దియా ప్రజాప్రతినిదుల మాట అధికారులు వినరు.. ప్రతీ విషయంలోనూ ఇద్దరి మధ్య సమన్వయం కొరవడడంతో అభివృద్ధి అటకెక్కింది. కామారెడ్డి పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడుస్తున్నప్పటికి ప్రగతి అన్నమాట కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రతినెల సమావేశం నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. అధికారులు, సభ్యుల ...

Read More »

మునిసిపల్‌ సమావేశంలో సమస్యలపై సభ్యుల రభస

  – 80 పనులకు చర్చలేకుండానే ఆమోదం కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన జరిగిన మునిసిపల్‌ సమావేశంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు వార్డు సమస్యలపై రభస చేశారు. కొందరు వార్డు సమస్యలను ప్రస్తావిస్తే మరికొందరు టెండర్లు, మరికొందరు బిల్లులు వేరు వేరు అంశాలపై చర్చ జరిపారు. అధికారులు తయారుచేసిన ఎజెండాలో 80 అభివృద్ధిపనులకు సంబంధించిన అంశాలను పొందుపరచగా ఎప్పటిలాగానే సభ్యులు వారిపై చర్చ లేకుండానే ఆమోదముద్ర ...

Read More »

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా నిర్వహించాలి

  కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా నిర్వహించాలని ఎస్సీ కార్పొరేషన్‌కు వెంటనే మంత్రిని నియమించి ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని దళిత బహుజన ఫ్రంట్‌ (డిబిఎఫ్‌) ప్రతినిదులు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి ఎంపిడివో కార్యాలయంలో బుధవారం డిబిఎఫ్‌ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఇందులో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని 10 మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ...

Read More »

కాంట్రాక్టు కార్మికులను పొడిగించాలి

  కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 280 మంది కాంట్రాక్టు కార్మికులను పొడిగించాలని కాంట్రాక్టు కార్మికులు బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, కమీషనర్‌ విక్రమసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈస ందర్భంగా వారు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో 20 సంవత్సరాలకు పైబడి బల్దియాలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడానికి టెండరు వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్టు కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అలా ...

Read More »

సిపిఎం ఆధ్వర్యంలో మునిసిపల్‌ ఎదుట ధర్నా

  కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పాలక వర్గ సభ్యులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ఎదుట బుధవారం సిపిఎం ఆద్వర్యంలో దర్నా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్‌ నాయకుడు పి.రాజలింగం మాట్లాడుతూ బల్దియా ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పాలకవర్గ ప్రతినిదులు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శ్రీరాంసాగర్‌ నీటి సరఫరా పైప్‌లైన్‌ టెండరును ...

Read More »

నివాసపు గుడిసె దగ్ధం

  – రూ. లక్ష ఆస్తినష్టం కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ రైట్‌ తాండాలో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో బదావత్‌ విఠల్‌కు చెందిన నివాసపు గుడిసెదగ్దమైంది. దీంతో గుడిసెలో ఉన్న నగదు, వంట సామగ్రి, నిత్యవసర వస్తువులు, ఆధార్‌ కార్డు, పాసుపుస్తకాలు, ఇతర దృవీకరణ పత్రాలు, కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంతో విఠల్‌ కుటుంబం రోడ్డున పడింది. కూలీ పనిచేసుకొని బతికే తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ...

Read More »

‘పిఎఫ్‌ సేవలు మీ ఇంటి ముంగిట్లో’ ప్రారంభం

  కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘పిఎఫ్‌ సేవలు మీ ఇంటి ముంగిట్లో’ కార్యక్రమాన్ని ప్రాంతీయ భవిష్యనిధి కమీషనర్‌ ఎస్‌.గోవిందన్‌ మంగళవారం దేశాయిబీడీ కంపెనీ కామారెడ్డిలో ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎఫ్‌ వెబ్‌సైట్‌లో లభించే సేవలు, యూనివర్సల్‌ ఎకౌంట్‌ నెంబరుతో మొబైల్‌ ఫోన్‌ నెంబరు అనుసంధానం చేస్తే ప్రతి పిఎఫ్‌ సభ్యుడు తమ ఖాతాలో జమ అయిన వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఈ గుర్తింపు నెంబరుతో ఉన్న ఇతర లాభాల గురించి వివరించారు. కార్యక్రమానికి సంస్థ యజమానులు, పిఎఫ్‌ ...

Read More »

పది ఫలితాల్లో గురు ఎడ్యుకేషనల్‌ అకాడమీ ప్రతిభ

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో గురు ఎడ్యుకేషనల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 20 మందికిపైగా విద్యార్థులు 9 ఆపై పాయింట్లు సాధించారు. 40 మంది విద్యార్థులు 8 ఆపై పాయింట్లు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గురు ఎడ్యుకేషనల్‌ డైరెక్టర్‌ గురువేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Read More »

లయోలా పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌సి మార్చి-2015 ఫలితాల్లో కామారెడ్డి లయోలా పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 75 మంది ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాదించారు. ఇందులో 9 ఆపై పాయింట్లు సాధించినవారు 20 మంది కాగా, 8 ఆపై పాయింట్లు సాధించినవారు 43 మంది, 7 ఆపై పాయింట్లు సాధించినవారు 12 మంది ఉన్నారు. అత్యధికంగా 9.7 పాయింట్లు సాధించిన భువనశ్రీరెడ్డిని ఉపాధ్యాయ బృందం ...

Read More »

పదిలో పడిపోయిన ఉత్తీర్ణత శాతం

  – గత ఏడాది కన్నా 8 శాతం తక్కువ కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రకటించిన 2014-15 విద్యాసంవత్సర 10వ తరగతి ఫలితాల్లో కామారెడ్డి డివిజన్‌లో గత ఏడాది కన్నా ఉత్తీర్ణత శాతం 8 శాతానికి తగ్గి విద్యార్థులు నిరాశపరిచారు. గత ఏడాది 92.1 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈయేడు 84.2 శాతం ఉత్తీర్ణత సరిపెట్టుకున్నారు. అత్యధికంగా మాచారెడ్డి మండలంలో 92 శాతం ఉత్తీర్నత సాధించగా, అత్యల్పంగా తాడ్వాయి మండల విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత ...

Read More »

మస్కట్‌లో గుండెపోటుతో జిల్లా వాసి మృతి

  ఏల్లారెడ్డి, మే 17: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలం పోసానిపేట పంచాయతీ పరిధిలోని గోకుల్‌తాండకు చెందిన కట్రోత్‌ లక్ష్మణ్‌(37) మస్కట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మణ్‌ మరణంతో ఆయన కుటుంబంలో విషాదచాయాలు అలముకున్నాయి. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం కంపెనీ విసాపై మస్కట్‌కు వెళ్లాడు. కంపెనీలో సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వెళ్లి పని చేసుకుంటున్నాడు. దీంతో ఇంటి వద్ద చేసిన అప్పులు తీరాలేక, అటు సరిగ్గా పని దొరకక్క ఆర్థిక ఇబ్బందులు ...

Read More »