Breaking News

Kamareddy

ఆర్టీసి కార్మికులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఉద్యోగులపై కన్నతల్లిప్రేమ చూపి భారీగా జీతాన్ని పెంచి ఆర్టీసి కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆర్టీసి కార్మికులు దుయ్యబట్టారు. ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 3వ రోజుకు చేరింది. సమ్మెలో పాల్గొన్న కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులపై నష్టాల బూచి చూపి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టుగా 43 శాతం జీతాలు పెంచకుండా 28 శాతం మాత్రమే పెంచుతామని ప్రకటించడం గర్హనీయమన్నారు. ఆర్టీసికి వచ్చే నష్టాలను ఇతర రాష్ట్రాల ...

Read More »

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతు ఆత్మహత్యలు రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర – టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వాల భరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా పాదయాత్రను చేపడుతున్నారని తెలిపారు. శుక్రవారం కామారెడ్డి సిఎస్‌ఐ గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ...

Read More »

బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో 150 కోట్లు – రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో అన్ని హంగులతో రూ. 63 లక్షలతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయం నూతన భవనానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ ఆర్టీసి విభజన సమస్య 14వ తేదీతో ...

Read More »

రాబడ్డి లక్ష్యసాధనకు కృషి చేయాలి – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా శాఖ అధికారులు, మోటారు వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్లు విదులను సమర్థవంతంగా నిర్వర్తించినపుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో నూతనంగా ప్రారంభించిన ఆర్టీఓ కార్యాలయంలో రవాణా శాఖ పనితీరును మంత్రి సమీక్షించారు. చెక్‌పోస్టుల్లో మరియు వాహనాల తనిఖీ ద్వారా రావాల్సిన రాబడి లక్ష్యాన్ని సాధించడానికి అంకితభావంతో కృషిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ రోడ్డు ...

Read More »

మాలల మహాగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో మే 10వ తేదీన నిర్వహించనున్న మాలల మహాగర్జనకు సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాల, మాల అనుబంధ సంఘాల సమాఖ్య జిల్లా కన్వీనర్‌ అంబం సంజీవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మాల, మాల అనుబంధ, ఉపకులాలకు సంబంధించిన వారు పోరాడారన్నారు. మంత్రి పదవులు ఇవ్వడంలోనూ, నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం మాలలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మాలలను ...

Read More »

ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్‌ ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం కామారెడ్డిలో ఆటోడ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా కోశాదికారి కట్ల భూమన్న మాట్లాడుతూ రోడ్డు ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం బిల్లును వ్యతిరేకించాలని కోరారు. దీని కారణంగా ఆటో, డిసిఎం, ట్రాలీ, లారీ, తదితర ట్రాన్స్‌పోర్టు రంగ వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి – మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేసేందుకు వైశ్య సంఘం ప్రతినిధులు తనకు అవకాశం కల్పించాలని మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రామాంజనేయస్వామి దేవాలయంలో గురువారం పట్టణంలోని ఆర్యవైశ్య ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తాను పోటీ చేస్తున్నానని, ఆర్యవైశ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా తనను గెలిపించాలని కోరారు. పట్టణంలోని 33 కాలనీల్లోని ఆర్యవైశ్య సంఘాల ...

Read More »

హిందూ శ్మశాన వాటికల సంఘం అధ్యక్షునిగా రాంచంద్రారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి హిందూ శ్మశానవాటికల సంఘం అద్యక్షునిగా ప్రముఖ న్యాయవాది రాంచంద్రారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు లాభిశెట్టి లక్ష్మయ్య గుప్త అనారోగ్యం కారణంగా అధ్యక్ష బాధ్యతలను రాంచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటినుంచి హిందూ శ్మశాన వాటికల సంఘం అభివృద్ది బాధ్యతలను రాంచంద్రారెడ్డి తీసుకుంటారని పేర్కొన్నారు. రాంచంద్రారెడ్డికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి శ్మశాన వాటికల్లో సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు.

Read More »

మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్స్‌లర్లను నియమించాలని డిమాండ్‌ చేస్తూ కామరెడ్డిలో గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్స్‌లర్లను ఇంతవరకు నియమించలేదని, ఈ కారణంగా విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తెరాస విసిలను నియమించకపోవడం గర్హణీయమన్నారు. వెంటనే విసిలను నియమించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

పట్టణాభివృద్దికి మరింత కృషి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాభివృద్దికి మరింత కృషి చేస్తామని ఇందుకోసం పాలకవర్గమంతా కలిసి పనిచేస్తామని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. గురువారం పట్టణంలోని 22వ వార్డులో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్‌ మాజీద్‌, ఎడి గంగాదర్‌, ...

Read More »

ఆర్టీసి డిపో ఎదుట కార్మికుల ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రోడ్డు సేప్టీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట కార్మికులు దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రోడ్డు సేప్టీ బిల్లు కారణంగా డ్రైవర్లు, ద్విచక్ర, హెవీ వాహనదారులు, యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సోలార్‌ హీటర్‌ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని వృద్దాశ్రమానికి సోమవారం రూ. 40 వేల విలువగల సోలార్‌వాటర్‌ హీటర్‌ను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్‌ గవర్నర్‌ మల్లాది వాసుదేవ్‌ మాట్లాడారు. రోటరీ క్లబ్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో వృద్దాశ్రమానికి వాటర్‌హీటర్‌తోపాటు చిన్నమల్లారెడ్డి, దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు 50 చొప్పున బెంచీలు అందజేసినట్టు తెలిపారు. దీంతోపాటు వైద్య, విద్య శిబిరాలు నిర్వహిస్తూ కామారెడ్డి రోటరీ క్లబ్‌ సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ...

Read More »

సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిఐటియు ఆద్వర్యంలో కామారెడ్డి తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ బాధ్యుడు రాజలింగం మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నామమాత్రపు వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా వేతనాలు సైతం విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు దుర్బర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

పోలీసుల ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గది ఆవరణలో సోమవారం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్వచ్చభారత్‌ చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణను దత్తత తీసుకొని స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాలు శుభ్రం చేసినట్టు డిఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో సైతం పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సంతోష్‌, సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు 3 లక్షలతో సిసి డ్రైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు సభ్యులందరితో కలిసి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, బట్టుమోహన్‌, నాయకులు రాంకుమార్‌, తదితరులు ఉన్నారు.

Read More »

తెరాస విజయగర్జనకు భారీగా జనసమీకరణ – వేలాదిగా తరలివెళ్లిన నాయకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన తెరాస విజయగర్జనసభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, తరలి వెళ్లారు. సుమారు 30 బస్సులు, వందకుపైగావాహనాల్లో నాయకులు, కార్యకర్తలను తరలించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని ఇదివరకే అధిస్టానం ఆదేశాలున్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలను సమీకరించేందుకు చమటోడ్చారు. కార్యకర్తలతో పాటు నాయకులు వాహనాల్లో కలిసి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నాయకులు జనసేకరణ కోసం పోటీపడ్డారు. గత కొన్ని రోజలు కిందటనే ...

Read More »

షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం… ఘన సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్షనేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగిడిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి కామారెడ్డి నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ వద్ద షబ్బీర్‌ అలీకి పూలదండలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడినుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్వాపూర్‌ నుంచి కామారెడ్డి వరకు ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం ...

Read More »

కేసీఆర్‌ ప్రజలపక్షమా… పెట్టుబడి దారీ పక్షమా…

  – సెక్యురిటీ వదిలి జనంలోకి వెళ్దాం పదా… – మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముక్యమంత్రి కేసీఆర్‌ ప్రజలపక్షమో.. పెట్టుబడిదారుల పక్షమో తేల్చి చెప్పాలని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశప్రధాని నరేంద్రమోడి అవలంబిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలు, భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలు ...

Read More »

ఛలో మెట్‌పల్లి గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25న తలపెట్టిన ఛలో మెట్‌పల్లి బహిరంగ సభ గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. భారతీయ విద్యార్థి మోర్చా, భారత్‌ ముక్తిమోర్చాల ఆధ్వర్యంలో ఛలో మెట్‌పల్లి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకమవ్వాల్సిన అవసరముందన్నారు. వెనకబడిన కులాల వారందరిని ఐక్యం చేసేందుకు వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి బాఫూలే విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుందన్నారు. దీనికి ...

Read More »

ప్రతిపక్షనేత స్వాగతానికి భారీ సన్నాహాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సన్మానించేందుకు కాంగ్రెస్‌ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ గురువారం కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ నుంచి షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్వాపూర్‌లో జెండా ఆవిష్కరణ చేయించి అనంతరం అక్కడినుంచి కామారెడ్డి వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో షబ్బీర్‌అలీకి పార్టీ, వివిధ సంఘాల ...

Read More »